Previous Page Next Page 
పడిలేచే కడలి తరంగం పేజి 20

     కిరీటిని చూడగానే కృష్ణుడ్ని చూసిన గోపికల్లా చుట్టుముట్టిన ఆడవారిపై శిల్పకు చెప్పరానంత కోపం వచ్చింది.

    వాళ్ళు వేసే కామెంట్స్ మరీ ఏవగింపుగా వున్నాయి.

    "హాయ్ కిట్టి...." అంటూ కిరీటిని కావలించుకున్నంత పనిచేసిన స్త్రీని 'షి ఈజ్ జయశ్రీ' అంటూ శిల్పకు చూపించాడు.

    వయసు దాచుకోవాలన్న వృధా ప్రయత్నంతో చెంపలకు రోజ్ పౌడర్, పెదవులకు లిప్ స్టిక్ దండిగా పట్టించి ట్రాన్స్ పరెట్ చీరలో అంగాంగ ప్రదర్శన చేయటానికి వచ్చిన బాబ్డ్ హెయిర్ భారతనారి అనుకుందామె.

    ఎవరో పలకరించటంతో కిరీటి మగాళ్ళ మగాళ్ళ మధ్యకు వెళ్ళాడు.

    చుట్టూ చేరిన స్త్రీల ప్రశ్నల పరంపరకు ఎదుర్కోవటం శిల్పకు కష్టమనిపించింది.

    ఆడవాళ్ళ రూపంలో ఉన్న అడివిమృగాల మధ్య తనను ఒంటరిగా వదిలిన కిరీటిపై చెప్పలేనంత కోపం వచ్చింది.

    మరీ బిగుసుక్కూర్చోవటం భావ్యం కాదని తలచిన శిల్ప పెదవుకు నవ్వును కూడా అలంకారంగా పూసుకుని జయశ్రీ ప్రశ్నలకు జవాబు చెబుతోంది.

    దూరంగా పింక్ కలర్ ట్వీడ్ సూట్ లో అందరిలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న కిరీటిని పదే పదే చూడకుండా ఉండలేకపోయింది.

    మధ్య మధ్యలో తననే గమనిస్తున్న కిరీటి చూపుల్నుండి తప్పించుకుంటూ అందరిలో తనకంత ప్రత్యేకత నాపాదించిన అక్కడి వాతావరణం ద్వారా కొంత అహంకారాన్ని చల్లార్చుకోసాగింది.

    "శిల్పా! యు ఆర్ రియల్లీ లక్కి."

    కూల్ డ్రింక్ సిప్ చేస్తూ అసూయగా అంది జయశ్రీ.

    "దేనికి?"

    "కిరీటిలాంటి స్మార్ట్ యంగ్ మాన్ని సునాయాసంగా కొట్టేసినందుకు....."

    తప్పనిసరిగా నవ్వింది శిల్ప.

    "మీ ఆయన్నెవరూ ఎత్తుకుపోరులే..... కాస్త మా వైపు కూడా చూడు."

    దొరికిపోయినట్టుగా గభాలున తల తిప్పుకుంది శిల్ప.

    పగలబడి నవ్వింది జయశ్రీ ఒళ్ళంతా వూగేట్టు.

    ఆమె మాటతీరు, ఆమె నవ్వుతున్న పద్ధతి వెగటుపుట్టించేట్టుగా వుంది..... అయినా తమాయించుకుంది.

    "అన్నట్టు హనీమూన్ కెందుకెళ్ళలేదు......"

    "ఆయనకు కుదరక....."

    నోటికొచ్చిన అబద్ధం ఆడేసింది.

    "నీ ప్లేస్ లో నేనుంటే ఆరునెలలపాటు ఆఫీసుకే వెళ్ళనిచ్చేదాన్ని కాదు..... హాయిగా ఏ స్విజ్జర్లాండో పోయి అక్కడే హాయిగా గడిపేసి మళ్ళీ పిల్లాడితో ఇండియాకు తిరిగివచ్చేదాన్ని."

    "ఏం కల్చర్రా బాబూ...... ఇంత పచ్చిగా మాట్లాడుతోంది" అనుకుంది శిల్ప.

    వదిలించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నా వీలు కాకపోవటంతో ఉస్సురోమంటూ ఓ సోఫాలో చతికిలబడింది.

    ప్రక్కనే కూర్చున్న జయశ్రీ శిల్పను ఆపాద మస్తకం పరికిస్తూ "కిరీటికి ఈ కలర్ నచ్చదే. ఈ శారీని ఎలా కట్టుకోనిచ్చాడబ్బా" అంటూ క్యూరియస్ గా అడిగింది.

    "ఒకరికి నచ్చకపోయినంత మాత్రాన నా పద్ధతుల్న మార్చుకోను" అనబోయి ఆగిపోయింది.

    "అఫ్ కోర్స్..... కిరీటి టేస్టు గురించి మీకు బాగా తెలుసనుకుంటాను" ఈర్ష్యగా అడిగింది.

    "కిరీటి టేస్టు గురించి మాత్రమే కాదు కిరీటి మొత్తం అఫైర్స్ గురించి నాకు తెలుసు. హి ఈజ్ రియల్లీ లవ్ లీగై....."

    ఆమె అతి సాధారణంగా అన్నా మాటలు శిల్ప హృదయాంతరాళానికి తాకాయి.

    ఏమిటీ..... కిరీటికి అఫైర్సా......

    ఆడతనం తెలుసుకోవాలని ఉవ్విళ్లూరితే అహంకారం వద్దు పొమ్మంటోంది.

    "అవునట. నాకూ చెప్పారు. కానీ ఆ అమ్మాయి మాత్రం......

    విషయాన్ని ఆరా తీయాలని అంతా తెలిసినట్టుగా చిన్న నాటకం ఆడింది.
    8)

 Previous Page Next Page