ఆ ఇరవై మందినీ సాంబ శివం తానె ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ ముగించుకుని బయటికి వస్తున్న అభయర్దుల ముఖాలు పాలిపోయి ఉన్నాయి.... నిరశాగా వెళ్తున్నారు. శేఖర్ సాహాసిమ్చి ఒకరిని "ఏమటడుగుతున్నారు?" అన్నాడు. "ఏమిటో అంతా అయోమయంగా ఉంది. కుంభకోణమేదో ఉంది. లేకపోతె రెండువేలు ఊరికే ఇస్తారేమిటీ? ఏదేదో అంటాడు __ మన సమాధానాల్లో హెచ్చు తగ్గులేముస్తాయో మరి! 'అయాం సారీ! మీకీ పోస్టు ఈయలేను __ వెళ్ళిరండి !" అంటాడు." అని చెప్పి దిగాలుగా వెళ్ళి పోయాడా అభ్యర్ధి.
శేఖర్ వంతు వచ్చింది.
సాంబశివ౦ శేఖర్ నఖశిఖ పర్యంతం పరీక్షించాడు __
శేఖర్ ముడుచుకుపోలేదు . ధైర్యంగా సాంబశివం చూపులను ఎదుర్కోన్నాడు.
"ఈ ఉద్యోగంలో చేరటం మీ కిష్టమేనా?"
"ఇష్టం లేకపోతె ఇంటర్వ్యూ కెందుకోస్తాను?"
"ఈ ఉద్యోగానికి ఇంత జీతం ఎందుకు నిర్ణయించామో ఊహించగలరా?"
"బాధ్యతగల ఉద్యోగమయి ఉండాలి ?"
"అంతమాత్రాని కేనా?"
"చిక్కులతో కూదినదయి ఉండాలి!"
హాయిగా నవ్వాడు సాంబశివం ........
"చక్కగా ఉంది _ సమాధానం కాదు __ అది చెప్పిన తీరు __ భయపడకుండా ..... దేనికయినా సిద్ధపడిన వాడ్కి ...... అందుకే ఇంతవరకు ఎవ్వరికీ చెప్పని నా చివరి షరతు చెప్తూన్నాను. మీరు ఒప్పుకుంటే మీకు ఉద్యోగం వచ్చినట్లే! మీరు ఒకసారి ఉద్యోగంలో చేరిన తరువాత ఎలాంటి పరిస్థితిలోనూ ఈ ఉద్యోగంలోంచి బయటకి వెళ్ళటానికి వీల్లేదు!"
శేఖర్ మనసు బండబారిపోయింది __ సాంబశివం అన్నట్లు దేనికైనా సిద్ధంగా ఉన్నాడు .
"వెళ్ళను __ అలా బాండ్ రాసియ్యాలా ?"
"అనవసరం _ బయటకు వెళ్ళాలని ప్రయత్నించినా ప్రాణాలతో వెళ్ళలేరు __ అందుకే ..... నా తప్పులేకుండా ముందుగా హెచ్చరించాను ..... పరవాలేదు ఆలోచించుకుని చెప్పండి . వార౦రోజులలోగా ఏం జరిగినా జరగవచ్చు...... ఇది చెయ్యిజారీపోవచ్చు ..... వెంటనంటి పీక్కుతినే ఆ భయంకరమైన దారిద్ర్యం ...... డిగ్రీ ఉండీ ఏమి సంపాదించుకోలేని ఆ నిసహాయస్థితి .... ఆ నరకం కంటె ఏదైనా మేలే!" ఆలోచించుకో వలసిన దేమీ లేదు _ చేరిపోతాను ......"
చేరిన తరువాత తనకు తానై ఎలాంటి విషవలయంలో ఇరుక్కున్నాడో అర్ధమయింది.
ఇంటిదగ్గర సుఖంగానే సాగిపోతోంది! కానీ ఆ సుఖాలన్నీ ఎక్కడివి? సమాజాన్ని అతి దారుణంగా వంచించి సంపాదించుకుంటున్నవి!
రాత్రి కన్ను మూయగానే ..... చింపిరి తలలతో ...... చింపిరి బట్టలతో .... 'అమ్మ! ఆకలి! ఆకలి' ... అని ఆక్రోశించే రకరకాల ఆకారాలు .... కారులో సాగిపోతున్నా .... అతని కళ్ళు చూడకుండా ఉండలేని రకరకాల హృదయ విదారక దృశ్యాలు ..... మూసుకున్న అతని కళ్ళను చీల్చుకుని మనసును చికాకు పరిచేవి.
ఏదో విరక్తి ..... మనుష్యులంటే .... సమాజమంటే ...... చివరకు ఈ దేశ మంటే ..... అతని మనసులో ప్రబలిపోతోంది ......
ఏం చెయ్యాలి? ఏం చెయ్యగలడు?
శేఖర్ చెయ్యి తన చేతిలోకి తీసుకుంది సుశీల ..... "అలా క్రుంగిపోకండి .... మనం తప్పించుకోగలం .... తప్పించుకుని దూరంగా పారిపోదాం!"
ఆ మాటలు శేఖర్ అనందాని కంటె భయాన్నే కలిగించాయి.....
"బయటికి వెళ్ళాలని ప్రయత్నించినా ప్రాణాలతో వెళ్ళలేరు ....." సాంబశివం మాటలు భయంకరంగా మనసులో ప్రతిధ్వనించాయి ......
కానీ పక్కన ఉన్నది సుశీల! సాంబశివం గారాల కూతురు. ఈ అంధకార జీవితంలో మెరుస్తోన్న ఆశారేఖ!
11
రాత్రి పది గంటలయింది.
సాంబశివం పర్సనల్ ఫోన్ మోగింది.
"హాలో?" మత్తుగా అన్నాడు సాంబశివం.
"నేను నాన్నా! సుశీలని!" గారాబంగా పలికింది సుశీల కంఠం ......
సాంబశివం కంఠం మత్తు వదిలిపోయింది.
"ఏవిటి సుశీ? ఇమ్తరాత్రివేళ ....."
'"నేనూ ప్రసూనా సినిమాకు వెళ్ళాం నాన్నా! ఇంటి కెళ్ళాలంటే భయంగా ఉంది. నీ దగ్గరకోస్తా! నువ్వు తీసికెళ్ళు ....."
సాంబశివంగారికి అర్ధమయిపోయింది.
సుశీల ప్రసూనతో కలసి సినిమాలకు తిరగటం లలితా సహించదు. లలితా నెదిరించే సాహసం సుశీలకు వెంటపెట్టుకు వెళ్ళి ఎవరో మినిష్టరుగారికి పార్టీ యిచ్చామనీ, సుశీలని మంత్రుగారికి పరిచయం చెయ్యటానికి తనతో ఉంచుకున్నానని చెప్పాలి ..... సుశీల ఇలాటి పార్టీలలోకి రావటం కూడా లలితాకిష్టంలేదు __ కానీ పెద్దపెద్దవాళ్ళకు సుశీలను పరిచయం చెయ్యటం తన కెంత గర్వమో లలితకు తెలుసు __ అందుకే మాట్లాడదు......
సుశీల, ప్రసూన చిన్నతనంనుంచే ఒకే కాన్వెంట్ లో చదువుకున్నారు . ప్రసూన సుశీలతో సుశీల ఇంటికి వచ్చేది. మామూలుగా సుశీల స్నేహితులందరినీ ఆదరిమ్చినట్ట్లే ప్రసూనాను ఆదరించింది లలితా మొదటలో .....
ఒకనాడు లలితా సుశీలతో "నువ్వు ఇంకమీదుట ప్రసూన తో స్నేహం చెయ్యడానికి వీల్లేదు _ ఆ అమ్మాయి మనింటికి రావటానికి వీల్లేదు" అంది ఖండితంగా ..... సుశీల తెల్లబోయింది _ అప్పటికే సుశీలకూ ప్రసూనకూ మధ్య గాఢ స్నేహం అల్లుకుపోయింది.
"ఏం ప్రసూనతో ఎందుకు స్నేహం చెయ్యకూడదు?" అంది గారాబంగా ......
"వద్దని చెపితే నీక్కాదు?" తీవ్రంగా అంది లలిత ..... లలిత సుశీలను వెర్రి గరాబాలు చెయ్యదు. కానీ, అంతతీవ్రంగా కూడా ఎన్నడూ మాట్లాడదు. తల్లి ఆ తీవ్రధోరణి సహించలేక సుశీల బావురుమని ఏడ్చేసింది . సుశీల కన్నీళ్ళు లలితలో ఆ తీక్షణత్వాన్ని క్షణాలలో కరిగించే శాయి. సుశీల దగ్గర కూచుని బుజ్జగీస్తూ కళ్ళు తుడిచింది.