Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 18

   
    ఎవ్వరితోనూ పెద్ద పరిచయంలేక ఇబ్బంది గా కూర్చున్న సుశీల అవస్థ అర్ధంచేసుకుని "నాతోరండి _ నా లైబ్రరీ చూపిస్తాను" అని తన గదిలోకి తీసికెళ్ళాడు శేఖర్ .......    
     రెండు బీరువాల నిండా ఉన్న పుస్తాకాలు చూస్తూ శేఖర్ వంక తిరిగి "మిమ్మల్ని చూస్తోంటే సైతానుకు ఆత్మ అమ్ముకొన్న ఫాస్ట్ గుర్తుకోస్తున్నాడు __" అనేసింది.
    కొయ్యబొమ్మలా నిలబడిపోయాడు శేఖర్ _ పైన ఫేస్ తిరుగుతున్నా అపాడను గుర్తుకోస్తున్నాడు __" అనేసింది.
    పిచ్చెక్కినవాడిలా తనను చూస్తోన్న శేఖర్ ను చూసి కంగారుపడిపోయింది సుశీల ......
    "అదేమిటి ? అలా అయిపోయారు? నేను ఏదో తమాషాకు అన్నాను.......
    "ఆ ఫాస్ట్ కన్నా విముక్తి ఉందేమో కాని నాకు మాత్రం లేదు." భరింపరాని నిస్పృహతో అన్నాడు శేఖర్ ......
    సుశీల తెల్లబోయి నిలబడిపోయింది ........
    శేఖర్ తెలివితెచ్చుకున్నట్లు తలవంచుకుని గబగబా అక్కడినుండి వెళ్ళిపోయాడు .......
    ఆ తరువాత సుశీల శేఖర్ కు సన్నిహితంగా రావాలని ఎంతో ప్రయత్నించింది ...... శేఖర్ రెండో చేల్లిలితో స్నేహం చేసుకుని శేఖర్ ఇంటికే వచ్చేది .... ఆ అమ్మాయి సుశీల మనసు అర్ధంచేసుకుని గడుసుగా సుశీలకు శేఖర్ కు ఏకాంతంకల్పిస్తూ తను తప్పుకునేది ....... శేఖర్ అప్పుడప్పుడు తనను తాను మరచి పోయి ఎంతో సరదాగా మాట్లాడేవాడు. అంతలో ఏదో గుర్తుకు తెచ్చుకొన్నట్లు ఎంతోదూరంగా అయిపోయేవాడు ..... శేఖర్ బాగా చదువుకున్నవాడు . అతని మాటల్లో ఆ విజ్ఞానం కనిపించేది . హుషారుగా ఉన్నప్పుడు అందర్నీ నవ్వించేవాడు. కాలం ఎలా నడుస్తోందో తెలియకుండా కబుర్లుచేప్పేవాడు. కానీ అలాంటి మూడ్ ఎంతో కాలం నిలిచేదికాదు. ఎవరో చెయ్యి పట్టుకుని వెనక్కు లాగినట్ట్లే ముడుచుకుపోయేవాడు.
    ఒకరోజు సుశీల వచ్చేసరికి శేఖర్ లేడు. స్వతంత్రంగా శేఖర్ గదిలోకి వచ్చి బీరువాలోంచి ఒక పుస్తకం తీసుకుని కుర్చీలో కూర్చుంది ఎదురుగా శేఖర్ పక్క కనిపించింది . గదిలో ఎవరూ లరు. సుశీల మనసులో ఏదో చిత్రమైన సంచలనం కలిగింది పిలిలా లేచి గది తలుపులు గడియవేసింది ....... ఆ పక్కమీద పడుకుంది ..... తలగడను చేతితో తడిమింది చేతికేదో గుచ్చుకున్నట్లయితే ఆశ్చర్యంగా చూసింది ..... చేతిరోమాలులో పచ్చగులాభీ తనకు గుచ్చుకున్నది. ఆ గూలాభికీ గుచ్చిన హెయిర్ పిన్  తను ప్రత్యేకించి ఫారిన్ నుంచి తెప్పించుకున్న అందమైన పిన్ .......
    రూమాలుతో కూడా ఆ పువ్వును చేతిలోకి తీసుకుంది సుశీల ఆ ముళ్ళు అరచేతిలో గుచ్చుకుంటే గిలిగింతలు పేట్టి నట్లయింది. ఆ రోమాలునూ, ఆ పువ్వునూ జాగ్రత్తగా తన హేండ్ బేగ లో దాచుకుంది .....
    తలుపు తట్టిన చప్పుడయితే త్వరగా పక్కమీది నుంచి లేచి తలుపు తీసింది. ఎదురుగా నిలబడ్డ శేఖర్ ను చూసి విచిత్రంగా సిగ్గు పడింది. లా సుగ్గుపడుతోన్న సుశీలతేరుకుని "ఎమిటలా చూస్తున్నారు?" అని దబాయించింది. శేఖర్ కంగారు పడిపోయాడు. పకపక నవ్వేసింది సుశీల .........
    శేఖర్ లోపలికొచ్చి ఏదో మాట్లాడుతూ ఆ ప్రయత్నంగా తన ప్రక్కవైపు చూశాడు. కంగారుగా పక్కమీద ఏదో  వెతకటం మొదలుపెట్టాడు ........
    "ఏమిటి వెతుకుతున్నారు?"
    నవ్వుతూ అడిగింది సుశీల.
    శేఖర్ గిర్రున తిరిగి సుశీల ముఖం కేసి కొన్నిక్షణాలు పరిశేలనగా చూశాడు. చెయ్యిజాపి "ఇచ్చెయ్యండి" అన్నాడు.
    "ఏమిటి?"
    "మీకు తెలుసు"    
    "ఇయ్యను"    
    "అపురూపంగా దాచుకున్నాను. నన్నిలా అల్లరి పెట్టడం న్యాయంకాదు."
    "పోనీ , ఇద్దరమూ పంచుకుందాం!"
    సుశీల తన బేగ్ లోంచి రుమాల్ లో చుట్టిన పువ్వు బయటికి తీసి రుమాలు తన బేగ్ లో దాచుకుని, పువ్వును పిన్ తో సహా శేఖర్ చేతిలో పెట్టింది. చాచిన శేఖర్ అరచేతిలో సుశీల పువ్వులా౦టిఅరచెయ్యి ఉంది. ఆ చేతిలో పిన్ తో ఉన్న వుప్పు ఉంది .... సుశీల చేతిని వెనక్కు తీసుకో లేదు __ అలాగే ఉంచింది __ శేఖర్ ముందుకువంగి పెదవులతో ఆ గిలాభీని అందుకున్నాడు. పెదవికి పిన్ గుచ్చుకుని రక్తం చిమ్మింది.
    "అరెరె!"" అంది సుశీల నొచ్చుకుంటూ.
    "ఫరవాలేదు . గులాభీలు రక్తం ఓడ్చకుండా దక్కించు కోలెము " అన్నాడు శేఖర్ విషాదంతో .
    సుశీల మనసు చాలా కలతపడింది ఆనాటినుండే వారి సాన్నిహిత్యం కొంత పెరిగినా ఎప్పటికప్పుడు శేఖర్ దూరంగా ఉండటానికే ప్రయత్ని౦చేవాడు.
    శేఖర్ చూసినప్పుడల్లా సుశీలకు ఫాస్ట్ గుర్తుకోస్తూనే ఉండేవాడు. "శేఖర్ ! నీ సైతాన్ ఎవరో నాకు తెలియదు. కాని నీకు విముక్తి కలిగించు తీరుతాను ....." అనుకునేది తనలో తను ఎన్నోసార్లు ......
    కానీ ఆ ప్రస్తావనమాత్రం తేలేదు. ఆనాడు కొయ్యబొమ్మలా అయిపోయిన శేఖర్ ని సుశీల ఏనాడూ మరచిపోలేదు. అందుకే అ అప్రస్తావన తేవడానికి సాహిసించలేదు _ ఇన్నాళ్ళకు శేఖర్ తనే అడిగేసరికి "గుర్తుంది" అంది.
    "అవును. నేను సైతానుకు ఆత్మను అమ్ముకునేవాడ్నీ !" నిరాశగా అన్నాడు.
    ఎన్నో రోజులుగా తనలో అనుకుంటున్న మాటలు ఆ రోజు సుశీల పైకి అంది.
    "నాకు వివరంగా చెప్పండి. నా ప్రాణాలు అర్పించి అయినా మీకు విముక్తి కలిగిస్తాను ......."
    సుశీల మాటలు చెవులకెంత తీయగా వినిపించినా అది సాధ్యమేనా? తనకు విముక్తి కలుగుతుందా?
    శేఖర్ మామూలు మధ్య తరగతి కుటుంబంలో వ్యక్తి .... అతి కష్టంమీద ఉన్నదంతా ఖర్చుపేట్టి తండ్రి చదువు చెప్పించాడు. బి.కాం. పాసయ్యాడు. ఉద్యోగాన్వేషణ ప్రారంభించేసేరికి చదువుకునే రోజుల్లో కన్న కలలన్నీ ఎంత కళ్ళలో అర్ధమయిపోయింది. పెరుగుతోన్న అప్పులు _ పెరిగిన చెల్లిళ్ళు _ పెరగవలసిన తమ్ముళ్ళు .... తల ఎటు తిప్పినా సమస్యలే! ఏదో ఒక ఉద్యోగం కోసం తిరిగి తిరిగి విస్గి వేసారిన రోజుల్లో కనిపించింది _ హొటల్ లోటస్ కి ఎకౌం టెంట్ కావాలనే ప్రకటన ..... ఆ ప్రకటనలో అతి విడ్డూరంగా కనిపించింది. జీతం రెండువేలు అనే ఆకర్షణ ..... ఉద్యోగానికి ఇంటర్వ్యూ కి వచ్చినవాళ్ళని చూస్తె దేశంలో జనాభా సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుంది. జనరల్ నాలెడ్జ్ , సమయస్పూర్తికి .......మొదలైన విషయాలన్నీ   రకరకాలుగా పరీక్షించారు. అందర్నీ ఇంటర్వ్యూ చెయ్యడానికి వరం రోజులు పట్టింది. వచ్చిన అభ్యర్ధులలో ఇరవై మందిని ఎన్నిక చేసి, వాళ్ళను మేనేజరు ప్రత్యేకించి ఇంటర్వ్యూచేస్తాడని అన్నారు . ఆ ఇరవైమందిలో శేఖర్ ఉన్నాడు.

 Previous Page Next Page