ఆమె హేండ్ బాగ్ ఎత్తి అతని నెత్తిమీదకొట్టబోయిందిగానీ ఆమె చేతిని పట్టేసుకుని దగ్గరకు లాక్కున్నాడు.
"సురేష్...." పెదాలు అతనికి దొరక్కుండా దాచుకోవాలని విశ్వప్రయత్నంచేస్తోంది.
"తులసీ..."
"ప్లీజ్......మనంహాల్లో వున్నాం....."
ఆమెను గుండెలకు హత్తుకుంటూ గాలిలోకి లేపి గదిలోకి చేర్చేశాడు.
"అదిగో.....ఆ కొండచిలువలు తీసెయ్!" నడుముని చుట్టేస్తోన్న చేతుల్ని లాగేయబోతోంది. టేప్ రికార్డర్ కిందవున్న మెత్తని తివాచీమీదకు ఒరిగిపోయి వాల్యూమ్ తగ్గిపోయింది. మరోచేతిలోని కాసెట్ బాక్స్ మరో పక్క పడిపోయింది.
"సురేష్.....ఆహ్.....నీకింతకుముందే.....అబ్బ.....చెప్పాను.....ఇలా......ఇక్కడ ప్ష్ ప్ష్.....అతిగా ప్రవర్తించవద్దని....అయ్యో....."
"తులసీ....." ఆమె చెవిలో, మెడమీదా, పెదాలమీదా......జివ్వున విద్యుత్ లా లాక్కెళ్ళిపోతూన్న వేడి ఊపిరి!
విదేశీ సబ్బులు విరజిమ్ముతోన్నంత పరిమళం.
"అయ్యో సురేష్.....ప్లీజ్....అవతల....."
ఆఖరి క్షణంలో జరిగిందది.
ముందు టీ సెట్ వున్న ట్రే గదిలోకి వచ్చింది. దాని వెనుకే ప్రభ.....నోరుతెరుచుకుని చూస్తూండిపోయింది కొద్ది క్షణాలు. వెంటనే తేరుకుని "అయ్యబాబోయ్" అనేసి వెనక్కు తిరిగిపరుగెత్తింది.
తులసి అతని పెదిమ మీదకొరికింది కసిగా.
"ఎప్పుడూ ఇంతే నువ్వు....."
"అబద్దం! మధ్యలో చాలా నిమిషాలు దూరంగా వుంటున్నాను"
అతనిచేతుల్ని బలవంతంగా పక్కకుతోసి లేచి పక్కకు జరిగింది.
తనూ ఆమె పక్కనే కూర్చున్నాడతను.
"ఎంత అసహ్యంగా ఉంటుంది.....ఆ వంటమ్మాయ్ ముందు."
"అసహ్యమెందుకు? అమెరికన్ తో తనూ లాస్ట్ బస్ లో వచ్చిన హజ్బెండ్ గారికి పట్టుబడిపోయిందిగా?"
"ప్లీజ్ షటప్!" లేచిబయటకు నడవబోయింది.
"అదేమిటి? మనం ఇంకా మ్యూజిక్ వినటం మొదలవలేదుకదా" ఆమె కాలు గట్టిగాపట్టేసుకున్నాడు.
"ఇంతవరకూ విన్నది చాలు! వదులు..."
"నాకింకా వినాలనివుంది!"
"విను.....నన్నెందుకాపుతున్నావ్?"
"హోప్ లెస్ గాళ్! మ్యూజిక్ అనేది ఇద్దరూ కలిసి అనుభవిస్తేనే బాగుంటుంది. ఎవరి మ్యూజిక్ వాళ్ళు అనుభవించటంలో థ్రిల్ లేదు."
తివాచీ మీదే పడుకుని మ్యూజిక్ వింటూంటే మళ్ళీ ట్రేలో 'టీ' తీసుకొచ్చింది ప్రభ. ఆమె మొఖంలోకి చూసినవ్వాడు సురేష్.
"ఇందాక మమ్మల్నిచూసి ఎందుకు పారిపోయావ్?"
ఆమె ముఖం ఎర్రబడింది.
"అయ్యబాబోయ్......పొరపాటయిపోయిందండీ!"
"అంటే ఈసారి అలాంటి సీన్లోనువ్ కూడా జాయినయిపోతావ్ కదూ?"
"అవును.......అయ్యబాబోయ్. మీరు ఏంటోగా మాట్లాడుతున్నారండీ" అంటూ ట్రే అతనిముందుపెట్టి పరుగుతో వెళ్ళిపోయింది గాబరాగా.
ఆఖరిక్షణంలో ఆమె చీర అంచుదొరికిందతనికి.
ఠక్కున నిలబడిపోయింది మరింత కంగారుగా.
"అమ్మో! అదేమిటండీ! వదిలేయండి" ఎవరయినా చూస్తున్నారేమోనని హాలువేపు చూసింది భయంగా.
"మరి అలాకొత్తయినట్లు యాక్షన్ చేస్తున్నావేమిటి? ఇప్పుడు లాస్ట్ బస్ బాధలేదుగా."
ఆమె మరింత గాబరా పడిపోయింది.
"అయ్య బాబోయ్ సీరొదలేయండి! నాకేటోగా వుందండీ!"
"వదిలేస్తే నాకేటోగా ఉంటదండీ!"
చేత్తోచీరను ఒక్కలాగు లాగివదిలించుకుని హాల్లోకి పరిగెత్తింది.
అక్కడేపడుకుని మ్యూజిక్ వింటుండగానే మాయవచ్చేసింది.
"ఓ యూ ఆర్ ఎంజాయింగ్ మ్యూజిక్?" చిరునవ్వుతో గదిలోకి వస్తూ అంది.
"సింగిల్ గా ఏ మ్యూజిక్ వింటేమాత్రం ఏం లాభంలెండి!" కింద తివాచీ మీదనుంచిలేచి కూర్చుంటూ అన్నాడు నిరుత్సాహంగా.
"తులసే మయింది? కంపెనీ ఇవ్వటం లేదా?"
"మీకో రహస్యంచెప్పనా? తులసిచాలా మూడ్ గాళ్! ఒక్కోసారి మరీ అరగంట, గంటసేపు వరకూ చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంది."
"అంటే ఏం చేస్తుంది?"
"ఛ! చెప్పాలంటే అసహ్యంగా ఉంది. ఇలాంటి విషయాలు ఎలా చెప్పటం?" ముఖం రెండుచేతుల్తో మూసుకుంటూ అన్నాడు.
ఆమె కిలకిలనవ్వేసింది.
"తెల్సింది లెండి! ఇంకా మీరేం చెప్పనక్కరలేదు."
"ఆ! తెలిసిందా? ఏం తెలిసింది?"
"అదే! మా తులసి కొంచెం ఎగ్రిసివ్ గా ప్రవర్తిస్తూఉంటుంది అంతేకదా?"
"అయ్యో!దాన్ని కొంచెం అంటారా? ఇలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మీ మీద నాకు అనుమానంవస్తోంది. పాపం మహీధర్ ని ఎన్ని హింసలు పెడుతున్నారోనని విరామం ఇవ్వకుండా."
ఆమె ముఖంలో సిగ్గు గోరంతలు మెరసిక్షణంలో ఆనవాలు లేకుండా మాయమైపోయినాయ్.
"నేనేం అంత 'సెక్స్ క్రేజీ' కాదులెండి."
సురేష్ ఆశ్చర్యంనటించాడు.
"అదేమిటి? సెక్స్ విషయం ఎవరు మాట్లాడారిప్పుడు?"
"మరి తులసిగురించి మీరు ఇంతసేపూ మాట్లాడింది....."
"అదా! యూఆర్ మిస్టెకెన్! ఘోరంగా ప్రవర్తిస్తుందంటే నా ఉద్దేశ్యం నాకు గంటో, అరగంటో దూరంగా ఉంటుందని."
మాయసోఫాలో కూలబడిందిదెబ్బతిన్నట్లు.
"యూ ఆర్ ష్రూడ్" అంది అంది క్షణాల్లో కోలుకుంటూ.
"థాంక్యూ! కేవలం నా థీయరీకే అన్ని మార్కులు వేశారంటే......"
ఛప్పుణ అతని వాక్యం పూర్తిచేయనీకుండా అడ్డుపడుతూ 'ప్రభా' అంటూ పిలిచిందామె.
ప్రభపరుగుతో వచ్చి సురేష్ ని చూస్తూనే దూరంగా వెనక్కు జరిగింది.
"ఏంటండి?"
"భోజనంరడీ అయిందా?"
"ఆయ్! ఇందాకే అయిపోయిందండీ."
"అయితే వడ్డించెయ్ మరి......తులసి ఎక్కడుంది?"
"కిచెన్ గార్డన్ లో వున్నారండీ."