Previous Page Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 18


  

    అట్లా మెరిసి మాయమయ్యే ఈ శరీరం మీద ఎందుకంత మమకారం అనిపిస్తుంది. తుచ్చమైన కోర్కెలను తీర్చుకోవడానికి మనిషిపడే తపనంతా అజ్ఞానమన్న వేదాంతం పట్టుకొస్తుంది. స్త్రీ పురుషుల మధ్య నున్న ఆకర్షణ, సంబంధాలు- ఇవన్నీ నీచమైనవిగా తోస్తాయి. ఎప్పుడో ఒకప్పుడు గాలిలో కలిసిపోయే ప్రాణం మీద తీపి, శుద్ధదండగన్న ఫిలాసఫీ మనసుకి వార్థక్యాన్ని ప్రసాదిస్తుంది. ఇలాంటి భావనలతో కుదేలైపోయాడతను.

 

    దేవుడికి హారతి ఇచ్చి దానిని ఆమె ముందు వుంచాడు. ఆమె కళ్ళతో హారతిని అద్దుకుంది. తీర్థప్రసాదాలు ఇవ్వగానే వెళ్ళిపోయింది.

 

    మరో అరగంటకు ఓ అవివాహిత యువతి వచ్చింది. ఆమె  దేవాలయంలో లోపలికి రాగానే పైట తీసే సన్నివేశాన్ని పంతులు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంతకు ముందు వృద్ధురాలు వచ్చినప్పుడు కలిగిన వేదాంతం అంతా ఆమె పైట అందాల ముందు వృద్ధురాలు వచ్చినప్పుడు ఎగిరిపోయింది.

 

    ప్రపంచాన్ని ధిక్కరించి ముందుకు దూసుకువచ్చినట్టున్న ఆమె యవ్వన సిరులు అతని మనసులో తుఫానులు రేపుతున్నాయి. ఆ గుండ్రనితనం మనసుని ముద్దలా చేసి ఎక్కడో కోర్కెల సుడిగుండంలో గిరవాటేస్తోంది. ఆ ఎత్తులు శరీరాన్ని సుతిమెత్తగా కోస్తున్నాయి.

 

    'రా దమ్ముంటే అనుభవించు! అర్థం లేని సంశయాలు వద్దు' అని అవి పిలుస్తున్నట్టు వున్నాయి. 'రేపు స్వర్గ నరకాలు వున్నాయో లేవో ఎవరికి తెలుసు. వయసున్నప్పుడే అందాలను నీ స్వంతం చేసుకో" అని అవి బోధిస్తున్నట్లే అనిపిస్తోంది.

 

    ఇలా రెండు రకాలయిన వేదాంతాల మధ్య పాపం అతను ఎప్పుడూ  నలిగిపోతుంటాడు. అందుకే ఏనుగులా వుండేవాడు పీనుగులా అయిపోయాడు.

 

    ఆ అమ్మాయికి తీర్థప్రసాదాలిచ్చి పంపించి వేశాడు. మోహన పనులన్నిటినీ ముగించుకుని వెళ్ళిపోయింది.

 

    భక్తులు వస్తే వాళ్ళకి తీర్థప్రసాదాలు ఇవ్వడం, భక్తులు లేని సమయంలో అక్కడే ఓ స్తంభానికి జారిగిలబడి కూర్చోవడం నిత్యకృత్యం.

 

    అలా మధ్యాహ్నం అయింది.

 


                                          *    *    *

 

    బావి దగ్గరికి వెళ్ళి అన్నం ఉడకబెట్టుకున్నాడు. సాంబారు తయారయ్యాక భోజనం చేశాడు.

 

    బాగా అలిసిపోవడం  వల్ల  శరీరం విశ్రాంతి కోరుకుంటోంది. దేవాలయంలోకి వచ్చి తలకింద ఉత్తరీయాన్ని వుంచుకుని పడుకున్నాడు. నిద్ర కనురెప్పల్ని మూస్తూ వుండగా ద్వారం దగ్గర అలికిడైంది. కళ్ళు విప్పి చూశాడు.

 

    మోహన అతన్ని చూస్తూ "ఏమిటి పంతులు! నిద్రా? భోజనం అయిందా?" అంటూ లోపలికి వచ్చింది. పైట తీసిబొడ్లో దోపుకుని అతని దగ్గరగా నిలబడింది. ఎవరో తన నరాలను కసికొద్దీ లాగి వదిలనట్టు అతను ఓసారి కుదుపిచ్చాడు. ఆమె ఎద కాంక్షలను రేపుతున్న తేనెతుట్టెలా వుంది.

 

    అతనికి నిద్ర రావటం లేదు. కోరిక శరీరాన్ని మండిస్తోంది. కానీ ఆచార వ్యవహారాలు అంతకంటే అతన్ని ముందుకు సాగనివ్వవు. "ఈ  సమయంలో ఎందుకు వచ్చావిక్కడికి?" తడబడుతూ ప్రశ్నించాడతను.

 

    ఆమె మరో స్తంభం దగ్గరికి  వెళ్ళి శుభ్రం చేసుకుని పడుకుంది. తలకింద పైటను వుండలా పెట్టుకుంది.

 

    "ఏం చేయను పంతులూ! ఆ ఇంట్లో వేడి, ఉక్క, హాయిగా బట్టలిప్పేసి నీళ్ళల్లో తొంగోవాలనిపిస్తూ వుందనుకో. కానీ గాలి అయినా ఆడుతుందని పైటతీస్తే చచ్చినోడు- అదే నా మొగుడు పైనబడి పోతాడు.

 

    ఈ  ఎండలో అలాంటివి భరించగలమా? అందుకే ఇక్కడికి వచ్చేశాను. హాయిగా పైట తీసేసి ఎంచక్కా నిద్రపోవచ్చుగదా" ఇలా చెప్పి ఆమె కళ్ళు మూసుకుంది.

 

    క్షణంలో ఆమెకు నిద్రపట్టేసిందని అర్థమైంది అతనికి.

 

    ఆమె పైటను చూస్తున్న అతనికి నిద్ర రావడం లేదు.

 

    చుట్టూ పిండివంటలు పెట్టి మూతిని కట్టేసినట్టు అతను గింజుకు పోతున్నాడు.

 

    
                                            7

 

    ఆ వీధి మలుపు తిరగగానే పులిరాజు గుండె వేగం హెచ్చింది. వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. మరో నిముషంలో పునర్వసు కనిపిస్తుందన్న ఆలోచనలతో శరీరం చిన్న జర్క్ ఇచ్చింది.

 

    అతనికి పాతికేళ్ళుంటాయి. సన్నగా, పొడవుగా. మంత్రగాడి ముఖాన దిద్దుకున్న  ఎర్రటి నామంలా వుంటాడు. ఆ చుట్టుపక్కల గ్రామాలంతటికీ ఏకైక భూతవైద్యుడు అతనే. ప్రతి ఆదివారం దెయ్యాలు పట్టిన వాళ్ళంతా వైద్యం కోసం అతనింటికి వస్తారు. ఆరోజంతా హడావుడిగా వుంటాడు. దెయ్యాలన్నిటినీతరిమికొట్టి వాళ్ళిచ్చిన తృణమో, పణమో స్వీకరిస్తాడు. ఇక వారంలో మిగిలిన రోజుల్లో ఏ పనీ వుండదు. మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప మిగిలిన రోజుల్లో భూతవైద్యం చెయ్యడు. దెయ్యం మరీ ఉద్ధండపిండమైతే అమావాస్యరోజు దాని పని పడతాడు.

 

    అతనికి అమ్మ నాన్న లేరు. శ్మశానంలో మంత్రం తప్పుగా చదవడంవల్ల అతని తండ్రిని పీక్కు తిన్నదని చెప్పుకుంటారు. ఇందులో నిజమెంతో తెలియదుగాని అతని తండ్రి స్మశానంలోనే చనిపోయాడు. చిన్నప్పట్నుంచీ  తండ్రి నేర్పిన మంత్రాలే ఇప్పుడతనికి తిండి పెడుతున్నాయి.

 

    సరిగ్గా ఎప్పుడో తెలియదుగానీ అతను ఇటీవల పునర్వసు ప్రేమలో పడ్డాడు. ఆమెకు ఇరవై ఏళ్ళుంటాయి. దేవుడు ముందు పెట్టిన  నిమ్మకాయలా పచ్చగా మెరిసిపోతుంటుంది ఆమె. శరీరంలో ప్రతి అవయవమూ పెద్దదే. కళ్ళ నుంచి కాళ్ళ వరకూ వుండాల్సిన సైజుకంటే కాస్త ఎక్కువగా వుంటాయి. సన్నగా, పీలగా వున్న తను ఆమె ప్రేమలో ఎలా పడ్డానా అని పులిరాజు అప్పుడప్పుడూ ఆశ్చర్యపోతుంటాడు.

 

    అతని ప్రేమ గొడవంతా పునర్వసుకు తెలియదు. ఇప్పటివరకు ఒన్ సైడ్ లవ్ గానే వున్న తన ప్రేమను డబుల్ సైడ్ లవ్ గా చెయ్యాలని అతను తెగ ఆరాటపడి పోతున్నాడు.

 

    ఈరోజు ఎలాగయినా తన ప్రేమను ఆమె ముందు ఏకరువు పెట్టాలని నిర్ణయించుకునే అతను బయలుదేరాడు. కానీ  ఎక్కడో ఏదో జంకు  వెనక్కి లాగుతోంది.

 

    దెయ్యాలను తరిమే తనలాంటివాడు కూడా ప్రేమ విషయం వచ్చేసరికి భయపడడం వింతగా అనిపిస్తోంది అతనికి. ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలన్న తపన ఎక్కువైంది. ఆమె ఒంటరిగా ఎప్పుడు కనబడుతుందా అని ఎదురు చూస్తున్నాడు. తను కనపడగానే ఏమేం చెప్పాలో చాలాసార్లు రిహార్సల్స్ వేసుకున్నాడు. తన తండ్రి వశీకరణమంత్రం నేర్పించనందుకు తిట్టుకున్నాడు కూడా.

 

    అప్పటికే చీకట్లు ముసురుకుంటున్నాయి. తూర్పు ఆకాశంలో చంద్రుడు అప్పటికే తెల్లగా నవ్వుతున్నాడు. గాలి పూలలోని పుప్పొడిని ఒంటికంతా స్ప్రే చేసుకున్నట్లు సువాసనలను విరజిమ్ముతోంది.

 

    పునర్వసు ఇల్లు దగ్గరపడింది.

 Previous Page Next Page