ఇప్పుడు టౌన్ లోని డాక్టర్ అలా తేల్చి చెప్పేయడంతో తన అనుమానం కరక్టేననిపించింది చంద్రరేఖకి.
రెండో రోజునుంచి ఊర్మిళ గురించి బాగా తెలిసినవాళ్ళను పిలిపించి, తమకు తెలిసిన విషయాలనంతా చెప్పమంది.
ఊర్మిళ గురించి తమకు తెలిసినదంతా చెప్పుకొచ్చారు జనం.
అన్నీ విన్నాక ఊర్మిళ జబ్బేమిటో తెలుసుకోవాలని ప్రయత్నించింది.
అసలు సమస్య ఏమిటో గుర్తించడానికి చాలా వివరాలే సేకరించింది. తను విన్న విషయాలన్నిటినీ ఓ దగ్గర పేర్చి, విశ్లేషణచేసి ఊర్మిళ జబ్బేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించింది చంద్రరేఖ.
రఘురామయ్యది సాధారణమైన రైతుకుటుంబం. పొలంలో వచ్చే రాబడి తిండికి, బట్టకే సరిపోయేది. ఆయనకు ఇద్దరు కూతుర్లు. పెద్దమ్మాయి ఊర్మిళ అయితే చిన్నమ్మాయి పేరు ఉజ్వల. ఇద్దరి మధ్య ఐదేళ్ళ ఎడం వుంది.
ఊర్మిళకు ఎనిమిదేళ్ళు వచ్చేసరికి తల్లి చనిపోయింది. దీంతో ఒక్కసారిగా వాళ్ళ ఇంటి పరిస్థితి మారిపోయింది. ఆడతోడు లేని కుటుంబము అయిపోయింది. ఇంటి ఇల్లాలు మరణంతో దిగులుచెందిన రఘురామయ్య మంచం ఎక్కాడు.
మొత్తం కుటుంబం భారమంతా ఊర్మిళపై పడిపోయింది. ఆ వయసులోనే వంటా వార్పూ నేర్చుకుంది. తమ చిన్నాన్నతో కలిసి పొలం వెళ్ళి ఆ పనులు చూసుకునేది. మరో సంవత్సరానికి రఘురామయ్య సర్దుకున్నాడు. ఊర్మిళ ఆనకు చేదోడు వాదోడుగా వుంటోంది. ఆ వయసులో అంతగా బాధ్యత ఎరిగి ప్రవర్తిస్తున్న తన పెద్ద కూతుర్ని చూసి ఆయన ఒకటే మురిసిపోయేవాడు.
"నాకు మగపిల్లల్లోరన్న లోటు లేదయ్యా! మా ఊర్మిళ నాకు పెద్ద కొడుకుతో సమానం" అనేవాడు ఇంటికొచ్చే వాళ్ళతో.
ఆ మాటలు వినీ వినీ తనూ మగపిల్లాడే అని భావించే స్థితికి వచ్చిందామె. మగాళ్ళతో తీసిపోకుండా కాయకష్టం కూడా చేసేది.
బండి తోలేది, మడక దున్నేది, రాత్రి అని కూడా లేకుండా పొలాలకి నీళ్ళు పెట్టేది.
ఆ పిల్ల ఇలాంటి పనులు చేస్తుండడంతో వూరి జనమంతా 'మగరాయుడు' అని పిలవసాగారు. తన భ్రమని ఇలాంటి పేర్లు మరింత బలపరిచాయి.
ఉజ్వల పెరిగి పెద్దదయింది. ఆమె వయసుకి వచ్చేటప్పటికి కుటుంబాన్నంతా కష్టాలనుంచి బయట పడేసింది ఊర్మిళ. స్వంతంగా బండి ఎద్దులు కొనుక్కుంది. అప్పులన్నిటిని తీర్చేసింది. పైపెచ్చు మరో అర ఎకరం కూడా పొలం కొన్నది. పూరింటిని పడగొట్టి పెంకుటిల్లు వేసింది.
ఓ ఆడపిల్ల వీటన్నిటినీ సాధించడం చూసి వూరంతా ముక్కు మీద వేలేసుకుంది.
మగరాయుడని పేరుపడ్డా ఆమెలోని స్త్రీ లక్షణాలు ఎక్కడికి పోతాయి? పద్దెనిమిదేళ్ళు వచ్చేటప్పటికి ఆమె ఎద తేనెతుట్టెలా తయారయింది! కళ్ళు మరింత పెద్దవై రెండు మబ్బుతునకల్ని అతికించినట్లు వుండేవి. నడుం చెర్నాకోలు కొసలా కనిపించేది. ఇక బొడ్డయితే పన్నీరు బుడ్డిలా వుండేది.
ఆమె అంటే వున్న భయంవల్ల ఎవరిచూపులూ అంతకంటే కిందికి దిగేవికావు.
ఆమె అచ్చం మగవాడిలా ప్రవర్తించడంతో ఏ అబ్బాయీ ఆమెతో చనువుగా వుండటానికి సాహసించలేకపోయాడు. ఆమెకీ ఎవరిమీదా మోజు కలగలేదు. ఎంతసేపటికి తండ్రి అనే మాటలు ఆమెలో ముద్రపడి పోయాయి. తను మగవాడి నేనని మనసా వాచా నమ్మడం ప్రారంభించింది.
"మగపిల్లాడిలాగా ఈ కుటుంబాన్ని ఓ దారికి తెచ్చావ్. ఇక ఎవరినో ఒకర్ని చూసి పెళ్ళి చేసుకోమ్మా" అని తండ్రి అంటున్నా ఆమె పట్టించుకోలేదు.
"నా పెళ్ళి మాటలు మరచిపో నాన్నా! నా మాట వినండి. ముందు చెల్లెలి పెళ్ళి చేద్దాం" అనేది.
రఘురామయ్య ఎంత చెప్పినా వినలేదు. చివరికి సరేనని తల వూపారు. దాంతో ఉజ్వలకి భర్తను తేవడానికి ఊర్మిళే పూనుకుంది.
ఫలానా వూరిలో మనవాళ్ళ అబ్బాయి వున్నాడని ఎవరయినా బంధువులు చెపితే క్షణం ఆలస్యం చేయకుండా పెళ్ళి చూసొచ్చేది.
చివరికి ఆమెకి పొదలకూరులోని వెంకటాచలం బాగా నచ్చాడు. ముగ్గురు అన్నదమ్ముల్లో అతను చిన్నవాడు. వ్యవసాయమే జీవనాధారం.