Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 16

    ఒక్క సంగతి మాత్రం చెప్పి వెళ్ళాలని వచ్చాను లాయరు గారు, మేం ఇద్దరం కల్సి చేసిన తప్పో, పొరపాటో ఇద్దరం కల్సే చేశాం దానికి నన్నోక్కర్తినే భాధ్య్హురాలిని చేసి వేలెత్తి చూసి దోషిగా నిర్ణయించడం నేను సహించను లోకం ముందు నాతో పాటు మీ అబ్బాయిని దోషిగా నిలబెడతాను. ఇద్దరూ కల్సి చేసిన పనిలో ఆడదే తరతరాలుగా నష్టపోతోంది. మగవాడేప్పుడు తప్పించుకుని పోతున్నాడు కానీ నేను మాత్రం అంత సుళువుగా మీ అబ్బాయిని తప్పించుకు పోనియను.
    నాతో పాటు మీ అబ్బాయి నలుగురుముందు దోషిగా నిలవాలి. నా కష్ట నష్టాలలో అతను సగభాగం పంచుకునేట్టు చేస్తాను. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకి వెడతాను. అందినంతవరకు అనుభవించి, ఆకలి తీరిన తరువాత విస్తరాకు విసిరేసినట్లు విసిరేస్తే వూరుకోడానికి నేను పాతతరం అమ్మాయినికాదు. ఈ తరం ప్రతినిధిని. నా బిడ్డకు తండ్రి అని న్యాయస్థానంలోనే నిరూపించి న్యాయం కోరతాను. అంత దూరం వెళ్ళకుండా మీరేమన్నా చేయ్యగలరేమోనన్నభ్రమతో వచ్చాను."
    "బెదిరిస్తున్నావా? కోర్టుకేక్కుతావా?" అయన మొహం ఎర్రబడి పోయింది.
    "తప్పకుండా. సజావుగా పరిష్కారం కానీ సమస్యలకి కోర్టుకి వేళతారన్నది లయరైనా మీకు నేను చెప్పలా?"
    "ఇదుగో అమ్మాయి విను. నేను లాయర్ని. కోర్టులు గురించి నీవు చెప్పక్కర లేదు. నీ మాటలన్నీ అబద్దాలని నేను నిరుపిస్తాను. జైలు పంపిస్తాను. బ్లాక్ మెయిల్ చేశావని" బెరిరించాడు.
    "సరే మన బలబలాలు కోర్టులోనే తెల్సుకుందాం." రూప లేచి నిల్చుంది.
    బెదిరిస్తే భయపడ్తుందనుకున్న రూప నిబ్బరంగా అలా మాట్లాడి వెళ్ళడానికి లేవగానే అయన జంకాడు. కలవరపాటుతో భార్య వంక చూశాడు. ఆవిడ ఇంతసేపూ జరుగుతున్నది వింటూ ఆరాటంగా, భయంగా, ఆదుర్దాగా ఏం అనాలో తెలియక గాభరాగా చూస్తుంది. రూప విసవిస రోడ్డెక్కింది భార్య భర్త మొహాలు కళతప్పి నల్లబడ్డాయి.
    "రూపా....." విశ్వనాధంగారి కేకతో ఇల్లంతా అదిరిపోయింది.
    ఆఫీసు కెళ్ళిన భర్త మరో గంటలోనే ఇంటికి ఎందుకు వచ్చారు. ఒంట్లో బాగోలదా అనడగాబోయిన పద్మావతి ప్రశ్న నోట్లోనే వుండిపోయింది. అప్పుడు తల్లి, కూతురు ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేస్తున్నారు. ఆ కేకతో హడలిపోయారు ఇద్దరూ.
    రూప తండ్రి వంక బెదుర్గా చూసింది. ఆయన మొహం ఎర్రబడి వుంది. మనిషి చెమటలు కక్కుతున్నాడు.
    "నిన్న లాయరు రామనాధం గారింటికెళ్ళావా?" గర్జించారాయన.
    తండ్రి కెలా తెల్సిందా అని తెల్లబోయింది రూప. భర్తకి ఆ విషయం తెల్సిపోయినందుకు,
    రూప ఇంట్లోంచి ఎందుకు పంపావు అని తనమీద విరుచుకు పడతాడని పద్మావతికి భయంతో కాళ్ళు వణికాయి. రూప తలదించుకుంది.
    "జవాబు చెప్పు. ఎందుకెళ్ళావు వాళ్ళ ఇంటికి? నా పరువు నడిబజార్లో పెట్టడానికి వెళ్ళావా? నాపేరు, నీ పేరు కిడ్చడానికి తయరయ్యావా? నీ కెంత సాహసం ఎంత ధైర్యం. నిన్నసలు గుమ్మం కదలడానికి విలులేదన్నాను. అసలు ఇంట్లోంచి ఎండుకెళ్ళవు. ఎలా వెళ్ళావు అసలు నీవు దాన్ని ఇంట్లోంచి ఎందుకు కదలనిచ్చావు. ఇంత జరిగినా ఇంకా నీకు బుద్దిరాలేదా? కూతుర్ని ఆమాత్రం అదుపులో పెట్టుకోలేని దానివి నివేం తల్లివి. నేను అది గుమ్మం కదలడానికి వీల్లేదని మరీ మరీ చెప్పినా నామాట లక్ష్య పెట్టకుండా దాన్ని నాకు తెలియకుండా బయటి కెందుకు వెళ్ళనిచ్చావు?" భార్యని తీక్షణంగా చూస్తూ మండిపడ్డారాయన.
    పద్మావతి తల దించుకుంది.
    "అసలు దాన్ని కాదు నిన్ననాలి పిల్లల్ని నీ చేతులారా నేవే పాడుచేస్తున్నావు" అరిచారాయన.
    "వద్దన్నా వినకుండా వాళ్ళ నాన్నతో మాట్లాడి వస్తానని వెళ్ళింది. నన్నేం చెయ్యమంటారు. ఇటు మీరు అటు అది ఇద్దరూ నా ప్రాణాలు తీస్తున్నారు. మధ్య నేను చస్తున్నాను. ఇంతకీ ఏమయింది?"
    "ఏమవాలే ఇంకా? ఇంకా అవడానికి ఏం మిగిలిందే. నీ కూతురు చేసిన వెధవ పనికి సిగ్గుపడి ఏడవాల్సిందిపోయి కోర్టుకేక్కుతుందిట. ఆ కుర్రాడిని నలుగురిలో నిలబెట్టి దానికి పుట్టబోయే బిడ్డకి తండ్రి అని నిరూపిస్తుందిట. మర్యాదగా పెళ్లాడకపోతే వాళ్ళ పరువు కోర్టుకిడుస్తానని బెదిరించి వచ్చిందిట నీ కూతురు నిన్నవాళ్ళ  ఇంటికి వెళ్లి. ఆ పెద్దమనిషి ఇవాళ మా బ్యాంక్ కి వచ్చి నలుగురిలో నన్ను పట్టుకుని మొహం ఈడ్చాడు.
    కూతుర్ని జాగ్రత్త పెట్టుకోలేక బజార్న వదిలారు. మా అబ్బాయితో మేం తిరగామన్నామా, కడుపు చేయించుకోమన్నామా? ఇప్పుడు మా ఇంటిమీదకి తోల్తారా, ఏం పెద్దమనిషివయ్యా. ఆడపిల్లని అదుపులో పెట్టుకోడం చేతకాక మా వాడిమీద ఏడ్చి ఇప్పుడు దమ్మిడి కట్నం ఇవ్వక్కర లేకుండా పెళ్ళాడానికి ఎత్తేసి మమ్మల్ని కోర్టుకిడుస్తాం అని బెదిరిస్తున్నారా- అంటూ దుయ్యబట్టి నలుగురిలో నా మొహాన పేడనీళ్ళు కొట్టాడు. నీ కూతుర్ని జాగ్రత్త పెట్టుకో, పరువు నష్టం దావా వేస్తాను, అని బెదిరించాడు. నా పరువు మర్యాద ఇంకేమన్నా వుందా. రేపు పొద్దుట ఆఫీసులో మొహం ఎలా ఎత్తుకు తిరిగితాను ఏమిటే ఇదంతా, ఏమిటో ఈ బాగోతం." అయన గొంతు ఆవేశంతో వణికింది.
    జరిగింది విన్నాక పద్మావతి పట్టరాని కోపం వచ్చింది.
    కూతుర్ని తీక్షణంగా చూసి "నిన్న నేను అడిగితే ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదు.
    సురేష్ ఇంట్లో లేడు! అతనొచ్చాక మాట్లాడుదాం అన్నారని నాతో ఎండుకబద్ధం చెప్పావు."
    "ఆ సంగతి అలా వుంది. అక్కడి కెళ్ళి పుట్టబోయే బిడ్డ అంటూ వాగింది. అదేమిటి? ఉత్తి బెదిరింపా, నిజమా కనుక్కుని ఏడు" కూతురివంక తిరస్కారంగా, ఏహ్యంగా చూసి ఆమెతో మాట్లాడడం ఇష్టంలేనట్టు భార్యతో అన్నారు విశ్వనాధం.
    పద్మావతి మొహం తెల్లగా పాలిపోయింది.
    "ఏమిటే! ఇది నిజమా. అబద్దమా?...." అంది.
    రూప తలదించుకుంది ఆ మొహం చూడగానే పద్మావతికి సంగతి అర్ధమైపోయింది.
    ఆమె గొంతు తడారిపోయింది.
    "ఊరి వాళ్ళ దగ్గర చాటుకోచ్చావు. మా దగ్గిర ఎందుకే? చెప్పు.....అది నిజమేనని చెప్పు, ఇన్నాళ్ళు ఏదో ఉత్తి తిరుగుడే ననుకున్నాను. ఇదీ జరిగిందన్నమాట. ఎంతదానివే. నా దగ్గిర ఇంత దాస్తావా? నీ కోసం ఇన్ని తిట్లు, చివాట్లు సహించాను. నా దగ్గిర దాచి నన్ను మోసం చేస్తావుటే నీ మొహానికి సిగ్గేలా లేకపోయిందే. ఇలాంటి వెధవ పని చేసి అంత నిబ్బరంగా ఎలా వున్నావే" పద్మావతి కోపం, దుఖం ఆవేశం అన్నీ ఒక్కసారి వచ్చేశాయి. కాళ్ళు వణుకుతుంటే చప్పున కుర్చీలో కూలబడింది.
    "నిబ్బరంగా వుండకేమే - దానికేం ఏడవాల్సింది మనం, ఇలాంటి కూతుర్ని, కన్నందుకు లోకానికి మొహాలు చూపలేక సిగ్గుతో మొహం దాచుకోవాల్సింది మనం దానికేం కోర్టు కెక్కుతుంది. కేసులు పెడ్తుంది.....పిల్లని కంటుంది. అది సిగ్గు, బిడియం వదిలింది" తల్లి, తండ్రి ఒకరి తర్వాత ఒకరు ఈటేల్లాంటి మాటలు విసురుతుంటే రూప తల దించుకుని నిలబడింది.
    ఏం పట్టనట్టు అంత నిబ్బరంగా వున్న కూతురుని చూసేసరికి విశ్వనాధంగారికి మరింత తిక్కరేగింది.

 Previous Page Next Page