Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 16


    వరదరాజులు చెప్పింది నమ్మినట్లు నటించాడు గౌతమ్. తగినట్లు తను నటించాడు. అద్వితయమయిన తెలివితేటలు గల గౌతమ్ పరిస్టితులకు తలవగ్గి పైసాకి కొరగాకుండా వున్నడుగాని. ఏ పనిలో ప్రవేశపెట్టినా చాకులాంటివాడు.

 

    "వరదాయ్! వందరూపాయలు పెట్టి బ్లూ ఫిల్మ్ చూడటమా! ప్రతి పైసాని పొదుపుగా వాడాబట్టి రోజులు ఇలా వెళుతున్నాయిరా అని చెప్పినవాడు అరగంట కోసం వందరూపాయలు అవలీలగా తగలేస్తాడా! పదహారేళ్ళ వయసులో నే పక్కింటి భార్యభర్తల దాంపత్య రహస్యాన్ని తలుపు సందులోంచి చూశాను అని చెప్పి ఆ దంపతుల కేళి విలసాలని వర్ణించి చెప్పిన ఈ వెధవాయే బ్లూ ఫిల్మ్ చూశానురా అని చెప్పడానికి డొంకతిరుగుడు కబుర్లు చెపుతాడా! వాడి కంగారు మాటలు తడుముకునే విధానం చూస్తుంటే ఇదేదో కాస్త ఆలోచించాల్సిన విషయం లాగానే వుంది..." దొవపొదుగూత అతడు అలా ఆలోచిస్తూనే వున్నాడు.

 

    ఏ విషయాన్నీ అయితే తేలిగ్గా తిసుకోకుడాదో ఆ విషయాన్నీ చాలా తేలిగ్గా తీసుకున్నాడు వరదరాజులు.

 

    ఏ విషయాన్నీ అయితే తేలిగ్గా తిసుకోవచ్చో ఆ విషయాన్నీ గట్టిగా పట్టేశాడు గౌతమ్.

 

    ఇది చాలు వాళ్ళిద్దరి జీవితంలో ముందు ముందు గొప్ప మార్పు జరగటానికి. ఇది నాంది మాత్రమే.

 

    "ఊ...ఊ.....ఊ...." చిన్నగా మూలుగు.

 

    నిమ్మదిగా వినిపించే ఓ స్రీ మూర్తి తాలూకా రోదన ధ్వని.

 

    ఆ తర్వాత ఎక్కిళ్ళు, ఆగి... ఆగి... ఆగి.

 

    ఆనందాశ్చర్యాలకి అతీతంగా వుండాలి. ఆ విషయం చక్రపాణికి బాగా తెలుసు. కనురెప్ప పాటు కాలంలో తెప్పరిల్లాడు. మిస్టర్ ఎక్స్ గా మారిపోయాడు.

 

    స్వీట్ బ్రూటల్ పార్టీకి వెళుతున్నామని గుర్రం ముఖం వ్యక్తి ముందే చెప్పాడు. క్రురత్వంలో తియ్యదనం ఏమిటో అప్పుడు చక్రపాణికి తెలియదు. చూసి తెలుసుకోవాల్సిందే గాని అడగకూడదు. ఎలాగు చూదబొతున్నాదు కదా!

 

    అండర్ వరల్డ్ లో స్టానం సంపాదించడమన్నది అంత తేలికపాటి విషయం కాదు. కఠీనమయిన నిర్ణయాలకు తల వగ్గడం చాలదు. కరకు మనస్తత్వం కూడా అవసరం.

 

    లైటు వెలిగేసరికి గుర్రం ముఖం వ్యక్తి పులితల లోకి (మారిపోయిన) తన తలదూర్చిన చక్రపాణి స్టేజి మీద వున్నారు. స్టేజి ఎదురుగా పెద్ద హాలువుంది. హాలులో రౌండ్ టేబుల్స్ వున్నాయి. ఒక్కో టేబుల్ చుట్టూ మూడేసి కుర్చీలు, హలులోని లైటు అతితక్కువ కాంతి ప్రసరిస్తున్నది.

 

    దీంట్లో వింతేమి లేదు. వింత అల్లా....

 

    భరించరానంత భాధతో భయంకరంగా మూలుగుతూ వినేవాళ్ళ గుండెలు అవిసేలా ఓ స్రీ తాలూకా రోదన ధ్వని హాలంతా పరుచుకుని వినిపిస్తున్నది. అక్కడ ఏడుస్తున్న స్రీ లేదు. పాప్ మ్యూజిక్ వినిపిస్తున్నట్లు ఏడుపు రికార్డ్ చేసి వినిపిస్తున్నారు. ఆ ఏడుపుకి తోడు కొన్ని వాయిద్యాలు తోడయి విషాద సంగీతాన్ని ఏడుపు మధ్యలో జోడించి వుంది.

 

    హాలులో చాలా కుర్చిలలో జంతువుల తలకాయలు మనిషి దేహంగల మనుషులు కుర్చుని వున్నారు. వాళ్ళలా పుట్టలేదు. అందరూ ముఖాలు కానరాకుండా పులి నక్క కుక్క వగైరా జంతువు అకారాల తలలు గల మాస్క్ల్ లు ధరించారు. శరీరాన్ని మాత్రం సగం నలుపు తెలుపుగల ఒకేరకం దుస్తులతో వున్నారు. ఎటొచ్చి ముఖాలే మార్పు. ఒకరి ముఖం ఒకరికి తెలియకుండా వుండటానికి ఆ ఏర్పాటు.

 

    వింత వింత లోకంలో విచిత్రమానవుల మధ్యకి వచ్చి పడ్డట్టయింది చక్రపాణికి. ఈ ముఖాలకి ఏడ్పు సంగీతం డెత్ గేమ్ లో చావు బాకా వినిపించినట్లు వుంది అక్కడితీరు.

 

    చక్రపాణి గుర్రం ముఖం వ్యక్తీ స్టేజి మీదకి రాంగానే ఏడ్పు సంగీతం ఆగిపోయింది. ఒక్కసారిగా అక్కడంతా భయంకర నిశ్శబ్ధం ఏర్పడింది.

 

    "మైబ్లడ్!" ఉన్నట్లుండి పెద్ద గొంతుకతో అన్నాడు గుర్రం ముఖం వ్యక్తీ.   

 Previous Page Next Page