"ఓ.కే. ....అయ్ విల్ ట్రై."
"వస్తాన్సార్" అతను వెళ్ళిపోయాడు.
శ్రీధర్ గమ్యం లేకుండా నడవసాగాడు.
* * * *
డోర్ బెల్ మోగేసరికి చేతిలోని పుస్తకం పక్కన పడేసి తలుపు తెరిచాడు సృజన్.
ఎదురుగా ఓ అందమయిన యువతి నిలబడి వుంది.
"గుడ్ మాణింగ్!" అందామె చిరునవ్వుతో.
"గుడ్ మాణింగ్....." అన్నాడు సృజన్. ఆమెను అంతకు ముందేక్కడో చూసినట్లనిపిస్తోందతనికి. కానీ గుర్తురావటం లేదు.
"నేను వాషింగ్ పౌడర్ సేల్స్ గాళ్ ని........."
"ఓ....."
"నవీనా వాషింగ్ పౌడర్........! క్రొత్తగా తయారుచేస్తున్నారు హైదరాబాద్ లోనే చాలా మంచి పౌడరు. మిగతా పౌడర్ల కంటే ఎందులోనూ తీసిపోదు.........కావాలంటే యిక్కడే డిమాన్ స్ట్రేట్ చేసి చూపిస్తాను."
సృజన్ నవ్వేశాడు.
"మా వదిన ఇంట్లో లేదు. మార్కెట్ కెళ్ళారు."
"పోనీ మీరు తీసుకోవచ్చు కదండీ.......?"
"ఆఫ్ కోర్స్ ......కానీ........:"యింకా ఆమె గురించి ఆలోచిస్తూనే అన్నాడతను.
"ప్లీజ్! ఒక్కటయినా తీసుకుండి! క్వాలిటీలో ఏ మాత్రం లోపం లేదు."
"మీరో విషయం చెప్తారా? మనం ఇంతకూ ముందేక్కడో కలుసుకున్నట్లనిపిస్తోంది -----మీరు......"
ఆమె అతని వంక చూసింది పరీక్షగా.
"నేనూ అదే ఆలోచిస్తున్నానండీ! కానీ ఈ ఉద్యోగంలో చేరాక ఈ నెలరోజుల్లో ఎన్నో వందల ఇళ్ళు తిరగటం చేత అందరినీ ఇంతకూ ముందేక్కడో చూసినట్లే అనిపిస్తుంటుంది."
"మీరింతకు ముందేక్కడ వుండేవారు? అయ్ మీన్ జాబ్!"
"బాంక్ లో రెండు నెలలు టెంపరరీగా పనిచేశాను. తరవాత యిది?"
హటాత్తుగా సృజన్ కి గుర్తు కొచ్చేసింది.
"మీరు వర్కింగ్ వుమెన్ హాస్టల్లో వుండేవారు కదూ?"
"అవును......."
"అయితే గుర్తుకోచ్చేసింది.........నేనూ, నాగేందర్ మీ కోసం వచ్చాం" అప్పుడు ఆమెకు గుర్తికోచ్చేసింది.
"ఎగ్జాక్ట్ లీ! చాలా రోజులయింది కదండీ! అందుకని...!"
"అయ్యో! నంచునే వున్నారు. రండి! కూర్చోండి"
"ఆమె చేతిలోని బాగ్ పక్కన పెట్టి లోపలికొచ్చి కూర్చుంది.
"మీ పేరు కూడా మర్చిపోయాను......."
"భారతి" అందామె.
"అవును, గుర్తుకొచ్చింది."
"ఈ ఉద్యోగం చాలా కష్టం కదండీ! అన్ని ఇళ్ళకూ వెళ్ళటం కొనమని అడగటం" ఆమె ముఖంలో బాధ కనిపించింది.
"అయినా తప్పదు కదండీ! కనీసం నన్ను నేనయినా ఏదో విధంగా పోషించుకుంటే మా వాళ్ళకు కొంత బరువు తగ్గినట్లవుతుందని.......అయినా వేరే ఊద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాను. ఎక్కడైనా దొరికితే ఇది మానేస్తాను."
"దీనికి జీతం ఎంతిస్తారు?"
"ఏంతండి ! రెండొందలు ప్లస్ కమీషన్" నిరాశతో అందామె.
"ఈ నెల మూడొంద లొచ్చింది. వచ్చేనెల అది కూడా వస్తుందన్న నమ్మకం లేదు-----"
సృజన్ చకచక ఆలోచించసాగాడు. ఆమెకు తమ కంపెనీలోనే ఉద్యోగం యిప్పిస్తే ! అన్నయ్య తను చెబితే కాదనడు.
అందువల్ల ఆమెకూ సహాయం జరుగుతుంది. తనకూ ఆమెతో చనువు పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఎందుకో ఆమెను చూసిన మొదటిరోజే ఆమె పట్ల ఆకర్షణ కలిగింది తనకు. తరువాత ఎన్నోసార్లు ఏదొక వంకతో మళ్ళీ హాస్టల్ కు వెళ్ళి ఆమెను కలుసుకోవాలనుకున్నాడు కానీ - తీరా హాస్టల్ గేటు వరకూ వెళ్ళేసరికి ఆమె ఏమనుకుంటుందోనన్న అనుమానంతో వెనక్కు తిరిగి వచ్చేశాడు.
"మీకు మా అన్నయ్య కంపెనీలోనే ఉద్యోగం ఇపిస్తాను. మీరు కావాలనుకుంటే ------"
ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, అనందం కనిపించినాయ్.
:నాకు అంతకంటే కావాల్సిదేముంతుందండీ! ఏం కంపెనీ మీదీ?"
"ఫార్మానుటికల్స్ కంపెనీ లెండి. అన్నయ్య నేను చేప్తే కాదనడు."
"అయితే దయచేసి నాకు సహాయం చేయండి! లేకపోతే ఇంకో రెండు మూడు రోజుల్లో మావూరు వెళ్ళిపోదామనుకుంటున్నాను."
"అయితే మీరు రేపు సోమవారం రండి మా ఇంటికి? ఈలోగా నేను అన్నయ్యతో మాట్లాడతాను."
"చాలా థాంక్స్ అండీ! సమయానికీ ఎంతో సహాయం చేస్తున్నారు."
అ రాత్రి శ్రీధర్ వచ్చేవరకూ ఎదురుచూస్తూ కూర్చున్నాడు సృజన్.
భోజనం చేస్తుండగా వెళ్ళి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు.
"ఓ హెల్ప్ కావాలన్నయ్యా!"
"ఏమిటది?"
"మా ఫ్రెండ్ ఒకమ్మాయికి ఉద్యోగం కావలన్నయ్యా! మీ ఆఫీస్ లో ఏదో ఒక పోస్ట్ కి."