Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 14


    ఆమె తనదారి పార్కులోకి మళ్ళించింది. ఆ సమయంలో పార్కు ఇంచుమించు నిర్మానుష్యంగా ఉన్నదనే చెప్పావచ్చు. ఆమె పార్కులో ఒకమూలగా ఉన్న బెంచీ మీద కూర్చుంది. చేతి సంచి లోని మాలను ఒకసారి బయటకు తీసి వాసన చూసింది. తర్వాత ఒక్క నిమిషం ఏదో ఆలోచిస్తున్న దానిలా ఉండిపోయింది. ఆ తర్వాత హటాత్తుగా ముఖం రెండు చేతుల్లోనూ దాచుకుంది. ఆమె ఏడుస్తోందని నాకు అనుమానం కలిగింది. నా అనుమాన నివృత్తి కన్నట్లుగా ఆమె ముఖాన్ని మళ్ళీ బయటకు తీసింది. దూరానికి కూడా ఆమె ముఖం మీద కన్నీటి చారికలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ సారి ఆమె చేతి సంచీ లోంచి మాలకు బదులు రుమాలు తీసి ముఖం శుభ్రంగా తుడుచుకుని కళ్ళు ఒత్తుకుంది.
    ఆమె లేచి మళ్ళీ కదిలింది , నేనూ కదిలాను.
    ఈసారి ఆమె సిటీ బస్సు ఎక్కింది. కొంచెం పరుగెత్తు కుంటూ వెళ్ళి నేనూ అదే బస్సు అందుకున్నాను. నేను టిక్కెట్టు బస్సు టెర్మినల్ దాకా తీసుకున్నాను. ఆమె ఎక్కడ దిగితే అక్కడే దిగే అవకాశం కోసం.
    అయితే నా డబ్బులు వృధా పోలేదు. ఆమె కూడా టెర్మినల్ దగ్గర దిగింది. అక్కడ ఒక చరిత్ర ప్రసిద్ది కెక్కిన కొండ ఉంది. ఆమె ఇప్పుడా కొండ వైపే నడుస్తోంది.
    ఆ కొండ ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. సుమారు నాలుగు వందల మెట్లు. ఎక్కితే అతి పురాతనమైన ఒక శివాలయం వస్తుంది. శివాలయం ఇంచుమించు కొండ శిఖరం పైనే ఉన్నదని చెప్పవచ్చు. అక్కడ ఆలయంలో ఏవో కొన్ని శిల్పాశాసనాలున్నాయి. సరైన ప్రకారం లేక పోవడం వల్ల ఆ ఆలయం కేవలం చరిత్ర కారులకు మాత్రమే ఆసక్తి దాయకంగా ఉండి - యాత్రీకులను అట్టే ఆకర్షించలేక పోతోంది.
    ఆమె నెమ్మదిగా వెనక్కు చూడకుండా మెట్లు ఎక్కుతోంది. మెట్లదారి మెలికలు తిరిగి ఉండడం వల్ల అప్పుడప్పుడు ఆమె నాకు కనుమరుగవడం జరుగుతోంది. బహుశా అయిదవ మెలిక తిరిగాక అనుకుంటాను -- ఆమె అదృశ్య మైంది.
    నేను మరో పాతిక మెట్లు పైకి వెళ్ళి చూశాను. ఇప్పుడు దారి చాలా దూరం వరకూ అగుపడుతోంది . ఆమె ఎక్కడా కనుచూపు మేరలో లేదు. నేను మళ్ళీ మెట్లు దిగాను. ఆమె మాయమైన మెలిక దారి ఎంతో పొడవు లేదు. నేను ఒక పర్యాయం చుట్టూ చూశాను. మెట్లకు కుడి పక్కగా ఉన్న చెట్ల మధ్య నుంచి మనుష్యులు నడిచే దారి లాంటిది కనబడింది. ఆమె ఇంక ఎటు వెళ్ళడానికి అవకాశం లేదని నాకు తోచింది. నేను నామార్గం ఆ సన్ననిదారిలోనికి మళ్ళించాను. ఒక పదడుగులు వేశానో లేదో కొంచెం దూరంగా ఆమె కనపడింది. దారికి పక్కగా ఒక చెట్టు  నానుకుని కూర్చుని ఉంన్నాదామే. నేను ఆమెను గమనించిన క్షణంలోనే ఆమె లేచి నిలబడింది. హటాత్తుగా ఆ చెట్టును ముద్దు పెట్టుకుంది. ఆమె ప్రవర్తన నిజంగానే విచిత్రమైనదనిపించింది. ఆమె మళ్ళీ కూర్చుని ముఖం చేతిలో దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. పార్కులో విధంగా ఆమె ఇప్పుడు నెమ్మదిగా ఏడవడం లేదు.
    మళ్ళీ ఆమె ముఖం తుడుచుకుని లేచింది. నేను చెట్ల చాటుకు తప్పుకున్నాను. ఆమె మళ్ళీ కొండ వైపుకు నడుస్తోంది. ఆమె నన్ను దాటి వెళ్ళాక నేను చప్పుడు కాకుండా ఆమె ఇందాక కూర్చున్న చెట్టు దగ్గరకు వెళ్ళాను. ఆ చెట్టుకు ఒక చిన్న కొయ్య పలక కొట్టబడి ఉంది. దాని మీద ఒక హంస బొమ్మ ఉంది. ఇందాక ఆమె ముద్దు పెట్టుకున్నదీ బొమ్మ నేనని నాకనిపించింది. అదే నిజమైతే ఆమె పిచ్చిది కాదు. ఈ హంస బొమ్మ వెనక ఏదో విషాద గాధ ఉండాలి. నేను ఎక్కువసేపు ఆలోచించలేదు. ఆమెను జాప్యం చేయకుండా అనుసరించ వలసి ఉంది కదా!
    నా అంచనా ప్రకారమే ఆమె మెట్లు దిగుతోంది. ఆ తర్వాత బస్సు ఎక్కింది. ఎక్కడ దిగుతుందో మాత్రం నాకు తెలియదు. ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఆమె బీచ్ దగ్గర దిగింది. అక్కడి నుంచి బీచ్ వారనే నడుచుకుంటూ వెడుతోంది. అలా సుమారు ఒక మైలు దూరం ఆమె నడిచింది. అప్పుడు ఆగింది. నేనూ ఆమె తప్ప అక్కడ మరో ప్రాణి లేదు. అక్కడ కొన్ని దుంగలు పడవేసి ఉంటె నేను వాటి వెనుక కూర్చున్నాను. ఆమెకు నేను కనిపించాను కాని ఆమెను నేను గమనిస్తూనే ఉన్నాను. ఇప్పటికీ ఆమె మొదటిసారిగా వెనక్కి తిరగడమనేది చేసింది. ఒక పర్యాయం చుట్టూ పరికించి ఆమె కూర్చుంది. నేను వాచీ కేసి చూసుకుంటూ ఆమెను గమనిస్తున్నాను. యిందు నిమిషాల అనంతరం ఆమె లేచి నిలబడి మళ్ళీ ఒకసారి చుట్టూ పరికించింది. హటాత్తుగా సముద్రం వైపు పరుగెత్తింది. నేను కొద్ది సెకన్ల పాటు మాత్రమే జాప్యం చేసి అటు వైపు పరుగెత్తాను. అప్పటికి ఆమె నీటిలో మునకలు వేస్తోంది.
    నేనామెను ఒడ్డుకు మోసుకువచ్చి కొద్దిగా ప్రధమ చికిత్స చేశాను. తడిసిన బట్టల లోంచి కనపడే ఆమె ఒంపు సొంపులు నన్ను అదోలా చేశాయి. ఒక్క పిసరు ఆవేశం గా ఉన్నాను. నా ప్రధమ చికిత్స ఫలించి ఆమె కన్నులు విప్పి మొట్టమొదటి సారిగా నా వేపు చూసింది. ఆ చూపులో ఏ భావమూ లేదు.
    "మీరు చనిపోవాలని ప్రయత్నించారు" అన్నానేను.
    ఆమె పెదవులు కదిలాయి. "మీరు ఆపారు కదూ" అన్నదామె.
    ఆమె రూపం కంటే కూడా చక్కని దామే కంఠ స్వరం అనిపించింది. కాసేపు ఇద్దరి మధ్యా మౌనం రాజ్య మేలింది.
    "నన్నెందుకు మీరు బ్రతికించడానికి ప్రయత్నం చేశారు?' అన్నదామె.
    "మీ ప్రాణాల్ని తీసుకునే హక్కు మీకులేదు. ఆత్మహత్య ప్రయత్నం చట్టరీత్యా నేరం . ఒక సామాన్య పౌరుడిగా నాకళ్ళ ముందు జరగబోతున్న నేరాన్ని ఆపాను." అన్నాన్నేను.
    "ప్రాణాలంటే ఎవరికైనా తీపి ఉంటుంది. నన్ను బ్రతికించితే అంతటితో మీ బాధ్యత తీరిపోయింది. కానీ ప్రతి క్షణం బ్రతకడానికి నాకు శక్తి కావాలి. అది ఎలా లభ్యమవుతుంది?" అందేమే.
    "మీరేదో కష్టాల్లో ఉన్నారనుకుంటాను. నన్ను మీరు నమ్మే పక్షంలో ఎటువంటి కష్టాన్నుంచేనా మీకు విముక్తి కలిగించగలనని హమీ ఇస్తున్నాను."
    ఆమె కనులు మెరిశాయి" నా సమస్య మీరనుకున్నంత సులభంగా పరిష్కరింపబడేది కాదు. భారత స్త్రీగా నోరు విడిచి బయాతాకు చెప్పుకోలేని సమస్య అది."    
    "ఫరవాలేదు. చెప్పండి - " అన్నాను కుతూహలంగా.
    ఆమెకు కాస్త ఓపిక వచ్చినట్లుంది. లేచి కూర్చుంది . "నాకు వివాహమైంది. అన్ని విధాలుగా నాకోర్కెలు తీర్చగల ఆస్తీ, అంతస్తూ గల భర్త ఉన్నాడు. నామీద ఆయనకు  అమితమైన ప్రేమ. కానీ అదేం దురదృష్టమో ఎంత ప్రయత్నించినా ఆయనంటే నేను ఇష్టపడలేక పోతున్నాను. నిజం చెప్పాలంటే నాకు ఆయనంటే అసహ్యం కూడా, ఎందుకో చెప్పలేను. ఇది నా మనసును దోలిచేస్తూ ఉంటుంది. నాకు ఈడూ జోడూ గా కనబడే యువకునితో సినిమాల్లోలా షికార్లు కొడుతూ తిరగాలని ఉంటుంది. నా భర్తను మీరు చూడలేదు. అయన నాకు ఈడే కాని జోడు కారన్న అభిప్రాయం నాలో బాగా స్థిర పడి ఉంది -"
    "మీ సమస్య చిత్రమైనదే అయినా దీనికి పరిష్కారం చావులో మాత్రం లేదు. కొంతకాలం గమనిస్తే మీ సమస్యకు పరిష్కారం నేనే చూపగలను -" అన్నాను నమ్మకంగా.
    "అదంత సులభం కాదు. కానీ మీ మాటలు నాకు ధైర్యాన్నిస్తున్నాయి-" అన్నదామె
    "ప్రస్తుతం ఏం చేద్దామని అనుకుంటున్నారు?" అనడిగాను.
    "ఆ విషయంలో ఒక నిర్ణయానికి రానే వచ్చాను. నా ప్రాణాల్ని అంతం చేసుకోబోతున్నట్లుగా నా భర్తకు ఉత్తరం ఇంట్లో వదిలివచ్చాను. నా ఆత్మకు శాంతి కలగడం కోసం ఏ విధమైన పోలీసు ఎంక్వయిరీలు జరిపించవద్దని అదే ఉత్తరం లో ఆయనకు కోరాను. అయన లెక్క ప్రకారం నా జీవితం మొగిసింది. సముద్రం లోంచి బయటకు వచ్చిన క్షణం నుండీ మరొక జన్మ ఎత్తాననిపిస్తోంది. మరి అయన వద్దకు మాత్రం వెళ్ళను, వెళ్ళలేను. ఇప్పుడు చెప్పండి - నా సమస్యకు పరిష్కారం మీరు చూపగలరా ?'
    "ఇంతకీ మీ భర్త గారి చిరునామా?"
    "మాదీ ఊరు కాదు. నా కోరిక మీద అయన నన్నీ ఊరు తీసుకుని వచ్చాను. గతవారం రోజులుగా మాత్రమే నేని ఉళ్ళో ఉంటున్నాను. ఇంతకు మించి మరేమీ వివరాలు నన్నడగవద్దు. ఇంతకూ నా సమస్య మీవల్ల పరిష్కరింపబడుతుందా" అన్నది తెలనే లేదు.
    "పదండి . ముందు మా ఇంటికి వెడదాం -" అన్నాను.
    నేను లేచి సంకోచించకుండా నాచేయి జాపాను. ఆమె సంకోచిస్తూ నా చేయి పట్టుకుని లేచింది. ఆ స్పర్శకు నా ఒళ్ళు జల్లుమంది.

 Previous Page Next Page