Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 14

    ఏదో విషయంలో ఇన్ స్పెక్టర్ గట్టి దెబ్బ తిని వుంటాడని ఇరువురు గ్రహించారు....ఏమీ తెలియనట్లు మెలిగారు.
   
                                                                       11
   
    రాత్రి పదకొండు...
   
    మేడమీద ఇన్ స్పెక్టర్ బన్సీలాల్ చెరో కుర్చీలో శుఖాశీనులు అయ్యారు....వాళ్ళముందు చిన్న టీపాయ్ వుంది.
   
    నౌకరు వచ్చి టీపాయ్ మీద రమ్ బాటిల్, బిస్తర్ బాటిల్స్, వేయించిన జీడిపప్పు, పుట్టగొడుగులు మసాలా క్రష్ తదితర సామాను సర్దిపోయాడు.
   
    బన్సీలాల్ ఆహ్వానం మీద ఇన్ స్పెక్టర్ డ్యూటీ లేనప్పుడు పార్టీకి వచ్చాడు.
   
    ఇన్ స్పెక్టర్ పేరు కన్నారావు....ఇప్పుడు డ్యూటీ మీదలేడు. అలాగే పైజమా లాల్చీతో సీదాసాదాగా వున్నాడు.
   
    ఆ సాయంత్రం బన్సీలాల్ ఫోన్ చేసి పార్టీ యిస్తున్నట్లు తప్పక పదకొండుకల్లా రమ్మని చెప్పాడు.
   
    "పార్టీయా! ఎవరెవరు! ఎందరు వస్తున్నారు? ఏ సందర్భంలో పార్టీ?" ఇన్ స్పెక్టర్ అడిగాడు.
   
    "వచ్చేది ఒక్కరు. ఆఒక్కరూ మీరేనన్న విషయం వేరే చెప్పనక్కరలేదనుకుంటాను" నవ్వుతూ జవాబిచ్చాడు బన్సీలాల్.
   
    "విశేషం...!"
   
    "ఏమిలేదు...కొన్ని గంటలు సరదాగా కబుర్లు చెప్పుకుందామని కాస్త స్పెషల్..."
   
    "ఇంక చెప్పొద్దు పదినిమిషాలు తక్కువ పదకొండుకి మీ సమక్షంలో వుంటాను లాల్ జీ!"
   
    "ఎదురుచూస్తూ వుంటాను మీ రాకకై" అంటూ నవ్వుతూ ఫోన్ దించేశాడు బన్సీలాల్.
   
    అన్నమాట ప్రకారం వచ్చాడు ఇన్ స్పెక్టర్ కన్నారావు.
   
    సరుకు సరంజామా ఎదురుగా వుంచుకొని వాళ్ళిద్దరు మాత్రమే మేడమీద వున్నారు....అక్కడ ఏం జరిగినా ఏం మాట్లాడినా వాళ్ళిద్దరికీ తప్ప ఎవరికీ తెలియదు.
   
    "రమ్ చాలా ఘాటైన సరుకు...విషయం ఏదో గట్టిదే అయివుంటుంది" రమ్ బాటిల్ ని చూస్తూ అన్నాడు ఇన్ స్పెక్టర్.
   
    "చల్లకొచ్చి ముంత దాచకూడదుగాని, రమ్ పుచ్చుకుంటూ రాజకీయాలు పలక్కూడదని ఎక్కడాలేదు" గ్లాసుల్లోకి రమ్ వంచుతూ చెప్పాడు బన్సీలాల్.
   
    విషయమేదో వటిలమైందే అనుకున్నాడు ఇన్ స్పెక్టర్.
   
    ఆ తర్వాత...
   
    ఇరువురు రమ్ చప్పరిస్తూ జీడిపలుకులు నములుతూ మధ్యమధ్య క్రష్ చప్పరిస్తూ కొద్దిసేపు మౌనంగా వున్నారు.
   
    కొద్దిసేపు అయిన తర్వాత ఇరువురికి కిక్ మొదలయింది.
   
    "జజారులో ఆనందయ్య కనపడ్డాడు" విషయానికి నాందీగా పలికాడు బన్సీలాల్.
   
    "బాకీ విషయం మళ్ళీ ఎత్తారాలాల్ జీ" జీడిపలుకులు నోట్లో వేసుకుంటూ అడిగాడు ఇన్ స్పెక్టర్.
   
    "మీరు పాతబాకీ విషయం అడగవద్దు అన్నారు...ఇంకెందుకు అడుగుతాను."
   
    "మరి పని గట్టుకుని ఈ సమయంలో ఆనందయ్య విషయం ఎత్తారు."
   
    "జరిగింది వినండి మరి."
   
    "చెప్పండి మరి!"
   
    ఇరువురు నవ్వుకున్నారు. వాళ్ళు మాట్లాడుకున్న తీరుకి. ఆ తర్వాత చెప్పటం మొదలుపెట్టాడు బన్సీలాల్.
   
    "వాడంతట వాడుగా ఆనందయ్య ఆగి నాకు నమస్కరించాడు విషయం బయటకు లాగుదామని నేనుకూడా శాంతం వహించి "మీ మనవడి విషయం తెలిసిందా?" అన్నాను. ఎలా మాయం అయ్యాడో తెలియదు. మళ్ళా ఎలా వచ్చాడో తెలియదు. వాడు యింటికి తిరిగివచ్చాడు బాబూ!" అన్నాడు.
   
    "నేను బాకీ డబ్బు పదేపదే అడిగానని నీ కొడుకు నీ మనవడ్ని ఎక్కడో దాచి నన్ను అల్లరి పెట్టాడని అంటాననుకొనేదానికి నీ సమాధానం?" అనీ నవ్వుతూనే అడిగాను.
   
    "పసిపిల్లవాడిని దాచేటంత తుచ్చలం కాదు బాబూ" అన్నాడు నంగనాచి ముఖం వేసుకుని.
   
    "అంటే వాడి అనుమానం నా మీదనే....సమయం రాకపోతుందా దెబ్బతీయకపోతానా! అనుకుంటూ తెచ్చి పెట్టుకున్న చిరునవ్వుతో అడిగాను "దాచింది ఎవరో నీ మనవడ్ని అడక్కపోయావా" అని__
   
    "ఏం జరిగిందో వివరించే తెలివి వాడికిలేదు. గదిలో పెట్టారు ఏడిస్తే కొడతానన్నారు అందుకని నేను ఎదవలేదు. తర్వాత వాళ్ళు మనింటిదగ్గర వదిలారు. అంటూ నాలుగు ముక్కలు చెప్పాడు. ఏదయితేనేం నా బంగారుతండ్రి నా యింటికి వచ్చాడు. అమ్మని నమ్మిన వాళ్ళకి అపకారం జరగదు. వస్తాబాబూ! వీలు చూసుకుని మీ బాకీ చెల్లిస్తాను" అని చెప్పి ఆనందయ్య వెళ్ళిపోయాడు.
   
    అదీ జరిగింది ఇన్ స్పెక్టర్ జీ! వీడి మాటలు వ్యవహారం, దీమా చూస్తుంటే నా కేదో అనుమానంగా వుంది. అమ్మ అంటే శక్తిమాయి అని ఆ నోట ఆ నోటా అనుకుంటున్నారు. ఆమె కాదు కదా! ఓ వేళ ఆమె గనుక అయితే ఆమెకు నేను చేసిన అపకారం ఏముంది? వాడుచేసిన అపకారం ఏముంది? నాకేమి అర్ధం కావటం లేదుజరిగింది వివరిచ్న్హాడు బన్సీలాల్.

 Previous Page Next Page