ఒక చేత్తో నోరు నొక్కుతూ, మరొక చేత్తో, త్యనాను నొక్కిపడుతూ క్రూరంగా నవ్వుతొన్న శ్యామ్ ను చూడగానే సంగతి అర్ధమయింది ప్రసూనకు _ భయంతో గడ్డ కట్టుకు పోయింది. శ్యామ్, చేతుల్లోంచి తప్పించుకోలేకగింజుకుపోతోంది. "మర్యాడుగా అడిగితె చెంపదెబ్బ కొట్టావు కదూ! అనుభవించు !" కసిగా అన్నాడు శ్యామ్ ...... ఒక ఫర్లాంగు దూరంలో చౌరస్తాఉంది. అక్కడ పోలీసులున్నారు ప్రసూన అదృష్టంబాగుండి ఒక చేతిని కొంచెం తప్పించుకో గలిగింది __ గబాలున ఆ చెయ్యి తొలగించాడు శ్యా మ్ .... శక్తి కొద్దీ "హేల్ఫ్! హెల్ప్! పోలీస్ ! పోలీస్!" అని అరిచింది పోలీసులు ఆ కేకను విన్నారు _ వెంటనే పోలీస్ వేన్ టాక్సీని వెంబడించింది _ పట్టుకుంది _ ప్రసూన జరిగిదంతా చెప్పింది శ్యామ్ ను అరెస్ట్ చేశారు రిపోర్టు రాయమన్నారు. ప్రసూనాను ఇంటి దగ్గర దింపారు.
ప్రసూన రూం కున్న స్ప్రింగ్ డోర్ తెరచుకుంది నవ్వుతూ లోపల ప్రవేశించిన శ్యామ్ "హలో మేడమ్ " అన్నాడు.
నిర్ఘాంతపోయింది ప్రసూన ......
శ్యామ్ చొరవగా ప్రసూన పక్కకు వచ్చి కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు.
ప్రసూన టేబుల్ మీద ఫోన్ తీసింది.
శ్యామ్ మెరుపులా తలుపుదగ్గరకు వెళ్ళిపోయాడు. ప్రసూన ఫోన్ పెట్టేసింది.
తలుపుదగ్గర ఆగి నవ్వి శ్యామ్ అన్నాడు. సి.ఐ.డి. ఆఫీసర్ మోహన్ పోలీసు డిపార్టుమెంటులో ఉన్నంతవరకూ నన్నెవరూ ఏమీ చెయ్యలేరు!
శ్యామ్ వెళ్ళిపోయాడు .....
ప్రసూన తల గిర్రున తిరిగింది , మోహన్ విడిపించాడా శ్యామ్ ను! ఇది నిజమేనా?
ఆ సాయంత్రమే మోహన్ దగ్గరకు బయలుదేరింది ప్రసూన.
ఎంతో ఆనందంతో ఆప్యాయంగా ఆహ్వానించాడు మోహన్. ఆ రోజు కన్నీళ్ళతో కారులో కూర్చున్న ప్రసూన మూర్తి ఆ తరువాత ఎంతకూ మరపు రాలేదు మోహన్ కి .... ఎన్నోసార్లు తనే ప్రసూనాను పలకరించాలనుకున్నాడు. ముఖంచెల్లక ఊరుకున్నాడు.
చిరునవ్వుతో " ఎన్నాళ్ళకు దయకలిగింది?" అన్నాడు మోహన్ చిరునవ్వునవ్వి, ఆ మాటల్లో ... ఆ కంఠంలో .... కళ్ళలో కనబడే ఆప్యాయత ప్రసూన మతిపోగొట్టింది.
తనెందుకు వచ్చిందోకూడా మరచిపోయింది క్షణకాలం ........
చిరునవ్వుతో విచ్చుకున్న పెదవులు .... ముగ్ధత్వం ఉట్టిపడే చూపులు .... అణువణువునా లావణ్యం తోణికిసలాడే శరీరము ..... ప్రసూనమూర్తి మోహన్ మనసును ఆకర్షించుకుంది ......
అర్ధస్వరూప అన్నాడు.
"నా ధర్మానికి విరుద్దంగా నడవలేను కాని మీ కోసం ఏమయినా చెయ్యగలను ......."
ఆ మాటలతో ఉలికిపడింది ప్రసూన ..... మరుగున పడిన రోషం ఒక్కసారిగా పెల్లుబికింది ......
"మిమ్మల్ని అభినందించాలని వచ్చాను నేను ...."
వెటకారం అర్ధంకాలేదు మోహన్ కి .... అయినా ప్రసూనమీద కోపం తెచ్చుకోగలిగే శక్తి ఆ క్షణంలో అతనికి లేదు.
"దేనికి?"
"ఆ రోజు నేను అలాంటి బట్టలు కట్టుకోవాలో, ఎలా ఉండాలో సలహాలిచ్చారు. మీకు అలాంటి సలహాలక్కర్లేదు ఈ పోలీసు యూనిఫాం మీకు అన్నివిధాలా బాగుంది ఈ యూనిపాంమాటున ఎన్ని ఘోరాలయినా చేసేయవచ్చు .... ఎన్ని శ్రీ రంగ నీతులయినా చేపోచ్చు ...."
మోహన్ కనుబొమలు ముడిపడ్డాయి అయినా శాంతంగా "మీరు చెప్తున్నదేమిటో నాకు అర్ధంకాలేదు" అన్నాడు.
ప్రసూన మరింత నిరసనగా "ఏముందిలెండి! అందరూ చేస్తునదే! మన వాయినం మనకుముడితే చాలు. అమాయకులు ఎందరు బలి అయిపోయినా పరవాలేదు .... సంఘం ఏమయిపోయినా పరవాలేదు .... దేశం ఏమయిపోయినా బాధలేదు ... కబుర్ట్లకేం, ఎన్నయినా చెప్పవచ్చు .... తెల్లారిలేస్తే రక్తంతాగే రాక్షసులు కూడా వేదికలమీద ఇచ్చే ఉపన్యాసాలు దివ్యమ్గానే ఉంటాయి ......" అంది.
"మీరు ఎవరిగురించి మాట్లాడుతున్నారు?"
మోహన్ కంఠం పదునెక్కింది ....
ఆ పదును గుర్తించిన ప్రసూన రగులుకుపోయింది ....
"మిమ్మల్ని గురించి! ఒక అమాయకురాలిబ్రతుకు సర్వనాశనం చెయ్య తలపెట్టిన నీచుడ్ని స్వార్ధంతో శిక్ష నుండి తప్పించిన ఒక పోలీస్ ఆఫీసర్ గురించి! ఎంత ముట్టింది శ్యామ్ దగ్గర్నుంచి?"
"శ్యామ్ ! .... శ్యామ్ విషయమా?"
మోహన్ గొంతు పొడారిపోయింది. ముఖం తెల్లగా పాలిపోయింది .
శ్యామ్ అరెస్టు వార్తా వినగానే తెలుసుకోకుండానే విడిపించే ఏర్పాట్లు చేశాడు ......
ప్రసూన జరిగిన అవమానం తలచుకుని దహించుకుపోసాగింది.
"ఆ దుర్మార్గుడు నడిబజారులో నన్ను అవమానించాడు. టాక్సీలో ఎత్తుకుపోయి సర్వనాశనం చెయ్యాలని చూశాడు ..... సమయానికి పోలీసులు పట్టుకొకపోతే, నా బ్రతుకు ఏమయిపోయేది? అలాంటి నీచుడ్ని తప్పించారు __ వాడు వచ్చి మళ్ళీ నా ఎదురుగా నవ్వేలాచేశారు! డబ్బుకి ఇంత విలువ ఉందా?"
"సారీ! శ్యామ్ మిమ్మల్ని అల్లరిపెట్టాడని నాకు తేలియదు" బుసలుకొడుతూ లేచింది ప్రసూన .......
"నేనని తెలిస్తే? ..... అప్పుడు లంచం తీసుకోకుండా శిక్షించెవారా? మరొక స్రీ అయితే నాశనం అయితే అయిందని రూపాయలే పరమార్ధ్గామనుకుని __ మురిసిపోయేవారా? ఏమిటి? ఇదంతా నామీద ప్రేమేనా ? వద్దులెండి. ఇంతప్రేమ నేను భరించలేను!"
విసురుగా వెళ్ళిపోయింది ప్రసూన.