Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 11


    "ఏందది? ఏమయినా దొంగతనంగా యెత్తుకుపోతున్నావా?" అని గద్దించి అడగడంతో రెండు చేతుల్నీ ముందుకు లాగి, తెరిచి "ఏం లేదు" అది.
    
    "ఏదో ఉందే" అంటూ ఉత్తరాన్ని తీసుకుని తన ఇంట్లోకి నడిచింది. దాన్ని చదవగానే మొత్తం అర్ధమయింది. బాల్ పెన్ తీసుకుని. కూతురూ, కోడలూ రాసిన వాటికింద, "అయిదుమూట్లకు నేను కూడా రెడీ" అని రాసి, రంగమ్మకిచ్చింది.
        
    దీపక్ ముఫ్ఫై అయిదు మూట్లిచ్చి ముగ్గుర్నీ చేరదీసేందుకు రెడీ అయ్యాడా? లేకపోతే ఎందుకీ ముగ్గురి లంపటం అని కామ్ గా అయిపోయాడా అన్నది మాత్రం తెలియదు"
    
    మహిత చెప్పడం పూర్తిచేసి నవ్వుతోంది. సూర్యాదేవి కూడా ఆమెతో పాటు శృతి కలిపింది.
    
    కాసేపయ్యాక అంది. "ఇది వినడానికి నవ్వులాటగా ఉన్నా ఎంత విషాదం ఉందో, డబ్బు ముందు, పేదరికం ముందు ఏ విలువలూ గట్టిగా నిలబడవు. మనిషి నిర్మించుకునే గోడలన్నీ యెంత ఓటివో యిలాంటివి విన్నప్పుడు తెలుస్తుంది"
    
    "అందుకే ఇదంతా నీకు చెప్పాను"
    
    "మీకు డబ్బులేదు, జీవితం వుంది. నాకు డబ్బుంది, జీవితం లేదు" అని విషాదం బరువుకి వెనక్కి వాలిపోయినట్లు చైర్ కి చేరగిలబడింది సూర్యాదేవి.
    
    ఆ సమయంలో ఠక్కున వసంత్ గుర్తొచ్చాడు.
        
    కోటిసార్లు తన పేరు రాశాడు. ఎన్నిరోజులు తన పేరు రాస్తూ గడిపాడు? ప్రపంచంలో మరేదీ గుర్తు రాకుండా ఉండడం కోసం కోటిసార్లు తన పేరు రాసినట్లనిపించింది.
    
    తన పెళ్ళిలో తాళం వేస్తూ తనను చూశాడట. పెళ్ళి పీటలమీద మరొకరి భార్య కాబోతున్న క్షణంలో ప్రేమించడం తమాషాగా లేదూ. ప్రేమ ఎప్పుడైతే స్టార్ట్ కాకూడదో అప్పుడు స్టార్ట్ అయిందన్న మాట. ఈ మూడేళ్ళు తనతో చెప్పలేక, తనలో తనే ఎంత ఒత్తిడికి గురయి వుంటాడో? ఐ ఏ ఎస్ ను తృణప్రాయంగా కాలితో తన్నేసిన అతనికి తనేమి ఇవ్వగలదు? తను ప్రేమించగలదా? వివాహం అయి మరొకరితో కాపురం చేస్తున్న తను అతన్ని స్వీకరించగలదా? ఇంపాజిబుల్.... ఏదో రొటీన్ కి భిన్నంగా వుండడం వల్ల తనకు థ్రిల్ లాంటిది కలిగింది. అంతే తప్ప ఏమైనా ఇవ్వగలిగే ప్రేమ తనకి కలగడం లేదు.
    
    కానీ అతను వున్నా అరగంట ఎంతగా ఎగ్జెయిట్ మెంట్ కి గురైంది తను. బతికున్న క్షణాలంటే అవే. విరసం సభల్లో గద్దర్ పాట విన్నప్పుడు, ఎస్ సీసీలో భాగంగా పక్కవూరికి వెళ్ళి రోడ్డువేస్తూ, ఓ గుడిసింట్లో పప్పులుసుతో సంకటి తినప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు టూర్ వెళ్ళి కన్యాకుమారిలో సూర్యోదయం చూసినప్పుడు, రామేశ్వరం గుడిలో యువకుడైన ఓ పూజారి తననుచూసి కన్నుగీటినట్లు అనిపించినప్పుడు ఇలాగే మనసు తుఫానులో చిక్కుకున్న పడవే అయింది. పెళ్ళి అయిన ఈ మూడేళ్ళలో అలాంటి క్షణాలు ఏమైనా వున్నాయేమోనని ఆలోచించింది. ఊహూఁ ఒక్కటీ వున్నట్లు గుర్తు రావడంలేదు.
    
    "ఏమిటి సూర్యా! ఏదో డ్రీమ్ లాండ్ లో కెళ్ళినట్లున్నావు. మేము కాలేక హాస్టల్ లో వున్నప్పుడు ఏ అమ్మాయి అయినా కాస్తంత మూడీగా వుంటే అలా అని ఆటపట్టించే వాళ్ళం"
    
    "ఏవో ఆలోచనలు అంతే అసలు మనిషికి ఈ మనసు అనేది వుండడం వల్లే ఇన్ని సందేహాలు, ఇన్ని సమస్యలు" అన్నది సూర్యాదేవి.
    
    "మరీ విషాదం ఏమిటో తెలుసా? ఈ సందేహాలు, ఈ సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్కవిధంగా వుంటాయి... అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఇలానే చెయ్, అని సలహా ఇవ్వడం గానీ, శాసించడంగానీ తప్పనుకుంటాను. విలువలు కాదు గదా పదాల అర్ధాలు కూడా మనిషి మనిషికీ మారి పోతుంటాయి. మా కల్యాణి పతివ్రతకు చెప్పిన అర్ధం విన్నప్పుడు నాకెంత నవ్వొచ్చిందో చెప్పలేను"
    
    "ఏమనిందేమిటి?"
    
    "అదంతా పెద్ద కథలే" అని మహిత చెప్పడం ప్ర్రారంభించింది.
    
    "కళ్యాణి మా పెద్దనాన్న కూతురు. ముఫ్ఫై ఏళ్ల వయసులో మంచి గంధం చెట్టులా వుండేది. ఏమాత్రం సాగడానికి వీల్లేని పెద్ద పెద్ద అవయవాలు కాబట్టి పిటపిటలాడుతుండేది.
    
    రేసుగుర్రాల్లాంటి పాలిండ్లు, వాటికి వేసిన జీనులాంటి సన్నటి నడుం, ప్రపోర్షనేట్ గా వుండే జఘన భాగం..... మొత్తానికి ఆమెను చూస్తే కాక్ టెయిల్ ఇచ్చిన నిషాలాంటిది కలిగిందనుకుంటాను మగవాళ్ళకి.
    
    అలాంటి కళ్యాణి భర్త నాగేశ్వరరావు విశాఖపట్నంలో ఓ కాంట్రాక్టర్ దగ్గర మేస్త్రిగా వుండేవాడు. ఏమూడు నెలలకో ఓసారి వచ్చి వారమో, పదిరోజులో వుండి వెళ్ళేవాడు. మిగిలినప్పుడు ఆమె ఒంటరే.
    
    రాచగున్నేరిలో మా పిన్నమ్మ కొడుకు పెళ్ళికి నేనూ, కళ్యాణి బయల్దేరాం. కళ్యాణితో ఎక్కడికైనా వెళ్ళడం భలే సరదాగా వుంటుంది. ఒట్టి కబుర్లపోగు, ప్రతిదాన్నీ హాస్యంతో చెప్పడం ఆమెకున్న కళ. ఎంత సీరియస్ విషయాన్నైనా సరే చాలా తేలిగ్గా, హాయిగా వుండేటట్లు చెబుతుంది.
    
    పెళ్ళికొడుకుతోపాటు మా ఇద్దరికీ దగ్గర బంధువు కాబట్టి పెళ్ళి ముందురోజు వెళ్ళాం. తెల్లారితే పెళ్ళి మేం వెళ్ళేటప్పటికి ఉదయం పదిగంటలైంది.
    
    టిఫిన్లూ, కాఫీలు ముగించాక పెళ్ళికొడుకు నలుగు కార్యక్రమం మొదలైంది.
    
    పెళ్ళికొడుకుతోపాటు వాడి ఫ్రెండ్స్ నలుగురు కూర్చున్నారు. తోటి పెళ్ళికొడుకుల్లాగా వాళ్ళందరికీ నలుగుపెట్టి లేచేప్పటికి పన్నెండయ్యింది.
    
    నేనూ కళ్యాణి ఓ పక్కగా నిలుచున్నాం మమ్మల్ని చూసి మా పెద్దమ్మ వచ్చింది.
    
    "ఏమిటల్లా నిలబడిపోయారు. తలా ఓ చేయివేస్తేనే పెళ్ళిలాంటిది జరిగేది. మహితా! నువ్వు తోడుపెళ్ళి కొడుకులకి వేడి నీళ్ళు తోడు. కళ్యాణి నువ్వు వాళ్ళకి తలస్నానం చేయించు" అంది.
    
    ఇక తప్పదని మేమిద్దరము దొడ్లోకెళ్ళాం. అప్పటికే తోడు పెళ్ళి కొడుకులంతా అక్కడున్నారు. నూనె కాస్తంత ఎక్కువైందేమో కళ్ళు తుడుచుకుంటున్నారు పెళ్ళి కొడుకు మాత్రం ఇంట్లోని బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్ళాడు.
    
    నేను కాగులోంచి వేడినీళ్ళు తోడి, బకెట్ బాత్రూమ్ లో పెట్టాను. బాత్రూమ్ అంటే నాలుగు తడికెలతో కట్టినదది. తడికెలు మరీ శిథిలావస్థకు చేరుకోవడంతో మనిషి సగానికి పైగా కనిపిస్తాడు.    

    'ఒక్కొక్కరే రండి స్నానానికి' అని కళ్యాణి చీర కుచ్చెళ్ళను కాస్తంత పైకిలేపి బొడ్లో దోపింది.
    
    ఆ కాళ్ళ తెలుపుని చూడకుండా వుండడం తమవల్ల కాదంటూ ఆ నలుగురు నూనె కారుతున్న కళ్ళను తెరవడానికి ప్రయత్నించడం గమనించాను.
    
    మొదట రఘు అనే కుర్రాడు స్నానానికి వెళ్ళాడు. అతను కట్టుకున్న లుంగీ తీసి తడికలమీద వేశాడు. డ్రాయర్ తప్ప మరేం లేదు ఒంటిమీద.
    
    అతను కూర్చోగానే కళ్యాణి తలమీద శీకాయ పోసి అంటడం ప్రారంభించింది.
    
    నేను బయట వేడినీళ్ళను కాగబెడుతుంటే మరో యిద్దరు తమ పిల్లలకి స్నానం చేయిస్తున్నారు. మొత్తం నాలుగు బకెట్లకు వేడినీళ్ళు తోడి, బాత్రూమ్ లో పెట్టడంతో చేతులంతా గుంజుతున్నాయి.

 Previous Page Next Page