Previous Page Next Page 
లేటెస్ట్ లవ్ పేజి 8

'తన కుమార్తె ఎప్పుడూ ఏదో మూడీగా, ఆలోచిస్తున్నట్టు అదోరకం గంభీరంగా వుండేది. ఆ సాయంత్రం తనకే ముచ్చటగా ముద్దుగా కనిపిస్తోంది. ఎందుకో ఈ సంతోషం.'
లలితమ్మ మనసులో అనుకుంది.
"ఆడపిల్లలెప్పుడూ ఇలాగే సంతోషంగా ముచ్చటగా ఇంటిలో తిరగాలి. అప్పుడే వారి అందమైన ముఖాలు మరింత అందంగా కనిపిస్తాయి."
పావని తల్లికి 'టాటా' చెప్పి బయలుదేరింది.
"ఇంటిల్ జెంటిల్ హాండ్ సమ్ యంగ్ మాన్! సాజిత్ ను తను త్వరగా ఇన్ స్టిట్యూట్ లో చూడాలి."
మనసులో మరీమరీ కోరుకుంటూ ఆమె వీధిలోకొచ్చి తనెక్కవలసిన బస్సుకోసం ఎదురుచూసింది.

                                                        *    *    *    *   
పావని కంప్యూటర్స్ ఇన్ స్టిట్యూట్ లోకి అడుగుపెట్టటంతో మరింత ఆశ్చర్యానికి గురయింది.
హాలులో చిన్నసైజు ఫంక్షన్ జరుగుతోంది.
డాక్టర్ సాజిత్ కు శ్రీనివాస్ అభినందన సభ ఏర్పాటుచేశాడు. అందరికీ అల్పాహార విందు కూడా ఎరేంజ్ చేసినట్టున్నాడు. తన్ను చూడటంతో-
"రండి పావనిగారూ! డాక్టర్ సాజిత్ గారు అపూర్వమైన ఒక ఆపరేషన్ చేసి మన సిటీ మెడికల్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని తెరిచారు. పేపరు వార్త చూడటంతో నేనే స్వయంగా వెళ్ళి ఆహ్వానించి తీసుకొచ్చాను. వాస్తవానికి ఈ సాయంత్రం ఆయనకు తీరికలేదు. లయన్స్ క్లబ్ వారు రవీంద్రభారతి ఓ పెద్ద అభినందన సభను ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రిగారు పురప్రముఖులూ వస్తున్నారు. ఏడుగంటలకల్లా ఆయనక్కడుండాలి. మనకు ఆయనిచ్చిన వ్యవధి ఒక గంట మాత్రమే. సమయానికి మీరు రావటం కూడా సంతోషం.
ముందు అల్పాహారం. తరువాత చంద్రునితో నూలుపోగులా ఆయనకు సత్కారం" అన్నాడు.
ఆయనలా చెప్తుంటే సాజిత్ తనను చూశాడు. నిన్నటికీ ఈ రోజుకీ తనలో ఒక మార్పు చోటుచేసుకున్నా సాజిత్ కది క్రొత్త అనిపించదు.నిన్న ఈ పావని పంజాబీ డ్రస్ వేసుకుంది. ఈ రోజు చీరె కట్టుకుందనుకుంటాను. ఆయన కోసమే తన మనసు తీసుకున్న తన వంటిమీద ఈ చీరె సింగారింపులు ఆయనకు తెలీవు.
ఈ రోజు కూడా నెట్ వర్క్ టోపాలజీ లో ఆయనకు తన ప్రేమను తెలియజేసి నిన్న జరిగినదానికి సారీ చెప్పాలని తను ఆరాటంగా వచ్చింది. కానీ యిక్కడ దృశ్యం మారిపోయింది.
ఆయన్ను ఈ అల్పాహారం తరువాత అభినందించే క్రమంలో తనను శ్రీనివాస్ రెండు మాటలు చెప్పమనొచ్చు. ఆ సమయంలో తను ఆయన గొప్పతనాన్నీ, మెడికల్ టెక్నాలజీనీ- అది ఈ రోజు మనిషి జీవితానికి ఎలా ఒక పరంగా మారిందో చెప్తూ సాజిత్ వితరణను కూడా చెప్పవచ్చు. కానీ ఈ సమయంలో ఆయన ఎడల పెల్లుబైక్ తన ప్రేమను ఎలా వ్యక్తం చేయగలుగుతుంది?
పావని? కొంత నిరుత్సాహం కలిగింది.
తరువాత మనసుంటే మార్గముంటుందనే విషయాన్ని కూడా ఆమె మనసే హెచ్చరించింది,
తరువాత ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ సాజిత్ దగ్గరకెళ్ళింది.
ఆయన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ చిన్నగా నవ్వి నమస్కరించింది. తరువాత ఆయనకు మరింత దగ్గరగా జరిగి-
"మీరు విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ వివరాలు పేపర్లో చదివాను. మీరెంత ఉన్నతులో తెలిసింది" అంది.
సాజిత్ ముఖంలో వెలుగు. వెంటనే-
"థాంక్యూ" అన్నాడు.
ఇంతలో శ్రీనివాస్ అందరినీ కూర్చోబెట్టి స్వీట్స్, హాట్స్ పంచే కార్యక్రమం తీసుకున్నాడు.
వారికీ, తమకూ గాప్ వుంది.
ఇంతకంటే తనకు సమయం చిక్కదు. తన ప్రేమను యిక్కడే భావగర్భితంగా వ్యక్తం చేయాలి.
"మీ టచ్ సాంగ్ వినపడింది. అది ఈ ఉదయం మరింత మధురంగా మనసును కలిచింది. దాన్ని మరింత మైమరచి విన్నాను.
డాక్టరీ వృత్తి వ్యాపారమైన ఈ రోజుల్లో అది సేవచేయటానికే అని నిరూపించిన మీ చర్యలో ఆ సాంగ్ ఎంత ప్రేమమయమయిందో, ఎంత పవిత్రమయిందో, మరెంత స్వచ్చమయిందో కూడా తెలుసుకున్నాను. అది మీ హృదయాంతరాళల్లోంచి నాకే వినిపించటం నా అదృష్టంగా భావిస్తున్నాను" పావని అనగానే-
"సో అయామ్ లక్కీ" సాజిత్ అన్నాడు.
"యూ ఆర్ నాట్ సర్! ఐయామ్ ఓన్లీ ఐ రెసి ప్రొకేట్ మైలవ్" అంది.
ప్రేమను తిరిగి అర్పించుకుంటున్నానని పావని చెప్పటంతో సాజిత్ ముఖంలో మరింత వెలుగు.
"దెన్ ఫిక్స్ ది 'ఎ సైనేషన్" అన్నాడు.
లవర్స్ కలుసుకొనే ఒక ప్రదేశాన్ని సూచించమని సాజిత్ ప్రేమ పూర్వకంగా అభ్యర్ధించటంతో పావని ఏమాత్రం తడుముకోకుండా అంది.
"నేషనల్ పార్క్, అపోలోస్టాట్యూ, రేపటి సాయంత్రం ఆరు గంటలు."
సాజిత్ ఒక్కసారిగా లేచి పావనికి షేక్ హాండ్ ను లవర్స్ హాండ్' గా మార్చి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా వత్తాడు. పావని హృదయంలో ఒక పులకింత.
తను ప్రపంచాన్ని జయించిన విజయగర్వం.

                    *    *    *    *
నేషనల్ పార్క్.
ఇటీవలే హైటెక్ సిటీలో డెవలప్ అయింది. ఒకరకంగా అది లవర్స్ పారడైజ్! వంద హెక్టార్ల స్థలంలో వినూత్నరీతుల్లో తీర్చిదిద్దబడింది. ఒకదరిని వాల్ డిస్నీ టైపులో పిల్లల్ని అలరించే విభాగముంది. అక్కడే మరోదరిని వాటర్ లాండ్ వుంది. పిల్లలూ పెద్దలూ స్నానాలు చేస్తూ, ప్రవాహాల వెంట జారిపోతూ, వాటర్ పాల్స్ క్రింద గంతులేస్తూ కేరింతలు సాగిపోతుంటారు. మరోదరిని వీటన్నింటికీ దూరంగా 'లవర్స్ పారడైజ్' వుంది.
దానిమధ్య అపోలో విగ్రహముంది. అది ఇరవై అడుగుల ఎత్తులో వుంది. అందంగా, మధురోహల చందంగా వుంది. వంటిమీద బట్టలు లేకుండా నేకెడ్ గా వుంది.
పాలరాతి నుండి చెక్కిన విగ్రహం అవ్వటంతో స్మూత్ గా వుంది. ముఖంలో ఓ లవ్ లీ నెస్! భారతీయుల మన్మధుడిలా 'అపోలో' యూరోపియన్స్ అందాలగాడే!
ఆ విగ్రహం అక్కడ అమర్చటంలో ఆ పార్క్ కే ఒక లవ్ లీ ఎట్మాస్పియర్ ఏర్పడింది.
అది చలికాలం....
డిసెంబర్ నెల రోజులు! అప్పటికే కొద్ది కొద్దిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి.
సాజిత్ ఐదు గంటలకే పార్క్ లోకి ఎంటరయి, తన కారును పార్కింగ్ ప్లేస్ లో పెట్టి, కాస్సేపు పార్క్ అందాల్ని చూసి, ఆ అందాల్లోకి రాబోయే అందాలరాశి పావనిని తలుచుకుంటూ ఆరుగంటలకు అపోలో విగ్రహం దగ్గరకు చేరాడు.
ఆ సమయంలో ఆ విగ్రహం దగ్గర జనం లేరు.
ఫ్లడ్ లైట్ల కాంతిలో అది మరింతగా మెరుస్తోంది.
పార్క్ క్లాక్ టవర్ తన ఆరుగంతల్ని సంగీతాన్ని మేళవించి మ్రోగించింది.
సరీగ్గా అదే సమయానికి పావని అక్కడికి చేరుకుంది. తనకోసం కదలాడే అందమైన ఈ అపోలో అక్కడ తనకంటే ముందుగానే చేరి నిలబడటం ఆమెకు మరింత ఆశ్చర్యాన్ని కలుగజేసింది.
సాగిపోతుంది కలో- వాస్తవమో ఆమెకు అర్ధంకాలేదు.
పావనిని చూడటంతోనే సాజిత్ తన చేతుల్ని చాపి తన ప్రేమను ఆహ్వానంగా పలికాడు.
"కమాన్ డియర్!"
ఆమె ఒక్కసారిగా అతని చేతుల్లోకి అతని గుండెల్లో తన తలను దాచుకుంది.
తన కౌగిట్లో పావనిని మరింత గట్టిగా బంధించి ఆమె ముఖాన్ని మెల్లిగా తన చేతుల్లోకి తీసుకొని ఆమె అందమైన పెదవుల్ని గట్టిగాముడ్డు పెట్టుకున్నాడు.
"పావనీ! ఎన్నో విజయవంతమైన ఆపరేషన్స్ చేశాను. కానీ అందమైన ఆపరేషన్ యిప్పుడే చేశాను. ఓ యంగ్ బ్యూటిఫుల్ లేడీ హృదయాన్ని చీల్చి, నేనుగా అందులోకి దోరబడి, లోపలుందే ఓ గూడు కట్టుకొని, ఒక ప్రేమ విజయం సాధించాను.
అతని మాటలకు పావని మరింతగా కదిలిపోయింది.
అలా ఆ నేషనల్ పార్కులో__
హైటెక్ కంప్యూటర్స్ లో అంకురించిన ప్రేమ__
కంప్యూటరంత స్పీడ్ గా ఎదిగి__
అక్కడ రెండు హృదయాల్ని ఒకటిగా చేసి__
నాలుగు పెదవుల్ని ప్రేమగా తడిపి__
అక్కడినుండి కదిలిపోయి_
ఓ వూ పొదలోకి చేరి....
ప్రేమ ఊసుల్ని మరింత మధురంగా పోయింది!

                    *    *    *    *
సాజిత్ తన హైటెక్ మెడికల్ చాంబర్లో కూర్చుని ఏదో ఫైల్ తిరగేస్తున్నాడు.
అతని ముఖంలో ఒక ఆసక్తి....
వ్యక్తులమధ్య ఒక 'కోల్డ్ వార్' వుండటం తనకు తెలుసు.
ఇప్పుడు ప్రపంచం మరోరకం కోల్డ్ వార్ ను ఎదుర్కోబోతోంది. అది విలువలమధ్య! ఒకరకంగా దాన్ని కోల్డ్ వార్ అనటంకంటే'హాట్ వార్' అని పేరు పెడితే బాగుంటుంది. అవును- బ్లాక్ మనీ, వైట్ మనీ, హాట్ మనీ, 'ఫీవర్ మనీ' అన్నటు....ఈ వార్స్ కూడా రకరకాల పేర్లతో పిలవబడతాయి.

 Previous Page Next Page