Previous Page Next Page 
కావేరి పేజి 7

    "అమ్మ కషాయం యిస్తే తాగాను. యిప్పుడు కొంచెం తగ్గింది! నే చెప్పిన పుస్తకాలు తెచ్చావా బావా!" లేచి కూర్చుంటూ అడిగింది.

    "ఆఁ...తెచ్చాను...యింటికి వెళ్ళితే మా అమ్మ చూస్తుందని యిటునుంచి ఇటే వచ్చాను...యివిగో!" కావేరి వడిలో పడవేశాడు.

    "మా బావ ఎంత మంచివాడో?"

    "సరే సరే! నా మంచితనం నువ్వే మెచ్చుకోవాలా? నెప్పి తగ్గే వరకూ నువ్వు పుస్తకాలు చదవకూడదు. విశ్రాంతిగా పడుకో!"

    "ఇప్పుడు కొంచెం తగ్గింది బావా! ఫరవాలేదు!"

    "కొంచెం తగ్గిందనే గాని సాంతం తగ్గినట్టు కాదుగా? వుండు యిప్పుడే వస్తాను!"

    అంటూ గబగబా బైటికి వెళ్ళిపోయాడు వినాయకరావు. అతనలా ఎందుకు వెళ్ళాడో? దేనికోసం వెళ్ళాడో ఎవరికీ అర్ధం కాలేదు. యింకేమయినా సినిమా పత్రికలు మరిచిపోయి వచ్చాడేమో? అనుకుంది కావేరి! తెచ్చిన పత్రికలను తన చుట్టూ పరిచింది. జయప్రద-జయసుధ, శ్రీదేవి ముఖచిత్రాలు కొన్నింటిమీద వుంటే, మరికొన్నింటిమీద శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి ముఖ చిత్రాలు వున్నాయి. తన అభిమాన నటుడు చిరంజీవి ముఖచిత్రం వున్న పత్రికను తీసుకుని ముద్దుపెట్టుకున్నది.

    వినాయకరావు అమృతాంజనం సీసా తీసుకొచ్చి కావేరికి అందించాడు.

    "ఇదా నువ్వు తెచ్చింది?" కోపంగా చూసింది కావేరి!

    "కీళ్ళు నెప్పులను తగ్గించుతుంది! నీకోసమని సినిమాహాలు సెంటరుకి వెళ్ళి అమృతాంజనం తెచ్చాను. వళ్ళంతా రాసుకుని మర్ధనచేస్తే నెప్పియిట్టే తగ్గిపోతుంది కావేరీ!" అన్నాడు సంతోషంగా!

    "నాకు వచ్చింది కడుపులో నెప్పి. వంటికి రాసుకుని మర్దన చేస్తే నెప్పియిట్టే తగ్గిపోతుంది కావేరీ!" అన్నాడు సంతోషంగా!

    "నాకు వచ్చింది కడుపులో నెప్పి. వంటికి రాసుకుని మర్దన చేస్తే లోపల నెప్పి తగ్గుతుందా? అయ్యో నాఖర్మ" నుదుటను చేత్తో కొట్టుకుంటూ అంది కావేరి.

    "అన్ని నెప్పులకూ ఒకటేమందు అనుకున్నాను."

    "అంతకంటే ఎక్కువ నీకేం తెలుసు? సరే!...అక్కడవుంచి వెళ్ళు!" కావేరి "వెళ్ళు" అనే సరికి చిన్నబుచ్చుకున్నాడు వినాయకరావు. తాను ఎంత కష్టపడి సైకిల్ ని స్పీడుగా తొక్కుకుంటూ చెమటలు కక్కుకుంటూ వెళ్ళి తెచ్చాడు తన కావేరి కోసమని!

    తను యింకా అలాగే కూర్చుని సినిమా పత్రికలు చూస్తూ వుంటే బావ వెళ్ళడనుకుంది. అతను వెళ్ళాలనుకుంటే తను పడుకోవాలి నెప్పి అని నటించుతూ.

    "ఎక్కడ నెప్పి" కావేరీ మీదకివంగి చేతులను మంచంపట్టె మీదకి ఆన్చి మరీ అడిగాడు వినాయకరావు.

    "ఎక్కడని చెప్పితే నువ్వేం చేస్తావులే?"

    "నెప్పి తగ్గేవరకూ నొక్కుతానుగా?"

    "ఏమీ వద్దులే!...."విసుక్కున్నది.

    తనకి వంట్లో బాగోక అలా విసుక్కుంటున్నదనిపించింది.

    "అమృతాంజనం వ్రాసుకో! కొంతయినా నెప్పి తగ్గుతుంది నేను వెళుతున్నాను!"

    అలా అంటే నయినా కావేరి తనను వుండమంటుందేమోనన్న ఆశ వినాయకరావుకి! ఎక్కడ నెప్పి అంటే అక్కడ నొక్కి సవరించాలని ఆశపడ్డాడు. కాని కావేరినుంచి జవాబు రాకపోయేసరికి నిరాశ పడ్డాడు. అయినా కావేరికి ఇష్టంలేని పని తను ఎందుకు చేస్తాడు? రేపు వచ్చి చూడవచ్చును. అంతకీ తగ్గకపోతే పట్నంనుంచి డాక్టర్ ని ఎంత ఖర్చు అయినా తీసుకురావాలి! అనుకుంటూ బయటికి వచ్చి సైకిల్ ఎక్కాడు వినాయకరావు.

    అతనటు వెళ్ళగానే గబగబా సినిమా పుస్తకాలు తీసుకుని వడిలో పెట్టుకుని తలగడక్రింద నుంచి తన ఫోటోలు తీసి ఆ ముఖచిత్రాల పక్కనపెట్టి చూసుకోసాగింది కావేరి!

    జయప్రద, జయసుధ, శ్రీదేవి కంటే తనే ఎంతో అందంగా వున్నాననుకున్నది. తను వీళ్ళందరి కంటే పెద్ద హీరోయిన్ అయిపోయినట్టు పగటి కలలు కనసాగింది......

    "నువ్వు పెట్టుకోలేదేమిటమ్మా!"   
   
    "నాకిప్పుడు ఆకలి వేయటం లేదు. తరువాత తింటానులే నువ్వు కానివ్వు!" అంది.

    ఆకలితో వున్నాడేమో? గబగబా అన్నంలో కూర కలుపుకుని నాలుగు ముద్దలు తిన్నాడో లేదో? ఏదో గుర్తు వచ్చిన వాడికివలె అడిగాడు తినటం ఆపి-

    "అన్నయ్య దగ్గరనుంచి ఉత్తరం వచ్చిందా అమ్మా!"

    "లేదే?....యిప్పుడా ఉత్తరం సంగతి గుర్తు ఎందుకు వచ్చింది?"

    "వస్తానని ఆ మధ్య వ్రాసిన ఉత్తరంలో వుంది కదా!సెలవులు యివ్వగానే రమ్మని రాశాను, తాను ఎప్పుడు వచ్చేది ముందుగా రాస్తాడుగా? అలా ఏమయినా వ్రాశాడేమోనని అడిగానమ్మా!"

    "మీ అన్నయ్య వస్తే నీ పెళ్ళి సంబంధం మాట్లాడతాడనా?"

    "నా పెళ్ళి ఏమిటి? మాట్లాడటం ఏమిటమ్మా?" అర్ధం కాక అడిగాడు.

    "అన్నయ్య పెళ్ళి అవనిదే నా పెళ్ళి కాదుగా! అంతవరకూ కావేరి ఇంట్లో ఊరికే వుండటం దేనికి? చదివించమని నేనే చెప్పానమ్మా!"

    కొడుకు వైపు తీవ్రంగా చూసింది. తాను ఊహించింది వేరు అయిందనిపించింది.

    "అంటే? నీ వుద్దేశ్యం?"

    "......"

    "చెప్పవేరా?...."

    "నా వుద్దేశ్యం ఏమిటంటే?...." ఇంకా ఆపై చెప్పలేకపోయాడు.

    "కావేరిని చేసుకుంటానని చెప్పావటగా?..."

    జవాబు చెప్పలేక తల వంచుకున్నాడు.


    "ఆ వగలమారి వయ్యారాలను చూసి చేసుకోవాలనుకుంటున్నావా? లేక మన స్థితిగతులకి సరిపడే కట్నం యివ్వగలరనే ఈ నిర్ణయానికి వచ్చావా?" ఎంత ఆపుకుందామన్నా కామాక్షమ్మకి కోపం ఆగలేదు. మాటల్లోనే కురిపించింది.

                                                                            3

    సైకిల్ కి స్టాండు వేసి లోపలికి వచ్చిన కొడుకుని చూసేసరికి కామాక్షికి ఎంతో కోపం వచ్చింది.

    "ఎరువుల బండి వచ్చి రెండు గంటలయింది. నువ్వెక్కడ పెత్తనాలు చేస్తున్నావు?" అనడిగింది.

    "కావేరికి కడుపులో నెప్పి వచ్చిందంటే వెళ్ళాను అమ్మా!"

    "ఈ వార్త దారిలో నీ కెవరు చెప్పారురా?"

    "దారిలో మురళి కనిపించాడు. మిరియాల కోసమని కొట్టుకు వెళుతున్నాడట! ఎందుకని అడిగితే కావేరి సంగతి చెప్పాడు..."

    "ఊహుఁ....పరామర్శించటానికి వెళ్ళావన్నమాట!"

    తల్లి మాటకి జవాబు చెప్పలేక తలవంచుకున్నాడు.

    కొడుకు మనసు ఎంత మంచిదో కామాక్షికి తెలుసు. ఎవరైనా బాధ పడుతుంటే తాను చూడలేడు. వారి బాధలు తన బాధలుగా భావించుతాడు. కావేరికి కడుపు నెప్పి అనేసరికి భయపడిపోయి వెళ్ళి వుంటాడు. ఆ కావేరిని చూస్తేనే తనకి వళ్ళు మంట.

    తన కొడుకే చదివించమన్నాడని సుభద్ర వదిన అన్న మాటలు ఎంత వరకు నిజమో నిర్ధారించుకోవాలి. అనుకుని కొడుకు వైపుకి చూసింది. కాని అప్పటికే వినాయకరావు గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటున్నాడు. ఇప్పుడే అడిగితే బాధపడతాడని ఆగింది. అయినా మనసులో ఆ మాట కదలాడుతూనే వున్నది.

    "అమ్మా! అన్నం పెట్టవూ?"

    బావి దగ్గర కాళ్ళూ చేతులూ కడుక్కుని తుండుతో తుడుచుకుంటూనే ఓ చేత్తో పీట వాల్చుకుని కూర్చుంటూ అడిగాడు వినాయకం.

    కామాక్షమ్మ లోపలికి వచ్చి పళ్ళెంలో అన్నీ పెట్టుకుని వచ్చి కూర్చుంది.

 Previous Page Next Page