"నా ప్లేట్ ఒక్కటే పెట్టవేంటి? నీ ప్లేట్ ఏది?"
"మూతలో తినేవాడిని."
"ఛీ! పాడు! ఇప్పుడెలా మరి?"
"నీ ప్లేట్ లో తిందాం.
"ఇద్దరం ఒకే ప్లేట్ లోనా?"
"ఒకే బెడ్ మీద ఎడ్జస్టవటం లేదూ?"
అతనిని గట్టిగా గిల్లిందామే. భోజనం అయింది.
అడ్డం ముందు నిలబడి మేకప్ కి పైనల్ టచెప్ యిస్తోంది తులసి.
"ఇంకేమీ ఇంటర్యులు లేవా?"
"నీ ఇంటర్యులు చాలు నాకు."
ఆమె బ్యాగు తీసుకుని చెప్పులు వేసుకుంది.
"సాయింత్రం చౌరస్తా దగ్గర వెయిట్ చేస్తున్నావా?"
"సాయంత్రం అయిదు గంటలకల్లా మీ బాస్ నీ చేతులు నిమరటం అపెస్తాడని గ్యారంటీ యిస్తే....."
ఆమె నవ్వేసింది.
"బై" అంటూ అతని దగ్గరకొచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకోబోయింది.
సురేష్ చటుక్కున తలఎత్తి ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు.
అతని నాలుక ఎక్స్ రేలు తీయడానికి ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తులసికి తెలుసు. కిందకు జారటం, బిగి కౌగిలి పక్కకు వోరగడం, వళ్ళంతా ఆవిరులు, అరమోడ్పు కన్నులు స్తంభించే గాలి-
"తులసి!"
"సురేష్!"
"అబ్బ తులసి!"
చప్పున అతన్ని దూరం తోసివేసింది తులసి.
"నీతో ఇదే తలనొప్పి" అంది మళ్ళీ అడ్డం ముందు నిలబడి మేకప్ సరిజేసుకుంటూ.
"అయితే ఆ మహేష్ గాడి దగ్గరకెళ్ళిపో."
"మహేష్ గురించి అలా మాట్లాడవద్దు - హి ఈజే జంటిల్మన్."
"మరి మీ ఇద్దరూ ఓసారి సినిమా చూస్తున్నప్పుడు వాడు నీ - పైట కొంగు....'
'అది ఏ డో లో సెం ట్ ఏజ్ అని ఓసారి చెప్పాను.'
'అదే నేననేదీనూ - ఇంత అందమైన అమ్మాయి పక్కనుంటే ఏం చేయాలో తెలీని వెధవని ఎలా లైక్ చేశావా అని ...."
"మహేష్ వెధవ కాదు - డెలికేట్ నేచర్."
"అమ్మాయిలకు కావలసింది డెలికేట్ నేచర్ కాదు.'
"నువ్వెలా చెప్పగలవ్?"
"వాళ్ళావిడ వారం క్రితం ఓ ఇన్ మొటాక్స్ కుర్రాడితో లేచిపోయింది."
"మైగాడ్!"
"దేవుడాయినా సరే డెలికేట్ పనికి రాదు."
"నువ్వు చెప్పేది నిజమేనా?"
"అవును. ఆ మధ్య సనత్ నగర్ లో కనిపించి చెప్పాడు మహేష్.'
తులసి ముఖంలో జాలి తొణికిసలాడింది. "పూర్ ఫెలో."
"ఎగ్జట్లీ! అదే వాళ్ళావిడ అభిప్రాయం కూడా అయ్యుంటుంది."
తులసి వెళ్ళిపోయింది.
మరికాసేపటి తర్వాత తనూ రడీ అయి బయటికొచ్చాడు సురేష్. గంగాభవాని కూరగాయల మొక్కలకు పాదులు తీస్తోంది. సురేష్ ని చూసి లేచి నిలబడింది. పైట సరిజేసుకుని ముఖం మడ్చుకుంటూ.
"మా వాటా పైనున్న చిక్కుడుపాదు మాదా, మీదా?" అడిగాడు సురేష్.
"మీదెలా అవుతుంది?"
"దున్నేవాడిదే భూమి అంటారు కదా! నేను పొద్దున్న దానికి నీళ్ళు పోశాను.'
"నీళ్ళు పోయగానే అయిపోతుందేమిటి?"
'ఇంకేం చేస్తే అవుతుంది?"
అసహనం పెరిగిపోతోందమెకి.
సురేష్ అనందం పెరిగిపోతోంది.
"మొక్కలు అద్దె కివ్వలేదు - ఇల్లోక్కటే.'
"నేను అన్నీ కలిపి అనుకున్నాను."
ఆమె ముఖం మరింత ఎర్రబడింది. పావురాయి కళ్ళు డేగ కళ్ళువుతున్నాయ్. ఇప్పుడు ఆమెను 'కూల్' చేయాల్సిన సమయం. ఆమె మళ్ళీ పాదుల దగ్గర కూర్చుంది.
చటుక్కు న ఆమె కెదురుగా కూర్చున్నాడతను.
"ఆగండాగండి - ఏది - మీ చేయి చాపండి.'
అనుమానంగా చూసిందామె "ఎందుకు?"
"అదో పిచ్చి! కనబడ్డ వారికల్లా చేయి చూసి చెపుతుంటాను - నేర్చుకున్న విద్య వృధా ఎందుకు చేయాలి?"
"అంటే?"
'జ్యోతి సామ్రాట్ వామనశాస్త్రి గారు మా గురువు.'
ఆమె చేయి నెమ్మదిగా ముందుకొచ్చింది. కాని అంతలోనే వెనక్కు లాగేసుకుంది. "నా కవసరం లేదు."
"మీరు నిజంగా గొప్ప అదృష్టవంతులు.'
"ఎందుకు ?"
"మిమ్మల్ని స్వర్గ సుఖాల్లో ముంచి తేల్చే సమయం అతి త్వరలో వచ్చేస్తోంది."
"అంతా వట్టిదే."
'ఆరు నెలల్లోపల మీ జీవితం అతి అద్భుతమైన మలుపు తిరగబోతుంది.
"నేనమ్మను.'
"నమ్మకపోయినా ఆ సమయం వచ్చినప్పుడు కాదనకండి.'
సురేష్ బయటి కొచ్చేస్తుంటే ఆమె పరధ్యానంలో మునిగిపోయింది.
* * * *
లైబ్రెరియాన్ నవ్వింది సురేష్ ని చూసి.
"ఎనీ లక్?" రిజిస్టర్ అతని ముందుకి తోస్తూ అడిగింది.
"ఎస్!"
ఆశ్చర్యపోయిందామె.
"ఎక్కడ - ఏ డిపార్ట్ మెంట్ లో దొరికింది?" ఆత్రుతగా అడిగింది.
"ఇదే."
"మైగాడ్ - లైబ్రరీలోనా?"
"అవును."
"టెంపరరీయా, పర్మినెంటా?"
"టెంపరరీగా పర్మనెంట్."
"అంటే?"
"మనకిష్టమున్నంత కాలం."
"జీతమెంత?"
"జీతం వుండదు."
"మిమ్మల్ని చూస్తూ కూర్చుంటే జీతం ఎవరిస్తారు?"
ఆమెకు అర్ధమైంది. "ఓ! వాటే మేన్ యూ ఆర్.'
"ఆఖర్లో మా తులసి కూడా ఇదే మాటంటుంది!"
"తులసి ఎవరు?"
"భార్య లాంటి అమ్మాయి."
ఆమె నవ్వాపుకోలేకపోయింది.
"నిన్నటి పేపర్స్ కావాలి" అడిగాడు సురేష్.
"తీసుకోండి."
"పేపర్లన్నీ త్వరత్వరగా వెతకసాగాడు.
మాములుగానే శ్రమంతా వృధా.
బయటకొచ్చేప్పుడు లైబ్రరియన్ మళ్ళీ నవ్వింది. ఆమె టేబుల్ దగ్గర అగాడతను.
'మీరు చాలా అందంగా వున్నారు?"
"థాంక్యు!' అందామె సిగ్గుపడుతూ.
"మీ భర్త ఎవరో గాని చాలా జాలిగా వుంది."
"ఎందుకు?"
"నిద్రలేమి జబ్బుతో కన్ను మూస్తాడేమోనని."
"మీరు చాలా ఇదిగా మాట్లాడతారు- అయినా నాకు పెళ్లి కాలేదు యింకా."
"భర్తంటే ప్రస్తుతం భరిస్తున్నావాడు అని అర్ధం."
అతను బయటికొచ్చేశాడు- వెనక్కు తిరిగి వుంటే .....
ఆమె ముఖంలోని సరికొత్త ఎక్స్ ప్రెషన్ - అంతకుముందు మరే అమ్మాయి ముఖంలోనూ చూడనిది - గమనించి ఉండేవాడు.
* * * *
గది తలుపులు తెరిచేసరికి విస్కీ వాసన గుప్పుమంది.
డార్క్ డెవిల్ సురేష్ ని చూసి ఆనందంగా చేతులు జాపాడు.
"కమాన్, కమాన్, కమాన్ లాంగ్ లాంగ్ టైమ్ - లాంగ్ లాంగ్ టైమ్."
సురేష్ గదంతా చూశాడు.
"ఇదా నువ్వుండే నరకం?"
"నరకాన్ని ఇన్సల్ట్ చేయకు."
సురేష్ డార్క్ డెవిల్ భుజం మీద చేయి వేసి వాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు.
"జాబ్ ఎందుకని చేయటం లేదురా?"
"చేయట్లేదని ఎవరన్నారు?"