"విజయనగర సామ్రాజ్యం: బహుమనీ సుల్తానులు ముట్టడించి ధ్వంసం చేసారు" అన్నాడు సైతాన్ సింగ్. అతను కాలేజీలో చదువుతూ ఎక్స్ ట్రీమిస్టులతో కలిసిపోయాడు.
"ఆఁ: అట్టా: అట్టాగే చిత్రద్వీప్, శ్రీలంకా, బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ అన్నీ ఒక్క మాట మీదుండి ఇండియా మీదపడితే నాయాల్ది: జుట్టుపట్టుకు లొంగదీయడం ఎంతసేపు?"
"ఆ రోజు కూడా నేను బతికి వుండగానే చావాలని నేను కోరుకుంటున్నాను" అన్నాడు సైతాన్ సింగ్.
"సైతాన్ సింగ్: ఇక ఇవ్వాల్టినుంచి నువ్వు హైజాక్ పనిమీదే ఉండు. డబ్బు సమస్య కాదు మనకి. తినడానికీ, తాగడానికీ దేనికీ మొహమాట పడకు. అదిగో: ఆ రూములోకి వెళ్ళావంటే అక్కడ అండంగులున్నారు. నీక్కావలసిందాన్ని ఏరుకో: మజా చెయ్యి: కానీ మనపని మాత్రం జరిగిపోవాలి. లేకపోతే నేను మనిషిని కాను. రాక్షసుడ్నే: మొహమాటం లేదు. ముందే చెబుతున్నాను. ఇంక వెళ్ళు" అన్నాడు.
సైతాన్ సింగ్ లేచాడు.
వినీల కూడా కదలబోయింది.
"నువ్వెక్కడికి: ఇట్రా" అన్నాడు భోజా.
"శపథం:" అని నవ్వింది వినీల.
"అది సరే ఏర్పాట్లు చేస్తూనే వున్నా. వింటూనే వున్నావు కదా" అన్నాడు జనరల్ భోజా.
మొహాన్ని ప్రదర్శిస్తూ అతనివైపు ఓసారి చూసి కొన్ని తెల్లకాగితాలు తీసుకొని కాక్ పిట్ లోకి వెళ్ళిపోయింది వినీల.
* * * *
తన స్టడీ రూంలో కూర్చుని తీక్షణంగా ఆలోచిస్తున్నాడు ఇండస్ట్రియలిస్టు బాబూజీ.
చిత్రద్వీప్ లోని జనరల్ భోజా ప్రభుత్వాన్ని పడగొట్టడం -
అదీ ఎన్నికల్లో డబ్బు గుప్పించడం ద్వారా కాదు.
రక్తపాతం ద్వారా, తిరుగుబాటు చేయించడం ద్వారా జనరల్ భోజాని పదవీచ్యుతుడిని చేయడం.
ఆ తర్వాత తనకు అనుకూలమయిన వాళ్ళని గద్దె ఎక్కించి, యురేనియం త్రవ్వి తీసి అమ్ముకునే హక్కు సంపాదించుకుని, డబ్బు చేసుకోవడం -
ఎలా? ఏం చెయ్యాలి? ఏం ప్లాను వెయ్యాలి?
ఏదో ఒక ప్లాను ఫ్లాను వేసినా, ఇక్కడ కుర్చీలో ఆలోచించినంత తేలికకాదు. తన ప్లానుని అమలుపరచడం.
అసలు ప్లానంటూ ఇంతవరకూ ఏమీలేదు తనకి.
ఆశ తప్ప:
కొత్త ఇండస్ట్రీ, కొత్త బిజినెస్ పెట్టడం అను, ఈ బాబూజీతిరుగులేని పధకాలు చెబుతాడు.
కానీ ప్రభుత్వాన్ని కూలదోయడం, అందులోనూ పరాయి దేశంలోని ప్రభుత్వాన్ని... వెల్... అది తనకు పరిచయం లేని ఫీల్డు.
ఎలా?
ఎక్కడ మొదలెట్టాలి?
ఎవర్ని అప్రోజ్ అవ్వాలి?
తనంతట తను ఒక సైన్యాన్ని తయారుచేసుకోగలడా?
సంభవమా అది అసలు?
పైపు పీల్చి గుప్పుగుప్పున పొగ వదుల్తూ ఆలోచించాడు బాబూజీ.
రెండు పద్ధతులు వున్నాయి.
ఒకటి - తనే ఒక ఇర్రెగ్యులర్ ఆర్మీని తయారుచేసి చిత్రద్వీప్ కు పంపడం.
రెండు - చిత్రద్వీప్ లోనే వున్న భోజా ఆర్మీలో తిరుగుబాటు తీసుకువచ్చి అతన్ని చంపించడం.
ఈ రెండు పద్ధతులూ కష్టమైనవే.
పైగా-
ఇలా చేయడంలో తన మనసులో ఉన్న ఉద్దేశ్యమేదో అందరికీ అర్థమయిపోయే అవకాశం వుంది.
అప్పుడు తన ఆశలన్నీ పురిటిలోనే సంధి కొట్టినట్లు అయిపోతాయి.
పైగా -
తను ఇలా సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని తెలిస్తే ఇండియా ఊరుకోదు. ఇండియానే కాదు ఇది ఇంటర్నేధనల్ వ్యవహారమైపోతుంది.
చాలా దేశాల వాంటెడ్ లిస్టులో తను వుంటాడు.
అది తను ఎదుర్కోలేని పరిస్థితి.
అలాంటి పరిస్థితే వస్తే తను ఇక జీవితాంతం అజ్ఞాతవాసం చేయవలసి వస్తుంది.
ఆ పధ్ధతి తనకి వద్దు.
ఇంక పోతే...
అతి గోప్యంగా పని జరిగిపోయే మరో పధ్ధతి ఏదన్నా వుందా...
అలాంటి క్లిష్టపరిస్థితిలో అప్సర తన పక్కనుంటే అద్భుతమైన ఐడియాలు చెప్పేది.