"నేనా రెచ్చగొడుతున్నది....నీమీద ఒట్టు....నువ్వే నీ అందంతో నన్ను రెచ్చగొడుతున్నావ్ ప్రియా"
"ఏయ్ చిలిపి....ఈ మాటల కోసమేనా కాలేజీకి ఎగనామం పెట్టించి నన్నింత దూరం తెచ్చి ఇప్పుడు మాటలతో సరిపెడుతున్నావా?"
"ఏం నాతో రావడం నీకు ఇష్టంలేదా? అయితే చెప్పు. ఇప్పుడే వెళ్ళిపోదాం."
"ఏయ్ అలగకు!"
"నీమీద అలిగి సాధించేదేముందిలే!"
"సారీ డియర్ ఐ లవ్ యూ!"
"రెండు వందల ఏడవసారి...."
"నిన్ను ఇలాగే చూస్తూవుంటే...."
"నూట ముప్పయ్ ఒకటి...."
"ఏమిటి?"
"నువ్వు ఈమాట అనడం...."
"అంటే, నేను అన్న ప్రతిదీ లెక్కపెడుతున్నావన్నమాట"
నవ్విందామె!
"నవ్వితే నీ నవ్వు ఎంత అందంగా వుంటుందో నీకు తెలుసా?"
అంటూ బెడ్ మీదకు లాగాడు ఆమెను....
"ఎంత అందంగా ఉంటుందేమిటి?"
"ఒక్కసారి నీ పెదవులు అందిస్తే....ఆ పెదవులను అడిగి చెప్తాను" తన గుండెలమీదకు లాక్కుంటూ అన్నాడతను.
"అబ్బ....ఎంత ఆశో...."
అతడామె పెదవులను ముద్దు పెట్టుకుంటూ....
"అ....య్.... ల....వ్....యూ....ఆల్సో...." మత్తుగా అన్నాడు.
అతని మీదకు పూర్తిగా వాలిపోయిందామె.
ఒక చేతితో ఆమె భుజాలను చుట్టి....
మరొక చేతిని వీపు క్రిందకు పోనిస్తూ....
చెవి క్రిందుగా మెడ భాగంలో తన పెదవులతో గాడంగా చుంబి చాడతను.
మరిచకొంచెం క్రిందకు జరిగి ఆమె ఎద ఎత్తుల మధ్య ఆర్తిగా తడవసాగాడు.
అతని ప్రతి కదలికకూ సహకరిస్తోందామె!
ఉచ్చ్వాశ నిశ్వాసలతో ఆమె శరీరం వేడెక్కిపోతోంది....
"ఆ లైట్ ఆర్పెయ్ బాబూ...."
ముఖం మరోవైపుకు చాటుచేసుకుంటూ సిగ్గుతో అందామె.
డిమ్ గా వెలుగుతున్న బెడ్ లైట్ ఆరిపోయింది.
చిక్కని చీకటి!
తప్పు ఒప్పు అన్న సందిగ్ధంలో నుంచి బయటపడి....ఓ భయాన్ని వీడి....ఒక మధురత్వానికి స్వాగతం పలుకుతూ....ఆ మధురిమలో అమరత్వాన్ని వెదుక్కుంటూ....తొలి సమాగమంలోని అమృతాన్ని ఆస్వాదిస్తూ.... ఒకరిలో ఒకరు ఏకమై....ఐక్యమై....ఒకరితో మరొకరు పోరాడి....ఆ మరొకరు ఒకరిని ఓడించి....గెలుపుకు....ఓటమికి మధ్య నిశ్చలురైన ఆక్షణాన....
ఆ చీకటి గదిలో....
ఒక చిన్న కదలిక!
'క్లిక్' మన్న చప్పుడు....
ఆ చీకటిని చీలుస్తూ కళ్ళు మిరిమిట్లు గొలిపే ఒక మెరుపు....
ఆ ఇద్దరి గుండెలు కొట్టుకోవడం క్షణకాలం నిలిచిపోయాయి....
ఇద్దరూ తేరుకుని చూసేలోపే....ఆ చీకటిలో ఒక ఆకారం ముదుకు కదిలి తెరిచివున్న కిటికీలోనుంచి అవతలివైపుకి దూకింది.
బట్టలను ఒంటికి చుట్టుకుని ఒక్క పరుగున విండోదగ్గరకు చేరుకునేసరికే, ఆ ఆకారం కిటికీ అంచు పైనుంచి వాటర్ పైప్ ద్వారా క్రిందకు జారి కనుమరుగు అయ్యింది.
ఆ క్షణంలోనే వాళ్ళకు అర్ధమయింది.
తమకన్నా ముందే ఎవరో గదిలో వుండి, తామిద్దరినీ చూడకూడని స్థితిలో ఫోటో తీశారని!
జరిగిన సంఘటనలతో మనసు వికలమైపోగా....ఆ గదిలో ఉండడానికి వాళ్ళకు క్షణం కూడా మనస్కరించలేదు....
క్షణం క్రితంవరకూ ఎంతో ఆనందంతో మధురోహల్లో విహరించారో....ఇప్పుడు అంత నిస్పృహతో క్షణాలమీద ఆ హోటల్ గది ఖాళీ చేసి వెళ్ళిపోయారు.
అంత రాత్రివేళ వెళ్ళిపోతున్న ఆ యువ జంటవైపు....పరీక్షగా చూసిన రిసెప్షనిస్ట్ భృకుటి ముడిపడింది.
అప్పటికే వాళ్ళిద్దరూ హోటల్ దాటి మెయిన్ రోడ్ మీదకు చేరుకున్నారు.
* * *
ఫోన్ మోగడంతో బడలికగా విశ్రాంతి తీసుకుంటున్న జైలర్ పరశురామ్ రిసీవర్ తీశాడు....
"హల్లో...."
"నమస్తే జైలర్ సాబ్"
"ఎవరు మీరు...."
"నా పేరు రాజేంద్ర అంటారులెండి....ఇక వృత్తి అంటారా? మీకు తెలియని వృత్తికాదులెండి..... అచ్చతెలుగులో చెప్పాలంటే రౌడీయిజం...."
"రౌడీయిజమా"
పరశురామ్ కు గుటకలు పడడంలేదు.
"మీతో నాకు పనిపడింది జైలర్ సాబ్"
"నాతో నీకేం పని?"
"పని వున్నది కనుకనే ఫోన్ చేశాను...."
"ఏమిటది?"
"ఈ నెలలో మీ జైలులో ఏదో వార్షిక ప్రోగ్రామ్ జరుగుతుందనుకుంటాను."