అతను బిగుసుకుపోయాడు. ఆమె అంది - "మిమ్మల్నందర్నీ తిరిగి తీసుకువెళ్ళటానికి మా వాళ్ళు వస్తున్నారు."
"నేనూ పాకిస్తాన్ ఏజెంట్ నే. ఇంతకాలం ఒకేచోట పనిచేసి కూడా ఒకరికొకరం తెలియకపోవడం విశేషం" అన్నాడు.
ఆమె మొహం చిట్లించి "కోడ్ వర్డ్ చెప్పు" అంది.
"నేను 'సా' మనిషిని కాను. ఆర్మీ ఇంటలిజెన్స్... అజ్మరాలీ తరఫున భారత సైన్యంలో చెరి, అక్కడ ప్లాంటర్ గా వుండిపోయాను."
"ఏ విషయం మీద?"
"ప్రనూష కార్యకలాపాలు ఎప్పటికప్పుడు అజ్మరాలీకి చేరవేయటము కోసం."
"అందరూ పాకిస్తాన్ కి వస్తున్నారని నువ్వు ముందే అతనికి తెలియ చెప్పలేదా?"
"చెప్పాను. అందుకే తన ఆర్మీ క్యాంప్ లో నాటకం ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు."
"ఇదేం చిన్నపిల్లలాట అనుకున్నాడా? శత్రువు మనదేశంలో ప్రవేశించాడని తెలిశాక అతడిని ఏదో ఒక మిషమీద అరెస్ట్ చేయించటం పోయి, సరాసరి సైన్యపు శిబిరంలోకే ఆహ్వానిస్తాడా? ఈ విషయం ఒక్కటి చాలు అతన్ని కోర్టు మార్షల్ చేయటానికి."
పాల్ జవాబు చెప్పలేదు.
"ప్రనూషనీ, చైతన్యనీ మన దేశంలోనే చంపుతాం. జగదీష్ ని వెనక్కి తీసుకువెళ్ళి జైల్లో పెడతాం. అదలా వుంచు.... రాత్రి జరిగిన విధ్వంసానికి జవాబుదారీ ఎవరు వహిస్తారు?"
దీనికి కూడా పాల్ సమాధానం చెప్పలేదు. అజ్మరాలీ పిల్లి లాంటివాడనీ ఎలుకలతో చెలగాటం అతనికి యిష్టమనీ 'సా' ఏజెంట్ తో ఎలా చెప్పగలడు?
"సరే. ఇవన్నీ మన సమస్యలు కావు. మిలటరీ అధికారులు చూసుకుంటారు." ఆమె అంది.
అతడు పిస్టల్ చేతిలోకి తీసుకున్నాడు. "ముందు ఆ ఇస్మాయిల్ ని చంపాలి" అన్నాడు.
ఆమె మొహం చిట్లించి "ఎందుకు?" అంది.
"అతనికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. అజ్మరాలీని అడిగాను. చంపేస్తే తనకేం అభ్యంతరం లేదన్నాడు. పైగా ఇస్మాయిల్ సైన్యంలో పనిచేసినవాడు. అతను మనతో వుంటే రేపొద్దున్న వరకయినా ప్రమాదమే" అతడు పిస్టల్ పట్టుకుని వాళ్ళు పడుకున్నవైపు వెళ్ళసాగాడు.
"వద్దు ఆగు" అంది.
పాల్ తలతిప్పి ఆమెవైపు చూసి "ఇది ఆర్మీ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన విషయం. 'సా' కి సంబంధించింది కాదు. 'సా' తరఫున ఇండియాలో మీకక్కడ ఏం పనో నేను అడగలేదు. అలాగే ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా వుంటే మంచిది" అన్నాడు సీరియస్ గా.
ఆమె నవ్వి "నేను ఆగమన్నది అందుకు కాదు" అంది.
"మరి?"
"వాడిని చంపగానే ఇక రాత్రంతా ఆ ముసలాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు. మనకి జాగారం తప్పదు. ఆ చంపే పనేదో తెల్లవారు ఝామునే చేసుకోవచ్చు మన పని పూర్తయ్యాక."
"ఏం పని?"
"ఆర్మీ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తూ అదికూడా అర్ధంకాలేదా?" సమ్మోహనంగా చూస్తూ అంది.
"అయింది" దగ్గరికి వస్తూ అన్నాడు.
ఆమె అతడి భుజాలమీద చేయివేసి, అరికాళ్ళు పైకెత్తి, అతడి బుగ్గమీద ముద్దు పెట్టుకుంది. అతడు ఆమెని దగ్గరగా హత్తుకున్నాడు. ఆమె కొద్దిగా వెనక్కి వెళ్ళి, అతడి చేతుల మీద నుంచి తన చేతులు క్రిందికి జరిపి బెల్ట్ హుక్ తీసింది. ఆ తర్వాత కూడా చేతులు అక్కడినుంచి తియ్యలేదు. అతడు సన్నగా మూలిగి, "ఇంత విద్య ఎక్కడ నేర్చుకున్నావ్? అని అడిగాడు.
ఆమె రెండు చేతుల్నీ అతడు నడుము చెరోవైపుకీ వేసి పాంటు క్రిందకి జరుపుతూ, "ఉద్యోగం అన్నాక తప్పదు కదా" అంది.
"ఏం ఉద్యోగం సీక్రెట్ సర్వీసా?" ఆమె పైట తొలగించబోతూ అన్నాడు. అతడి ప్రయత్నాన్ని అవరోధిస్తూ "జూనియర్ ఆర్టిస్ట్" అంది.
"అదేమిటి?"
"నటించటం" అతడి ముందు మోకాళ్ళ మీద కూర్చుంటూ అంది.
"నువ్వు తియ్యవేం?" జాకెట్ తొలగించబోయాడు. ఆమె సుతారంగా అతడి చేతులు పక్కకి తప్పిస్తూ, "అవసరంవస్తే తప్పకుండా" అంటూ అతడి ఆఖరి ఆచ్చాదన కూడా తొలగించి వున్న ఆమె చేతులు అతడి కడుపు మీదనుంచి క్రిందికి జారేయి.
ఒక్కక్షణం తర్వాత అతడు పెట్టిన కేక అడవిలో మార్మోగింది.
గాఢనిద్రలో వున్న ఇస్మాయిల్ మగతనిద్రలో వున్న జగదీష్ దంపతులు అడవిలో అన్ని జీవాలూ ఆ కేకకి నిద్ర లేచాయి. చెట్లమీద వున్న పక్షులన్నీ ఒక్కసారిగా రెక్కలు టపటపా కొట్టుకోవటంతో అక్కడ నిశ్శబ్దం భయంకరంగా చెదిరింది.
ఇస్మాయిల్ పరుగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి, ఆ దృశ్యం జలదరించేలా వుంది.
పడగ వదిలేస్తే పాము ఎక్కడ కాటువేస్తుందో అన్నభయంతో విషాన్ని పిండినట్లు ఆమె అతని ప్రాణాలు తోడేస్తుంది. అతడి కేకలు, క్రమంగా క్షీణమయ్యాయి. కాళ్ళూ చేతులూ కొట్టుకోవటం కూడా ఆగిపోయింది. నెమ్మదిగా నిర్జీవమయ్యాడు. అతడి ప్రాణాలు వున్నాయా పోయాయా అనికూడా ఆమె చూడలేదు. ఆమె ఆ క్షణం ఒక హిస్టీరియా పేషెంట్ లా వుంది.
ఇస్మాయిల్ అప్పటికి తేరుకున్నాడు. ఒక్క ఉదుటున చెట్ల వెనుకనుంచి దగ్గరగా వెళ్ళి ఆమెని విసురుగా వెనక్కి లాగుతూ "లక్ష్మీ ఏమిటిది?" అని అరిచాడు.
ఆమె ఆవేశం తగ్గగానే, దుఃఖం ఉప్పెనలా వచ్చింది. ఎందుకో కారణం తెలీదు. "ఇతను... ఇతను పాకిస్తాన్ ఏజెంట్" అంది వెక్కుతూ. ఇస్మాయిల్ నిరత్తరుడయ్యాడు. ఆమె చెప్పింది ఒక పట్టాన అర్ధంకాలేదు. ఆమె అంది. "మిమ్మల్ని చంపేసి, వాళ్ళని వెనక్కి పాకిస్తాన్ తీసుకు పోవాలని ప్లాన్ వేశాడు. అజ్మరాలీతో మాట్లాడుతూ వుంటే విన్నాను."
క్రమక్రమంగా ఇస్మాయిల్ కి అర్ధమైంది. డాక్టర్ పాల్ కి కొద్ది దూరంలో పిస్టల్ అలాగే వుంది. లక్ష్మి 'ఆ పనిని' ఎటువంటి పరిస్థితుల్లో చేసిందో కూడా అర్ధమైంది. తనని రక్షించటం కోసం ఆమె ఏం కోల్పోవటానికి సిద్ధపడిందో తెలియగానే అతడు కదిలిపోయాడు.
ప్రనూష వ్యాన్ ఎక్కకముందే అది ఎందుకు కదిలిందో ఇప్పుడు అతడు స్పష్టంగా వూహించగలిగాడు. ఇంకో రెండు గంటలు ఆలస్యమై వుంటే తమ ప్రాణాలు ఎంత నిశ్శబ్దంగా ఈ అడవిలో సమాధి కాబడేవో వూహించి, ఆమెపట్ల కృతజ్ఞతతో తలమీద చేయివేశాడు. ఆమెకూడా క్రమంగా తేరుకుంది.
"ఒక పాకిస్తాన్ ఏజెంట్ కూడా నమ్మేటంతగా నాటకం ఆడి, ఈ సాహసానికి పూనుకున్నావంటే నమ్మలేకపోతున్నాను...."
"మరేం చేయను? అతడికి ఆలోచించుకునే టైమ్ ఇవ్వకూడదు. ధైర్యం తెచ్చుకున్నాను."
"ధైర్యం గురించి కాదు నేను మాట్లాడేది. త్యాగం గురించి" అన్నాడు.
ఇస్మాయిల్ డాక్టర్ పాల్ నగ్న శరీరం వైపు చూస్తూ "నీ పరిస్థితుల్లో ఎవరున్నా ఈ పనిచేయగలిగి వుండేవారు కాదేమో."
ఆమె నెమ్మదిగా తల పైకెత్తి, తడికళ్ళతో అతనివైపు చూసింది. "అవును. చేయగలిగి వుండేవారు కాదేమో.... నటిని కదా... నటించటం సులభమై వుంటుంది. జూనియర్ ఆర్టిస్ట్ ని కదా... పైట తొలగించటం అలవాటై వుంటుంది" అంది.
18
ఉదయం తాలూకు వెలుగు ఆ మైదానంనిండా పరుచుకోవటం ప్రారంభించి చాలా సేపయింది.
అజ్మరాలీ అక్కడికి వచ్చేసరికి ప్రనూషని బందీగా తెచ్చి వుంచారు. అతడు ప్రనూషని చూసి నవ్వాడు.
"మీ భారత రాయబారి మిగతా వాళ్ళందర్నీ తీసుకువెళ్ళిపోయాడు. చైతన్యతో కలిసి నువ్వు మాకు మిగిలి పోతావన్నమాట. ఇంకో రకంగా చెప్పాలంటే, బ్రతికున్న ఖైదీల లిస్టునుంచి నీ అడ్రస్ కొట్టివేయబడుతుంది. అర్ధమైందా?"
ఆమె సమాధానం చెప్పలేదు.
"నీకు తెలుసుకదా... యుద్ధంలో దొరికిన సైనికులపట్ల గెలిచిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో" నవ్వేడు... "అలాగే శత్రుదేశంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే, ఇక ఆ సైనికులకి పండగే. కోళ్ళు... గొర్రెలు... ఆడపిల్లలు..."
నవ్వు ఆపి, అతడు అన్నాడు "నేను చెప్పిన ఒక పని చేస్తే నిన్ను సకల మర్యాదలతో మీ దేశ రాయబారి కార్యాలయానికి పంపుతాను."
ఆమె తలెత్తి చూసింది.
"మా సైనికులందరూ చూస్తూండగానే నన్ను ముద్దు పెట్టుకోవాలి. చిన్న ముద్దు... అంతే నిన్ను వదిలేస్తాను."
"ప్రాణం పోయినా నేనా పని చేయనని నీకు తెలుసు."
"సరిహద్దు ప్రాంతాల్లో సైనికుల గురించి నీకు చెప్పానుగా. మొహం వాచిపోయి వుంటారు. చూడు మా వాళ్ళు నీ వైపు ఎలా ఆకలిగా చూస్తున్నారో. నేను చిన్న సైగ చేశానంటే నెలరోజులు నేలమాళిగలో పెట్టి రోజుకి పదిమందికి తక్కువ కాకుండా అనుభవిస్తారు. అది మంచిదా, ఓటమి ఒప్పుకుని నన్ను ముద్దు పెట్టుకోవటం మంచిదా?"
అంటూ జేబులోంచి కాయిన్ తీశాడు. "నీకు గుర్తుందో లేదో కొన్నేళ్ళ క్రితం నీకూ నీ తల్లికీ మధ్య- ఎవర్ని అనుభవించాలో అని ఒకసారి టాస్ వేశాను. ఇప్పుడు నీ ముద్దుకీ- శీలానికి మధ్య టాస్ వేస్తాను" అంటూ నాణేన్ని గాలిలోకి ఎగరేశాడు.
ఆమె కళ్ళు మూసుకుంది. "బొమ్మ పడితే నాకు ముద్దు. బొరుసు పడితే మా వాళ్ళకి విందు....."
అజ్మరాలీ మాటలు గాలిలో ఆమెకు వినిపించాయి. ఆ తర్వాత చిన్న చప్పుడు.
"బొరుసు..." అజ్మరాలీ అన్నాడు. ఆమె ఇంకా కళ్ళు తెరవలేదు. అడుగుల చప్పుడు దగ్గరైంది.
అజ్మరాలీ ఆమె దగ్గరగా వచ్చి ఆమె గడ్డం పైకెత్తి మొహం దగ్గరగా వంగాడు. పెదాలమీద పెదాలు ఆన్చి ముద్దు పెట్టుకోబోయి 'నో' అంటూ దూరంగా జరిగి నవ్వేడు.
"... నాకు ప్రిన్సిపుల్స్ వున్నాయి. మాటమీద నిలబడతాను. బొరుసు పడితే మా వాళ్ళకి విందన్నాను. నా అదృష్టం బావోలేదు. మా వాళ్ళ అదృష్టం బావుంది" అంటూ నీళ్ళటాంకు పక్కగా వచ్చాడు.
ఇంకా కళ్ళు మూసుకుని వున్న ప్రనూషకి అప్పుడు మరో శబ్దం వినిపించింది. నీళ్ళు జారిన శబ్దం, ఎవరినో కొట్టిన ధ్వని. క్రిందపడిన చప్పుడు. అప్పటికే ఆమె కళ్ళు తెరిచింది.
అంత వేగాన్ని ఆమె తన జీవితంలో అంతకుముందు ఎన్నడూ చూడలేదు. నీటి ట్యాంకులోంచి బయటకు దూకిన చైతన్య రెప్పపాటుకాలంలో అజ్మరాలీని సమీపించటం, ఒకే దెబ్బతో అతన్ని నేల కరిపించటం, ఫాలిలో డైవ్ చేసి ప్రనూష పక్కనున్న సైనికుడి రైఫిల్ లాక్కుని, అదే వేగంతో తలమీద కొట్టటం జరిగిపోయింది. ఇదంతా ఎంత ఫాస్ట్ గా జరిగిందంటే, చుట్టూ వున్న సైనికులు తమ ఆయుధాలు సరి చేసుకునే లోపులో అజ్మరాలీ నేలమీద వున్నాడు. పక్క సైనికుడి నుంచి లాక్కున్న రైఫిల్ తో చైతన్య అతని పక్క గురిపెట్టి నిలబడ్డాడు.