Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 40

                                 

    ఉదాహరణకి మీరు నాలుగు అనే అంకెని 'బి' కేటగిరీలో వ్రాసి, ఆరు, తొమ్మిదిలను ఏ కేటగిరిలోలా వ్రాసి, మిగిలిన అంకెలన్నీ 'సి' కేటగిరిలోకి చెందినట్లుగా వ్రాస్తే మీరు 'సి' కేటగిరి విశ్లేషణను కలిగి వుంటారు. అయితే మిగతా  రెండు కేటగిరీలను కూడా చదివి మీ మనస్తత్వాన్ని కరక్ట్ గా అంచనా వేసుకోవచ్చు.

     

     పైన నాలుగు రకాల  విభాగాలు ఇవ్వటం జరిగింది. ఈ నాలుగు కేటగిరీలలో ఏదో ఒక భాగానికి మీరు చెందాలని  లేదు. ముందే చెప్పినట్లు మీరు అంకెలని ఏ విధంగా వ్రాస్తార నిర్ణయించుకుని దాన్ని బట్టి మనస్తత్వ విశ్లేషణ ప్రారంభించాలి.

     కేటగిరి ఎ :

     అంకెలు పొందికగా వ్రాసేవారు రెండురకాలుగా వ్రాస్తారు. ఒకటి  పెద్ద అంకెలు.  రెండు చిన్న అంకెలు (వీరు సాధారణంగా కలాన్ని ఎక్కువగా ఒత్తుపెట్టి వ్రాస్తారు) ఈ కేటగిరిలో అంకెలు  చిన్నవిగా వ్రాసేవారు మెటీరియలిస్టులు వాస్తవ దృక్పథం  కలిగిన వారూ అయివుంటారు. వీరి జీవితాన్ని వ్యాపారంగా తీసుకుంటారు. ఏదైనా పనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయితే తప్ప ఆ పని చేయరు. వీరిలో ఏకాగ్రత ఎక్కువ.

    ఇదే కేటగిరిలో అంకెలనీ పెద్దగా వ్రాసే వారిలో అసహనం  పాలు ఎక్కువ.  తమమీద తమకి నమ్మకం కూడా ఎక్కువ.

     ఈ కేటగిరిలో వ్యక్తులు, తాము అనుకున్న దానికన్నా ముందుగా పనులు పూర్తి చేయటానికి ఇష్టపడరు. చాలా సిస్టమేటిక్ గా ప్రతీ అంశాన్నీ పరిశీలిస్తూ గమ్యం చేరుకోటానికి ఇష్టపడతారు.

     కేటగిరి - బి :

    ఈ కేటగిరిలో అంకెలన్నీ కోణాలతో వ్రాయటం మనం గమనించవచ్చు. ఈ టైపువ్యక్తులకి కాస్త ఏంక్సయిటీ, టెన్షన్ వుంటాయి. ఇదే కేటగిరిలో అంకెలని ఇంకాస్త  అందంగా చెక్కేవారైతే పగటి కలలుకనే  స్వభావం కలిగినవారైవుంటారు. వీరు ఎక్కువ నమ్మకస్తులు. సాటివారిపట్ల గౌరవం, అవతలవారి తెలివి తేటలని ఒప్పుకొనేవారై వుంటారు.

     కేటగిరి - సి :

     అంకెలని తేలికగా వ్రాసేవారు, అక్షరాలకి  ఇవ్వవలసినంత ప్రాముఖ్యత ఇవ్వకుండా అవతలవాళ్లకి అర్దమయితే చాలనుకుని వ్రాసేవారు డబ్బు సంపాదనపట్ల ఎక్కువ ఆసక్తి గలవారై వుంటారు. జీవితంలో ఏ ఆనందం పొందాలన్నా డబ్బే ముఖ్యం అనే అభిప్రాయంతో  వుంటారు. వీరి అభిప్రాయాలు చాలాసార్లు కరెక్ట్ అవుతూ వుంటాయి. ఇదే టైపు  అక్షరాలని మరింత ఒత్తి  వ్రాసేవారు డబ్బు సంపాదన  పట్ల నిర్లక్ష్య వైఖరి గలవారై వుంటారు. అయినా సరే, వీరికి  డబ్బు వచ్చిపడుతూనే వుంటుంది.

    కేటగిరి -డి :

     అక్షరాలని అందంగా తీర్చిదిద్దాలనే తపన, అంకెలని వ్రాసేటప్పుడు అందంగా దిద్దేవారు ఎక్కువగా భావుకులు, తమను ఎవరూ అర్దం చేసుకోవటం లేదు అనుకునేవారు, తమని తాము సమాజంలో అవసరమైన దానికంటే ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకునేవారు - అయివుంటారు. వీరు నెమ్మదిగా  తమ లక్ష్యాన్ని సాధిస్తారు. అయితే తప్పనిసరిగా తాము అనుకున్న దాన్ని సాధించగలుగుతారు.  వీరిలో ఓటమిపాలు ఎక్కువగా వుండదు.

 Previous Page Next Page