1. పుత్రకామేష్టి
సరయూ నదీ తీరమున కోసల దేశము కలదు. సూర్యవంశపు రాజగు దశరథుడు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకొని ఆ దేశమును ప్రజా రంజకముగా పాలించెను.
ఆ వసుదేశ్వరునకు కౌసల్యా, సుమిత్రా , కైకేయ అనుమువ్వురు భార్యలు ఉన్నారు. ఆ రాణులలో ఎవరికీనీ సంతానము కలుగలేదు. బిడ్డలు లేరని విచారించుచున్న దశరథునితో అయన పురోహితుడైన వసిష్ఠమహర్షి ఇట్లు చెప్పెను.
"మహారాజా, కొంతకాలము క్రితము వర్షములు కురియక అంగదేశమున భయంకరమగు కరువు సంభవించెను. ఆ క్షామము నుండి తన ప్రజలకు రక్షించుకొనుట ఎట్లు అని ఆ దేశపు రాజగు రోమపాదుడు చింతించుచుండగా నేను అతని వద్దకు పోయి 'రోమపాదా, నీ రాజ్యము సరిహద్దుల్లో ఉన్న అరణ్యములో 'విభాండకుడు' అను యోగివుంగవుడు కలడు. ఆ మహత్మునకు 'ఋశ్యశృంగుడ' ను కుమారుడు ఉన్నాడు. ఆ యువకుడు తవము తప్ప అన్యమేరుగుని అమాయుకుడు. ఆ నిర్మల హృదయుని నేర్పుగా నీ రాజధానికి రప్పించుము. ఆ పుణ్యాత్ముడు నీ రాజ్యమున కాలుమోపుటతోనే వర్షములు కుంభవృష్టిగా కురిసి క్షామము తొలగిపోయి దేశము సస్యశ్యామనమగును' అని చెప్పినాను.... రోమపాదుడు నేను చెప్పినట్లు చేసి తన ప్రజలను కరువు నుండి కాపాడినాడు. ఋశ్యశృంగుని తాన రాజ్యమునందే ఆపి వేయవలెనన్న సంకల్పముతో రోమపాదుడు తన కూమార్తెయైన శాంతాదేవిని ఆ తపస్సంపన్నునకిచ్చి వివాహాము చేసినాడు ....... నీవు అంగరాజధానికి పోయి ఆ దంపతులకు ప్రార్ధించి అయోధ్యకు తీసుకురమ్ము. ఆ కరుణాయముడు నీ చేత పుత్రికామేష్టిని ( పుత్రులు కలుగవలెనని కోరి చేయు యజ్ఞమును ) చేయించి నున్ను కృతార్ధుని చేయును."
దశరధుడు వసిష్ఠ మహర్షికి కృతజ్ఞతను తెలుపుకుని అంగ రాజధానికి పోయినాడు. ఋశ్యశృంగునీ శాంతాదేవిని తన రథమునందు కూర్చుండ బెట్టుకుని అయోధ్యకు తిరిగి వచ్చినాడు...... ఋశ్యశృ౦గుడు ఒక శుభమూహూర్తమున దశరథుని దీక్ష వహింపజేసి ఇష్టని ప్రారంభించినాడు. వేదమంత్రములతో హొమములు గుండములోని అగ్నిహొత్రునకు అందింపబడుచున్నవి.
అదే సమయమున ఇంద్రుడూ మున్నగు దిక్పాలురునూ, అన్య దేవతలనూ, తాపసులునూ వైకుంఠమున శేషశాయియైయున్న శ్రీ మహావిష్ణువు సన్నిధిని నిలిచి మొఱపెట్టుకొన్నారు.
"ఆర్తత్రాణపరాయణా, విశ్వవసు కుమారుడు _ పదితలల రావణాసురుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని మెప్పించి వరమును పొంది, ఆ వర గర్వముతో లోకకంటకుడుగా పరిణమించినాడు. దేవతలను బాధించుచున్నాడు. మునులను హింసించుచున్నాడు. వానికి భయపడి సూర్యుడు ప్రకాశించుటలేదు. వాయువు వీచుటలేదు. పరాత్పరా, సాదురక్షణ నిమిత్తము నీవు ఆ దురాత్ముని సంహరించవలెను."
శ్రీ మహావిష్ణువు వారికి అభయమిచ్చి , ఇట్లు వంచించినాడు:
"దశకంఠుడు నరులూ వానరులూ అల్పులనియూ వారి వలన తనకెట్టి హానియూ కలుగదనియూ భావించి, వారిని తన వరములో పేర్కొనలేదు. కనుక నేను నరుడుగా అవతరించి దశగ్రీవుని పీడను తొలగించెదను. దేవతలు మీరందరునూ బాలపరాక్రమ సంపన్నులగు వానరులుగా భూలోకమున జన్మించి, దైత్య సంహారమున నాకు సహకరించుడు"
అమరులను, మునులను సంతుష్టాంత రంగములతో తమ తమ సెలవులకు తిరిగిపోయినారు.
అంతయూ ఆలకించిన వేయిపడగల ఆదిశేషుడు మహావిష్ణువుతో "ప్రభూ మీకు శయ్యనైన నాకు ఇంతవరకూ మీ నిరంతర సాన్నిధ్యము లభించినది. భూలోకమున అవతరించునున్న మీరు నన్నూ మీవెంట తోడ్కొని పోవలెనని ప్రార్ధించుచున్నాను. మీ వియోగమును భరించలేను" అనెను. శ్రీమహావిష్ణువు "వసుధలో దశరథుడను రాజు పుత్రకామేష్టిని చేయుచున్నాడు. యాగఫలముగా ఆ పార్దివునకు నలుగురు తనయులు జన్మించెదురు. వారిలో జేష్టడుగా నేను తోడుగా నుందువు" అనెను. ఆదిశేషుడు బ్రహ్మనందభరితుడై 'ధన్యోస్మి' అనుచూ తన సహస్రవణములనూ పద్మాక్షుని పాదపద్మముల వైపు వంచి మ్రొక్కినాడు.
అయోధ్యా నగరమున దశరథుని ఇష్టి (యజ్ఞము) పూర్తైయైనది. హొమగుండము నుండి మహాపురుషుడోకడు వ్రత్యక్షమై "రాజా నీ యజ్ఞమునుకు దేవతలు సంతుష్టులైనారు. ఇదిగో ఈ కనక కలశమున పరమాన్నము ఉన్నది. ఈ పాయసమును నీ రాణులచే ఆరగింప జేయుము. నీకు సంతానము కలుగును" అని చెప్పి కలశమును దశరథునకందించి, అంతర్హతుడయ్యెను.
ఆ సువర్ణ పాత్రను సంతోషముతో అందుకొన్న దశరథుడు పాయసమును రెండు సమభాగములుగా చేసి కౌసల్యకు ఒక భాగామునూ కైకేయికి ఒక భాగమునూ ఇచ్చినాడు. కౌసల్య తన పాయసము నుండి సగము తీసి సుమిత్ర కొసగినది. కైకేయియు అట్లు చేసినది. ఆ విధముగా సుమిత్రకు రెండు పావులు ముట్టినవి.
రాణులు మువ్వురునూ గర్భవతులై నెలలు నిండిన పిదప బిడ్డలను ప్రసవించినారు. నవమినాడు కౌసల్య పుత్రుని కన్నది. దశమి రోజున కైకేయికి సుతుడు జన్మించినాడు. అనంతరము సుమిత్రకు ఇద్దరు తనయులు పుట్టినారు. కుమారస్వామిని కన్న పార్వతీదేవి వలె కౌసల్యయూ చందుని కాంచిన పూర్వ దిక్సతి చందమున కైకేయియూ ఇంద్ర ఉపేంద్రులకు జననియైన అదితి రీతిన సుమిత్రయూ భాసిల్లినారు. బంధు మిత్రులూ ప్రజలూ సంతోషించినారు. దశరథుడు అనందాతిశయమున వివిధ దానములను చేసినాడు.
నామకరుణ మహొత్సవము వైభవముగా జరిగినది. కౌసల్య సుతునకు రాముడు అనియూ కైకేయి బిడ్డకు భరతుడు అనియూ సుమిత్ర నందనులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనియూ పేర్లు పెట్టినారు.
బిడ్డలు నలువురూ దినదిన ప్రవర్ధమానులు అయ్యారు. ఆదిశేషుని అవతారమైనా లక్ష్మణుడు మహావిష్ణువు అవతారమైన రామునితో ఎక్కువుగా చెలిమి చేసి అతనికి బ్రహ:ప్రాణము అయినాడు. శత్రుఘ్నుడు బాల్యము నుండియూ భరతునకు సన్నిహితుడిగా నుండెను.
ఉపనయనములైన పిమ్మట ఆ అన్నదమ్ములు వేదాధ్యయనమును చేసినారు. శృతిన్మృతి పురాణేతిహాసములను వఠించినారు. విలువిద్య యందునూ ఖడ్గవిద్య యందునూ ఆరితేరినారు. గజ అశ్వరథారోహణ చతురులు ఐనారు. వినయ శీలురై తలిదండ్రుల ప్రేమకునూ ప్రజల మన్ననకునూ పాత్రులైనారు. వారిలో జేష్టడగు రాముడు సర్వజనాభిరాముడూ పితృసేవాపరాయణుడూ ఐనాడు. దశరథడు కుమారులకు యుక్త వయసు సమీపించగా వారి వివాహములను గూర్చి అలోచించసాగినాడు. *