Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 4

 

    "మీకు కలిగిన ఆనందమే నాలోనూ ప్రతిఫలిస్తోంది. " ఒక్క క్షణం ముఖం ఎర్రబడ్డా తనూ నవేశాడు రామచంద్ర. "ఇవాళ నన్ను మీతో మీ పొలానికి తీసికెళతారా పచ్చని పంట పొలాలు చూడాలంటే నాకెంతో సరదా."
    "అలాగే! సినిమాలో లాగా నేను నాగలి పట్టుకుని దున్నుతాననుకునేరు! అన్నీ కూలీలు చేస్తారు. నేను స్వయంగా దగ్గరుండి చూసుకుంటా నంతే! కాని ....?"
    "ఏమిటీ?"
    "మీ వారు ఏమయినా అనుకుని మీకు ......." కిలకిల నవింది వారిజ.
    "మహానుభావా! ఆ విషయం పూర్తిగా మర్చిపోండి. మా వారికీ నాలో సంపూర్ణ విశ్వాసం వుంది. అయన ఒక్క నాటికీ ఏమి అనుకోరు. నాకే ఆపదా రాదు.'
    వారిజా, రామచంద్రలు కలిసి పొలాని కేడుతుంటే పల్లె పల్లె అంతా విరగబడి చూసింది. "వాళ్ళెంత వింతగా చూస్తున్నారో చూడండి....." అన్నాడు రామచంద్ర . వారిజ నవ్వింది.
    "న్యాయానికి వాళ్ళను తప్పు పట్టడం దేనికి.....? ఆ మాటకొస్తే మన ఈ ప్రయాణం మనకే వింతగా లేదు?" రామచంద్ర కూడా తేలిగ్గా నవేశాడు.
    "నిజమే! ఇప్పటికీ ఇదంతా నిజమో, కలో అర్ధం కావటం లేదు నాకు.' పొలం సమీపిస్తుండగానే ఎదురోచ్చాడు వీరన్న, వరిజను వింతగా చూస్తూ ఆగిపోయాడు.
    "ఈవిడ వారిజ గారు వీరన్నా!" సరాదాగా నవుతూ అని ఆగిపోయాడు రామచంద్ర. అంత కంటే ఏం చెప్పాలో తెలీక. వీరన్న ఉలుకు పలుకున వారిజ వంక చూశాడు.
    "ఇతను వీరన్న -- మా పాలేరు. కాని, నాకు ప్రాణానికి ప్రాణం. ఇంత కంటే మంచి స్నేహితుడు నాకీ ఊళ్ళో ఎవరూ లేరు. ఇప్పుడు నా దగ్గర చదువుకుంటున్నాడు.....మొన్ననే మెట్రిక్ పాసయ్యాడు."
    వీరన్నను వారిజకు పరిచయం చేశాడు రామచంద్ర. వీరన్న ముఖంలో ఒక్క క్షణం చిరునవు చిందులాడినా, వారిజను చూడగానే ముడుచుకు పోయింది. "మీరా పాకలో కూచోండి. నేనిప్పుడే వస్తాను.' అంటూ గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు.
    వారిజ బాధపడుతుంటేమొనన్నట్లు నొచ్చుకుంటూ చూశాడు రామచంద్ర. ఆమె నిరికారంగా నవింది. పొలానికి పక్కనే చిన్న డేరా లాగ ఒక పూరిల్లు కట్టుకున్నాడు రామచంద్ర. ఒక వారగా బల్ల, కుర్చీ , కొన్ని పుస్తకాలు, కాగితాలు వున్నాయి. వారిజ లోపలి వచ్చి కుర్చీలో కూర్చుంది.
    "కూలీలు సరిగ్గా చేస్తున్నారో లేదో చూస్తూ వాళ్ళకు సలహా లిస్తూ , మధ్య మధ్య ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాను.' మీరు కాస్సేపిలా కూర్చోండి. నేనొక్క సారి కూలీలతో మాట్లాడి వస్తాను.' వారిజ మున్డుకొన్ని పుస్తకాలు పడేసి, చక చక బయటి కెళ్ళిన రామచంద్ర పది నిముషాల్లోనే తిరిగి వచ్చేశాడు.
    'అప్పుడే వచ్చేశారే?' అప్పుడప్పుడే ఏదో పుస్తకం తెరవబోతున్న వారిజ అంది.
    "మీ ఒక్కరికే ఏం తోస్తుంది మరి?" వారిజ నవ్వి కుర్చిలోంఛి లేచింది.
    'పంట పొలాల మధ్య నడవాలంటే నాకు చాలా సరదా! వెళదాం పదండి.
    "మరి, మీరు నడవగలరా?"
    "మాములుగా అయితే ఏమో! మీరు పక్కనుండి కబుర్లు చెపుతుంటే ఎన్ని మైళ్లున్నా నడవగలను..." రామచంద్ర తలవంచుకున్నాడు. అంతలో తలెత్తి ....." మీకు పుణ్య ముంటుంది.....ఇలా మాట్లాడకండి" అన్నాడు.
    "ఏం నేను మాట్లాడిన మాటలో తప్పేముందీ! స్నేహితులతో కబుర్లు చెపుతుంటే శ్రమ తెలుస్తుందా?" ఒక్కసారి వారిజ ముఖంలోకి చూసి , రాబోతున్న నిట్టుర్పు నాపుకుని "పదండి.." అన్నాడు. వరి చేలు వయ్యారంగా ఊగిపోతున్నాయి. మడుల మధ్య ఇరుకు గట్ల మీదుగా నడుస్తూ వాటిని చూడటం ఎంతో హాయిగా వుంది వారిజకు. సూర్యుడు పై పైకి వస్తున్నా శీతాకాలపు చలిగాలులతో వేడి కరిగిపోయి సూర్య కారణాలు శరీరాలను వెచ్చగా తాకుతున్నాయి. కంకులతో బరువుగా ఒరిగిపోతూ, ఆకులతో పచ్చగా కలకలలాడుతూ ఎవరో వన దేవతలు గుమిగూడి నాట్యం చేస్తున్నట్లుగా వున్నాయి. పంటచేలు ....దూరంగా నిండుగా, నిదానంగా పారుతున్న యేరు.
    గట్టుమీద నడుస్తున్న వారిజ కాలుజారి పడబోయింది. చటుక్కున ఆమెను తన చేతులతో పొదువుకొని, పడకుండా ఆపాడు రామచంద్ర. అతని భుజం మీద వాలింది ఒక్క క్షణం వారిజ శిరస్సు అంతలో సర్దుకుని పక్కకు నిలిచి కిలకిల నవింది. "నవతం కాదు, కాలు జారిందంటే ఆ బురదలో పడేవారు - అప్పుడుండేది తమాషా!' గంబీరంగా అన్నాడు రామచంద్ర.
    " మీరున్నారుగా నా పక్కన! నా కాలు జారకుండా కాపాడడానికి." వారిజ నవుతూనే అన్నా, రామచంద్రకి అదోలా వినిపించింది. తలెత్తి సూటిగా వారిజ ముఖంలోకి చూశాడు వారిజ నవ్వి.' నా మాటల్లో అర్ధాలు వెతక్కండి....పదండి" అంటూనే అతని చెయ్యి పట్టుకుంది. ఒక్కసారిగా రామచంద్ర అణువణువూ ఝల్లుమంది. ఆమె చెయ్యి విదిలించుకోవాలనే ఆలోచన లోలోపల కలిగినా, కనీసం ఆ ప్రయత్నం కూడా చెయ్యలేకపోయాడు. పైగా తన చేతిలో ఉన్న ఆమె చేతిని మరింత దృడంగా పట్టుకున్నాడు.
    రామచంద్ర చేతిలో తన చెయ్యి బంధింపబడగా , ఆహ్లాదకరమైన వాతావరణంలో సుందరమైన ప్రకృతి మధ్య నిల్చిన వారిజ "మానవ జీవితం చాలా మధురమైంది" అంది. అప్పటికి తనలో ఉవెత్తున చేల రేగుతోన్న సంచలనాన్ని నిగ్రహించుకోగలిగాడు రామచంద్ర. ఆమె చేతిని అలాగే పట్టుకుని అన్నాడు.
    "అవును. మానవజీవితం మధురమైంది సృష్టి సుందరమైనది.... ఈ సౌందర్యాన్ని, మాధుర్యాన్ని అనుభవించడానికి సున్నితమయిన మనస్సుండాలి , కాని ఈ సున్నితత్వం సౌందర్యాన్ని మాధుర్యాన్ని కాక క్షోభనూ , అసహనాన్నీ అశాంతిని కూడా అంతే వాడిగా గ్రహిస్తుంది. వీటికి భయపడి సున్నితమైన మనసును బండ  చేసుకుని జీవితం నుండి పారిపోతారు కొంతమంది. కాని అప్పుడా జీవితాన్ని మానవ జీవితమనడానికి వీల్లేదు. అది సృష్టికర్త మానవులకు ప్రసాదించిన అపూరూపమైన అత్యుత్తమ వరాన్ని నష్ట పరచుకున్న దౌర్భాగ్యుల దుస్థితి అది....."
    వారిజ క్రింద పెదవి పళ్ళ మధ్య నలిగి రక్తాన్ని చిమ్ముతోంది. కళ్ళు దిగంతాలలో ఏదో వెతుక్కుంటూన్నాయి రామచంద్ర ఒక్కసారి వారిజను కుదిపి "ఏమిటి?" అన్నాడు గాభరాగా తనవంట్లో జీవమంతా ఎవరో లాగేసుకున్నట్లు అక్కడే ఆ గట్టు మీద కూలబడి పోయింది వారిజ.
    'చూశారా! మీరు నడవలేరని నాకు తెలుసు. చెపితే వినలేదు....ఇప్పుడెలా? ఉండండి ....నా పాకలో కెళ్ళి ప్లాస్క్ లోకి కాస్త కాఫీ తీసుకొస్తాను...." కంగారుగా అని, వారిక వారించేలోగానే వెళ్ళిపోయాడు రామచంద్ర.

 Previous Page Next Page