Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 38

 

    అతను నిరాశ పడిపోయాడు.
    ఆ సాయంత్రానికి విష్ణు ఓ చిన్న ప్యాకెట్టూ తీసుకొచ్చి సురేష్ మీదకు విసిరేశాడు.
    "మీ తులసిని చూడాలనుందన్నావు కదా! యా జే ఫ్రెండ్ - నీ కోసం ఏర్పాటు చేశాను."
    ఆత్రుతగా ప్యాకెట్టు విప్పాడు అతను.
    లోపల తులసి ఫోటోలు..... ఆమె మార్కెట్లో నడుస్తున్నప్పుడు- ఇంట్లో గంగాభవానితో మాట్లాడుతున్నప్పుడు, సాయంత్రం కిటికీ దగ్గర నిలబడి రోడ్డు  వైపు దిగులుగా చూస్తున్నప్పుడూ.
    అతనికి మనసంతా వికలమైపోయింది.
    తులసి కోసమే తను ఇదంతా చేశాడు. అయినా ఆమె సంతోషంగా వున్నట్టు లేదు - ఆ ఫోటోల్లో.
    ఆ రాత్రంతా అతనికి  నిద్ర లేదు.
    ఫోటోలో తులసి దిగులుగా వుంటే గంగాభవాని నవ్వుతోంది.
    ఏదో కామెంట్ చేస్తూ నవ్వుతుంది. ఏమయి ఉంటుందామె కామెంట్?
    "ఎక్కడన్నా ఎవరో కొత్త అమ్మాయిని కలిపేసుకుంటాడులే - ఆ తెలివి చాలా వుంది" అంటోందా?
    మరో రోజు గడిచిపోయింది.
    మిసెస్ మధురి కనిపించటం లేదు.
    ఆ రోజంతా అర్జున్ లా కుర్చీలో కూర్చోవటం, మాట్లాడటం నడవడం బాగా ప్రాక్టీస్ చేయించాడు విష్ణు. ఆ తర్వాత రెండు రోజులకు వచ్చింది మధురి.
    "గుడ్ మాణింగ్" అందామె చేతి మీద చిలుక.
    ఆమె నవ్వింది.
    విష్ణు చెపుతున్నాడు - మీ ట్రైనింగ్ పూర్తీ అయిందని.
    సురేష్ ఇప్పుడు కొంత రిలాక్స్ అయ్యాడు. ఆ భవనంలోకి వచ్చాక ఆమె వంక పరీక్షగా చూశాడు.
    "28 -20- 24 అనుకున్నాడతను. కళ్ళల్లో విపరీతమైన సెక్స్ వుంది. తను చాలా అందమయిన అమ్మాయిలను చూశాడు గానీ సెక్స్ అఫీల్ చాలా తక్కువ మందికి వుంది. గంగాభావానీ కూడా కొంత సెక్సీగా వుంటుంది గానీ యింత విపరీతమైన ఆకర్షణ ఎవరికీ వుండదు.
    అతను తనవంకే చూడటం గమనించింది మాధురి.
    "మీరు అన్నింటిలోనూ చాలా ఫాస్ట్ అని విష్ణు చెపుతున్నాడు." నవ్వుతూ అందామె.
    "అవును! నా గాళ్ ఫ్రెండ్ కూడా అదే మాట చెప్తారు."
    ఆమె కొంచెం పజిల్ అయినట్లు చూసింది.
    "ఓ మీకు గాళ్ ఫ్రెండ్స్ కూడా వున్నారన్నమాట" ఆసక్తిగా అడిగింది.
    "ఐ లైక్ గాళ్ ఫ్రెండ్స్."
    విష్ణుకి ఆ సంభాషణ నచ్చినట్లు లేదు.
    "మేడమ్ నిన్ను పరీక్షించడానికి వచ్చారు సురేష్ - నువ్వెంత బాగా అర్జున్ గారిని అనుకరిస్తున్నావో చూడ్డానికి."
    సురేష్ లేచి నిలబడ్డాడు.
    అర్జున్ లాగా గదిలో పచార్లు చేశాడు. చేతులు పాంట్ జేబులో పెట్టుకుని, కుర్చీలో కూర్చుని ఫోన్ లో మాట్లాడుతున్నట్లు నటించాడు. గొంతు ఇమిటేడ్ చేశాడు. టేబుల్ మీదున్న కాగితం మీద సంతకం చేశాడు.
    మాధురి ముఖంలో అనందం స్పష్టంగా తెలుస్తోంది.
    "ఎక్స్ లెంట్" అందామె ఆఖర్లో. "భార్య నయుండి నేనే తేడా కనిపెట్ట లేకపోతున్నాను."
    "సహా దేవ్ గారు రేపట్నుంచే సురేష్ ని ఆఫీస్ కి తీసుకెళ్దామంటున్నారు మేడమ్" అన్నాడు విష్ణు.
    "తీసుకు వెళ్ళవచ్చు హి ఈజ్ ఫర్ ఫెక్ట్ నౌ"
    "హి ఈజ్ ఫర్ ఫెక్ట్ నౌ" అంది చిలుక.
    ఆమె చిలుకను ప్రేమగా ముద్దు పెట్టుకుంది.
    "ఓ.కే! సురేష్ రేపట్నుంచి మీ వుద్యోగంలో రెండో ఘట్టం ప్రారంభమవుతోంది. మీరు అర్జున్ ని అనుకరిస్తున్న విషయం కేవలం నలుగురు వ్యక్తులకే తెలుసు.
    అర్జున్ కీ, నాకూ, సహదేవ్ కీ, విష్ణు కీ మీరు వుండటం మా బిల్డింగ్ లోనే, మీ బెడ్ రూమ్ సపరేట్ గా వుంటుంది. ఆఫీస్ లో కూడా మీకు ఎలాంటి సమస్యా వుండదు. ఇంతకాలం అర్జున్ కి పర్సనల్ సెక్రటరీగా వున్న అమ్మాయిని తీసివేసి మిస్ ప్రత్యూషనే అమ్మాయిని అపాయింట్ చేశాము. ఆమె కొత్తగా జయినయింది గనుక మీకూ, అర్జున్ కీ ఏమయినా తేడా వున్నా కనిపెట్టలేదు. మీరు ఆఫీసులో విష్ణు చెప్పినట్లు చేస్తారు..... సంతకాలు చేయటం, బిజినెస్ వ్యవహారాలు మాట్లాడటం - అన్నీ విష్ణు గైడెన్స్ ఇస్తాడు ......' మాట్లాడటం ఆపి సురేష్ కళ్ళలోకి చుసిందామే. "అర్ధమయిందనుకుంటాను?"
    అతను తలూపాడు.
    "ఇందులో మీరు కష్ట పడాల్సిందేమీ లేదు. అంతా అతి తేలిక! అయినా గానీ మీకు చాలా ఎక్కువ డబ్బు ఇస్తున్నాం."
    నిజంగానే ఈ మాత్రానికే అయితే తనకిచ్చే డబ్బు చాలా ఎక్కువే! కానీ ఇంతేకాదు దీని వెనక ఇంకేదో వుండి వుంటుంది.
    ఆమె లేచి నిలబడింది.
    "రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా మీరు ఆఫీస్ కి బయల్దేరాలి. ఆఫీస్ లో మీ కోసం జర్నలిస్ట్ లు, బిజినెస్ పీపుల్ - చాలా మంది కలుసుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వం ఇటివలే మాకు లైసెన్స్ మంజూరు చేసిన N R I ప్రాజెక్ట్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దాని విషయంలో ప్రభుత్వం అవినీతి పాల్పడిందని ఎన్నో విమర్శలు వచ్చాయ్ న్యూస్ పేపర్లలో."
    సురేష్ కి టక్కున గుర్తుకొచ్చింది.
    ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో తను చదివాడా న్యూస్. కొద్ది రోజుల పాటు ఓ కరస్పాండెంట్ ధారహహికంగా ఆ వ్యవహారమంతా రచ్చ కేక్కించాడు. దీనిని బేస్ చేసుకుని ఆ అసంబ్లిలో పెద్ద గొడవయింది . అపోజిషన్ సభ్యులు ముఖ్యమంత్రి మీద ఎన్నో ఆరోపణలు చేశారు.
    "మీరేం గాబరా పడనక్కర్లేదు . అన్నిటికి విష్ణు సహాయం చేస్తాడు. మీ తరపున అతనే యాక్టివ్ గా పాల్గొంటాడు అన్నింట్లో-"
    ఆమె వెళ్ళిపోతూ తలుపు దగ్గర ఆగి అతని వైపు చూసింది మళ్ళీ.
    "విష్ యూ గుడ్ లక్ ......." అంది చిరునవ్వుతో.
    అలా నవ్వుతున్న ఆమెను చూస్తుంటే మతి పోతోంది. టేర్రిఫిక్ సెక్స్!
    ఇదే మరోక్కప్పుడయితే.....
    "విష్ యూ గుడ్ లక్" అంది చిలుక.
    ఆమె చిలుకను ముద్దు పెట్టుకుంది. తలుపు మూసుకుంది. ఆమె వెనుకే.
    "చిలుకయినా కాకపోతిని ఆమె పెదిమలు తాకగా -" పాట గుర్తు కొస్తోంది.
    వి.సి.ఆర్ అన్ చేశాడు.
    అర్జున్ ఆఫీస్ గదిలో నడుస్తున్నాడు.
    చాలా ఫాస్ట్ గా నడుస్తున్నాడతాను. అది ప్రాక్టీస్ చేయటం అంత కష్టమేమీ కాలేదు. కాలేజీలో తను 'గాంధీ' డ్రామా వేశాడు. గాంధీ నడవడమూ, ఆయనలా మాట్లాడటాన్నీ , గేశ్చర్ అన్నీ 8MMప్రొజెక్టర్ చూపించారు ప్రిన్సిపాల్ గారు.
    అంచేత తేలికగా ప్రాక్టీస్ చేసి , అద్భుతంగా అనుకరించగలిగాడు.
    రాత్రి పది గంటలకు నిద్ర పడుతున్న సమయంలో విష్ణు గదిలో కొచ్చాడు.
    "మనం యింకో అరగంటలో బయల్దేరుతున్నాం డ్రస్ చేసుకో.'
    "ఎక్కడికి?"
    విష్ణు చిరాగ్గా చూశాడు.
    "సారీ!' అన్నాడు సురేష్. త్వరగా డ్రస్ చేసుకున్నాడు.
    అద్దం ముందు నిలబడ్డాడు రడీ అయ్యాక.
    ఇప్పుడతను అర్జున్. కే.యన్ అర్జున్! మన దేశంలోని అతి కొద్ది మంది కోటేశ్వరులలో ఒకరిని ముమ్మూర్తులా పోలి ఉన్నాడతను.
    చాలా ఎక్సయిటింగ్ గా వుందతనికి.
    తన కేడురుగ్గా అద్దంలో కె.యన్ . అర్జున్!
    సురేష్ నవ్వాడు. కే.యన్ అర్జున్ కూడా నవ్వాడు.
    సురేష్ మస్తిష్కంలో మెరుపులా పాకింది ఆలోచన. అవును! తనకూ అర్జున్ కీ ఏమిటి తేడా?
    అతనికి కోట్ల కొద్ది ఆస్థి వుంది. తనకు లేదు! అంతే! అదొక్కటే తేడా! మిగతావన్నీ తనకూ వున్నాయి. అతని రూపం, అతనిలా సంతకం, చేసే నేర్పూ, అతనిలా మాట్లాడటం, ప్రవర్తించడం , తను తలచుకుంటే - తల్చుకుంటే.......
    "కమాన్ సురేష్! ఎంతసేపు చూస్తావు అద్దంలో " విష్ణు తలుపు దగ్గరే నిలబడి పిలిచాడు.
    అతనితో పాటు గదిలో నుంచి బయటి కొచ్చాడు సురేష్. ఇన్ని రోజులు బంది ఖానా తర్వాత బయటి ప్రపంచాన్ని చుడబోతున్నాడు తను. చిక్కటి అనందం కదిలించి వేసిందతనిని. లిప్టు కిందకు దిగుతోంది.
    5-4-3-2-1- గ్రౌండ్ ఫ్లోర్ - అంటే తను ఆరో అంతస్తులో వున్నాడన్న మాట.
    పోర్టికోలో కారు సిద్దంగా వుంది.
    స్ట్రీమర్ లా పొడుగ్గా వుందది. డ్రైవర్ బ్యాక్ డోర్ తెరచి పట్టుకున్నాడు.
    ఇద్దరూ కార్లో కూర్చున్నారు.
    కారు వేగంగా పరుగెడుతోంది. ఆ రోడ్డు తానెప్పుడూ చూడనయినా లేదు. అటూ ఇటూ అందమైన భవనాలతో ఇంద్రలోకంగా వుందా ప్రాంతం కొండల మీద నుంచి పాకి చివరకు ఓ లోయలాంటి చోటకు దిగి ఆగింది కారు.

 Previous Page Next Page