Previous Page Next Page 
గ్రాండ్ మాస్టర్ పేజి 31


    "మీరు దూరంగా వెళ్ళిపోండి."

 

    "మిస్టర్" కంపిస్తూనే అన్నాడు డాక్టర్. "ఆ అమ్మాయి ఎవరో, ఆమె ఏ స్థాయి వ్యక్తో తెలిస్తే..."

 

    "తెలుసు డాక్టర్. కాని అంబులెన్స్ వేన్ని కారులో అనుసరిస్తున్న ఆ స్థాయి వ్యక్తి హోండాకారులో మనకింకా పదినిముషాల దూరంలో వున్నాడు"

 

    వేన్ కుదుపులతో దూకుడుగా నడిపింది అతడే అని అర్థమైపోయింది. "వేన్ ముందు ఓమూల స్పృహతప్పి పడివున్న మీ డ్రయివర్ ఇప్పుడిప్పుడే కాన్షస్ లోకిరాడు. సో! ఈ పదినిమిషాల తర్వాతగాని మీరు ఈ ఛాయలకి రావద్దు."

 

    "ఇప్పుడేంచేద్దామని" బామ్మగారు అడిగారు ఆదుర్ధాగా.

 

    "మీ మనువరాలితో ఏకాంతంగా మూడు నిముషాలు గడపబోతున్నాను"

 

    "నా మాట విను" ప్రాధేయపడిందామె "అది చిన్నపిల్ల"

 

    "కాబట్టే పది నిముషాలు కాక మూడు నిముషాలు గడుపుతానన్నది"

 

    ఆజానుబాహుడయిన ఆ వ్యక్తిని ఎదుర్కొనే సాహసం చేయలేకపోయిన డాక్టరు నిరుత్తరుడై చూస్తుండగానే వేన్ లోకి అడుగుపెట్టాడు శ్రీహర్ష.

 

    "ఎ... వ... రు..."

 

    ఒంటిపై చేయి పడగానే బడలికగా కళ్ళు తెరిచింది దృశ్య. ఆ చేతులు కూడనిచోట తాకుతున్నట్టనిపించడంతో తను హాస్పిటల్లో వున్నాననుకుందేమో "ఆడ డాక్టర్లు లేరా. అదేమిటి నా ఒంటిలో విషం వుందోలేదో చెక్ చేయడానికి ఒళ్ళంతా తడమాలా."

 

    ఉన్నట్టుండి కెవ్వుమంది దృశ్య బయట బామ్మగారి గుండెలదిరేట్టు."

 

    "కంగారుపడకు దృశ్యా నేను"

 

    వేన్ లోని మసక వెలుతురులో అప్పుడు చూసింది శ్రీహర్షని. "నువ్వా"

 

    "యస్ నేనే. నీ అహానికి జవాబుగా ముద్దు పెట్టినవాడ్ని. నీ తండ్రి అహంకారానికి జవాబుగా పోలీసులచేత టార్చర్ చేయబడ్డవాడ్ని."

 

    "ఎంత రాక్షసుడివి" కంపించిపోతూంది "నాకు విషమివ్వటమే గాక నా బ్రాని లాక్కుంటావా."

 

    "విషం లేదు కషాయం లేదు. నేను వచ్చింది నీ బ్రా తీసుకెళ్ళడానికి."

 

    "వ్వాట్" ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. "అంటే తను చావడంలేదూ..." గుండెలకు చేతులడ్డం పెట్టుకుని ఉద్విగ్నంగా చూసింది.

 

    "ఒక చిన్న అవసరంకోసం ఈ మాత్రం నాటకం ఆడాను మిస్ దృశ్యా. నిజానికి కావాలీ అంటే ఇప్పుడు నిన్ను అనుభవించగలను" కానీ నా ఉద్దేశ్యం నీ అహాన్ని ఓడించడమేతప్ప నిన్నలా గెలవడం కాదు."

 

    "ఎక్కడ, మా డాడీ ఎక్కడ" అరిచింది ఉక్రోషంగా.

 

    "మరో పదినిముషాలకుగాని ఈ చాయలకు రారు దృశ్యా. వేగం ఒడుపు అంటే ఏమిటో తెలియజెప్పాలనే హోండాలో అనుసరిస్తున్న మీ డాడీకి దూరంగా నిన్నిలా తీసుకొచ్చింది. బై" చీకటిలోకి నడవబోతూ క్షణం ఆగేడు డాక్టర్ని చూస్తూ "అంబులెన్స్ ముందు స్పృహతప్పి పడివున్న మీ డ్రయివర్ కి ఫస్టుఎయిడ్ చేసి కాన్షస్ లోకి రప్పించుకోండి"

 

    వెళ్ళిపోయాడు నిశ్శబ్దంగా.

 

    బామ్మగారు అవాక్కయి చూస్తూనే మనవరాల్ని చేరుకున్నారు. "అమ్మా దృశ్యా నువ్వు క్షేమంగానే వున్నావటే."

 

    దృశ్య జవాబు చెప్పలేదు.

 

    "డాక్టరుగారూ! మా మనవరాలు లేచికూర్చుంది"

 

    డాక్టరుకీ అర్థంకావడంలేదు.

 

    "నాకేం కాలేదు. అయామ్ ఓ.కె" అసహనంగా అరిచింది ఆమె.

 

    అంబులెన్స్ బ్లాంకెట్ ని గుండెలకు అడ్డంపెట్టుకున్న దృశ్య యిప్పుడు డాక్టరు గుచ్చి గుచ్చి చూస్తుంటే అస్సలు సహించలేకపోయింది.

 

    "అవునూ. వున్న పళాన విషమెలా విరుగుడయ్యిందే" మనవరాలి ఒంటిమీద కనిపించని బ్రా మరింత అనుమానాన్ని రేపుతుంటే బామ్మ అడిగేసింది యిక ఉండబట్టలేక "అవునూ... మూడు నిముషాలు అతనేం చేసాడు"

 

    "విషం విరుగుడికి మంత్రం వేసాడు"

 

    "అంటే పాముల నర్సయ్య టైపులో అన్నమాట"

 

    "అతనెవరు" విసుక్కుంది దృశ్య.

 

    "గొప్ప పాముల మంత్రగాడే పిచ్చిమొద్దూ. పాము కాటేసిన వార్తని ఎవరయినా చేయవేయగానే చెప్పినవాడి ఒంటిమీద చొక్కా చించేవాడట. పాముకాటు తిన్నవాడు టక్కున లేచి కూర్చునేవాడట. ఇప్పుడు నీ బ్రా ని అలాగే"

 

    "గ్రాండ్ మా..."

 

    'బ్రా' పోయినందుకుకాదు. పోయిందని బామ్మ గుర్తించినందుకు బోలెడంత కంగారుపడింది.

 

    శ్రీహర్షపై తిరుగులేని గెలుపుకోసం మొండిగా ఆలోచిస్తూంది దృశ్య.


                                    *  *  *


    "స్ల్పెండిడ్... .మిస్టర్ శ్రీహర్షా"

 

    తెలతెలవారుతుండగా ఇంటిలో అడుగుపెట్టిన శ్రీహర్షని చూస్తూ అభినందనగా అంది రేష్మి.

 

    "తిరిగి రావేమో అనుకున్నా... కానీ అసాధ్యాన్ని సాధ్యం చేసి మీ డైనమిజాన్ని నిరూపించారు. ఆశ్చర్యపడకండి, రాత్రి మిమ్మల్ని అనుసరించిన రాణా జరిగింది చెప్పాడు."

 

    అతనికి కావాల్సింది ఈ అభినందన కాదు.

 

    జూలీని చూడడం.

 

    "బ్రేవో మిస్టర్ శ్రీహర్షా... చెప్పి మరీ ప్రత్యర్థిపై దెబ్బ తీయగలిగిన మీ శక్తికే కాదు. మీ యుక్తికి నా జోహార్లు. ఒక బలమైన వ్యవస్థలో అడుగుపెట్టగలరో లేదో అని శంకించిన నా భయాన్ని ఒక్క రాత్రిలో తుడిచేయగలిగిన మీరే నా ఆశయాన్ని సాధించగలిగే ఒకే ఒక్కవ్యక్తిగా అంగీకరిస్తున్నాను. కమాన్ లెటజ్ సెలబ్రేట్."

 

    రోజులతరబడి పేరుకున్న నిస్త్రాణ చెరిగిపోతున్నట్టు ఆమె ఉత్సాహంగా మాట్లాడుతుంటే నిరాసక్తంగా తల తిప్పుకున్నాడు.

 

    ఇక జూలీ గురించి అడిగేవాడే.

 

    అదిగో అప్పుడు చూశాడు టీపాయ్ పై వున్న దినపత్రికని.

 

    "ఏయస్పి శమంత్ అదృశ్యం."

 

    యధాలాపంగా పేపరందుకున్నాడు. "ఇది మా ప్రతీకారచర్య. నిన్న రాత్రి శమంత్ ని అపహరించిన ఉగ్రవాదుల హెచ్చరిక."

 Previous Page Next Page