Read more!
 Previous Page Next Page 
సినీ బేతాళం పేజి 3

                                 

        
                         
    "టామిళ్ ఫీల్డు లో పాప అని ఓ చేప కళ్ళమ్మయి ఉండేది. ఆ పిల్ల తెగ సెక్సీగా ఉండటం చేత ఆ పిల్ల నటించిన సినిమాలన్నీ శతదినోత్సవాలు చేసుకోసాగినాయ్. అజ్జూసి ఏనాటి కయినా ఓ శతదినోత్సవం సిన్మా తీయాలని ఓ మంచి కంకణం కట్టుకున్న ఇ తెలుగు నిర్మాత ఆ పాపను బుక్ చేద్దామని ముచ్చటపడి వాళ్ళింటికెళ్ళాడు.
    "నీరేటెంత ?" అన్నాడు చెక్ బుక్ తీసి.
    "రెండు లక్షలు ' అంది పాప కారాకిళ్ళీ నముల్తూ.
    'అమ్మో ! రెండు లక్షలే! రెండు లక్షలు నీకిచ్చే బదులు రెండు లోబడ్జెట్ సినిమాలు పూర్తి చేయవచ్చు కదా!" అన్నాడు నిర్మాత.
    పాప నిర్మాతను చూసి అరవంలో జాలిపడింది. కాసేపు జాలిపడ్డాక "పిచ్చివాడా" అంది అరవంలో ఇంకా జాలిగా.
    "అలా వూరికే జాలిపడకు! నాక్కావలసింది ప్రేక్షకుల జాలి గాని ఆర్టిస్టుల జాలి కాదు. అయినా నేనేం అవార్డ్ పిక్చర్ తీశానని నన్ను చూసి ఊరికే అలా జాలి పడుతున్నావ్!" అన్నాడు నిర్మాత దుఃఖం ఆపుకుంటూ.
    "లేపోతే ఏమిటి? లో బడ్జెట్ సినిమాలు నాలుగు తీసినా ఒక లోనేక్ జాకెట్' పిక్చరు అడినన్ని రోజులాడవు. కావాలంటే ట్రై చేసుకో" అంది పాప నవ్వుతూ. హటాత్తుగా నిర్మాతకు జ్ఞానోదయమయింది. లోనేక్ జాకెట్ అని రెండు సార్లు లోలోపల కళ్ళు మూసుకుని జపించాడు. అ తరువాత కళ్ళు విప్పిచూస్తే ఆ పిల్ల క్కూడా లోనెక్ జాకెట్ కనిపించింది.
    అయితే అంతలోనే "మరి మా తెలుగు హీరోయిన్లకు కూడా లోనెక్ జాకెట్లున్నాయి కదా! ఈ అరవ పిల్ల నెందుకు తీసుకోవాలీ" అని ఓ అనుమానం కాసేపు డాన్స్ చేసింది గానీ మన వాళ్ళకు పొరుగింటి 'లోనెక్ జాకెట్' అంటేనే ఇష్టం కదాని గుర్తుకొచ్చి వెంటనే చెక్కు రాసి పాప చేతికొచ్చేశాడు. సినిమా షూటింగు కోడైకెనాల్లో మొదలయింది.
    ఆ సినిమాలోని కుర్ర హీరో కూడా ఒకప్పుడు మామూలు ప్రేక్షకుడే కనుక, ప్రేక్షకులందరికీ పొరుగింటి పుల్ల కూరే రుచి కనుక ఆ 'లోనెక్ జాకెట్' పాపను చూసి సరదా పడ్డాడు. ఆ పాప క్కూడా అంతవరకూ ముస్సలి హీరో ఆ పక్కన నటించి ఎలర్జీ వచ్చేయడం మూలాన అ కుర్ర హీరో అంటే మోజయిపోయింది. రెండో రోజు ప్రేమ దృశ్యాలు చిత్ర్రీకరిస్తుంటే ఇద్దరూ గాడంగా కౌగలించుకుని డైరక్టర్ 'కట్ కట్ కట్ కట్' అంటూ గావు కేకలేసినా గాని కౌగలి వదల్లేదు. యూనిట్ వాళ్ళందరూ కలిసి ఇద్దరినీ లాగడానికి ప్రయత్నించినా ఏ మాత్రం లాభం లేకపోయింది. నిర్మాత "బాబోయ్ నా షెడ్యూల్ అప్సెట్ అయిపోతోంది - దేవుడోయ్" అంటూ జుట్టు పీక్కోడం మొదలు పెట్టాడు. ఇలా లాభం లేదని డైరక్టర్ అర్జంట్ కాల్ బుక్ చేసి సెన్సార్ వాళ్ళకి చెప్పాడీ సంగతి. "మీరే వాళ్ళని విడదీయాలి - మమ్మల్నీ రక్షించాలి" అన్నాడు ప్రాధేయపడుతూ. మా వాళ్ళు ఈ వార్త వింటూనే ఖంగారు పడిపోయారు. ఆ విషయం ప్రజలకు తెలిసిందంటే దేశమంతా కొడైకెనాల్ వెళ్ళి ఆ దృశ్యం ఎక్కడ చూసేస్తుందోనని దిగులు పడ్డారు. వెంటనే ఓ హెలికాప్టర్ ను రానూ పోనూ మాట్లాడుకుని కొడైకెనాల్ వెళ్ళి , హెలికాప్టర్ ని సరిగ్గా ఆ హీరో హీరోయినూ పైన ఆపి, అందులో నుంచి వారిద్దరి మధ్యకూ దూకి వాళ్ళను విడదీశాను.
    ఆ హీరోకి, హీరోయిన్ కి మా సెన్సార్ వాళ్ళను చూస్తె ఒళ్ళు మండిపోయింది.
    "మీకు పిల్లా మేకా లేరూ? పవిత్ర ప్ర్రేమకు విఘాతం కలిగిస్తారా?" అంది హీరోయిన్ శాపం పెట్టె ఫోజులో.
    మేము విలన్లాగా వికటంగా నవ్వాము.
    "పిచ్చిదానా! సెన్సార్ వాళ్ళకి ప్రేమలేమిటి? పిల్లి మేకను కావలించుకున్నా, మేక ఎలుకను కౌగలించుకున్నా, తల్లి కొడుకుని కౌగలించుకున్నా , తాత మనవరాలిని కౌగలించుకున్నా - మేము సహించం! సహించం!!" అన్నారు హీరోయిన్ తో.
    "మీ తిక్క ఎలా కుదర్చాలో మాకు తెలుసు" అంది హీరోయిన్. అని ఆ రాత్రి మరో హోటల్లో గది తీసుకుని ఆ కుర్రాడిని తెల్లార్లూ ప్రేమించింది. తెల్లారుజామున వాళ్ళ గది తలుపు తట్టేసరికి మళ్ళీ సెన్సార్ వాళ్ళేమోనని కోపంగా తలుపు తెరిచిందామే.
    ఎదుర్గా యెల్లో రంగు బట్టలేసుకున్న పెద్దమనిషి నవ్వుతూ నమస్కరించాడు.
    "ఎవర్నువ్వు ?" అందామె కోపంగా.

 Previous Page Next Page