మరుసటిరోజు ఉదయాన్నే ఇన్ స్పెక్టర్ చతుర్వేది రాత్రి హైవేలో ఏదో లారీ గుద్దడం వలన స్పాట్ లో అక్కడి కక్కడే చనిపోయాడు అన్న వార్త... మెయిన్ హెడ్డింగ్స్ లో చోటు చేసుకుని ఉండడం చూసిన జయచంద్ర విరగబడి నవ్వుకున్నాడు.
తను దొంగనోట్లు మార్పిడి చేయడం ద్వారా అక్రమ సంపాదన ఆర్జిస్తున్న విషయం తెలిసిన వాళ్ళు ఎవరూ ఇప్పుడు లేరు.
ఈ సమాజాన్ని డబ్బుతో లేదా రాజికీయంతో మాత్రమే శాసించగలమన్న నమ్మకం అతనిది.
అందుకే ఆ రోజు నుంచీ వెనుతిరిగి చూడలేదు.
అంచెలు అంచెలుగా దొంగనోట్ల వ్యాపారంలో ఎదిగిన జయచంద్ర లక్షాధికారి అయ్యాడు.
ఈ రోజు అతను నగరంలో ఎన్నో వ్యాపారాలకు అధిపతి.
* * * *
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం__
హోంమంత్రితో పాటు ముఖ్యమైన పోలీసు అధికారులు అందరూ సమావేశమయ్యారు.
"డియర్ ఆఫీసర్స్... నగరంలో విచ్చలవిడిగా కౌంటర్ ఫీట్ కరెన్సీ రాజ్యం ఏలుతుందని ఇంటిలిజెన్స్ రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. నగరంలోనే సంచరిస్తున్న దొంగనోట్ల ముఠా వ్యక్తులతో ఎవరినీ మనం పట్టుకొనలేకపోయాం. వాళ్ల వ్యాపారం మాత్రం యదేచ్చగా జరిగిపోతుంది_" అన్నాడు హోం మంత్రి సీరియస్ గా.
"సర్__ నిరంతరమూ వాళ్ళకోసం నిఘావేసి వున్న ఫలితంగానే ఇన్ స్పెక్టర్ చతుర్వేదిని మనం పోపొట్టుకున్నామనిపిస్తుంది. లారీ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయినట్టు ప్రజలను ప్రభుత్వాన్ని నమ్మించాలని ప్రయత్నించినా మన డిపార్ట్ మెంట్ ను నమ్మించడం చాలా కష్టం. ఎంతో సీనియర్, డేరింగ్ ఇన్ స్పెక్టర్ అలా అసహాయముగా లారీ ప్రమాదంలో చనిపోయాడంటే మనం నమ్మలేం. అతని మరణం వెనుక ఎవరో ఉన్నారు. ప్రమాదకరమయిన రహస్యం ఏదో అతను తెలుసుకోబట్టే అతనని లేకుండా చేశారు వాళ్ళు_" అన్నాడు ది.జి.పి.
"ఎవరు వాళ్ళు?"
"అదే పరిశోధిస్తున్నాం సర్... ఆ రోజు రాత్రి నారాయణ్ గూడా పోలిస్ స్టేషన్ దగ్గర చతుర్వేది కొద్దీసేపు ఆగి వెళ్ళాడట... అతనని ఆఖరి సారిగా చూసింది అక్కడి స్టాఫ్ మాత్రమే. ఒక ముఖ్యమయిన పనిమీద వెళుతున్నట్టు చెప్పాడట. తెల్లవారే సరికి అతని శవం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ ప్రక్కనే ఉన్న రోడ్ పై లారీ క్రింద పది నజ్జు నజ్జు గా మారిపోయి దర్శనమిచ్చింది." డి.జి.పి. చెప్పడం ఒక నిమిషం ఆపాడు.
"ఇట్స్ ఆల్ రైట్... నగరంలోని అన్ని స్టేషన్ లనూ ఎలర్ట్ చేయండి. ఈ దొంగ నోట్ల వ్యవహారంలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమిస్తే ఏమయినా ఫలితం వుంటుందేమో!"
హోం మంత్రి మాటలకు మిగిలిన పోలీస్ అధికారులు కూడా సంసిద్దతను వ్యక్తం చేశారు.
"గుడ్ డెసిషన్ సర్__ నగరంలో జరిగే క్రైమ్ లకే తల బొప్పికడుతుంది. క్షణం కూడా తీరికలేని ఇలాంటి పరిస్థితులలో ఒక సమర్ధుడయిన వ్యక్తికి అలాంటి బాధ్యతను అప్పగించడం మంచిదే..." డి.జి.పి మెచ్చుకున్నాడు.
"అలాంటి ఆఫీసర్ ఎవరున్నారు మనలో_"
ఆ మాట అనడం ఆలస్యం డిజిపితో సహా అందరి చూపులూ ఒకే ఒక వ్యక్తి పై నిలిచాయి.
అది గమనించి ఆశ్చర్యపోయాడు హోంమంత్రి.
"హూ ఈజ్ దట్?"
"ఏ సి పి వీరేష్..."
డిజిపి అభిప్రాయం అర్ధం అయిన వీరేష్ లేచి నిలబడి హోంమంత్రి కి ఠక్కున సెల్యూట్ చేశాడు.
అతనిని గమనించి మెచ్చుకోలుగా తల ఊపాడు హోంమంత్రి.
"నిన్ను గురించి నేనూ విన్నాను మై బోయ్... ఇట్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ కేస్ ఫర్ యూ... ఎలాంటి ఆధారాలు లేవు... బట్.. ఆ దొంగనోట్ల ముఠా నాయకుడు ఎంత వున్నత పదవిలో వున్న వాడయినా సరే అతనని చట్టానికి పట్టిచ్చే బాధ్యతను నీకు అప్పజెబుతున్నాను."
"ఓకేసర్...ఐ విల్ డూ ఇట్..."
ఇన్ స్పెక్టర్ చతుర్వేది చనిపోయిన కేసు ఫైలు తీసుకుని ఆ గదిలో నుంచి నిష్క్రమించాడు ఏ సి పి వీరేష్.
* * * *
వివేకానంద ఆడిటోరియం.
నియోన్ లైట్ల వెలుగులో కళ కళ లాడిపోతుంది.
ఆ రోజు అక్కడ కాలేజీ స్టేట్ కల్చరల్ మీట్ జరుగుతుంది.
ఆహుతులు అందరిలోనూ ఆడిటోరియం కోలాహలంగా వుంది.
బ్యాగీలు__ చుడీదార్ లు __ లూజు ఫాంట్లు__ టైట్ షర్ట్ లు __
అందంగా అలంకరించుకుని వున్న అమ్మాయిలను అల్లరి పెట్టే కాలేజీ అబ్బాయిలు.
ప్రతి ఐటమ్ కు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి.
'తారాశశాంకం' లో తార పాత్ర వేస్తున్న రజని ఏకపాత్రాభినయం హైలెట్ అని తమలో తామే చర్చించుకుంటున్నారు కొందరు.
ఆమె అందాన్ని... అందానికి మించిన నాట్యాన్ని చూడడానికి ఉత్సాహంగా ఉన్నారు.
గ్రీన్ రూమ్ లో రజని స్వయంగా తుదిమెరుగులు దిద్దుకుంటుంది. అప్పటి వరకూ జానపద నృత్య ప్రదర్శన తో అలరించిన వ్యక్తి తన ప్రోగ్రామ్ అయిపోగానే మేకప్ తొలగించుకొనడానికి గ్రీన్ రూమ్ లోకి అడుగు పెట్టాడు.
అతను రవితేజ... ప్రముఖ వ్యాపారవేత్త ఆనందరావు ఏకైక పుత్రరత్నం!
పరాయి వ్యక్తి ఉన్నాడనే బెరుకు లేకుండా రజని డ్రస్ ఛేంజ్ చేసుకొనసాగింది.
యధాలాపంగా ఆమె వేపు చూసిన రవితేజ కన్నులు చెదిరిపోయాయి.
అలంకరణలు అన్నీ ఒకటొకటిగా తీసేస్తుంది ఆమె!
అతని వంకే ఓరగా చూస్తూ చీర కుచ్చెళ్ళపై చేయి వేసిన మరుక్షణంలోనే ఆమె కళ్ళ ముందు చీర గుట్టగా పడిపోయింది. ఇప్పుడు ఆమె ఒంటి మీద బ్లౌజ్... లంగా మాత్రమే ఉన్నాయి.
రజని యూనివర్సిటీ బ్యూటీ...
మగవాళ్ళు ఆశగా ఆమె వేపు చూస్తూ పెదవులు చప్పరింఛే అందం ఆమెది... ఎంతో గోప్యంగా దాచి ఉంచుకున్న శరీరపు ఒంపులన్నీ ఇప్పుడు ఎంతో దగ్గరగా కనిపిస్తున్నాయి.
శంఖంలాంటి ఆమె కంఠం చుట్టూ మెరిసే సన్నటి గోల్డు చెయిన్ రెండు స్థనాల మధ్య వేలాడుతుంది. ఆమె ముందుకు ఒంగినప్పుడు సన్నటి నడుము చుట్టూ ఏర్పడ్డ పలుచటి ముడతలు మరింత ఆకర్షనీయంగా వున్నాయి.
యవ్వనం అంతా అక్కడే కేంద్రీకృతమై వుంది అనిపించేలా లోతయిన నాభి...
లేత గోధుమ వర్ణపు శరీర ఛాయా... పాదాలకు మువ్వల పట్టీలు.... ఓహ్... ముమ్మూర్తులా ఆమె అజంతా శిల్పాన్ని పోలినట్టు వుంది.
ఆసాంతం ఆమె రూపాన్ని చూస్తున్న రవితేజకు సభ్యత గుర్తుకు వచ్చి చట్టుక్కున తల తిప్పుకున్నాడు.