"చూశారుగా-మీరే అన్నారు_పౌర ధర్మమని! మైక్రో ఫిల్మ్ ను పోలీస్ హేండోవరు చేసినంత మాత్రాన మీ బాధ్యత తీరిపోయినట్టు కాదు! నిజానికి, అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుంది! టెర్రరిస్టుల బారి నుంచి ఇకపై మిమ్ము మీరు రక్షించుకోవాలి. కనుక, ఆత్మ రక్షణార్ధం ఒక రివాల్వరు కోసం అప్లికేషన్ పెట్టుకోండి!"
"మై గాడ్! మీతో పరిచయమే నన్నీ స్థితికి తెచ్చింది. ఇక, 'గయోపాఖ్యానము' నాటకంలో గయునిగా నేనూ భయంతో చస్తూ బ్రతుకుతుండవలసిందేనా? మొత్తానికి మీ పోలీసు శాఖ నన్ను సుఖంగా బతకనిచ్చేట్టులేదు!" ఆందోళనగా అంటూ దీర్ఘంగా నిశ్వసించింది డాక్టరు సునంద.
ఆమె ఆలోచనలు పరిపరి విధాలపోతున్నాయి. భూత, భవిష్య, వర్తమానాలను అవలోడిస్తున్నది.
* * *
పురాతన భవనం. పూర్తిగా శిథిలమయిన దాని కిందే జమ.
తలుపులు కిటికీలు అన్నీ లోపల వైపు నుంచి గడియపెట్టి వున్నాయి.
అంటే, నివాసయోగ్యం కాని ఆ పురాతన భవనంలో నర సంచారం వున్నదన్న మాట!
భవనం చుట్టూ కాంపౌండ్ వాల్ కాని వైర్ ఫెన్సింగ్ కాని లేవు. కాపలా లేదు.
అలా అనుకుని ఎవరైనా ఆ ప్రాంగణంలోకి అడుగిడితే వారి ఆయువు మూడినట్టే....
భవనం చుట్టూ అడుగడుగునా "లేండ్ మైన్స్" అమర్చి వున్నాయి!
భవనం లోపలి నుంచీ నిశబ్దాన్ని భగ్నం చేస్తూ మనిషి మూలుగు వినిపిస్తున్నది.
ఆగి ఆగి, క్షణం క్షణం పెరుగుతున్నది ఆ మూలుగు శబ్దం. అది మృత్యుహేల....
ఒకానొక గదిలో బంధితురాలై వున్న ఆషాకు అప్పుడప్పుడే స్పృహ వస్తున్నది.
అడవిలో కళ్ళకు గంతలుకట్టి, తీసుకు వచ్చి జీప్ లో కూర్చోపెట్టడం వరకే ఆషాకు తెలుసు. ఆ పైన ముక్కు దగ్గర ఏదో వాసన చూపడంతో స్పృహ కోల్పోయింది.
పక్క గది నుంచి మూలుగు మరింత హెచ్చుగా వినిపించడంతో పరిస్థితి అర్ధమయింది ఆషాకు. తను, కిరణ్ కుమార్ బందీలై వున్నట్టు గ్రహించింది.
కిరణ్ కుమార్ ను ఇంటరాగేట్ చేస్తూ హింసిస్తున్నట్టు అర్ధమయింది ఆషాకు.
"ఆయన్ని హింసించవద్దు, ప్లీజ్...." ఆషా ఆక్రోశించింది.
గది తలుపులు భళ్ళున తెరచుకున్నాయి. కమాండరు ప్రత్యక్ష మయాడు. అతని కనులు అగ్ని గోళాలు.ఆకృతి భయానకం.
గొలుసులతో వ్రేలాడుతున్న కిరణ్ కుమార్ శరీరం నజ్జునజ్జుఅవుతున్నది. సాయుధుడు కొరడాను ఇంకా ఝళిపిస్తూనే వున్నాడు.
"ప్లీజ్....ఆయన్ని కొట్టవద్దు...." ప్రాధేయపూర్వకంగా మరల అరచింది ఆషా.
కమాండరు క్రోధంగా చూశాడు. సాయుధులకు సంజ్ఞ చేశాడు.
వెంటనే కిరణ్ కుమార్ కట్లను వూడదీసి ఆ శరీరాన్ని ఆషా గదిలోకి దాదాపు విసిరివేశారు. అక్కడి ఆషాను ఇక్కడికి బరబరా ఈడ్చుకు వచ్చి గొలుసులతో కట్టేశా.
సాయుధుడు కొరడాను అందుకున్నాడు.
ఊహించని ఈ విపరిణామానికి మ్రాన్పడిపోయింది ఆషా.
ఇంటరాగేషన్ పేర ఏమి జరగనున్నదో ఊహించుకుని, వణికి పోయింది. ఆకులా అల్లల్లాడిపోయింది.
ఊహాగానాలు వేరు వాస్తవం వేరు అని ఆమె ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నది.
వీళ్ళ స్థావరానికి పరిశోధనా దృష్టితో అనాలోచితంగా వచ్చి చేజేతులా చిక్కులు తెచ్చిపెట్టుకున్నది తనే! ఇప్పుడు భయంకరమైన స్థితిలో చిక్కుకుపోవలసివచ్చింది.
నిజాన్ని కక్కించాలానే పేర తన శీలాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తే....
వంటి మీద వున్న చీర రవిక చీలికలై తన శరీరాన్ని దాచలేక పోతున్నాయి....
కమాండరు దృష్టి ఆమె ఒంపు సొంపుల మీద పడనే పడింది....
అతని చూపుల నుంచి తప్పించుకునే ఉద్దేశంతో తల వాల్చేసుకుంది ఆషా.
చేతిలోని రైఫిల్ ను సహచరునకు ఇచ్చి, ముందుకు కదిలాడు కమాండరు.
పిచ్చిపిచ్చిగా అరుస్తున్నది ఆషా. అదేదో పీడకలలాగా భ్రమిస్తున్నది.
పక్కగదిలో జరుగుతున్న పైశాచికం గురించి లీలామాత్రంగా ఊహించుకోగలుగుతున్నాడు కిరణ్ కుమార్. లేవడానికి శక్తిని కూడగట్టుకుంటున్నాడు. స్వాధీనంలో లేని శరీరం....