కొంపదీసి ఈ అహంకారపు ఆడపిల్లకి కడుపు అయ్యిందా అని కూడా అనుకుందికాని ధైర్యంగా ఆడలేకపోయింది.
నానమ్మపై విరుచుకుపడేదే.
సరిగ్గా అప్పుడు ఫోన్ రింగయింది.
ఇది మరీ చికాకుగా తోచడంతో విసుగ్గా అందుకుంది దృశ్య "ఎవరు?"
"నేను"
"నేనే అంటే"
"ఆరోజు నిన్ను ముద్దు పెట్టుకున్నవాడ్ని. ఆ తర్వాత నీ ఒంటికి అతుక్కున్న బ్రా స్ట్రాప్ పట్టుకుని నీ సిబ్బంది నుంచి క్షేమంగా తప్పించుకున్నవాడ్ని."
ఉక్రోషంగా నిలువునా కంపించిపోయిందామె "అసలు అర్థరాత్రి నాకిలా ఫోన్ చేయడానికి నీకెన్ని గుండెలు"
"ఆ విషయం అడగాల్సింది నన్నుకాదు. నీ గుండెలపై మెరుస్తున్న వజ్రాల్ని."
గభాలున వక్షద్వయానికి ఓచేతిని అడ్డం వుంచుకుంది. ఈరాత్రి అందరిదృష్టి వాటిపైనే పడటం చాలా దురదృష్టకరంగా అనిపించడంతో "నీ అంతు చూస్తాను" అంది అక్కసుగా.
"చూడటానికి నువ్వుంటేగా."
"తెల్లవారేసరికి ఉండనిది నేనుకాదు"
"సరిగ్గా విను మిస్ దృశ్యా. ఎందుకంటే ఇందాక నువ్వు తాగావే అందులో నేను అద్భుతమైన విషం కలిపాను కాబట్టి."
నిశ్చేష్టురాలయింది. "అబద్ధం. నువ్వు... .నువ్విక్కడికెలావచ్చావ్. హార్లిక్స్ లో విషం ఎలా కలిపావ్."
"నీ బ్రా టిప్స్ పై వున్న డైమండ్స్ ని అక్కడకు వచ్చే చూసాను దృశ్యా"
మరింత ఆందోళనపడింది అతడి లాజిక్ సవ్యంగా అనిపించడంతో-
"యూ సీ మిస్ దృశ్యా. ఆ విషం ఎంత ప్రమాదకమైనదీ అంటే ముందు రెండు గంటలపాటు మత్తుగా నిద్రపడుతుంది"
'నిజమే' సుమారు గంటన్నరపాటు చాలా మత్తుగా నిద్రపోయింది.
"తర్వాత కడుపులో మొదలయిన నొప్పే క్రమంగా గుండెలదాకా ప్రాకుతుంది."
చాలా సుకుమారంగా పెరిగిన దృశ్యకి వింటుంటే అది నిజంలాగే అనిపిస్తూంది.
"ఆ తర్వాత చేతులు కంపిస్తాయి. ఆయాసంతో గుండెలు ఎగిరెగిరి పడతాయి. కొద్దిగా కళ్ళు తిరిగినట్టనిపిస్తూంది. దానితో నీ ఒంటిపై నీకు..."
ఒంటిపై' అన్నపదం ఆమెను ఎంత ఉద్విగ్నపరిచిందీ అంటే యిందాక డేవిడ్ కూడా అలానే 'ఒళ్ళు' గురించి మాట్లాడటం జ్ఞప్తికొచ్చింది. అంటే డేవిడ్ ఏదో సమాచారం సేకరించాడన్న మాట.
నిజంగానే చేతులు కంపిస్తున్నాయి.
అంతకన్నా నిజంగా గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి.
"గ్రాండ్ మా" దృశ్య కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలుతున్నాయి.
"నాకదోలా అవుతూంది."
"అంటే వాంతవుతున్నట్లుగా ఉందా" వృద్ధురాలికి యిందాకటి తన అనుమానం బలపడిపోయింది "పుల్లనిదేదన్నా రుచి చూడాలనిపిస్తుందా."
"అదికాదు... నాకు కళ్ళు తిరుగుతున్నాయి."
"అమ్మో! అయితే అదే" గ్రాండ్ మా కంపించిపోతూంది. "నిన్ను కాదే వయసొచ్చిన నీకు పెళ్ళిచేయకుండా ఇలా పెంచిన నా కొడుకుననాలి".
మామూలప్పుడైతే నానమ్మ అలవాటుగా ఉపయోగించే ఇలాంటి పదాలకి తూర్పూరబెట్టేసేదే. కాని యిప్పటి స్థితి వేరు.
"ఆ పెడబొబ్బలు చాలు గ్రాండ్ మా... ముందు నా సంగతి చూడవే. నా ఒంటిపై విష ప్రభావం."
తూలి పడబోతున్న మనవరాల్ని పట్టుకున్న ఆ వృద్ధురాలు పెట్టిన కేకతో ఆ భవంతి నిద్ర లేచింది.
సవ్యసాచితో బాటు సెక్యూరిటీ యిన్ ఛార్జి డేవిడ్ కూడా పరుగెత్తుకు వచ్చాడక్కడికి.
సరిగ్గా ఇదే సమయంలో.
ఫోన్ క్రెడిల్ చేసిన శ్రీహర్ష పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో నుండి బయటికి నడవబోతూ టక్కున ఆగేడు.
పోలీస్ పెట్రోలింగ్ వేన్ లో నుండి దిగిన పోలీసులు అతడికి అభిముఖంగా నిలబడి వున్నారు.
"డేమిట్"
ఇలాంటి సన్నివేశాన్ని వూహించని శ్రీహర్ష తన పథకం అర్ధాంతరంగా ముగిసిపోతున్నందుకు స్తబ్థుడైపోయాడు.
నేర వ్యవస్థలో అసాధారణమైన ప్రజ్ఞగలవాడే.
కాని అనూహ్యంగా ఓటమికి చేరువైపోయాడు.
క్షణాలు టెన్షన్ గా గడుస్తున్నాయి.
"ఎవర్నువ్వు?"
శ్రీహర్షని ఆపాద మస్తకం పరిశీలిస్తూ అడిగాడు యస్సై "ఈ వేళలో యిక్కడెందుకు తారట్లాడుతున్నావ్. స్పీక్."
వ్యవధి లేదు. వెంటనే అక్కడ నుండి తప్పించుకోవాలి. నిజానికి అది సమస్యకాదు. కాని తను బలాన్ని ప్రదర్శించే సమయం కాదది.
"మాటాడవేం" రెండడుగులు ముందుకేసాడు యస్సై.
శ్రీహర్షని వేన్ లోకి నెట్టాలని నలుగురు కానిస్టేబుల్స్ సమీపిస్తుండగా అమెరికన్ హాస్పటల్ క్లాక్ టవర్ రెండు గంటలు కొట్టింది.
ఒక చిన్న ఆధారం దొరికిందేమో వెంటనే అన్నాడు శ్రీహర్ష "అర్జెంట్ గా మెడికల్ ఎయిడ్ కావాలి".
"అది టెలిఫోన్ బూత్ లో దొరుకుతుందనుకున్నావా?" సర్కాస్టిక్ గా అన్నాడు యస్సై. "యూసీ మిస్టర్."
"ప్రముఖ పారిశ్రామికవేత్త సవ్యసాచిగారు మీకు తెలిసే వుంటుంది."
ఆ పేరు వినగానే కొద్దిగా తగ్గేడు యస్సై "అతను నాకు తెలియటానికి, నువ్విక్కడ వుండటానికి కనక్షనేమిటి?"
సవ్యసాచిగారి కూతురు ప్రాణాపాయ స్థితిలో వుంది. అత్యవసరంగా ట్రీట్ చేస్తే తప్ప బ్రతకదు. దానికోసం అమెరికన్ హాస్పటల్ అంబులెన్స్ కి ఫోన్ చేస్తున్నాను.
అంతా గందరగోళంగా వుంది.
"కావాలంటే మీరు నాతో వచ్చి చెక్ చేసుకోవచ్చు."
"కాని" యస్సై ఏదో అడగబోయాడు.
"సందేహం తర్వాత తీర్చుకోవచ్చు మిస్టర్ యస్సై. సాధ్యమయితే అంబులెన్స్ వేన్ రప్పించి సహకరించండి.