Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 28

                                 

    రొమాన్స్  లో కొన్ని వందల సార్లు అవకాశాన్ని కనుక్కొని, రకరకాల ప్రయత్నాలు చేసి, విజయం సాధించినా సరే దానిని చివరిక్షణంలో వదిలేసి, మరొక అవకాశం కోసం ప్రయత్నం చేస్తారు.

     వీరి వ్యక్తిత్వం,తెలివి వుండే సర్వ విషయాలగురించి చమత్కారంగా చర్చించగలిగే నైపుణ్యం వీరికి వుంటుంది.

     ప్రేమకోసం వేటలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం నచ్చి, చివరికి ఎవర్ని ప్రేమించాలో తెలియక తికమక పడతారు.

     వీరు స్త్రీలయితే పొద్దున్న  పక్కింటావిడకి వంటలో సహాయం చేసి, మధ్యాహ్నం  చిన్ననాటి స్నేహితురాలికి ఫోన్ చేసి ముచ్చట్లు చెప్పి, మళ్లీ రాత్రి పిల్లలకి ఎంతో క్లిష్టమైన పాఠాలు చెప్పి... ఇలా రకరకాలుగా దినచర్యని మార్చుకోగల సమర్దులు.

    పరిగెత్తగలిగి నడవటం, మాట్లాడగలిగి మౌనంగా వుండటం,సహాయం చేయగలిగి వుండి చేయకపోవటం లాంటి పనులు వీరి స్వభావానికి విరుద్దం.

     వీరితో, వీరి ఆలోచనా వేగంతో సమంగా పరిగెత్తి, వీరికి సహాయం చేస్తూనే, వీరి చంచల స్వభావాన్ని తగ్గించగలిగితే, వీరికి స్నేహితుడు/  ప్రియుడు/ ప్రియురాలు కావాలనుకునేవారు చాలా అదృష్టవంతులవుతారు.

     3. అస్తవ్యస్థపు రైట్ మార్జిన్:

    ఒక వాక్యం పేజీ చివరి వరకూ వ్రాసి, మరొక వాక్యం కొద్దిలో  ఆపుచేసి, తరువాతిలైను ప్రారంభించే చేతివ్రాత వున్నవారు అనుకున్న విషయాన్ని కష్టపడి నిజాయితీగా, సాధించుకునే వారుగా గుర్తింపబడతారు. వీరు చిన్న చి్నన విషయాలకు తాలా ప్రాముఖ్యత ఇస్తారు. తాము చేయదలచుకున్న పనిని ఎవరేమనుకుంటారోనన్న భయం లేకుండా చేస్తారు.

     మొదటిసారి వీరిని ఎవరైనా చూస్తే, అంత గుర్తుంచుకో దగ్గవ్యక్తిగా కనిపించకపోవచ్చుగానీ తరువాత్తరువాత మాత్రం వీరి గొప్పదనాన్ని గుర్తిస్తారు.

    వీరని తెలివి తక్కువ వారిగానూ, బుద్దావతారాలుగానూ పరిగణించే కొంతమంది వీరు చేసే హేతుబద్దమైన వ్యాఖ్యలు, చర్చలు వినడం సంభవిస్తే తమ అభిప్రాయం తప్పు అన్ననిర్ణయానికి తప్పకుండా వస్తారు.

    వీరిని వీరు అవసరమైన దానికంటే  అతిగా అంచనా వేసుకుంటారు.అయినా బరువు బాధ్యతలను ఆనందంగా స్వీకరిస్తారు.
    ఆర్దిక సంతృప్తిని,గౌరవాన్ని  ఇచ్చే ఏ పనినైనా వీరు సంతోషంగా చేస్తారు.

     వీరి పర్సులో తప్పకుండా వీరికిష్టమైన వారి ఫోటో ఉంటుంది. వివాహ వ్యవస్థపట్ల, సంసార బంధాల పట్ల వీరికి అపారమైన నమ్మకం వుంటుంది.

    వీరు నలుగురితో కలవడానికి జంకకపోయినా, వీలైనంతవరకు నలుగురికీ దూరంగా వుండటానికే ప్రయత్నిస్తారు.

     ఏ విధమైన సంభాషణల్లోకానీ, చర్చల్లోకానీ అవతలివారిని ఓడించాలన్న తపన వీరిలో సాధారణంగా వుండదు. తమ తెలివితేటలు ప్రదర్శించటానికి అవతలివారు కొలమానంకాదు, దానికి వేరే మార్గాలున్నాయి అన్న అభిప్రాయంతో వుంటారు.

     తప్పుడు వాదనలు ఖంచించే ధైర్యం ఉన్నాసరే, అనవసరమైన విషయాల జోలికి పోకుండా నిర్లిప్తంగా ఉండిపోతారు. అలాగే తమకి ఏమాత్రం తెలియని విషయాల గురించి ఎప్పుడూ నోరు జారరు.

     పగటి కలలు కనటం వీరి కిష్టం వుండదు. అలా అని కలలు కనటం ఇష్టం లేదని కాదు. రాత్రిళ్లు ఒక అందమైన కలని కనాలంటే పగలంతా కష్టపడాలి అన్న సత్యాన్ని ఆకళింపుచేసుకున్న వారై వుంటారు.

     చట్ట విరుద్దమైన పనులు చేయటానికి వీరెప్పుడూ ఇష్టపడరు. సంఘంలో, సమాజంలో గౌరవాన్ని మన్నన, మర్యాదల్ని న్యాయపూరితమైన దారుల్లో పొందటానికి ఇష్టపడతారు.

          

     డబ్బు విషయాల్లో వచ్చిన అవకాశాన్ని ఎన్నడూ జారవిడుచుకోరు. అలాఅని చెప్పి నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టరు.

     ముసలితనంలో వచ్చే కష్టాలగురించి ఇప్పటినుంచే భయపడుతూ వుంటారు. జీవితభీమా చెయ్యటం, డబ్బుమదుపు చేయటం లాంటి పనులు అనేకం చేస్తారు.

    వీరితో పరిచయమున్న ప్రతి ఒక్కరూ దాదాపు ఏదో ఒకసమయంలో వారి దగ్గరనుంచి అప్పుతీసుకున్నవాళ్లే అయి వుంటారు. కానీ వీరిని అందరూ పిసినారులుగానే భావిస్తూ వుంటారు. ఎవరైనా  వీరిని పిసినారులు అంటే బాధపడనవసరం లేదు. ఎందుకంటే  అలా అన్నవాళ్లే వీరి దగ్గరికి త్వరలో  అప్పుకోసం వస్తారని వీరికి తెలుసు.

     వీరు ఏ వ్యక్తిని ఎక్కడ వుంచాలో అంతలో వుంచటానికి ఇష్టపడతారు.

     స్పేసింగ్ :

    తను వ్రాయవలసిన మేటర్ ని ఒక కాగితంలో ఎక్కడ ప్రారంభించి, ఎక్కడ పూర్తి చేయాలి అనే దానిమీద ఆ వ్యక్తి మనస్తత్వం అధారపడి వుంటుందని ఇదే చాప్టర్ లో ముందు ప్రస్తావించటం జరిగింది. ఈ క్రింది ప్రతులను పరిశీలించండి.

 Previous Page Next Page