సుఖంలేని మనిషి
జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ అనిచెప్పి ఓ పెద్ద బట్టలదుకాణం పెద్ద బజారు రోడ్డుమిద అర్నెల్ల క్రితం వరకూ వెలిగిపోతూవుండేది. ఈ కధ జె వెంకటేశ్వర్లు అండ్ సన్స్ వారి బట్టల దూకాణం గురించి మాత్రం కానే కాదు.
ఆ బట్టల దుకాణం కొన్ని లక్షల వ్యాపారం చేసిందని వినికిడి. జె. వెంకటేశ్వర్లు వూళ్ళో నాలుగు మేడలు కట్టించడం గూడా ఆ వ్యాపారం యొక్క ప్రయెజకత్వమేనని వదంతి.
ఆ దుకాణం అస్తమానం రద్దీగా వుండేది డాక్టరూ ప్లీడరూ , కాలేజీ కుర్రాళ్ళూ, ఆఫీసర్లూ, పొద్దుపోని ఆస్థిపరులూ మొదలైన పచ్చట మనుషులు చాలా మంది అక్కడ ఖాతాదారులు. జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ లో కొన్న గుడ్డ చాలా ఖరీదైనదీ, మంచి శ్రేష్ఠమైనదీ అని పెద్దనమ్మకం జనాభా!! ఆకొట్టు యింద్ర భవనంలా వుండేది. ఆ కొట్లో మనుషులూ బాగుండేవారు.
మరీ బాగుండేది మిస్ సుబ్బులు! ఆ అమ్మాయి ఆ కొట్లో సేల్స్ గర్, ఆ కొట్టు కొచ్చే సగానికి సగం మంది కేవలం సుబ్బుల్తో కాస్త కాలక్షేపం కేసమని చెప్పేస్తే అతి శయోక్తికాదు.
జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ కి వాస్తవమైన యజమాని. జె. వెంకటేశ్వర్లు మత్రమే! ఆ ఆసామికి గుండెనొప్పి,ఆయాసం దడఅనే మామూలు వ్యాధి ఒక అలంకారం. అంచేత యజమాని పదవి ఒక నమ్మిన మనిషి చేతిలో పెట్టేడు. ఆ మనిషి పేరు సుబ్బారావు.వి. సుబ్బారావు.
చాలామంది ఆశ్చర్యపోయే వారు. జె. వెంకటేశ్వర్లుకున్న ముగ్గురు కొడుకూలూ ఉత్తచవటలని జనం ఉద్దేశంకాదు గానీ వాళ్ళెవరికీ దక్కని స్థానం ఎవడో పరాయి వాడు. విసుబ్బారావు కెలా దక్కిందని ముక్కులమిద వెళ్ళేసుకునేవారు. డిగ్రీలు పుచ్చుకున్న నిరుద్యోగులకీ, పేదరికంలోంచి బైట పడిపోవాలనుకునే సామాన్యమైన మనుషులకీ వి. సుబ్బారావున్జుస్తే వొళ్ళు మండుకొచ్చే ఖరీదైన ఖాతాదార్లు. వి.సుబ్బారావుని మర్యదగా పలకరించడం చూసిన మూడో మనిషి (వి. సుబ్బారావుకి ఆత్మీయుడైన పక్షంలో) చచ్చేంత సిగ్గుపడిపోయేవాడు.
అంతలా వెలిగిపోయేడు. వి సుబ్బారావు కానీ- ఆర్నెల్ల క్రితం జె. వెంకటేశ్వర్లుకి గుండె కొట్టుకోవడం మరి ఆగిపోయింది. జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ లోని పెద్దమ నిషి, యోగ్యుడు, దూరదృష్టి కలవాడూ, అదృష్టవంతుడూ, మహానుభావుడూ కన్నుమూసేడని స్థానిక ప్రతికలు ఉద్ఘాటించేయి, సభల్లో తీర్మానాలూ చోటు చేసుకున్నాయి. వారం రోజుల పాటు మూసిన జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ దుకాణం మరింక తెరవనే లేదు. దానికి జనం ఆశ్చర్యపోనూ లేదు ఏమంటే వాళ్ళందరికీ అండ్ సన్స్ గాళ్ళ చాకులాటి తెలివి తేటలు ఎప్పట్నుంటో తెలుసు.
ఈ మహత్తర భాగ్యంకోసం అండ్ సన్స్ ఎంతకాలం నుంచో యెదురు చూస్తున్న వైనమూ తెలుసు. అండ్ సన్స్ బట్టల వ్యాపారం మానుకుని మిస్ సుబ్బుల్తో సహా మదరాసు వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళందరూ కలిసి తెలుగు సినీమా తీసే యేర్పాటులో తలనిండా మునిగిపోయేరు. ప్రస్తుతం జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ స్థానంలో రెండు డ్రింక్ షాపులూ. ఒక " మందు" దూకాణమూ వెలిశాయి.
ఈ విపత్కర సంఘటనకి గొప్ప బాధపడ్డది కేవలం వి. సుబ్బారావొక్కడే. ఎంచేతంటే దేవుడులాటి యజమానీ, ఇంద్ర పదివిలాటి ఉద్యోగవూ దూరయ్యాయి కదా!
కాబట్టి ఇది వి. సుబ్బారావు కథ మాత్రమే!
* * * *
ఉద్యోగం వూడిపోయిన లగాయితూ- అతనుఒక్కో సారి జీవితాన్ని గురించీ , ఒక్కోసారి ప్రేమగురించీ , ఎక్కువ సార్లు జీవితం ప్రేమ రెండిటిని గురించీ ఆలోచించడం నేర్చుకున్నాడు. జీవితం గురించి ఆలోచించిన క్షణం జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ గుర్తుకొచ్చి ఆశ్చర్యపోతాడు. ప్రేమ గురించి ఆలోచించిన క్షణం చంద్రావతి జ్ఞాపకమొచ్చి బాధపడిపోతాడు. టూకీగా అతని వ్యాపకం యిది:
చంద్రావతి యోగ్యురాలని తెలుసు. కాదేమోనన్న అనుమానం జే. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ లో పనిచేస్తు న్నప్పుడు కలిగింది కాదు. ఆరోజుల్లో పరాయి విషయాలు ఆలోచించేందుకు టైముండేది కాదసలు. కానీ ఇప్పుడిప్పుడు చంద్రావతివని తలుచుకుంటూంటే భయం వేస్తోంది.
చంద్రావతి నర్సు ఉద్యోగం చేస్తున్న ఇల్లాలు. రెండేళ్ళ క్రితం కాబోలు చంద్రావతికి సుబ్బారావుకి పెళ్ళయింది. ఆ పెళ్ళి చాలా సందడిగానూ, ఆనందంగానూ, కాంతివంతంగానూ కాలేదు.అభిమానాలూ,పట్టుదలలూ, పంతాల మధ్య మలుగురైదుగురు ముఖ్యమైన స్నేహితుల సంక్షాన విరాడంబరంగా జరిగి పోయింది. వాళ్ళద్దరి పెళ్ళి అంత నీరసంగా , బద్దకంగా జరగడంలో కధావుంది.
ఆ మధ్యెప్పుడో సుబ్బారావుకి జబ్బేదో చేయడం మూలంగా హాస్పిటల్లో నడుం వాల్చవలసి వచ్చింది. అతనికి హాస్పటలంటే మహా అసహ్యం. అయినా తప్పిందికాదు లేక పోతే జబ్బుముదిరి భూమ్మిద నూకలక్కూడా నోచుకోలేవని బెదగొట్టారు. భయంభయంగానే హాస్పిటల్ మంచంమిద చేరేడు.
రెండురోజుల వరకూ మంచం దగ్గరకొచ్చే మనుషులమిద అతనికాట్టే ఆసక్తివున్నదికాదు. తన జబ్బు గురించి దిగులుగానూ కొంచెం యేడువుగానూ వుండేది.
ఆ స్థితిలో చంద్రావతి కలిగింది. పున్నమిలాటి చందమామకీ, చంద్రావతికీ పోలిక జేసి చెప్పడం అలంకార రీత్యా దోషమేమికాదు. అంత చల్లగానూ, అంత వెల్తురుగానూ అంత అందంగాను వుంటుంది చంద్రావతి.
మందుపోసేది. మాడిపోతున్న నొసటిమిద చల్లటి చేతి స్పర్శతో అమృతం కురిపించేది. అప్పుడనుకునే వాడతను-" చంద్రా! నువ్వు దూరం కావద్దు అస్తమానం నువ్వు నాద్గగరే వుండిపో. నన్ను విడిచి వెళ్ళిపోతే నేను బతకలేను. నీలో యేదోవింత ఆకర్షణ వుంది; నన్ను అలరిస్తోందది. చంద్రా- నువ్వు దూరంకాకు, నన్ను విడిచి పెట్టొద్దు."
ఓనాటి రాత్రి అతనికి టెంపరేచర్ ఎక్కువయ్యింది. అప్పుడతను నిజంగా పలకరించేడు. ఆ పలకరింతలు విన్న చంద్రావతి మొదట్లో ఖంగారు పడ్డది. ఆనక సర్దుకుంది.
సుబ్బారావు నిర్ణయం విన్న తల్లీ తండ్రీ, అన్న దమ్మూలూ వెరశి ఆత్మ బంధువులంతా నోరూ నెత్తీ మొత్తుకున్నారు, " నీ కెవడ్రా ప్రేమగురించి చెప్పాడు! పోనీ ప్రేమిచేవాడివి.... హవ్వ....సుబ్బారావొరేయ్! నువ్వు నీ జన్మలో బాగుపడవు. తెలిసిందా, నువ్వు నీ యిష్టంమిద పెళ్ళి చేసుకుంటే నా యిష్టంమ్మిద నా యిష్టం మ్మిద నువ్వుబతకడం లేదన్న మాటేగదా! వెళ్ళిపోరేయ్! ఈ యింట్లో వెళ్ళిపో,మళ్ళీ నీదరిద్రగొట్టు మొహం నాకు చూపించకు" అన్నాడు తండ్రి తతిమ్మా వాళ్ళరి కన్నీళ్ళు గమనిస్తూ గూడా.
వి. సుబ్బారావుకివన్నీ బాగా గుర్తుండిపోయేయి. గుర్తుండకూడదను కున్నవన్నీ మరిచిపోయే అవకాశాన్ని అండ్ సన్ తినేశారు.