Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 23

                                 

    4. డబ్బు విషయంలో వీరు ఉదార స్వభావులే అని చెప్పుకోవాలి. అనవసరంగా ఏమీ ఖర్చు చేయకపోయినా అందం కోసం, సంతోషం కోసం ఖర్చు చెయ్యటానికి వెనుదియ్యరు.  వీరి ఆనంద మంతా తను తనదగ్గరి వాళ్లు అనే సర్కిల్ మీదే ఆధారపడి వుంటుంది.

    5. ఇటువంటి వ్యక్తులు 'కాస్ద్రోఫోబియా' కి గురయ్యే అవకాశం వుంద.అంటే  గుంపులని ఇష్టపడక పోవటం. ఇటువంటి వాళ్లు అయిదారుగురు స్నేహితుల్తో సినిమాలకి, పెళ్లిళ్లకీ వెళ్లటాన్ని ఇష్టపడరు.

    6. వీరికి అంతర్గతంగా చాలా భయం వుంటుంది. వీరికి ఎంత భయం వుంటుందంటే సంతానం కలిగితే భార్య నిర్లక్ష్యం  చేస్తుందేమోనని, పిల్లల్ని కూడా వాయిదా  వేస్తారు.

    అక్షరాలు వ్రాసే విధానం:

    తెలుగులో కొన్ని కొన్ని అక్షరాలు చాలా మెలికలు తిరిగి వుంటాయి. ఒక వ్యక్తి వ్రాస్తూ పోతున్నప్పుడు ఎక్కువ మెలికలు తిరగని అక్షరాలను పూర్తిగా వ్రాయడానికి ప్రయత్నిస్తాడు. అదే చాలా మెలికలున్న అక్షరాల్ని వీలైనంత నిర్లక్ష్యంగా తొందరగా పూర్తి చెయ్యటానికి ప్రయత్నిస్తాడు. దీన్ని బట్టి కూడా వారి మనస్తత్వాన్ని విశ్లేషించవచ్చు.

    ఉదాహరణకి తను వ్రాసేది అవతలవాళ్లకి అర్దం అయితే చాలు అనే ఉద్దేశ్యంతో కొన్ని అక్షరాలను అతను పూర్తి చేయకుండానే వదిలేస్తారు.
    ఇలాంటి అక్షరాలు ఉదాహరమకి - శ్రీ - ఆ- త - కొ- సి-గ- మొదలైనవి.

    ఇప్పుడు ఈ క్రింది అక్షరాలను వివిధ రకాలుగా ఎలా వ్రాస్తారో పరిశీలించి దాని బట్టి మానసిక విశ్లేషణను పరిశీలిద్దాం.

              

    1.మొదటి అక్షరం పూర్తిగా వ్రాసి ఎడమవైపు అర్దచంద్రాకారపు ఒత్తు ఇస్తే డబ్బుపట్ల చాలా జాగ్రత్త వున్నవారు. గతాన్ని వీలైనంత వరకూ  మర్చిపోడానికి ఇష్టపడేవారు అయివుంటారు.

    2. అదే ఒత్తు కుడివైపు ఇస్తే పాతకాలపు పద్దతుల మీద నమ్మకం వున్నవారు, ధర్మగుణాన్ని కలిగున్న

    3.అక్షరాలు పూర్తిగా ఒత్తుతో చుట్టేస్తే ఎక్కువ భక్తి భావం కలిగి వున్నవారు తనలోతానే  కుచించుకుపోయేవారు, ఏ పనైనా మొదలు పెడితే పూర్తయ్యే వరకూ వదిలిపెట్టని వారు అయివుంటారు.

    4. అక్షరాన్ని ఒక అలంకారంగా దిద్ది క్రింద ఒత్తుని అర్దచంద్రాకారంగా పూర్తిచేస్తే, ప్రతీ పనినీ సులభంగా తీసుకొనేవారు నిర్లక్ష్యపరులు, అలంకార ప్రియులు అవుతారు.

    5. ఒక సున్నాతో ప్రారంభించి, మరోసున్నతో పూర్తిచేసి క్రింద ఒత్తుని కూడా సున్నా చుట్టాలనే ప్రయత్నంతో అక్షరాన్ని పూర్తిచేసేవారు ఎక్కువగా డిఫెన్స్ టైప్ అయివుంటారు. కొంచెం సిగ్గు ఎక్కువ,తక్కువ మాట్లాడే గుణం కలిగి వుంటారు.

    6. మొత్తం అక్షరాన్ని ఒత్తులా చుట్టకుండా ఒత్తుని అక్షరం చివర భాగంలో వ్రాసేవాళ్లు సాధారణంగా తమమీద తమకి నమ్మకం కలిగిన వారైవుంటారు. తమని అందరూ గుర్తించాలనే తపన కలిగి తమని నమ్మిన వాళ్లకి ఏదో ఒక లాభం చేకూర్చుదాం అనే మనస్తత్వం కలిగిన వారై వుంటారు.

                   


    1. 'అ' అనే అక్షరాన్ని మొదలుపెట్టి ఒక సున్నాచుట్టి, క్రిందకువంచి కుడివైపుమరో సున్నాచుట్టి కలం అఖ్కడ ఆపుచేసి మళ్లీ గీతని ఎడంవైపు నుంచి ప్రారంభించి కుడివైపుకి తీసుకువచ్చి అక్షరాన్ని పూర్తి చేసే వ్యక్తులు, సాధారణంగా ఒక పనిచేసిన తర్వాత ఆ పనిలో లోటుపాట్లన్నీ పునః పరిశీలించుకునేంత జాగ్రత్తపరులై వుంటారు. వీరు సాధారణంగా ఆర్టిస్టులు కళాకారులు అయివుంటారు.

    2.రెండు చిన్న సున్నాలతో మధ్య అర్దచంద్రాకారంతో 'అ' అనే అక్షరాన్ని పూర్తి చేసేవాళ్లు సాధారణంగా ఎక్కువ పని ఒత్తిడితో, నిరంతరం టెన్షన్ తో బాధపడేవాళ్లై వుంటారు. తమని అవతలివారు అర్దం చేసుకోకపోయినా తమకేమీ నష్టం లేదనే మనస్తత్వం కలిగివుంటారు.

    3. ఒక చిన్న గీతతో ప్రారంభించి, ఒక సున్నాతో అక్షరాన్ని పూర్తి చేసేవాళ్లు, డబ్బుపట్ల ఎక్కువ అభిరుచి కలిగివుంటారు. వీళ్లు కాస్త అహంభావులై కూడా వుంటారు.

    4. సున్నాతో  ప్రారంభించి అక్షరం గీతని కొద్దిగా గీసి ఆపుచేసేవారు సాధారణంగా వాణిజ్య లక్షణాలని కలిగివుంటారు. ఎక్కువ మాట్లాడే స్వభావాన్ని కలిగివుంటారు.

    5.అక్షరాన్ని గుండ్రంగా కాకుండా మూడుకోణాలతో పూర్తి చేసేవారు సాధారణంగా కలలుకనే వారై వుంటారు. వీరు ఎక్కువ బాధ్యతలని స్వీకరించలేరు. పుస్తకాలని, చరిత్రని చదవాలనే కుతూహలం కలిగిన వారైవుంటారు.

    6. అక్షరాన్ని పూర్తిగా వెడల్పుగా వ్రాసి ఈ చివర్నించి ఆ చివరికి గీతతో రెండుసున్నాలతో కలిపేవారు సాధారణంగా ఎక్కువకలలు కనేవారు, అవసరమైన దానికన్నా ఎక్కువ మాట్లాడేవారు అయివుంటారు. షో ఆఫ్ ఎక్కువ చెయ్యాలనే కోరిక వీరికి మనసులో వుంటుంది. దయాగుణం, స్నేహగుణం, వీరిలో ఎక్కువ.

    1.రెండు సున్నాలను చిన్నవిగా వ్రాసి వాటిని కలిపేగీత, తలకట్టు పెద్దగా ఇచ్చేవాళ్లు సాధారణంగా సెక్స్ కోర్కెలను ఎక్కువగా కలిగివుంటారు.  పైకి చెప్పకపోయినా అంతర్గతంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన వీరిలో ఎక్కువగా వుంటుంది.

    2. మొత్తం అక్షరాన్నంత గుండ్రంగా వ్రాసి సున్నాలు వాటిని కలిపేసున్నా,పైన ఒక తలకట్టు వ్రాసేవారు జీవితంలో తొందరగా స్థిరపడాలని కోరుకుంటారు. రహస్యాలని బైటకి వెల్లడి చేయరు. నెమ్మదస్తులై వుంటారు.

 Previous Page Next Page