బైకుకు అడ్డంగా నిలబడింది మౌన.
ఆ రోజు ఆటో ఇటో పట్టిస్తున్నడన్నఅనుమానం కలిగింది.
"పోనీ మ్యాన్... నా మీదుగా బైక్ ఫోనీ... అసలు నువ్వు మనిషివేనా? ఓ అందమైన ఆడపిల్ల... అదీ యించుమించు మిస్ యూనివర్స్ కు సరిపోయే కొలతులున్న ఆడపిల్ల 'ఐ లవ్ యూ...' అంటే మాట్లాడవు..." కోపంగా అంది మౌన.
భస్మ మాట్లాడలేదు.
"ఏంటీ... నరాల వీక్నెస్ కేసా? అంది వళ్ళుమండి.
గేర్ మార్చాడు.
"ఫోనీ.... ఇలానే బైక్ కు అడ్డంగా నిలబడుతా..." ఒళ్ళుమండి అంది.
బండి రేయిజ్ చేసి ముందుకు దూకించాడు. వెంటనే కంగారుగా పక్కకు తప్పుకుంది మౌన.
లేకపోతే తన శరీరాన్ని నుజ్జూ నుజ్జూ చేసి మరీ ముందు కెళ్తడని అర్దమైంది.
"హూ... ప్రేమతే పిరికితనాన్ని వదలిమ్చుకున్నాక మావుదలేట్టిమ్ది..." అని తనే ఓ కొత్త కొటేషన్ రాసుకోవాలనిపించింది.
ఒక్కొక్కరు బ్లేడు తో కోసుకోవడం, ప్రేమించకపోతే సూసయిడ్ చేసుకుంటానంటారు? తనకేంటి... ఇలా భయమేసింది? అనుకుంది మౌన్. అలా అనుకున్నా, ఆమెలో పట్టుదల మాత్రం మరింత పెరిగింది.
'నిన్ను వదలిపెట్టాను భస్మ..." అనుకుంది మౌన మనసులో.
***
న్యూఢిల్లీ...
ఫోలీసు వాళ్ళతో కలకలం మొదలైంది.
గుర్తు తెలియని ఆగంతుకుడు సృష్టించే విద్వంసమే దానిక్కారణం వారం రోజులుగా వూహించని దారినాలు జరగిపోతున్నాయి.
జర్నలిస్ట్ నితీష్ రాయ్ హత్య తర్వాత మరో నలుగు బ్యాంకు దోపిడీలు జరిగాయి. రెండు బ్యాంకు దావుపిదీల్లో ప్రాణనష్టం జరక్కపోయినా, మరో రెండు బ్యాంకుల్లో సేమ్త్రీలు చనిపోయారు.
అదీ, దారుణంగా.
కిన్నెరా బ్యాంకులో జరిగిన సంఘటనలే పునరావృత్తం అయ్యాయి.
సేంట్రీ కాలి బూడిదయ్యారు.
కరెంట్ సెంట్రీల బాడీల్లో సర్క్యూట్ అయి ఒకేసారి మంటలు పుట్టాయని... కొందరు తేల్చారు.
అయితే, బ్యాంకుల్లో ఎలక్ట్రసీటి సిస్టమ్ ఫెయిలవ్వలేదు. పూజ్యాలు పోలేదు.
అలాంటప్పుడు సెంట్రీ బాదీలోకి ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఎలా అవుతుంది?
అన్ని ఫోలీసు స్టేషన్ల కు ఎలర్ట్ గా వుండమని కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందింది.
బ్యాంకుల దగ్గర గస్తీ మొదలైంది.
కొందరు సాక్షుల కధనం ప్రకారం...
అర్దరాత్రి ఓ వ్యక్తి రోడ్డుమీద తాపీగా నడుచుకుంటూ వెళ్ళాడని తెలిస్తోంది.
న్యూఢిల్లీ న్యూస్ లో కూడా నితీష్ రాయ్ ఇదే కధనాన్ని రాసాడు.
ఆ వ్యక్తి ఎవరు?
వెంటనే రూమర్లు షికారు చేయటం ప్రారంభించాయి.
అతనికి అతీత శక్తులు వున్నాయని కోడరంటే, అతను నడుస్తూంటే అతని కాళ్ళు వెనక్కి తిరిగి వున్నాయని మరికొందరు...
ఇలాంటి రూమర్లుకు త్వరగా రెక్కలోస్తాయి. ఆ మధ్య ఎవరో ఇంటి ముందు 'ఓ స్రీ రేపురా....'అని రాస్తే ఆ తర్వాత అందరూ తమ ఇంటి గోడల మీద రాసుకున్నారు.
మరికొందరు అర్దరాత్రిళ్ళు ఓ స్రీ తెల్లచీరతో తిరగడం చూసామన్నారు. ఇప్పుడు అలాంటి చర్చే... రూమరుయి, రెక్కలు విప్పుకుంది.
***
"మనం రాంగ్ స్టెప్ వేసాం..." అన్నాడు ఖాన్.
అగర్వాల్ మౌనంగా వుండిపోయాడు.
భస్మ గురించి పబ్లిసిటీ వద్దనుకున్నాం... అనవసరంగా ఫోకస్ అవుతుందన్నాడు..." కరంజయా అన్నాడు అ మోఎనాన్ని చేదిస్తూ.
"ఫోకస్ అవ్వడం ఓ విధంగా మంచిమోననిపిస్తోంది. ఇప్పుడు ఆలోచిస్తుంటే..." అన్నాడు ఖాన్.
"అదేంటి... డబుల్ స్టేట్ మేంటిస్తారు?" కరంజయా అనుమానంగా అడిగాడు.
"అవును... భస్మ మాగ్జిమమ్ ఫోకస్ అవ్వాలి. ఓ అతీత వ్యక్తి లేదా సైన్స్ కు అందని మనిషే ఈ దారుణాలు చేస్తున్నాడని ప్రపంచానికి తెలియాలి. కాకపోతే... అతని ఫోటోలు దోరక్కూడదు..."
"అదేంటీ?" కరంజయాలో అనుమానం.
"అవును... మనం భస్మను అడ్డుపెట్టుకుని త్వరలో జరగబోయే ప్రపంచ దేశాల నాయకుల సమావేశంలో, అందర్నీ ఒకేసారి చంపేయబోతున్నాం. అందుకు అయూధం భస్మే... మానవ బాంబు కన్నా ప్రమాడంకరమైన వ్యక్తి భస్మ. అతనిలో రోజురోజుకూ పెరుగుతోన్న వూహకు అందని వేళ వోల్టుల విద్యుత్ తో ప్రపంచ నయుకులకు ఒకేసారి 'ఖతం' చేస్తాం.
ఇదంతా భస్మే చేశాడని తెలియాలి. నేరం అతనిమీదే వుండాలి. ప్రజల దృష్టి అతని మీదే వుండాలి. భస్మ సేఫ్ గా వుంటే, ఆ తర్వాత మనేమే అతన్ని సైంటిఫిక్ పద్దతి ద్వారా 'దిమాలిష్ 'చేస్తాం"
ఖాన్ వైపు చూడ్డానికే భయమేసింది కరంజయాకు.
ఖాన్ ఎంత భయంకరమైన మనిషో... అర్ధమవుతోన్నకొద్దీ కరంజయా లో వణుకు పెరిగిపోతోంది.
"అది వదిలేయండి... ముందు మనం హైదరాబాదు బయల్దేరాలి. మనతోపాటు భస్మకూడా..."
"అదేం... ఎందుకు?" కరంజయా అడిగాడు.
"భస్మ మీద ఇక్కడ నిఘా ఎక్కువైంది. న్యూఢిల్లీ శివారు ప్రాంతలతో సహా.. అనివనివూ భస్మ కోసం గాలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భస్మ ఇక్కడ వుండడం క్షేమకరం కాదు.