Previous Page Next Page 
రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 20


                                                   16

    మన వాంఛలను తెలుసుకోవడమే స్వాతంత్యం.
    (ప్లేస్డి లా సోర్బాన్)
    శుక్రవారం , మే 24
    సమాచార కార్యాలయం (అంటూ ఒకటుందా?)
    యూనియన్లూ, ధన సామ్యం, ప్రభుత్వమూ రాయబారాలకు దిగి కార్మికుల విశ్వాసాన్ని బేరాలకు దింపుతుందని.
    శరీరం లేని గవర్నమెంటు దీనికి మధ్యవర్తి. ఇది రాయబారులు సాగిస్తుంది.
    జోరుగా, కత్తివాదర దిగుతుంది జోరుగా.
    వణికే చేతులకి చెమట కమ్మింది. బహుశా ఆలస్యంగా.
    సి.జి.టి. తన భక్తులందర్నీ ఆఖరి హత్యాకాండకి ముందర ఆఖరి భజనకి సిద్దం కమ్మంటుంది. భజన కూటం సిద్దం, "క్రమబద్దంగా ప్రశాంతంగా , హుందాగా'-
    రాబందుగాళ్ళని ఉపసంహరించుకుంది. పోలీసోళ్ళు దూరాన నిలిచి కనిపెడుతున్నారు. వాళ్ళు అనవసరం.
    నాస్ టేస్ అప్పుడే విముక్తి పట్టణం. ఇదివరలో "రాజవిది ' ఇప్పుడు "ప్రజలవిధి" అయింది.
    పారిస్ లో సి.జి.టి సభను అభినందించి భక్తుల్ని పొమ్మంటుంది.
    గొప్ప సభ, గొప్ప ఊరేగింపు.
    కాని, కాలం కఠినమైనది ప్రమాదకరమైనది.
    సి.ఎఫ్. డి.టి (కేధలిక్ కార్మిక సమాఖ్య) అగ్రహం ప్రదర్శిస్తున్న విద్యార్ధులతో, కార్మికులతో చేతులు కలిపింది. పాత భక్తులు కొందరు సొంత చర్చిని వదిలి గూంపులో కలుస్తారు.
    కలిసే చోటు : గర్టిలియాస్. లియాన్ రైలు స్టేషన్.
    అక్కడ డిగోల్ మాట్లాడతాడు.
    వెయ్యి ట్రాన్సిస్టర్లు వుంటాయి.
    "నన్నేం చేయ్యమన్నారో మీరే చెప్పండి . రిఫారెండం కావాలా"? అంటాడు, హేళనల మధ్య.
    ప్రజజేబురుమాళ్ళు వూపుతూ "ఇక ఫించన్ పుచ్చుకోవయ్యా" అంటుంది.
    టైము 8గం.
    డిగోల్ ఒక శతాభ్దానికి, వందలాది కేడ్లకి వెనక ఉన్నాడు. వల్లకాటి నుంచి కంటం . ఆఖరి కౌగిలి ఇమ్మంటూ.
    పోలీసులున్నారక్కడ . రాకల కడ్డుగా , పోకల కడ్డుగా.
    ప్రదర్శకులు చిక్కుకున్నారు. నాయకులకది తెలుసు.
    చావబోతున్న రాబందుకీ, చస్తున్న రాక్షసీ బల్లికీ రక్తసంబంధం కుదిరింది.
    అధికారరాబందు, వదిలిన బలంతో రాక్షసిబల్లి వీలయినన్నీ చోట్లా పోరాడదలిచింది.
    మళ్ళీ ప్రచార సాధనాల ప్రదర్శన- మిగిలిన చోట్లన్నీటా నీర్జీవమయిన సంగతిని ప్రజలు మరచిపోవడానికి గోర్రెలకి గడ్డి మేత.
    పోరాటం తప్పదు. ఈసారి వీళ్ళు 50 వేలు.
    ఈసారి మరింత బలవంతులు. సాహసవంతులు, ఉచ్చులు తగిలించారని తెలుసు.
    అయినా పోరాడక తప్పదు.
    వాళ్ళ భూతకాలమే వాళ్ళ భవిష్యత్తు నినాదాలు కూడా పాతవే" బాస్టిల్ దిక్కుగా"
    రెండుగంటల కిందట శాంతియుతమైన సి,జి,టి ప్రదర్శనాన్ని చూసిన బాస్టిల్ . అదే బాస్టిల్ .
    తొందరగా బారికేడ్లు, పోలీసుదాడి, ప్రజలు చెల్లాచెదరవుతూ పోలీసులకు దారి ఇవరు. అప్పుడు రెండో పాత నినాదం.
    "డివియో హొటేల్ దిక్కుగా"! కమ్యూన్ నినాదం.
    ఊరు నిండా యుద్దరంగాలు.
    నూరేళ్ళ కిందట బూర్జువాజీ ప్రజా నివేశానాలని చీల్చిన ఓజ్మాన్ రహదారులన్నీటిలో.
    లేహల్స్ లో కూరలూ, పళ్ళూ చేరవేసే లారీలు, గమ్యాన్ని చేరుకొని, మళ్ళీ మంత్రబద్దమైన లాటిన్ కార్టర్ కి తిరిగొస్తాయి'.
    "కోమర్ సేబాస్టపోల్ లో చెదురుమదురుగా యుద్ధం.
    ఫోబూర్ సంటాంటాయిస్ లో అడపా దడపా యుద్ధం.
    డివియ్ హోటెల్ ను పోలీసులు రక్షిస్తున్నారు -- యావచ్చక్తులతో . ప్లేస్ ద లా రిపబ్లిక్ లో వేలకొలది కార్మికులు పోరాటానికి నాయకత్వం వహించారు. తోలు చొక్కాల నిరుద్యోగులు ప్రాణానికి తెగించి పసందుగా పోరాడుతున్నారు.
    ఇళ్ళలోంచి జనం బయటికొస్తున్నారు.
    రాజభవనాన్ని పోలీసులు రక్షిస్తున్నారు. మంత్రివర్గ కర్యాలయాలనీ, అమూల్య మైన దస్తావేజులతో నిండిన బిల్డింగులవీ.
    స్టాక్ ఎక్స్చెంజీ సురక్షితంగా వుంది. 10.30 కి దాడి జరిగింది.
    ప్రక్షాళన చేసిన ప్రజలనాలు యింకా ప్రకాశిస్తూనే ఉన్నాయి. కొన్ని నీడలనీ, ఒక నల్ల జెండానీ మంటల వెలుగు స్పష్టం చేస్తుంది.
    గొరిల్లా పోరాటం ఫలితాలనిస్తోంది. శత్రువు మందుగుండుబలం కూడా దాన్ని తట్టుకోలేకపోయింది.
    కాని ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. కంచుకోట వైపు (లాటిన్ కార్టరు) అధిక సంఖ్యాకులు తోసుకుపోతున్నారు. భావనా శక్తిని గెలిచింది అలవాటు బలిమి. లాటిన్ కార్టరు యుద్దరంగమే కాదు, ఒక బోను కూడా.
    అక్కడ పోలీసులు సెయింటు మైఖేల్ అడుగుకొస నుండి దాడి చేస్తారు. ఇదివరకటి లాగే, యదాప్రకారమే . నింపాదిగానైనా నిరాఘాటంగా పోగాల్లోంఛి మంటల్లోంచి రహదారి మీదుగా దారి చేసుకుంటారు. స్థానిక బాహబాహీయుద్దంలో గెలుపు అసంభవం. ఆయుధ బలానిదే పైచేయి. యోధులకు మిగిలిందల్లా పట్టుదలా, ధైర్యమూ! వారి ఆశలంత ఉన్నతమైనవి బారికేడ్లు . కాని పెద్ద సైజు మిడతలాంటి బుల్ డోజర్లు వాటిని చిందర వందర చేస్తాయి.
    వాళ్లకి మిగిలిందల్లా వాళ్ళ యౌవనం, వాళ్ళంధులూ, వాళ్ళ నిరాశా! బారికేడ్లు పడిపోతున్నాయి, కొత్తవి లేస్తున్నాయి. స్థలం కోల్పోతున్నారు. పోరాటం సాగిపోతోంది. నిశీధంలో వేదన. పోలీసులకు మెల్లగా కాలునుకునే చోటు, పరిస్టితి మీద అదుపు. దానితో బాటు గరం.

 Previous Page Next Page