Read more!
 Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 2


    ఉన్నట్టుండి కారు వేగం పెరిగినట్టయింది.

 

    "ఏయ్ ... కాస్త స్లోగా పోనివ్వొచ్చుగా?" అంది భయంగా.

 

    "సాధ్యం కావడంలేదు."

 

    "ఏమిటి?"

 

    "నిన్ను చూస్తూ వూరుకోవడం."

 

    ఆ వాక్యాన్ని ప్రయోగించినందుకు కాదు, ఆ మాట చెబుతూ చూసిన చూపుని విజూషని అదోలాంటి వివశత్వానికి  గురిచేసింది.

 

    ఎడమ చేతిలో గభాల్న విజూషని దగ్గరకు లాక్కున్నాడు.

 

    "దేవుడెందుకింత పొరపాటు చేసాడు?'

 

    అర్దంకానట్టు చూసింది విజూష

 

    "అందాన్నంతా ఓ  ముద్దగా మార్చి నిన్ను ఒక్కదాన్నే తయారుచేయడానికి బదులు మరికొంతమంది అమ్మాయిలకి డిస్ట్రిబ్యూట్ చేయవచ్చుగా!"

 

    ఆమె నేత్రాలు అరమోడ్పులయ్యాయి.

 

    అతడి చూపుల కిరణాలు గుండె అంతరిక్షంలోని నక్షత్రాల నాడుల్ని కదిలించినట్టు....


 
    కోర్కెల కడలికెరటాల లోగిళ్లను పగలగొట్టగా జ్వాలా జల పాతమై అతడిపై దూకాలనిపించినట్టు ఉద్వేగపరుస్తుంటే సీటులో మరో మూలకి జరిగింది అతడికి దూరంగా.

 

    "కోపం వచ్చిందా?" బుజ్జగించినట్లుగా అడిగాడు.

 

    ఆడతనపు అగాధ నిశీధంలోకి రహస్య మధువుని రుచి చూపించే బాటసారిలా  అరుదెంచి ఆరునెలల కాలంలోనే నూరేళ్ల బంధానికి సరిపడ్డ లాలిత్యాన్ని అందించిన  అతడి మాటలకి ఆమె ఎలా కోపగించుకోగలదు?

 

    ఒక జీవితకాలపు తపస్సుతో సాధించిన సంజీవిని ఆడదైతే ఇతిహాసాల నిడివితో అతడ్ని తడిపే తరిపి వెన్నెల పుప్పొడిలా మారి జారి పాదాల మ్రోల వరాలిపోగలదే తప్ప అతడ్ని కాదని ఎలా వుండగలదు?

 

    "నేను అబద్దం చెప్పడంలేదు విజూషా...' నిజాయితీగా అన్నాడు నడుపుతున్న సీలో వేగాన్ని మరింత పెంచుతూ. "భాషకందని రూపం.... వర్ణనకి అందని అందం నీది."

 

    మసక వెలుతురులో సైతం మిలింద్ కళ్లలోని ఎరుపు కోర్కెల జ్వాలలు అస్ఫష్టంగా కనిపించి సన్నని ప్రకంపనకి  గురిచేశాయి.

 

    "ఒక్కమాట చెప్పనా నిజూషా?" బావరహితంగా అన్నాడు.

 

    "అప్పుడెప్పుడో యుద్దాలమధ్య కడతేరిపోయిన రాణివాసం స్త్రీలంతా దేవుడ్ని ప్రార్దించి ఇప్పటి ప్రపంచంలో తిరిగి పుట్టేంత వరాన్ని కోరుకుంటే, వాళ్లందరి సౌందర్యమూ కలిసి దేవుడు నిన్నొక్కదానిగా పుట్టించాడని  అనిపిస్తోంది..."

 

    రాలిపడబోయిన ఒక నీటిబొట్టు ఆమె కనుకొలకుల్లోనే ఆరిపోయింది.

 

    "ఇంకా ఎంతదూరం?" అడిగింది ప్రసక్తిని మార్చాలనుకుంటూ.

 

    "వెళ్లాల్సిందా? లేక నాతో కలిసి నడవాల్సిందా?"

 

    ఉద్విగ్నంగా తల తిప్పి చూసింది.

 

    "గుడ్ స్పాంటెనిటీ."

 

    "లేకపోతే ఇంత అదృష్టవంతుడ్ని కాగలిగేవాడ్నా?"

 

    అతనికి దూరంగా వుండలేనంత తమకంతో ఆమె కొద్దిగా జరిగింది.

 

    "అదృష్టం నీదొక్కడిదే కాదు మిలింద్."

 

    "తెల్లవారితే తప్ప హైద్రాబాద్ రాదు" అన్నాడు నిస్త్రాణగా.


 
    "హైద్రాబాద్ వెళ్లాక మనం వుండేది ఎక్కడ?"

 

    "ఓ ఫ్రెండ్ ప్లాట్ కు."

 

    "బహుశా ఈపాటికి -" చెబుతూ సన్నగా వణికింది విజూష.

 

    "మా డాడీ నా గురించి వేట మొదలుపెట్టి వుంటాడు."

 

    ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పకుండా ప్రేమించినవాడితో  వెళ్లిపోవడాన్ని ' లేచిపోవడం' గా భావించే సొసైటీలో ఎంత ఆస్తిపరుడైనా తన తండ్రి ఇప్పుడు తను చేసిందాన్ని క్షమించడు.

 

    "ఒక్క ప్రశ్నకి జవాబు చెబుతావా?"

 

    సీరియస్ గా ఆమె ప్రతిస్పందన గురించి ఆలోచించకుండా అడిగాడు మిలింద్.

 

    "చావైనా బ్రతుకైనా నాతోనే అన్నావు. ఆ మాటకి చివరిదాకా కట్టుబడే వుంటావుగా?'

 

    విజూష కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి.

 

    "ఎందుకు అనుమానిస్తున్నావు?"

 

    "నీకోసం చావునైనా ఆహ్వానిస్తాను తప్ప నువ్వు లేకుండా వుండడాన్ని బ్రతికుండగా నేను అంగీకరించలేను కాబట్టి"

 

    అతడి భుజాలపై తల ఆనించి  అంది.

 

    "ఆ పరిస్థితి రానివ్వను."

 

    "అంటే?"

 

    "అలా నీకు దూరమయ్యే పరిస్థితి వస్తే నీకన్నా ముందు నేనే ఈ ప్రపంచానికి గుడ్ బై చెప్పి వెళ్లిపోతాను"

 

    ఆమెకు తెలుసు. ఆ స్టేట్ మెంట్ కి మిలింద్ ఎంత బాధపడి వుంటాడో.


 
    "దానితో హేపీగా మరో లోకంలో సెటిలైపోతావా అని అనకు."

 

    చిలిపి సింధూరంకన్నా ఎరుపైన హృదయాన్ని అతి ముందు పరుస్తున్నట్లుగా అంది.

 

    "దేవుడి బుర్ర తింటాను."

 

    నిర్లిప్తంగా చూశాడు మిలింద్.

 

    "ఏ విషయం అని అడగవేం?"

 

    అడగలేదు.

 

    అయినా తనే చెప్పింది.

 

    "నీ గురించే" నిష్టూరంగా నవ్వింది.

 

    "ఎప్పుడో రాణీవాసం స్త్రీలంతా రాలిపోతే అందరి అందాన్ని కలగలిపి నిన్నగాక మొన్న నన్ను పుట్టించిన దేవుడా నాది అనుకున్నది నాది కాకుండానే బ్రతుకు చాలించాను.

 

    ఏడేడు జన్మలదాకా ఎన్నిసార్లు నేపోయినా నా మిలింద్ కోసం నన్ను పుట్టించమంటాను.     కీచుమంటూ కారు బ్రేక్ పడింది.

 Previous Page Next Page