Previous Page Next Page 
చైనా యానం పేజి 19


                                             పదహారు

    24-12-76
    నిన్న వాయిదా పడిన ప్రయాణం యివాళ సానుకూలంగా సాగింది.
    ఉదయం నుంచీ వాతావరణం అతి ప్రశాంతంగా వుంది.
    మొదటిసారిగా చైనీస్ విమాంలో షాంఘై నుండి కున్మింగ్ కు ప్రయాణం.
    9 గంటలకు బయలుదేరిన పౌర విమానం 11 గంటలకు చాంగ్షా చేరింది.
    అక్కడ విమానాశ్రయంలో 45 నిమిషాల సేపు వున్నాము.
    ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట పది నిమిషాలకు కున్మింగ్ చేరుకున్నాము.
    అక్కడ హోటల్ లో నా రూం నంబరు 223.    
    అప్పటికే నాకోసం పీకింగ్ రేడియో ఉద్యోగి ఒకాయన టేప్ రికార్డర్ తో కాచుకొని వున్నాడు.
    కొంత తెలుగులోనూ, కొంత ఇంగ్లీషులోనూ వున్న గీతాన్ని తొందర తొందరగా పూర్తిచేసి, ఇంగ్లీషు, తెలుగు వెర్షన్లు రెండింటినీ రికార్డర్ లో పఠించాను.
    దీని శీర్షిక
    My china, oh my china
    దీన్ని తెలుగులో ఇలా ముద్రించ దలిచాను.
    నా చైనా ఓ నా చైనా
    చై    చై
    నా    నా
    ఓ      శ్రీశ్రీ    ఓ
    నా    నా
    చై    చై
    నా చైనా ఓ నా చైనా

    నా చైనా ఓ నా చైనా
    దుష్ట చతుష్టయభంజన చైనా
    కష్టజీవి జనరంజన చైనా
    నా చైనా నా చైనా
    జన చైనా సజ్జన చైనా !

    My china oh my china!
    Smasher of the gang of four
    Place of the toiling masses
    My china oh my china
    People's china !
    Good peoples china !

    నేడు ఫలించినది నా దీర్ఘ కాలిక స్వప్నం
    నేను చూస్తున్నాను రమణీయ శ్రామికస్వర్గం
    ఎక్కడో లేదు ఉజ్వల భవిష్యత్తు నా ఎదుటనే వుంది.
    ఈ మహాస్వర్గ ధాత్రిలోని
    తరుణారుణ సుమ నేత్రాలలో
    చూస్తున్నాను భావిని!
    ఓ చిన్నారి ఎర్రదళాల బాలల్లారా !
    మీరే మానవ జాతి భవిష్యత్తు !

    This is my long time dream come true !
    I am looking at a beautiful workers dream heaven!
    Why search for a brilliant future,
    it is here, right in front of me.
    In the bright eyes of the little red flowers
    Of this great golden land,
    I am seeing the future !
    Oh, dear, little red guards !
    You are the future of mankind!

    ఇప్పుడు నాకనిపిస్తుంది    
    ఎవరు గొప్పవారు?
    ఛైర్మన్ మావో గోప్పవారా?
    చైనా ప్రజలు గొప్పవారా అని!
    ఇప్పుడు నేను జవాబు చెప్పుకుంటాను
    ఉభయులూ సమానంగానే గొప్పవారని.

    I sometimes wonder, who is greater,    
    Chairman Mao or the Chinese people
    And I Answer myself saying.
    Both are equally great.

    మగ, ఆడ, వృద్ధ యువ భేదం లేకుండా
    ఏ చైనీస్ కామ్రేడ్ నైనా
    "ఎందుకు నీవు జీవిస్తున్నావు?"
    అని నేనడిగితే, వెంటనే
    ప్రత్యుత్తరం వస్తుందిలా !
    "నా పొరుగువాడికి సాయం చెయ్యడానికి
    బ్రతుకుతున్నాను.
    ఒళ్లు వంచి పనిచేసి ఉత్పత్తిని పెంచి
    నా దేశం సామ్యవాద మార్గంలో
    పురగోమించేలాగ చూడ్డానికి
    బ్రతుకుతున్నాను.
    మా ఉదాహరణ ద్వారా
    ప్రపంచ విప్లవోద్యమానికి
    దోహదం చెయ్యడమే నా ధ్యేయం!

    When I ask a chinese comrade
    Be he boy or be she girl
    Be he old or be she young
    "Why do you live?"
    Pat comes the answer thus :
    "I live so that
    I can be of help to my neighbour !
    I live so that
    I can work hard and increase production
    and take my country on the forward road
    to communism !
    And by example, to advance the cause of
    world Revolution !
    That is why I live!"

    అందువల్లనే చైనా దేశపు ప్రజలు
    ఆకాశాల నుండి అంతర్జాతీయ రంగాన్ని చూస్తూ
    "స్వర్గం కింద గందరగోళం వున్నా
    ప్రపంచ పరిస్థితి అత్యంతోత్తమంగా వుంది."
    అనే మావో అధ్యక్షుని సూక్తిని
    మళ్ళీ మళ్ళీ ఉద్ఘాటిస్తారు.

    That is why, the chinese people
    Scan the international horizon
    And repeat chirman Mao's word :
    "This is disorder under the heavens
    But the world situation is excellent"

    నేను చైనా భూభాగం మీద
    కాలుపెట్టిన ఈ తరుణంలో
    రెండోసారి సమీద్ధిగా యీయేడు పంటలు పండేయి
    కలుపు మొక్కల్ని యేరి పారవేయడం జరిగింది.
    విమానం మీద గగనంలో పయనిస్తూ
    ఈ విశాల భూమిని చూస్తూ వుంటే
    చీనా మాత తన సుదీర్ఘ బాహువులను చాచి
    తన కవల చెల్లెలు భారత మాతను
    పరిరంభంలోకి తీసుకోబోతున్నట్టుంది.

    I come here at a time
    When there is a good harvest
    For the second time this year
    And the poisonous weeds are rooted out
    When from the skies I see
    the vast expanses of this great land
    They seem to me like the extended arms
    of mother china out stretched to embrace
    Her twin sister, Mother India.

    ఔను ఇక మీద ఈ స్నేహం
    ఇతోధికంగా వర్థిల్లుతుంది.
    మన రెండుదేశాలు కలిసి మెలిసి జీవిస్తూ
    ప్రపంచం అంతటా ఆశాజ్యోతి వెలిగిస్తాయి.

    Yes, Here after the friendship of our two
    countries
    will go sure from strength to strength and
    Co-existing, our two countries
    will light up the world's Hope.
                                                                                                  -శ్రీశ్రీ
                                                                                                కున్మింగ్
                                                                                               24-12-76

    నాటి అపరాహ్ణం పశ్చిమ పర్వతాలను చూడడానికి మా ప్రతినిధి వర్గం అంతా బయలుదేరాము. కాని కున్మింగ్ నగరాన్ని దాటి కొన్ని మైళ్ళు వెళ్ళిన తర్వాత ఎక్కడి బళ్ళు అక్కడ ఆగిపోవలసిన పరిస్థితి యేర్పడింది. ముప్ఫయి నలభై నిమిషాల తర్వాత మెల్లగా దారి చేసుకుంటూ మా కార్లు వెనక్కి వెళ్ళిపోయాయి.
    కారణం చిన్న ట్రాఫిక్ యాక్సిడెంటు ప్రాణ నష్టమేమీ జరగలేదు గాని మా కార్యక్రమం అస్తవ్యస్తమయింది. ఆ సాయంత్రం అందరమూ కున్మింగ్ జు చూశాము. సినిమాలో చూసిన పండాతోపాటు పెద్దసైజు పండాలూ, సింహాలూ, పులులూ, ఒక పెద్ద ఏనుగూ, కోతులూ, పక్షులూ ఎన్నెన్నో చూశాము.
    ప్రతినిధి వర్గంతో నా చైనా పర్యటన ముగిసింది. ఆ రాత్రి ప్రతినిధులందరూ (చాంగ్షాకు కాబోలు) వెళ్ళిపోయారు. నేను కున్మింగ్ లో వుండిపోయాను. నా తిరుగు ప్రయాణానికి యేర్పాట్లు జరుగుతున్నాయి.

 Previous Page Next Page