"ఇస్తారా?" అన్నాడు.
"ఏం? లోపలకు రాకూడదా?" అంది మళ్ళీ నవ్వుతూ.
"అలా అనికాదు."
"రండి లోపలకు"
అతనికేం చెప్పాలో తెలీక మొహమాటపడి లోపలకడుగు పెట్టాడు. హాల్లోకి దారితీసింది."
"కూర్చోండి" అంది.
సోఫాలో కూచుని ఆమె చూపులు తట్టుకోలేక అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు.
మధ్యాహ్నం చదివిన సెక్సు విజ్ఞానాన్ని గురించిన పుస్తకం, అందులోని రకరకాల సందేహాలు, ఆ సందేహాల్లో వాడిన పదాలు, వాటి సమాధానాలు ఆమె రక్తాన్ని మరగబెట్టి శరీరాన్ని కుదిపివేశాయి. సాధారణంగా సంసార జీవితంలో మొదటి రెండు మూడేళ్ళు శృంగార విజృంభణ వుంటుంది. తర్వాత పిల్లలు, స్త్రీలో ఏదో కొట్టొచ్చినట్లు కనిపించే మాతృత్వపు ఛాయలు, మగాడిలో జీవితాన్వేషణ ఇది సెక్సు వల్ల కొంత స్తబ్దత ఏర్పడినట్లు కనబడుతుంది. సంసారం ఓ కొలిక్కి వచ్చాక ముప్ఫై అయిదూ నలభై ఏళ్ల వయసులో రెండో విడత శృంగారయాత్ర వీరవిహారం మొదలవుతుంది. ఆ వీరవిహారంలో కొన్నిసార్లు తప్పటడుగులు క్కూడా దారితీస్తుంది.
"ఏమిటటూ యిటూ చూస్తున్నారు. నేనిటున్నాను"
ఆమె చొరవకతను ఆశ్చర్యపోతున్నాడు.
ఇన్నాళ్ళూ...నా వంక దొంగచూపులు గడుపుతూ కాలక్షేపం చేశారుకదా. ఇప్పుడెదురుగా, ఏకాంతంగా దొరికే అవకాశం లభిస్తే ప్రక్కచూపులు చూస్తారేం?"
"నేనేం మీవంక దొంగచూపులు చూళ్ళేదు" అంటూ చప్పున ఆమెవంక ముఖం త్రిప్పాడు.
స్నానం చేస్తూ చేస్తూ మధ్యలో వచ్చిందేమో, నుదుటి మీద, చెంపలమీద, మెడమీద మిలమిలలాడుతూ నీటి బిందువులు...
లోపలి వయ్యారాలని సందర్శింపజేస్తూ చాలా పల్చటి టవల్.
"చూశాడు" అంది కొంటెగా.
"లేదు."
రాధాప్రియ చనువుగా, చిలిపిగా నవ్వింది. "అబద్ధాలు చెప్పటంలో నువ్వు చాలా చతురుడివి వినోద్" అంది అమాంతం సంబోధన మార్చివేస్తూ?
"నా తాళం చెవి..."
"ఇస్తాను..." అంటూ దగ్గరగా వచ్చి అతని వెనగ్గా వున్న అల్మారాలో చేయి పెట్టబోతున్నట్లు ముందుకు వంగింది. అలా వొంగటంతో ఒంటిని కప్పివున్న ఆ పల్చటి టవల్ కూడా ప్రక్కకి తొలగింది. ఆమె అనాచ్చాదిత వక్షోజాలు అతని ముఖానికి దగ్గరగా వచ్చాయి. ఊపిరి సలపనట్లయి ఆమెనుంచి తప్పించుకోవాలని రెండు చేతులూ పెట్టి వెనక్కి తోశాడు. అలా చెయ్యడంతో అతని చేతులామె వక్షస్థలం మీద పడక తప్పలేదు.
కొంచెం తూలి, నిలద్రొక్కుకుని విభ్రాంతిగా నిలబడింది.
"క్షమించండి. నాకిలాంటివి ఇష్టంలేదు అన్నాడు. లేచి నిలబడింది.
"అంటే?"
"ఈ మాదిరి...అక్రమ వ్యవహారాలు"
"నువ్వు చాలా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నావే. బహుశా నన్ను తేలికగా అర్థం చేసుకున్నట్లున్నావు."
ఆమె ధోరణి అదిరిపడి ఆశ్చర్యంగా చూశాడు.
"ప్రక్క పోర్షన్ లో కాపురముంటూన్న వాడివి కదా అని సభ్యతకోసం, మర్యాదకోసం... స్నానం చేస్తూ చేస్తూ కూడా మధ్యలో చీరయినా కట్టుకోకుండా, తువాల కప్పుకుని తలుపుతీశాను. సంస్కారం వున్న మనిషిని కాబట్టి కూర్చోమన్నాను. మర్యాద చేశాను. ఇంట్లో ఎవరూ లేరు కదా అని నువ్వే ఎడ్వాంటేజ్ తీసుకుని వెయ్యకూడని చోట చెయ్యి వేశావు, బ్రూట్ లా బిహ్వే చేశావు. నేను కాబట్టి తమాయించుకున్నాను. ఇంకో ఆడదయితే ఎంతయినా అల్లరిపెట్టేది. ఇక్కడ్నుంచి వెంటనే వెళ్ళిపో"
అతని నివ్వెరపాటుకు హద్దులేదు. షాక్ లోంచి కోలుకున్నాక ఆమెతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవటమనవసరమనుకుని అక్కడ్నుంచి కదిలి విసురుగా బయటకెళ్ళిపోయాడు.
* * * *
ఆ రాత్రి వినోద్ కు చాలాసేపు నిద్రపట్టలేదు. ఒకవైపు నుంచి మనస్సులో కాల్చేస్తున్న బాధ, రెండోవైపు నుంచి శరీరమంతా ఏవో నొప్పులు...
అతనికి కొంచెం దగ్గరలో పడుకున్న మాధురికి కూడా నిద్రపట్టడం లేదు.
వినోద్ అటూ ఇటూ కదలడం గమనిస్తూనే వుంది.
ఆమెకు పదే పదే దీక్షిత్ గుర్తు వస్తున్నాడు.
ఎందుకలా__తన వెంటబడతాడు! మొదట్లో కోపమొచ్చింది. రాను రానూ ఆ కోపం కరిగిపోయి అతన్ని గురించి ఆలోచించేలా చేస్తున్నది. ఎంతో కఠినంగా వుండాలనుకుంటోంది. ఉండలేకపోతున్నది. ఏదో ఆకర్షణ అటువైపు లాక్కుపోతున్నది. దీన్ని ప్రేమంటారా? వయసువల్ల కలిగే ప్రకంపనలు...వ్యామోహమంటారా? తాను తప్పు చేస్తున్నదా?
తెలియడం లేదు.
ఆమెకు భయంగా వుంది.
ఆమె మనసు వ్యాకులపాటుతో వుంది.
ఆమె హృదయం క్షణం క్షణం పెరిగే పరవశత్వానికి లోనవుతుంది.
ఆమెకు దుఃఖం వుంది.
ఆ దుఃఖంలో ఏదో సుఖం మిళితమై వుంది.
* * * *
ఆ రాత్రి రాధాప్రియకు కూడా నిద్ర పట్టడం లేదు.
ఆమె మనసు నిప్పులు చెరుగుతోంది.
ఆమె శరీరం మంటలు వెదజల్లుతోంది.
"ఒరేయ్ వినోద్, నువ్వు కాస్త అందంగా వున్నావని, యవ్వనంలో అఘోరిస్తున్నావని మోజుపడితే ఇంత దారుణంగా అవమానిస్తావా? నా పర్సనాలిటీ మీద, వ్యక్తిత్వం మీద ఇంత బలంగా దెబ్బకొడతావా? నువ్వేం ప్రవరాఖ్యుడివా? మహా మహా పోటుగాళ్ళే నా చుట్టూ గంగవెర్రులెత్తుతూ ప్రదక్షిణాలు చేస్తున్న వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నువ్వెంతరా ఆఫ్ ట్రాల్. నువ్వో బడుద్దాయివీనూ, నీ బతుక్కో పనికిమాలిన వదినా. దాన్ని చూసుకుని నీకు ఒంటినిండా పొగరూ. ఇద్దర్ని తొక్కిపారేస్తున్నానురా. ఈ రాధాప్రియ తడాఖా అంటే ఏమిటో చూపిస్తాను.