"పక్కింటి వారి దగ్గర నగలు అరువు తెచ్చాను --- పెట్టొచ్చా?"
"మంచిదానివి ముందుగానే చెప్పావు! ఇలాంటి డాబులు వాడి కసలు పనికి రావు. బొట్టూ - కాటుకా, పూలు పెట్టి శుభ్రమైన చీర కట్టుకు రమ్మను చాలు అయినా దీనికి నగలేందుకు ?"
"సరే! సరే!" అంటూ లోపలి కెళ్ళి పోయింది పార్వతి.
సత్యనారాయణ రామచంద్ర రెండు చేతులూ పట్టుకుని ఎవరో అపూర వ్యక్తిని చూస్తున్నట్లు చూశాడు ."ఎంత బాగున్నావయ్యా! చదువుకున్నవాడివి - నిజంగా మా అమ్మాయిని చేసుకుంటున్నావా? మీ నాన్న నీకు పూర్తిగా చెప్పాడో లేదో? నేనూ కట్నాలియ్యలేను సరే! నీకు మోటారు సైకిలూ, వాచీ, ఇలాంటివి కూడా కొనియ్యలేను. పండగలూ అవీ వస్తే కొత్త బట్టలూ అవి కుట్టించలేను - చేసుకుంటావా? నిజంగా ఏమీ అక్కర్లేకుండా మా అమ్మాయిని చేసుకుంటావా?"
"ఏవండీ ఇలా రండి" లోపల్నుంచి అరిసింది పార్వతి.
"వస్తా! వస్తా!" అంటూ లోపలికి వెళ్ళాడు సత్యనారాయణ. అస్థిపంజరంలాంటి వృద్దుడ్ని అతని కళ్ళల్లో బెడురుని , అతడి మాటలలో ఆర్తినీ గమనించిన రామచంద్ర హృదయం కదిలిపోయింది.
ఆ పిల్ల బాగున్నా బాగుండకపోయినా తప్పక చేసుకు తీరాలనే నిర్ణయానికి వచ్చేశాడు. ఈలోగా సత్యనారాయణ మళ్ళీ వచ్చాడు.
"ఏమీ ఇవనంతే ఏమీ ఇవననీ కాదు. ఇస్తాను, ఎప్పుడయినా నా దగ్గర డబ్బున్నప్పుడు - ఎప్పుడో ఒకప్పుడు ఉండదా? అప్పుడు నేను తాగకుండా - ఉండగలను లే! తాగకుండా కూడా ఉండగలను - ఆ డబ్బు పెట్టి నీకు"
"ఏవండీ! కాస్త బజారు కెళ్ళి అరటిపళ్ళు తీసుకురండి" అంటూ పార్వతి భర్త కేసి కోపంగా చూస్తూ సంచి చేతి కిచ్చింది.
"సంచీ యిచ్చావు - సంచీ చూపిస్తే అరటిపళ్ళు యిస్తారా?" రామచంద్ర వృద్దుడ్ని ఆదరంగా చూస్తూ ' ఎక్కడికి వెళ్లొద్దు ఇప్పుడేమీ అక్కర్లేదు " అన్నాడు. సత్యనారాయణ వెంటనే కూర్చున్నాడు.
"నువు నిజంగా మంచి వాడివే నా దగ్గర డబ్బున్నప్పుడు నీకు ఉలెన్ సూటూ , వుంగరం ..."
'అయన మర్యాదకి వద్దంటే కుర్చోడమేనా?" కోపంగా అంది పార్వతి. లేచాడు సత్యనారాయణ. చెయ్యి పట్టుకు కూర్చోబెట్టాడు రామచంద్ర.
"నిజంగా వద్దండీ అత్తయ్యగారూ? మీరాయనని అనవసరంగా కష్ట పెట్టకండి" అన్నాడు. కాబోయే అల్లుడిని గౌరవంతో చూసి లోపలి కెళ్ళి పోయింది పార్వతి. 'అత్తయ్యగారూ "అన్న అతని సంభోధన ఆమె చెవులలో అమృతం నింపింది.
తీరుబడిగా ఎరుపు నగలు అద్దంలో చూసుకుంటూ అలంకరించుకొంటున్న లతను చూసి "ఆ నగలన్నీ తీసెయ్యి" అంది పార్వతి.
తాత్కాలికంగానే అయినా అన్ని నగలు అలంకరించుకోగలుగుతున్నందుకు మురిసిపోతున్న లత బెంగగా "ఏం?" అంది.
'అతని కిలాంటివన్నీ ఇష్టం లేదుట! తెసెయ్యి. ఆ పట్టు చీర కూడా వద్దు. వెంకటగిరి జరీ చీర కట్టుకో" ఉసూరు మంది లత ప్రాణం.
నగలంటే ఇష్టం లేదుట! ఇక మందు కూడా తనకు నగలెం చేయించాడు కాబోలు అనుకుంటూ దిగులుగా నగలన్నీ తీసేసి వేంకటగిరి చిరెతో వచ్చి కూర్చుంది లత. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు రామచంద్ర.
ఇదెలా సాధ్యం? ఈ అమ్మాయిలో వారిజ పోలికలేలా వచ్చాయి . వారిజ ముఖంలో వున్న సౌమ్య రేఖ లేదు.
వారిజ కన్న ఒక చాయ తక్కువ. వారిజ కళ్ళల్లో ఏదో చిలిపితనం, చైతన్యం నీటిలో లీనమయిన ఒక ఆర్ద్రత కనిపించవేం. ఈ అమ్మాయి కళ్ళు కొంచెం బెదురుతున్నాయి.... పెళ్ళి కూతురు కావటం వల్ల కావచ్చు. కళ్ళు ఏవో కలలు కంటున్నట్లు వున్నాయి బరువుగా మెత్తగా. ఈ స్వల్ప బేధాలు తప్పిస్తే వారిజే ఎదురుగా కుర్చున్నట్లుంది.
లత కూడా అతనిని చూసి ఉలిక్కిపడింది . ఇదేమిటి? బి.ఎస్.సి పాసయ్యడంటే సూటు బూటుతో దర్జాగా వుంటాడనుకుంది. కాని , ఇలా పంచె , చొక్కాతో పల్లెటూరి బైతులా వున్నాడేమిటి?
అన్నట్లు ఇతనుండేది పల్లెటూళ్ళో కదూ? స్వంత వ్యవసాయం కూడాను ......లోలోపల చాలా నిరుత్సాహ పడింది లత. తదేకంగా లతను చూస్తోన్న రామచంద్రను చూసి నవుకుంది కళ్యాణి. "చాలు, చాలు రాము! దృష్టి తగిలెను! మూడు ముళ్ళూ పడ్డాక తనివి తీరా చూసుకుందువు గానిలే" అంటూ నవింది. అందరూ నవారు. రామచంద్ర సిగ్గుపడ్డాడు. లత కూడా సిగ్గుపడి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది.
"మా అమ్మాయి నచ్చినట్లేనా?" ఇంకా తన అదృష్టంలో తనకు నమ్మకం కుదరక బెంగగా అడిగాడు సత్యనారాయణ. చిరునవుతో తల ఊపాడు రామచంద్ర్తం.
'ఇంకా అడగాలిటండీ! ఆ చూపులు తెలియటంలా?" నవింది కళ్యాణి.
ఆ సాయంత్రమే వెళ్ళిపోయారు రామచంద్రం , కళ్యాణి. అందరూ సంతోషించారు. ఒక్క లత తప్ప. లత ఆశలు వేరుగా వుండేవి ఇన్నాళ్ళూ. అక్కయ్య వేలకి వేలు సంపాదిస్తోంది. ఒక్క ఆరేడు వేలు తనకు కట్నంగా ఇయ్యకపోతుందా? ఒక ఇంజనీరో, డాక్టరో తనకు భర్త రాకపోతాడా? హాయిగా పట్టు చీరెలు కట్టుకుని బోలెడు నగలు పెట్టుకుని యింటి పనంతా దాసీలు చేస్తుంటే , తనూ, తన భర్త కార్లలో తిరుగుతుంటే ఎంతో కమ్మగా వుంటుంది జీవితం! అలా వుండవలసిన జీవితాన్ని వారిజక్కయ్యే పాడుచేసింది ....మధ్యలో అమాంతంగా మంచిదానిలా మారిపోయింది . అయినా ఒకసారి చెడిపోయాక మళ్ళీ మంచివాళ్ళేలా అవుతారు? రెంటికీ చెడ్డ రేవడి కాకపోతే.
వారిజ మీద కోపంతో వుడికిపోయింది లత. మనసు తను సినిమా హీరోల్లా లేని రామచంద్ర, లతను మనసునంతగా మురిపించలేకపోయాడు.
------------
కట్నమయితే ఇవక్కరలేదు కాని పెళ్ళి ఖర్చులో? పార్వతి , సత్యనారాయణలకి దొక సమస్య అయిపొయింది. సత్యనారాయణ లేచి ఓపిక తెచ్చుకు తిరుగుతున్నాడు. కాని డబ్బెలా పుట్టించగలడు?
చివరకు వారిజ తప్ప గత్యంతరం కనిపించలేదు పార్వతికి. బాధపడుతూనే రవిని పంపింది రవి విసుక్కున్నాడు.