Previous Page Next Page 
ఖడ్గసృష్టి పేజి 17


                           భ్రమరగీత


            (శాంతిలో అశాంతి అశాంతిలోనే శాంతి అనుభవించగలడు శ్రీశ్రీ)

    గిరగిరగిరాం
    భ్రమరం
    గిరాం భ్రమణం
    భ్రమం
    'భ్రమరణం'
    భ్రమణ భ్రమరం
    భ్రమర భ్రమణం
    గిరగిర గిరాగిరాగిరాం భ్రమణం
    రణం
    మరణం
    రణమరణం దారుణ హననం
    ధిషణానిధనం
    వృథామథనం
    అది నా చెవిలో కథనం
    లోకధనం
    కదనం
    కదన కథాకథనం
    అది నా యెదలో రణనం
    ఝణ ఝణ ఝంఝణ ఝణా ఝణా నిక్వణనం
    అది నా నయనంలో ప్రథ మారుణ కిరణం
    రణ నిస్సహణం
    వధా విధా నాచరణం
    నాలో లోలోపల భ్రమా భ్రమర సంచరణం
    రణద్రణ నిస్సహణ ప్రణవం
    అది నా హృదయంలో రుధిర జ్వలనం గీతాజననం!!!

 

                          * * *

 Previous Page Next Page