Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 16


    "అయింది మావయ్యా!"
    "ఇవాళ్టి నుంచి ఇల్లు వదిలి బయటకు వెళ్ళారంటే బెల్ట్ తెగేవరకూ కొడతాను. తెలిసిందా?"
    చిరంజీవి మంచం మీద పడుకున్నాడు.
    పిల్లలు పక్కనే చాపమీద కూర్చుని స్కూలు పుస్తకాలు చదువుకోసాగారు బుద్ధిమంతుల్లాగా.
    ఆరోజు నుంచి బ్రతుకు తెరువు ఏమిటా అనే విషయం అర్థంకావటం లేదతనికి.
    ఏదయినా రాజకీయ పార్టీ మారినప్పుడల్లా సమస్యలు వస్తుంటాయ్.
    అదివరలో తను కొంతకాలం ఓ పార్టీలో పనిచేశాడు.
    ఆ పార్టీ బంద్ లు నిర్వహించినప్పుడల్లా తను ఇంకొంతమంది చిల్లర గూండాలను వెంబడి వేసుకుని దుకాణాలు బలవంతంగా మూయించేస్తుండేవాడు.
    అందుగ్గాను తనకు రెండు మూడువేల రూపాయల వరకూ ముడుతుండేవి.
    అంత డబ్బు ఒకేసారి వచ్చేసరికి తాగుడు అలవాటయిపోయింది. మరిప్పుడేమిటి చేయటం?"
    అదివరకు తనకీ పిల్లల బాధ్యత లేదు కాబట్టి తన కిష్టంవచ్చినట్లు ప్రవర్తించాడు. కాని ఇప్పుడీ పిల్లలను అక్కయ్య తనకు అప్పజెప్పి వెళ్ళిపోయింది.
    రాత్రంతా నిద్రలేకపోవడంతో వెంబడే నిద్రపట్టేసిందతనికి.
    నిద్రలో కల...
    ఒంటరిగా ఓ రోడ్డు మీద వెళుతున్నాడు తను. ఆరోజు నగరమంతా కర్ఫ్యూ వుంది. పోలీసులు తనను చూసికూడా తెలిసిన వాడవటం చేత ఊరుకుంటున్నారు.
    హఠాత్తుగా కార్లో దీప వస్తూ కనిపించింది.
    తను కారుకి అడ్డంగా నిలబడ్డాడు.
    కారు ఆగిపోయింది.
    "ఏయ్....బ్లడీ ఫూల్! చస్తానికి నిలబడ్డావా?" కోపంగా అరిచిందామె.
    "అవును. దమ్ముంటే చంపు."
    ఆమెక్కూడా కోపం పెరిగిపోయింది.
    కారుని అమాంతం స్టార్ట్ చేసి మీదకు డ్రైవ్ చేసింది.
    దగ్గరకు రాగానే రెండు చేతులతో అమాంతం కారుని ఆపేశాడతను.
    ఆమె యాక్సిలేటర్ ఎంత నొక్కినా ప్రయోజనం కనిపించటం లేదు.
    చక్రాలు తిరిగిపోతున్నాయ్ గానీ కారు ముందుకి కదలటం లేదు.
    ఆమె కోపంతో పిచ్చిదయి పోతోంది.
    ఇంజన్ ఆపి కోపంగా డోర్ తెరుచుకుని బయటకొచ్చింది.
    అమాంతం గాలిలోకెగిరి కరాటే కిక్ ఇవ్వబోయింది.
    తను చటుక్కున ఆమె కాలు పట్టుకున్నాడు. దాంతో బాలెన్స్ అవుటయి కిందపడిపోయింది.
    వెంటనే ఆమె జుట్టు పట్టుకుని లేపి నిలబెట్టాడతను.
    "ఏమే! ఆ రోజు ఏమిటి కూశావ్? నేను ఇడియట్ నా, మునిసిపల్ డ్రయివర్ నా? బాస్టర్డ్ నా? ఏదీ ఇప్పుడు వాగు చూద్దాం."
    "ఏయ్ వదుల్తావా? పోలీసుని పిలవమంటావా?"
    "పోలీసా? కానిస్టేబుల్ కనకారావ్ మా ఫ్రెండే! నన్నెవడూ ఏమీ చేయడు. తెలుసా?"
    "వదులు ముందు" అతని చేతిని కొరకబోయిందామె.
    అమాంతం ఆమె చెంపమీద బలంగా కొట్టాడతను.
    "ఆ రోజు డోర్ తెరచి పట్టుకోలేదని చెంప మీద కొట్టి ఇన్సల్ట్ చేస్తావా? అదీగాక కారుకి నువ్వే యాక్సిడెంట్ చేసి నేను చేశానని మా ప్రొప్రయిటర్ కి చెప్తావా? నేను కారు వదిలిపారిపోయానా?" ఆమె చెంపలు మళ్ళీ వాయించేస్తున్నాడు.
    "డాడీ! డాడీ! నన్ను ఛంపేస్తున్నాడు" అరుస్తోందామె.
    "డాడీ కాదుగదా నిన్ను రక్షించడానికి నీ తాత కూడా రాడిప్పుడు."
    "నీకు నమస్కారం చేస్తాను. నన్నొదిలేసెయ్."
    "అంత తేలిగ్గా వదులుతానా? నిన్ను సినిమాల్లో లాగా రేప్ చేస్తాను."
    ఆమె కెవ్వున కేక వేసింది.
    "అంతపని చేయకు! నన్ను క్షమించు. నేను నీపట్ల అమానుషంగా ప్రవర్తించాను."
    "మగాళ్లంటే కుక్కలనే భావం నీలో ఉన్నందుకు నీకీ శిక్ష తప్పదు" అంటూ ఆమె మీదకు జరిగాడతను.  
    ఆమె అమాంతం తన కాళ్ళమీద పడిపోయింది.
    "నన్ను అన్యాయం చేయకు, ప్లీజ్."
    చిరంజీవికి అప్పటికి కసి తీరింది.
    "వెళ్ళు. ఇక్కడినుంచి నడిచి ఇంటికి వెళ్ళు."
    ఆమెను వెనక్కు తోసి తను ఆమె కారులో స్టీరింగ్ ముందు కూర్చుని కారు స్టార్ట్ చేశాడు.
    ఆమె ఏడుస్తూ వెనుక పడింది.
    "చిరంజీవి...అయామ్ సారీ! నన్ను క్షమించు చిరంజీవి."
    అప్పుడు మెలకువ వచ్చిందతనికి.
    పిల్లలంతా చుట్టూ మూగి చూస్తున్నారు తనవంకే!
    "ఏమిటి మావయ్యా! వెళ్ళు వెళ్ళు వెళ్ళు అరుస్తున్నావ్ ఎవరిని?"
    చిరంజీవి లేచి కూర్చున్నాడు.
    "ఎవరూ లేరురా! కల వచ్చింది."
    వాళ్ళ మొఖాల్లో ఆశ్చర్యం కనిపించింది.
    "ఏం కల మావయ్యా అది?"
    "చాలా మంచి కలరా!" ఆనందంగా అన్నాడతను.
    "కల నిజంగా జరుగుతుందా మావయ్యా?"
    చిరంజీవి మొహం విచారం అలుముకుంది.
    "ఊహు! కలలు ఎప్పుడూ నిజం కావురా!"
    "కాని మొన్న నాకొక కల వచ్చింది మావయ్యా! అది నిజం అయింది."
    "ఏమిటది?" ఆశ్చర్యంగా అడిగాడు చిరంజీవి.
    "నా బంతి ఆ గణేష్ గాడు కొట్టేసినట్లు రాత్రి కల వచ్చింది. మర్నాడు మేము ఆడుతూంటే వాడు నిజంగానే కొట్టేశాడు."
    చిరంజీవి నవ్వాడు.
    "ఒకోసారి నిజమవుతాయిరా కలలు."

 Previous Page Next Page