అవతలి గట్టు
-ఇవేమిటీ వింత భయాలు? -ఇంట్లో చీకటి!
-ఇవేమిటీ అపస్వరాలు? -తెగింది తీగ!
-అవేమిటా రంగుల నీడలు? -చావూ, బ్రదుకూ!
-ఎచటికి పోతా వీ రాత్రి? -అవతలి గట్టుకు!
16-6-1934
* * *