"గాడ్... ఫోన్ పనిచేస్తున్నట్లు లేదు" యింకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
అప్పటికే స్వేదంతో తడిసిపోయిన రాజ్యం రొప్పుతూ చేతులతో తలపట్టుకుంది.
"భయపడకండి మేడమ్..." గూర్ఖా అన్నాడు జాలిపడుతూ "నేనుండగా ఈ గెస్ట్ హౌస్ లోకి ఎవరూ అడుగుపెట్టలేరు... సర్... ఆ ఫోన్ పనిచేయదు..."
"షిట్" నిస్త్రాణగా ఓ సోఫాలో కూలబడిపోయాడా యువకుడు.
"పట్టపగలు... బాస్టర్డ్సు... ఈ పోలీసులేంచేస్తున్నారో అర్థం కావడంలేదు" అన్నాడు కర్చీఫ్ తో మొహం తుడుచుకుంటూ. "మీరు కాస్త రిలాక్సవ్వండి. బయటపరిస్థితి చూసొస్తాను" అంటూ ద్వారం దాటి బయటికి వెళ్ళిపోయాడు.
ఒక ప్రమాదం నుంచి గట్టెక్కిన రాజ్యం ఆ వ్యక్తి సభ్యతకి, సంస్కారానికి చేతులు జోడించింది.
"మేడమ్. ముందు మీరీ మంచినీళ్ళు తాగండి"
గూర్ఖా కూజాలో నీళ్ళు అందించాడు.
గడగడా తాగేసింది ఒకటికాదు... రెండు గ్లాసులు.
ఒకటి... రెండు... మూడు నిముషాలు గడవలేదు. ఏదో వికారంగా అనిపించింది.
అదికాదు... శరీరం తూలిపోతూంది.
కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.
"ఏమైంది అడిగాడా యువకుడు లోపలికి వస్తూ.
"నాకేదోలావుంది"
"గాడ్" ఆమెను పైకెత్తుకున్నాడు.
మగతగా కళ్ళుమూస్తున్న ఆమెను లోపల బెడ్ పైకి చేర్చాడు.
"ఇ... దే... మి... టి"
"శయ్యాగారం డాళింగ్"
బెడ్ రూంలోని ఓ రివాల్వింగ్ చైర్ మాటాడుతున్నట్టనిపించి అంది.
"వ... ద్దు..." నిస్సత్తువగా అంది. ఒంటిపై చీరని లాగేస్తున్నారెవరో. ఎవరో కాదు... ఇందాక మోటార్ బైక్ పై తనను తీసుకొచ్చిన వ్యక్తి. "నువ్వు..."
"నా అనుచరుడు" రివాల్వింగ్ చైర్ పైనుంచి లేచాడు ఓ యువకుడు... "కంగారుపడకు - మాకు ఇది మామూలే. ఓ గాంగువెంటపడటం, నా అనుచరుడు సూర్యం ఇలా రక్షించుకు తీసుకురావడం, ఇక్కడ ఫోన్ పనిచేయక పోవడం, గూర్కా మంచినీళ్ళివ్వడం, అమ్మాయిలకి మైకం కమ్మడం, అన్నట్టు... నీ తండ్రికి బాగోలేదని క్లాసులోకి మెస్సేజ్ పంపిందీ నేనే."
ఆమె తూలిపోతూ చేతులు జోడించింది.
బ్రతుకు కాలిపోతూందన్న భయంతో పాదాలపైన పడింది.
అయినా -
"కంగారుపడకు డాళింగ్... కన్నెపిల్లల్ని తొలిసారి బోణీ చేసేది నేనే అయినా ఆ తర్వాత నువ్వు అంతర్జాతీయస్థాయికి ఎదిగిపోతావ్. ప్రామిస్..."
ఆమెకు గుర్తుంది తను నగ్నంగా మారటం.
ఆ తర్వాతదే ఆమెకు అనుభవంలేని విషయం.
శరీరంపై సుతిమెత్తని స్పర్శ.
సబ్ కాన్ షస్ గా నిరోధిస్తూ ఓడిపోతుంది.
అలా ఎంతసేపు పోరాడిందో ఆమెకే గుర్తులేదు.
కాని వున్నట్టుండి మెలిపెట్టిన బాధ.
ఏమైంది...
ఆమె కళ్ళనుంచి ఆ స్థితిలో కూడా నిస్సహాయంగా నీళ్ళు రాలుతున్నాయి.
ఇక్కడ ఇంత ఆర్గనైజ్ గా ఈ వ్యవహారం నడుపుతున్న వ్యక్తి ఎవరో కాదు...
దేశ ఉపప్రధాని కొడుకు మహేంద్ర.
ఒక ఆడపిల్ల పతనానికి ఇది ఆఖరిమెట్టుకాదు... ప్రారంభం. ఈ రాకెట్ లోనే మహేంద్ర శమంత్ కి ప్రత్యర్థిగా మారింది.
* * *
మేఘావృతమైన ఆకాశం ఏ క్షణంలో అయినా వర్షించేట్టుంది.
అప్పటికి సూర్యుడు అస్తమించి రెండు గంటలయింది.
మొదలుగాబోతున్న కుంభవృష్టికి సూచనగా ఈదురుగాలి.
విశాఖ నగరపు నడిబొడ్డుపై ట్రాఫిక్ తగ్గుముఖం పడుతూంది.
ఉన్నట్టుండి కరెంట్ సప్లయ్ పోయింది.
కళ్ళుపొడుచుకున్నా కనిపించనంత దట్టమైన చీకటి.
ఆగాడు శ్రీహర్ష.
మరో పదినిమిషాలలో షాపుకెళ్ళి టాయ్స్ కొనాలనుకున్న అతడిప్పుడు సందిగ్ధంలో నిలబడి వుండగానే...
సమీపంలో ఓ కారు ఆగింది.
అతడు ఏం జరుగుతున్నదీ గ్రహించేలోగానే వెన్నెముకపై రివాల్వర్ గుచ్చాడో వ్యక్తి.
"మర్యాదగా కారెక్కు"
ప్రత్యర్థులు ఎంతమంది వున్నదీ తెలీడంలేదు.
పోరాటం అతడికి కొత్తకాకపోయినా తొందరపడలేదు.
సాధ్యమయినంత త్వరలో ఈ దేశం వదిలి వెళ్ళాలనుకుంటున్న శ్రీహర్ష యిక్కడ హంతకుడిగా చరిత్ర సృష్టించాలని కోరుకోవడం లేదు...
అందుకే నిశ్శబ్దంగా కారెక్కాడు.
అతడికి సమీపంలో సాయుధులయిన వ్యక్తులు కూర్చున్నారు.
వెనుక మరో కారుకూడా ఉంది.
ఎందుకు వీళ్ళంతా కోరి నన్ను రెచ్చగొడుతున్నారు? అసహనంగా అనుకున్నాడు కారు కదుల్తుంటే.
* * *
సరిగ్గా ఇదే సమయంలో...
ఫ్రాన్స్ దేశపు పారిస్ నగరంలోని ఇంటర్ పోల్ హెడ్ క్వార్టర్ లో సెంట్ క్లౌడ్ బిల్డింగ్ లో రేడియో టెలీకమ్యూనికేషన్స్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నాడు ఇంటర్ పోల్ అధికారి నెపోటె.
అక్కడ టెలెక్స్, టెలిటైప్, రేడియో, టెలిగ్రాఫ్ మిషన్సుముందు ఆపరేటర్స్ కూర్చుని వివిధ దేశాలనుండి అత్యవసరమైన సమాచారాన్ని అందుకుంటున్నారు.
వారంరోజుల క్రితం కెనడానుంచి తప్పించుకున్న 'షా'కి చెందిన వివరాలివి :
సెంట్ క్లౌడ్ బిల్డింగ్ పైభాగానకల నలభై 'జైంట్ యాంటెన్నాన్' షాకి సంబంధించిన ముఖ్య సమాచారం సేకరణకి కేటాయించబడ్డాయి.