Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 11

 

    బావురుమని ఏడ్చాడు సత్యనారాయణ . పసిపిల్లలా తండ్రి ఒళ్ళో వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది వారిజ.
    "ఏమిటమ్మ! ఏమిటి?" గాభరాగా అన్నాడు.
    "ఆ ....! ఆ....! ఆ ముసలాడికిస్తున్నా? చ- చ ఏడవకమ్మ! వాడికివను. అంతకంటే తాతలాంటి సంబంధం తాతంటే ముసలాడిని కాదు .........తాతంటే ...." అక్కడ నుంచి వెళ్ళిపోయింది వారిజ.
    ఆ రాత్రే మాధవితో కలిసి ఊరు విడిచి పెట్టింది వారిజ.

                                                                4


    మాధవి వారిజ ను పరిచయం చేసిన డైరెక్టర్ కి వారిజ కంఠం కంటే రూపం నచ్చింది. "నటించటం చేతవునా?" అని అడిగాడు. బెదిరిపోయి చూసింది వారిజ.
    'చక్కగా నటించగలవు' అన్నాడు డైరెక్టర్. అలా చిత్రమైన మలుపు తిరిగింది వారిజ జీవితం. మొదటిసారిగా డైరెక్టర్ దగ్గరిగా మీదకు లాక్కుని బలంగా అదుముకున్నాడు అతను ....."ఇలా అయితే ఎలా నటిస్తావ్?" అంటూ.
    "దానికీ దీనికి ఏం సంబంధం? నాకు నటించగలిగే శక్తి ఉంటే పైకొస్తాను. లేకపోతే లేదు" అంది వారిజ. పకపక నవ్వాడు.
    "నీ టేలెంట్ కు మా బోటి వాళ్ళ సహకారం ఒక మైనర్ పాయింట్! మా కిష్టమయిన వాళ్ళకి చాన్స్ ఇస్తాం. మా కిష్టం లేకపోతే నటనకు ఏ మాత్రం అవకాశం లేని పాత్ర కల్పించి, ఏం నటించలేదని ప్రచారం చేస్తాం. అంతా మా చేతుల్లో వుంది. అయినా ఇంత మాత్రానికే బెదిరిపోతే ఎలా?"
    అయోమయంగా అతని కౌగిలిలో ఒదిగిపోయింది వారిజ. తర్వత తర్వాత అర్ధమయింది వారిజకు. "ఇంత మాత్రానికే బెదిరిపోతే ఎలా?" అన్న మాటలకు అర్ధం. అర్ధమయినా కాకపోయినా ఒకటే ఒక విచిత్రమైన పరుగు ప్రారంభించింది . ఇది పరుగే! అపడానికి లేదు. ఆపితే అక్కడే వేగంగా, ఉక్కిరి బిక్కిరిగా పరుగెత్తాలి. వేగంగా ఇంకా వేగంగా , ఉక్కిరి బిక్కిరిగా అప్పుడప్పుడు వారిజ ల్లోపల ఏమో గొంతులు అక్రిశించెవి. హృదయం ఏదో ఆర్తితో కొట్టుకుపోయేది.
    వెనక్కు తిరిగే అవకాశం లేదు. ముందుకే మరింత వేగంగా పరుగు - హృదయం ఆక్రోశించిన కొద్దీ భరించలేక పరుగు వేగాన్ని మరింత హెచ్చించేస్తుంది. ఆర్ధికంగా ఇబ్బందులకు తట్టుకోలేక ఇక్కడ కొచ్చింది ఇక్కడా ఆర్ధికమైన ఇబ్బందులే! అక్కడ ఆనాటి బియ్యానికి ఒక రూపాయి, ఆ పూట కూరకి అర్ధరూపాయి అవసరమయ్యేది . వాటి కోసం ఇబ్బంది పడేది . ఇక్కడ ఇబ్బంది వేలకు వేల రూపాయల ఇబ్బంది.
    సరికొత్త మోడల్ కారు కొనాలి. పాత మోడల్ కారు ఏం బాగుంటుంది? అది అమ్మేయ్యాలి. డబ్బు సరిపోదు.
    రేపు ఏదో చిత్రం ప్రారంభోత్సవం జరుగుతుంది. వెళ్ళాలి. మంచి చీర కొనుక్కోవాలి. ఎప్పుడూ పాత చీరలేనా? అద్దె ఇల్లు విసుగొస్తుంది. సొంత ఇల్లు కొనుక్కోవాలి. డబ్బు లేదు. డబ్బు లేదు డబ్బు సరిపోదు. డబ్బు ఇబ్బంది. అక్కడి సమస్యలకు భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చింది. ఇక్కడా సమస్యలే.
    ఫలానా చిత్రంలో తనకు చాన్సియ్యలేదు. ఏదో చిన్న వేషం ఇచ్చాడు . అలాంటి వేషం వస్తే పేరు పడిపోతుంది.
    మొన్న అదా మోదర్ తో కాస్త నవుతూ మాట్లాడినందుకు ప్రొడ్యుసర్ గారు కనుబొమలు ముడుచుకున్నారు. పబ్లిగ్గా సాగే ఈ వ్యవహారాల్లోనూ ఈర్ష్యాలూ, కలతలూ తప్పవు. ఈ మధ్య బొత్తిగా అవకాశాలు రావటం లేదు ఎలా ఇలా అయితే? మొన్నీ మధ్య తను హీరోయిన్ గా చేసిన పిక్చర్ పూర్తిగా ఫెయిల్యూర్ అయింది.
    వెధవది, డైరెక్షన్ లో లోపం , కధ బలమైనది కాదు మిగిలిన యాక్టర్లు సరీగా చెయ్యలేదు. ఇన్ని కారణాలతో పిక్చర్ ఫెయిలయితే . మధ్య తనకప్రతిష్ట , ఫలాని ఆవిడ వేషం వేసిన పిక్చర్ హాప్ లెస్ ఫెయిల్యూర్ అనీ .
    ఈ మధ్య రామక్రిష్ణ కు యశోద మీద గాలి మళ్ళింది. బహుశా తన పిక్చర్లో ఆవిడనే హీరోయిన్ చేస్తాడు. పోనీలే! ఆ యశోద కేం చేతనవుతుంది నటన? ఆ పిక్చర్ ఫెయిల్యూర్ కాక తప్పదు. సమస్యలు , చికాకులు.
    "ఆ పూటకి గంజికి లేకపోయినా టిక్కెట్ కొని సినిమా చూస్తారు కూలిజనం. నెల క్లాసు వల్లే ఎప్పటికయినా డబ్బు రావాలి మనకీ. అందుకే వాళ్ళకు నచ్చేలా ఉండాలి పిక్చర్. అవార్డులు లేకపోయినా ఫరవాలేదు" అన్నాడు ప్రొడ్యుసర్.
    "ఆ పూటకి గంజీ లేని కూలిజనం దగ్గర నుంచి వస్తున్నాయి . ఈవేలన్నీ , ఈ కార్లు, సీలింగ్ ఫాన్ లూ , ప్లేస్ రోజ్ వుడ్ , ఫర్నిచర్ , విదేశీ విస్కీలు అన్నీ కడుపు మాడ్చుకొంటున్న కూలీ జనం పిండిన రక్తాశ్రువులు. ఆ పూట తిండి కూడా లేకుండా రిక్షా తొక్కుతూ "ఎస్ టివోడు బలే వేశాడ్రా!" అని మురిసిపోయే అమాయక జనుల నుండి కొల్ల గొట్టిన ఐశ్వర్యం.
    చటుకున అలోచించటమేమిటి బుద్ది లేకపోతె సరి! అప్పటికప్పుడు షాపింగుకు బయలు దేరింది. రవల నక్లెస్ కొనుక్కోటానికి.
    "వారిజా!' అన్న కేక విని డ్రైవర్ కు కారాపమని కేక పెట్టింది. చుట్టూ చూసింది . పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అస్తిపంజరం లాంటి ఆకారంతో వదులుగా వేళ్ళాడుతున్న పైజమా లాల్చితో, రేగిపోయిన జుట్టూ మాసిన గెడ్డంతో రవి ఒక్క క్షణం దిగ్బ్రమజెందింది.
    "వారిజా!" అంటూ సంబరంగా పిలిచాడు.
    "హుష్!" గాబరాగా అంది వారిజ. అప్పటికే కారు చుట్టూ జనం గుమిగూడి తననూ, రవినీ వింతగా చూస్తున్నారు. తన ఎడ్రసిచ్చి , అయిదు రూపాయలు చేతిలో పెట్టి "ఇంటికిరా మాట్లాడుకుందాం" అంటూ వెళ్ళిపోయింది.
    చాలా రోజులు వారిజ లోలోపల నిద్రపోతున్న ఏదో సున్నితత్వం మేల్కొని వారిజను సలపసాగింది. బయలు దేరిన పని మరచిపోయి డ్రైవర్ ను కారు వెనక్కు తిప్పమంది. మంచం మీద వాలి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది.
    వారిజ ముందే చెప్పి ఉంచటం వల్ల దరాన్ రవిని లోపలికి ప్రవేశింపనిచ్చాడు. ఎదురుగా వున్న ఫలహరాలను చూసి, త్వరగా వాటిని తినసాగాడు రవి. రవిని జాలిగా చూస్తూ "మనవాళ్ళంతా ఎలా ఉన్నారు రవి!" అంది.
    "బాగున్నారు. మొన్ననువేసిన సినిమా యెంత బాగుంది వారిజ. అందులో నీ డాన్స్ భలే వారిజా. నాకు స్టూడియో చూపించవా?" "అమ్మ ఆరోగ్యం ఎలా వుంది?"
    "బాగానే వుంది. నీకు సినిమా యాక్టర్లందరూ తెలుసు కదూ - నాకు చూపించవా? నన్ను షూటింగ్ చూడనిస్తారా!"
    "లతకు పెళ్ళయిందా?"
    "పెళ్ళా! ఎలా అవుతుంది.? అది గంప గయ్యాళిది . అదీ అమ్మా దెబ్బలాడుకొని రోజుండదు? నిన్ను తలుచుకుని అమ్మా దాన్ని రోజూ తిట్టి పోస్తూ వుంటుంది. వారిజా నాకు సినిమాల్లో వేషం దొరుకుతుందా?"
    "అయితే అమ్మకూ, నాన్నకూ నా మీద కోపం లేదా?"
    "కోపమా! కోపమెందుకు? నీ అదృష్టం యెంత మంది కొస్తుంది-? ఏదీ, లతను అవమను సినిమా స్టార్ కాగలదేమో."
    "వద్దు -వద్దు - లతకీ దురవస్థ వద్దు."
    'అవస్థమేటి వారిజా కార్లూ, బంగళాలు, సోఫాలు, డబ్బు, జనం నీ పేరు చెపుతే విరగబడతారు. నువేక్కడుంటే అక్కడ తీర్ధ ప్రజ......" ముందున్న బల్ల మీద వాలి కుమిలి కుమిలి ఏడ్చింది వారిజా.
    "ఏడుస్తున్నావా? దేనికీ ? నీకు ఏడుపు దేనికీ....? లత ఏడుస్తుంది. అమ్మ ఏడుస్తుంది. నువు ఏడవటం ఏమిటి?" వారిజ గబుక్కున కళ్ళు తుడుచుకుని నవింది.
    'అవును ఏడవటానికి అర్హత ;లేని నేను ఏడవటం ఏమిటి , కదూ?"
    "అంటే?"
    "తెల్లబోతూ అడిగాడు రవి."
    "ఏం లేదులే! ఇప్పుడు నేనోక్కసారి అమ్మని నాన్ననీ చూడటానికి వస్తే వాళ్ళు రానిస్తారా?"
    "ఎందుకు రానివ్వరూ? ఇప్పుడు నీ దగ్గిరింత డబ్బూ కార్లూ , మేడా, అక్కడే ముంది! దరిద్రం తప్ప." విరక్తితో ముఖం తిప్పుకుంది వారిజ.
    "సరేలే! ఇవాళ సాయంత్రం విమానంలో మానం బయలుదేరుదాం."
    "విమానంలోనే! నన్ను విమాన మెక్కిస్తావా . భలే! భలే! నువ్వు చాలా మంచిదానివి వారిజా." వారిజ అక్కడి నుండి లేచిపోయింది.
    ప్రస్తుతం తనతో రాత్రులు పంచుకుంటోన్న రాధాకృష్ణ కు ఫోన్ చేసింది.
    "నేను మా వూరు వెళుతూన్నాను. వారం రోజులు వరకూ రాను."
    "హమ్మో! వారం రోజులే! అయినా ఇలా సడన్ గా చెప్తే ఎలా? ఇప్పటికిప్పుడు నేనెవర్ని వెతుక్కోను?"
    "ఎలాగో అవస్థ పడుదూ వారంలో వచ్చేస్తాగా!"
    "నా సంగతి సరే - ! నీ కక్కడి చక్కిలిగిలి ఎవరు పెడతారు?" టక్కున ఫోన్ పెట్టేసింది వారిజ. ఇంకా జుగుప్స, అసహ్యం, ఆవేదన తనలో మిగిలి ఉన్నందుకు తనను చూసుకుని తనే ఆశ్చర్యపోయింది. వీధి గుమ్మంలో టాక్సీ ఆగినందుకు ఆశ్చర్య పోయిన లత ఒకరి వెనుక ఒకరు దిగుతున్న రవి, వారిజను చూసి మరింత ఆశ్చర్యపోయింది.
    వారిజ పేలవమైన నవుతో లతను సమీపించింది. "గుర్తున్నానా? నువు చాలా ఎదిగావు."

 Previous Page Next Page