"ఏమిటిది?" చికాకుగా అందామె.
"వంటింట్లో లవ్ - ఉజ్వల సాంఘిక చిత్రం. రోజుకొక అట! సాయంత్రం ఏడుగంటల నుంచి."
"ఉష్!"
ఆమెను తన వేపు తిప్పుకున్నాడు.
"ఇదిగో! మన తోలి పరిచయమునకు గుర్తుగా ......ప్రేమతో నీ .....సురేష్" జేబులో నుంచి అందమయిన చిన్న బుద్దుడి బొమ్మ తీసి ఆమె కిచ్చాడు. తులసి అది చూస్తూనే ఉప్పొంగిపోయింది.
"సో లవ్ లీ! ఎక్కడిది?"
"ప్రశ్నలోద్దు. నచ్చిందా?"
"ఎలా కొన్నావు?"
"వేర్ దేరీజ్ లవ్ దేరీజ్ వే."
అతని తలవంచి ముద్దు పెట్టుకుందామే.
"థాంక్యు డియర్! ఐ లవ్ దిస్. ఐ లవ్ యూ" అంది.
మర్నాడు రాత్రి ఏడు గంటలకి డేబనీర్ బార్ కు చేరుకున్నాడు . తులసి గంగాభవాని వాళ్ళింట్లో టి.వి సినిమా చూడడానికి వెళ్ళింది.
గేటు దగ్గరున్న ఎయిరిండియా మార్క్ రాజు అచ్చం అలాగే వంగి నమస్కరించాడు.
"ప్లీజ్ కమిన్ సర్! వెల్ కమ్."
"నేను డార్క్ డెవిల్ ని కలుసుకోవాలి. వాడు నా ఫ్రెండ్!"
"నాకు చెప్పారు సర్! రండి.....ప్లీజ్ కమిన్! మీ కోసం ఆ ముందు టేబుల్ రిజర్వ్ చేశారు."
సురేష్ లోపలికి నడిచి కూర్చున్నాడు.
డార్క్ డెవిల్ విజ్రుంభించి గిటార్ వాయిస్తున్నాడు.
"ఓ హసీనా జుల్ఫోవాలీ జానే జిహా?' పాట గిటారు. డ్రమ్స్ తో మోతెక్కిపోతోంది. డాన్స్ చేస్తున్న అమ్మాయి ఈ లోకాన్ని మరిచిపోయినట్లుంది.
తనూ ఆ అమ్మాయితో పాటు మరో లోకానికి వెళ్ళిపోయాడు సురేష్. డార్క్ డెవిల్ గిటార్ తాలుకూ తరంగాలు అందరినీ ఊపిపారేస్తున్నాయ్.
పాట అయిపొయింది.
ఆ అమ్మాయి లోపలికెళ్ళిపోయింది. స్పృహలోకి కొచ్చి చుట్టూ చూశాడు , ఆడా, మగ సెంట్ పర్సెంట్ మేకప్ లో కుర్చుని డ్రింక్స్ తాగుతున్నారు.
బేరార్ వచ్చి సురేష్ దగ్గర వినయంగా నిలబడ్డాడు.
"ఏం తెమ్మంటారు సార్?"
"ఏమీ వద్దు! నేను డార్క్ డెవిల్ కోసం వచ్చాను."
"డార్క్ డెవిల్ గారే చెప్పారు సార్! మీరేం ఆర్డర్ చేస్తే అది ఇమ్మని."
'థాంక్యు నాకేం వద్దు."
"ఫర్లేదు సార్! ఏదో ఒకటి తీసుకోండి! అందరూ అంత సుఖం అనుభవిస్తుంటే మీరు అలా నిశ్శబ్దంగా వుంటే బావుండదు. బిల్లు మీరు ఇవ్వక్కర్లేదు కూడా డార్క్ డెవిల్ గారు చెప్పమన్నారు."
సురేష్ కి నవ్వొచ్చింది.
'అల్ రైట్! ఒకే ఒక్క బీర్ బాటిల్! డార్క్ డెవిల్ హెల్త్ కోసం."
"ఒకే సర్!"
హటాత్తుగా మ్యూజిక్ ప్రారంభమయింది.
డార్క్ డెవిల్ మళ్ళీ విజ్రుంభించాడు.
ఇంకో అమ్మాయి వచ్చింది స్టేజ్ మీదకు. అర్ధనగ్నంగా , అందంగా అద్భుతమయిన విన్యాసాలు చేస్తోంది. హటాత్తుగా స్టీస్ టీజ్ మొదలయింది.
అందరికి సెక్స్ ఫీవర్ పెరిగిపోతుంది.
చిన్న గుడ్డ పీలికల్లాంటి దుస్తులు మాత్రం మిగిలాయి చివరకు. బీర్ బాటిల్ ఎప్పుడయి[పోయిందో తనకే తెలీదు.
కాబరే డాన్సర్ స్టేజీ దిగి ఒక్కొక్క టేబుల్ దగ్గర కెళ్ళి సరసాలాడుతోంది. మీసాలతను ఆమెకు ఓ గ్లాసులో బ్రాందీ పోసిచ్చాడు.
ఓ గుక్క తాగి అతనికే మళ్ళీ ఆ గ్లాసు ఇచ్చిందామే. తర్వాత మరో టేబుల్ వరుస ప్రకారమయితే ఆ తరువాత తన టేబుల్ దగ్గరకే వస్తుందని అర్ధమయింది సురేష్ కి.
ఎలా ఆ అమ్మాయి బారి నుంచి తప్పించుకోవడం?
"హలో" వచ్చేసి సురేష్ కెదురుగా కుర్చుందామే.
ఆమె నగ్న రూపం మతి పోగొడుతోంది.
"హలో" బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు.
సురేష్ చేయి తీసుకుని తన చేతుల్లో వుంచుకుని ముద్దు పెట్టుకుందామే.
ఆమెను క్లోజప్ లో చూసి ఉలిక్కిపడ్డాడు.
ఆమె ఎవరో తనకు తెలుసు! ఎక్కడో , ఎప్పుడో చూశాడు.
ఆ అమ్మాయి కూడా సురేష్ వంక చూసి అంతకుముందే పరిచయమున్నట్లు మరోసారి చూసింది పరీక్షగా.
"నువ్వు సురేష్ వి కదూ?"
సురేష్ కి గుర్తుకొచ్చేసింది.
"నటాషా!"
"సిల్లీ ఫెలో! ఇంతసేపా గుర్తుపట్టటానికి.
"నీ నేకేడ్ బాడీలో చిన్నప్పటికీ , ఇప్పటికీ చాలా తెడాలోచ్చినయ్ కదా? ఎలా గుర్తు పడతాను?"
'ఓ.కే! తర్వాత మాట్లాడదాం వెళ్ళిపోకు. ఆ రాబందులన్నీ ఆకలిగా చూస్తున్నాయ్. వెళతాను" అంటూ సురేష్ చేయి అందుకుని ముద్దు పెట్టుకుని మరో టేబుల్ దగ్గరకు వెళ్ళింది.
రాత్రి పన్నెండింటి వరకూ క్యాబరే డాన్స్ లు సాగుతూనే వున్నాయ్. సురేష్ కి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది గానీ నటాషాతో మాట్లాడాలని కూడా వుంది. రొచ్చులో కేలా దిగబడింది పాపం? ఒకటా, రెండా? ఎయిత్ క్లాస్ వరకూ ఇద్దరూ క్లాస్ మేట్స్ . కేవలం క్లాస్ మేట్స్ కాదు ఆ కొద్ది సంవత్సరాలలోనూ వంద సంవత్సరాల జీవితం చవిచూశారు.
డార్క్ డెవిల్ వచ్చి కూర్చున్నాడు సురేష్ దగ్గర,
"ఎలా వుందిరా మన పెర్ ఫార్ మెన్స్?"
"ఫెంటాస్టిక్."
బేరార్ ఇద్దరికీ రెండు బీర్ తెచ్చి టేబుల్ మీదుంచాడు.
"ఇంకా వద్దురా."
"ఫర్ ది హెల్త్ ఆఫ్ యువర్ లవ్ లీడాల్ . పేరేమిటన్నావ్?"
"తులసి"
బీరు తాగుతోంటే నటాషా వచ్చింది. ఇప్పుడు పూర్తీ డ్రస్ లో వుంది. చీర, జాకెట్టు, చెవులకు రింగులూ, మెడలో నెక్లెస్ , లిప్ స్టిక్ . మేకప్ ఇంకా అలాగే అందంగా అంటిపెట్టుకుని వుంది.
"నటాషా ఇక్కడే వుందని చెప్పలేదేం?" డార్క్ డెవిల్ ని అడిగాడు సురేష్.
"ఇవాళ నిన్నీ బార్ కి రమ్మని ఎందుకు చెప్పాననుకున్నావు మరి? నా గిటార్ వాయింపు చూడ్డానికా ? నో- నువ్వు నటాషాను కలుసుకుంటావని."
"అంటే డార్క్ డెవిల్, నువ్వూ కలుసుకుంటూన్నారా?" అడిగింది నటాషా, సురేష్ తాగిన బీర్ గ్లాస్ తీసుకుని తానూ తాగుతూ.
"ఎస్ డియర్! ఈ మధ్యనే కలుసుకున్నాం. చాలా గ్యాప్ తర్వాత."
"మరి నాకా విషయం చెప్పలేదేం?"
"మీ ఇద్దరికీ సర్ ప్రయిజ్ యివ్వాలని."
"థాంక్యు డార్క్ డెవిల్! నిజంగా చచ్చేంత సర్ ప్రయిజ్ అనుభవించాం." అతని చెయ్యి పట్టుకుని ఆప్యాయంగా నొక్కాడు సురేష్.
"మీరు బయట గేటు దగ్గర నిలబడండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను." అంటూ లోపల కెళ్ళాడు డార్క్ డెవిల్.
సురేష్, నటాషా బార్ బయటకొచ్చి గేటు వైపు నడవసాగారు.
సురేష్ కింకా మెదడు పని చేయటం లేదు.
"బ్రిలియంట్ గాళ్" అని హైస్కూల్లో పేరు తెచ్చుకున్న అమ్మాయి- డాక్టరు గానో, ఇంజనీర్ గానో , సైంటిస్ట్ గానో వెలిగిపోతుందని టీచర్స్ అందరూ వూహించిన నటాషా - ఎందుకిక్కడ క్యాబారెలు చేస్తూ , అంగాంగాలు ప్రదర్శిస్తూ , రాబందుల వళ్ళో కూర్చుంటూ-
"ఏమీ మాట్లాడవేం?" అడిగింది నటాషా.
'ఇందులోకెందుకు దిగావ్ నటాషా?"
నటాషా నవ్వింది.
"మనందరినీ మనం చేసే పనుల్లోకి పరిస్థితులు దించుతాయ్."
"ఎక్కడుంటున్నా విప్పుడు?"
"ఒక నెల హైదరాబాద్, ఒక నెల బాంబే- ఒక నెల డిల్లీ - ఒక నెల వైజాగ్ - అలా గడిచిపోతుంది.
"మీ అమ్మ న్నాన్నా చెల్లెలు?"
"అంతా వైజాగ్ లో వుంటున్నారు."
కారు వచ్చి ఆమె పక్కన ఆగింది. బ్యాక్ సీట్ నిండా క్యాబరే అమ్మాయిలు. డోర్ తెరచుకుంది.
"రేపు రూమ్ కిరా. హోటల్ గౌతమ్ ప- రూమ్ నెంబర్ 696."
సురేష్ ఆశ్చర్యపోయాడు. "హోటల్ వాళ్ళకెలా తెలిసిందా సంగతి?"
"ఏ సంగతి ?" తెల్లబోతూ అడిగింది.
"అదే- నీకు 696 నెంబరు యివ్వాలని."
నటాషా తన బ్యాగ్ తో నెత్తి మీద కొట్టింది. "ఇంకా గుర్తుందా అది?" అంది గొంతు తగ్గించి రహాస్యంగా.
కారు హరన్ మోగింది. ఆమె కార్లో కుర్చుని చేయి వూపింది. మరికొద్ది నిమిషాల తర్వాత వచ్చాడు డార్క్ డెవిల్ తూలుకుంటూ.
"సురేష్! ఇవాళ కనిపించాడు ఆ బాస్టర్డ్!" అన్నాడు పిడికిళ్ళు బిగిస్తూ.
"ఎవరు?"
"మా పెద్దనాన్న."