Previous Page Next Page 
మ్యూజింగ్స్ - 1 పేజి 11


    వర్ణనలు పచ్చిగా వున్నాయనీ, ఆకర్షంగా వున్నాయనీ, ఒక నింద. "అవును. ఆ శృంగార వర్ణనలతోనే ఆకర్షించాలి మీ tastes ని. నేను వ్యాసాలు serious గా వ్రాస్తే, చదివేదాకా? నా అభిప్రాయాలని తర్కించనన్నా తర్కించేవారా? బా వర్ణనలు మీ రుచులకి యెర. తిట్టుకుంటో వాటికోసంవొచ్చి, నా అభిప్రాయపుబోనులో చిక్కుకోవాలనే నా ఉద్దేశ్యం" అని నేనంటే యెట్లావుంటుంది?
    ఇదంతా vested interests చేసే మామూలు propaganda. నేను బోధించే స్వాతంత్ర్యం తనకి కావాలనే వుంటుంది పురుషుడికీ, స్త్రీకీ తన స్త్రీలకీ తక్కిన పురుషులకీ కూడా యీ స్వాతంత్ర్యం వస్తుందేమోనని ఎవడికి వాడికి బెంగ. కారణం లోకం పాడవుతుంది అని చెప్పుకుని సమర్ధించుకుంటారు. వాళ్ళ మనస్సుల్లో తర తరాలనించి నాటివున్న నీతిఅభిప్రాయాలు మార్పుని అంగీకరించవు. ప్రేమలో యీ బలవంతమూ మామూలే అనే రెండూపోతే యెన్ని నూతన సుందర లోకద్వారాలు వాళ్ళ కళ్ళముందు తెరుచుకుంటాయో కలలోనన్నా తెలుసుకోలేరు వాళ్ళిప్పుడున్న స్థితిలో, యీ ప్రజలు. వాళ్ళందరికీ యీ నిర్భంధ వివాహం అవసరం. నిర్భంధం లేకపోతే యీ మాత్రం స్త్రీ సౌఖ్యం దొరకదు వీళ్ళకి. వీళ్ళకి విజ్ఞానం యివ్వడం, వీళ్ళ మనసుల్ని మార్చడం, మనుష్య ప్రయత్నానికి సాధ్యమయ్యే పనికాదు. ఎప్పుడో ఎట్టాగో, యే జన్మలోనో, యే లోకంలోనో వారికి ఆత్మలనేవి వుంటే, mysterious గా, యీ పువ్వుల్ని వికసింపచేసే కాంతివలెనే క్రమంగా వాళ్ళ కళ్ళని విప్పుతుంది యీ విశ్వప్రేమ. ఏ భయంకర ఘాతాలవల్లనో, యే ప్రేమ సృష్టివల్లనో, ఒక్కసారి నూతనలోకంలో ప్రవేశిస్తారు. అందాకా నావంటివారు, యేనాటికి అవసరమవుతుందో, ఏవ్యక్తి అభిలషించి వెతుక్కుంటుందోనని యీ విజ్ఞానాన్ని వెదచల్లి వుంచాలి. దీనివల్ల తృప్తినీ, సుఖాన్నీ, కాంతిని పొందుతున్న మిత్రులున్నారని నాకు తెలుసు. నాకు మనుష్య హృదయం మీదవున్న విశ్వాసంవల్ల యిట్లా పాడగా, మేల్కొంటుండనే భగ్నంకాని ఆశతో వ్రాస్తోవుంటాను. ఈ అశాంతి, యీ వ్యభిచారం, కామోద్రేకం, యీ స్వల్పవాంఛలు, శాశ్వతమైనవికావనీ, యింతకన్న జీవితాల్ని వున్నతంగా ఆకర్షించి తృప్తినిచ్చే మహాశక్తి ప్రతివారికొరకూ జన్మహక్కై వేచివుందనీ, విశ్వసించబట్టే వీళ్ళు కల్పించుకున్న కాపరాలూ, వివాహాలూ, చట్టాలూ, బంధాలూ అన్నీ మేఘాలవలె చెదిరిపోయి, ప్రేమభాస్కరోదయ మవుతుందని నాకు రూఢి కాబట్టే, నేను ఇంత కాలాన్నీ శక్తినీ, మర్యాదనూ, సౌఖ్యాన్నీ, వినియోగించి persistant గా వ్రాయగలుగుతున్నాను. నిర్భాగ్యులైన ప్రస్తుత స్త్రీలలో వారి ముద్రత్వంలో బానిసత్వంలోనే, దేవత్వాన్ని, అధికత్వాన్ని, చూసి ప్రకటించదలచిన నా faith in woman-hood ని వక్రంచేసి స్త్రీ పాతివ్రత్యాన్ని, శీలాన్ని, modesty ని ధ్వంసం చెయ్యాలని చూస్తున్నానని సాగించే దుష్టప్రచారం అసాధారణంకాదు లోకచరిత్ర చూస్తే. నిజంగా శీలాలూ, ఆత్మనిర్మలత్వాలూ, ధర్మాలూ, పాడైపోతోవుంటే, భార్యలు, కూతుళ్ళూ, తమ ఇష్టాలకి  ఎదురుతిరిగి వేషాలూ, భాషలూ, ఆచారాలూ, నీతులూ, మీరుతూవుంటే, ఏమీ అనలేరు వాళ్ళని - వాళ్ళు లేకుండా గడవదు. ఏమన్నా గట్టిగాఅంటే స్త్రీలు వీధిని పడుతున్నాడు. అందుకని ఆ కోపాన్నీ, ఉక్రోషాన్నీ అసహాయత్వాన్నీ, స్త్రీల స్వతంత్రతనీ సమర్ధించే వ్యాసాలమీద చిమ్ముతారు.
    
                                                  -------
    
    విశాఖపట్నం వూరు యింత అందమయిందని ముందు నాకు యెవరూ చెప్పలేదు. ఈ కొండలూ, సముద్రతీరమూ, ఎన్ని నెలలకికూడా వీటి అందం పాతపడటంలేదు నాకు. ప్రతిసారీ యేదో వొకమూల కొట్ట ఆనందాన్ని చూసి నన్నాకర్షిస్తున్నాయి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క యెత్తునించి, కోణంనించి చూస్తే కొబ్బరిచెట్ల నీడలోంచి మధ్యాహ్నపు పచ్చనియెండ మెరుపులోంచిగాని, రాత్రి నిండువెన్నెల తెలుపు నునుపులోంచిగాని, మెరిసే యిసికా, తెల్లని నురుగూ, వెనక నీలపు సముద్రమూ నిలేసి హృదయాన్ని ఆకర్షిస్తాయి.
    'సోమర్ సెట్ మాఘమ్' సౌత్ సీ ద్వీపాల్ని వర్నించినప్పుడు భావనలోపడ్డ బాధ యిన్నాడు నిజంగా నేను చూసి అనుభవించినట్టవుతుంది. ఇల్లు కట్టడమన్నా, లోకంలో ఒక ప్రత్యేక స్తలంనాదని 'సెటిల్'  కావడమన్నా, అసహ్యమైన నాకు యీ 'బీచ్' మీద నివసిద్దామా అన్నంత వ్యామోహం కలుగుతోంది. ఈ సౌందర్యం నేనేనా, నావంటి కొద్దిమందేనా, ఇక్కడ సాయింత్రాలు పోగయ్యే జనమంతా అనుభవిస్తున్నారా? లేకపోతే యెందుకు వొస్తారు?
    అలలు కొండరాళ్లమీద తగిలి పైకి చిమ్మినప్పుడల్లా గుండె ఝల్లుమంటుందా అందరికీ! సుందర రాజన్ అనే స్నేహితుడు హిందూ దేశంలో మనుష్యుల అందంగాని, సృష్టి అందంగాని, చూడాలంటే యీ కొనకో ఆ కొనకో ఉత్తర దక్షిణాలకు వెళ్ళిచూడాలని అన్నారు. మరి విశాఖపట్నం సంగతీ! రాత్రులు యెర్రదీపం, పచ్చదీపం, సముద్రం మధ్యనించి మిణుకు మిణుకని ఆగి ఆగి వెలగడం, వెనక నలుపులో నలుపైన కొండనీడ, దీవిస్తున్న దేవతాహస్తాలవలె తిరిగే 'లైట్ హౌస్' కాంతిచారలూ, మా నెత్తిమీది బ్లూలైట్ వీటి అందమంతా ఆ అందంనించి కలిగిన ఆనందమేనా లేక బాపయ్య స్నేహంలో, బ్రహ్మానందం అల్లరిలో, చి -కళ్ళచూపుల జ్ఞాపకాల్లో నేను పొందిన మాధుర్యం ప్రతిఫలించిన transferred emotion ఐ వుంటుందా? బాపయ్యని నేను-----

 Previous Page Next Page