Read more!
Next Page 
భస్మనేత్రం పేజి 1

                                                                భస్మనేత్రం
                                                                     -------ముచ్చర్ల రజనీ శకుంతల
    ప్రకృతి వికృతమై తన పైశాచిక హస్తాలతో నగరాన్ని కబళిస్తోన్న వేళ....
    నగరమంతా జలమయం.
    వీధులన్నీ నిర్మానుష్యం.
    స్తంభించిన జనజీవనం.
    జనరేటర్ లో అమర్చిన మెర్క్యూరీ లైట్ల మధ్య సిటీ హాస్పిటల్ మెరిసిపోతోంది.
    ఎంతమంది ప్రాణాలను కాపాడే అయుక్షేత్రమో! ఎంతమంది విగాతజీవులు మిగిలే మర్మభూమో... భావాల మధ్య, ఉద్విగ్నతల మధ్య, ఉత్కంఠల మధ్య...బిక్కుబిక్కు మంటోన్న మనిషుల మధ్య  ... అమాయకపు చూపు విసురుతూ వుంది సిటీ హాస్పిటల్.
                                                                     ***
    థర్డ్ ప్లోర్లో రూమ్ నెంబర్ 179లో మాత్రం కాసింత అందోళన, మరి కాసింత ఉద్వేగం, యిమ్కాసిమ్త ఉత్కంఠ నెలకొని వుంది. ఆనందానికి, విషాదానికి మధ్య సన్నటి పరదా ఆ గదిలో వేలాడుతోంది.
    దేశం గుర్తుంచని ఓ మేధావి, అక్కడ తన రూపును దిద్దుకొని, తన ప్రేమను పంచుకొని, తన జీవిత భాగాస్వామీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని చూసి స్థాణుడై, స్తబ్దుగా వుండిపోయాడు.
    సైన్సుకు అందని విచిత్రం.
    మేధస్సుకు అంతుపట్టని అద్బుతం.
    మనిషిని నిలువెల్లా వణికించే, కళ్ళెదురుగా కనిపించే నిజం.
    ఆ మేధావి పేరు భరద్వాజ.
    దేశం గుర్తించకపోయినా,శాస్రజ్ఞుల ప్రపంచం పరామర్శించకపోయినా, ప్రజలు పట్టించుకోకపోయినా... ఎన్నో... అద్బుత ఫార్ములాలనుతయారు చేసిన విజ్ఞాన ఖని.
    అలాంటి మేధావికి పుట్టిన బిడ్డలు వున్నారు.
    రెండు తలలతో పుట్టిన బిడ్డలున్నారు.
    రెండు శారీరాలు అతుక్కుపోయిపుట్టిన బిడ్డలున్నారు.
    కానీ, కేవలం పురాణాల్లో తప్ప, వినని నిజం...
    కానని వైపరీత్యం... ఇది...
    తనకు పుట్టిన బిడ్డకు మూడో కన్ను వుంది... త్రినేత్రం... శివుడికినుదుట ఓ నేత్రం వుందన్నది పురాణేతిహాసం అయితే, తన బిడ్డకు తల మధ్య ఓ కన్ను వుండడం... దానికి చలనమూ వుండడం... ఎంతటి వైపరీత్యం...
    అతనిలోని మేధావికి అర్ధమైన ఆ నిజం... అతనిలోని పిత్రుహృదయాన్ని అతలాకుతలం చేస్తోంది.
    ఆ మూడోకన్నుని పరీశిలించిన భరద్వాజ అంతలా భయపడ్డానికి కారణమదే.
    ఆ మూడో కన్ను తెరుచుకోగానే...
    వేడి.. సే..గ..లు..
    ఆ కంటిమిద ఉంచిన తన చేయిచుర్రుమంది.
    అతనిలో ని సైంటిస్ట్ కు ఆ మరుక్షణం అర్ధమైన నిజమోక్కటే...
    అదే అతన్ని భయపెడుతోంది.
            ***
    అనందం అర్ణవయ్యేవేళ, వుశాడం నేస్తమయింది.
    "ఎలా ఉన్నాడండీ మన బిడ్డా?" విశాలిలో మాతృహృదయ తపన పొంగిపొర్లుతోంది. భార్య పిలుపులో ఉలిక్కిపడ్డాడు భరద్వాజ.
    అతనిలో సైంటిస్ట్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
    భర్త మోఎనం విశాలిని బాధించింది. తనలో ఒదిగిపోయిన ఈ శిశువుకు వచ్చింది. బిడ్డని, తనని అక్కువ చేర్చుకుని అనండ భాష్పాలు రాల్చవలసిన భర్త మౌనంగా వుండడం సహించలేకపోతోంది.
    "ఏమిటండీ... ఏం  జరిగిందండీ!"
     భార్య ముఖంలోకి పరీశిలనగా చూశాడు. మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోయింది. కళ్ళకింద నల్ల చారికలు.
    "వి..శా ..లీ..బా..బు.. మనకి అవసరమంటవా?"
    "ఏ..మం..డీ.." అది కోపమా, ఆశ్చర్యమో, బాధో... తెలియని స్థితి. ఏ భార్యా ఇలాంటి డైలాగ్ భర్త నుండి బహుశా వినదేమో?
    "తొమ్మిది నెలలు వాడికి నేనే పూపిరై నిలిచానండీ. తొమ్మిది గంటలు నేనే బాధని బిగపట్టి జన్మనిచ్చానండీ, మనిద్దరి ముద్దుల బిడ్డ అని మురిసిపోతున్న ఈ సమయంలో...
    "ఒక్కక్షణం విశాలీ..." అంటూ లోపలకి వెళ్ళాడు. దేనికోసమో చాలాసేపు వెతికాడు. చివరికి దొరికింది. ఉల్లిపొరలాంటి కాగితం.
    భర్త చేస్తున్న పని వంక అయోమయంగా చూడ్డం మినహా ఏమీ చేయలేకపోయింది.
    ఆ ఉల్లిపొరలాంటి కాగితాన్ని బిడ్డ తలమీద పెట్టాడు.
    "చూడు... విశాలీ..." తల మద్యలో వున్న వెంట్రుకలను పక్కకి జరిపాడు.
    అక్కడ...

Next Page