ఒకరి కౌగిట్లో ఒకరు పడుకుటారని కాలేజ్ లో ఫ్రెండ్స్ అనుకుంటుండే వాళ్ళు.
మరిప్పుడు తమ వరస చూస్తె ఎండికి అనుమానం కలుగుతుందా? అతనికి అనుమానం కలిగిందంటే తమ ఇద్దరి గురించి వాకబు చేయమని ప్రైవేట్ డిటెక్టివ్ ఏజన్సీకి అప్ప జెప్తాడు. దాంతో తమ బండారం బయటపడి ఉద్యోగం కాస్తా పోతుంది. దాంతో నెలకు నాలుగు వేలు నష్టం! డబ్బంటే తనకు ప్రాణం!
అందుకని ఎండికి తమ మీద కొంచెం కూడా అనుమానం కలుగకుండా నటించాల్సిన బాధ్యత తమ మీదుంది.
వెంటిలేటర్ కిటికీ రెక్క మళ్ళీ కదిలింది చిన్న శబ్దంతో.
"ఇదిగో .....ఒక్కసారి ఇలా తిరగండి !' నెమ్మదిగా అంది.
సురేష్ తల వెనక్కు తిప్పి చూశాడు.
"ఏమిటి?"
"పైన వెంటిలేటర్ వంక ఓసారి చూడండి! జాగ్రత్త! చూస్తున్నట్లు తెలీకుండా చూడాలి."
సురేష్ పైకి చూశాడు.
"ఎవరిదో తల అద్దం వెనుక నిలబడినట్లు లేదూ?"
"అవును!"
"ఎండి శివరావ్ అయుంటాడు."
"అయినా ఇలా రెండు గడులకూ మధ్యలో వెంటిలేటర్ పెట్టరేమిటి?"
"ఒరిజినల్ ఇవి రెండూ కలిపి 'సూటే' అయిండాలి. మనం ఇలా దూరం దూరంగా పడుకుని ఉంటె ఆయనకు అనుమానం వస్తుందేమో!"
'అయితే! ఏం చేయమంటారు?"
"భార్యాభర్తల్లాగా కొంచెం దగ్గరగా పడుకుని నా మీద చేయి వేస్తె .....' ఇంక తర్వాత చెప్పలేక సిగ్గుపడిందామే.
ఇద్దరూ దగ్గరగా జరిగారు.
"ఏమీ అనుకోకండి! ప్లీజ్! ఇటీజ్ కోశ్చేనాఫ్ మై జాబ్!"
"అసలు మీ జాబే "ఇది' అనిపిస్తోంది నాకు"
"అలా మాట్లాడకండి !' చిరుకోపంతో అంది.
మళ్ళీ వెంటిలేటర్ వేపు చూసిందామె. "ఇంకా అతని తల కనబడుతూనే వుంది.
"ఇంతకూ మీ మీద ఆకాశరామన్న ఉత్తరం ఎవరు రాసుంటారు!"
"మా ఇంటి దగ్గరలో ఒకడున్నాడు వాడితో నేను కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యాను. కారులో నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తుండేవాడు. పెళ్ళి చేసుకుందామని వెంటపడ్డాడు. అతని కాస్ట్ కూడా మా కాస్టే ! వప్పుకుందామనే అనుకున్నాను గానీ ఆఖరులో తెలిసింది. ఆ కారు అతనిది కాదని! వెంటనే 'కట్' చేసి పారేశాను .
ఆ కోపం పెట్టుకుని నా గురించి అన్నీ ఆరాలు తీసి బ్లాక్ మెయిల్ చేయడానికి చూస్తున్నాడని నా అనుమానం. ఆకాశరామన్న ఉత్తరం కూడా వాడి పనే అయుండాలి !"
"పిచ్చి వెధవ! మీరు ప్రేమించింది 'కారు' ని అనే విషయం తెలుసుకోలేకపోయాడు.
ఆమె కోపంగా చూసింది.
"అవును! నా యిష్టం! కాదంటానికి వాడేవాడు, మీరెవరు?"
"ఇలా ఎంతసేపూ దగ్గర -దగ్గరగా పడుకొని ఉండాలి మనం?"
"వెంటిలేటర్ వెనుక తల తప్పుకునేంతవరకూ!"
"అదెప్పుడు తప్పుకుంటుందో ఎలా తెలుస్తుంది ?"
"మనం ఇంకొంచెం క్లోజ్ గా మూవ్ అయితే వెళ్ళిపోతాడెమో!"
'అంటే?"
"నా మీద చేయి వేసి ముద్దు పెట్టుకుంటూన్నట్లు నటించండి చాలు!"
"ఇదిగో -- ఇలాంటి వన్నీ చేస్తానని నేను మీరేం హామీ యివ్వలేదు. జస్ట్ పేరుకి మొగుడిగా ఉండమంటే వుంటున్నాను! అంతే పక్కలో పడుకోవడాలూమ చేతులు వేయడాలూ, ముద్దులు పెట్టుకోవడాలు నావల్ల కాదు!"
"ప్లీజ్! ఇంక ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాదని ప్రామిస్ చేస్తున్నాను."
"నాక్కావలసింది ప్రామిస్ కాదు ! కాష్!"
రాధిక త్రుళ్ళిపడింది.
"అంటే?"
"అంటే తెలీందేముంది? మనం ఏం చేసినా కాష్ రూపంలో చేస్తాం!"
"ఛీ! మీకు ..........మీకు ........మీరు మనుషులు కాదు ! ఓ ఆడపిల్ల ను పీక్కుతినే రాక్షసులు."
"జాగ్రత్తగా ఆలోచించుకుని తిట్టండి ! తిట్టుకి పది రూపాయలు చార్జ్ చేస్తాను - తర్వాత మీ ఇష్టం -"
రాధికకు భయం వేసింది. తన నోటి రురద వల్ల డబ్బు పోగొట్టుకోవటం ఇష్టం లేకపోయిందమెకి. డబ్బు కోసం తన అలవాట్లను మర్చేసుకోవటం కోపం చంపేసుకోవటం -----అయిష్టాలను అలా చేసుకోవటం చిన్నప్పటి నుంచీ చేస్తున్నదే తను.
ఆటోలో వెళ్ళమని డబ్బిస్తే తను బస్ లో వెళ్ళి ఆ డబ్బు అదా చేసుకునేది . బస్ లో వెళ్ళమంటే నడిచి వెళ్ళిన రోజులనేకం వున్నాయ్.
ఏవయినా వస్తువులు కొనేప్పుడు గీచి గీచి బెరాలాడి కొంత డబ్బు మిగుల్చు కున్నందుకు అనందం అనుభవించటం తరచూ జరిగేదే!
నిజానికి తను ఉద్యోగం చేస్తేనే గానీ గడవదన్న మాటే లేదు. కానీ నెలకు నాలుగు వేలు సంపాదించుకోవచ్చన్న ఆశతోనే ఇదంతా చేసింది.
హైస్కూల్లో కాలేజ్ లో తన ఫ్రెండ్స్ అందరూ కూడా 'కంజూస్ ' అని నిక్ నేమ్ తో పిలుచుకునే వాళ్ళు.
డబ్బు మీద తన కేందుకింత మమకారం ఏర్పడిందో తెలీదు. పైగా అది రోజు రోజుకీ పెరుగుతోంది గాని తరగడం లేదు.
సురేష్ నవ్వుతున్నాడు.
"చూశారా! తిట్టుకి పది రూపాయలు చార్జ్ అనేసరికి మీ నోరు ఎలా మూసుకుపోయిందో"
"ఇంతకూ ఇప్పుడేమంటారో చెప్పండి !"
"చెప్పాను కదా! మిమ్మల్ని కౌగలించుకోడానికి పది! ముద్దు ఒకటికి పది రూపాయలు చొప్పున ఎన్ని ముద్దులు పెట్టుకోవాలంటే అన్ని పదులు..... అందుకు రడీ అనేట్లయితే నేను రడీ...."
రాధికకు కోపం అవమానం దహించి వేస్తున్నాయ్. డబ్బు ఖర్చైపోతోందన్న బాధ వాటి నన్నిటినీ మించి అశాంతి కలుగజేస్తోంది.
"మీలాంటి డబ్బు పురుగుని ఎన్నికోవటం అసలు నాదీ తప్పు!"
"టెంపరరీ మొగుడిని కాబట్టి బ్రతికిపోయాను. లేకపోతే రోజూ ప్రణయం జరపడాని కూడా నా దగ్గర డబ్బు వసూలు చేసే వాళ్ళు మీరు ........అంతాశ డబ్బు మీద-"
ఆమె కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగాయ్, ఆ మాట ఆమెను బాగా హార్టు చేసింది.
"ఇంకో సారిలాంటి మాట అన్నారంటే మర్యాదగా వుండదు " దుఖం నిండిన కంటాంతో అంది.
"ఉండి కూడా డబ్బంటే మీకింత మోజుంటే , లేనివాడికింకెంత ఉండాలి ?"
"సరే! తీసుకోండి! ఆడపిల్ల ఉసురు తప్పకుండా తగుల్తుంది మీకు !"
"ఉసురు తగిలించినందుకు ఇంకో పది ఖర్చవుతుంది మీకు ----- జాగ్రత్త!' నవ్వుతూ అన్నాడు. అంటూనే అమాంతం ఆమె వేపు తిరిగి నగ్నంగా కనబడుతున్న పొత్తి కడుపు మీద తన చేతిని పోనిచ్చి నడుముని గట్టిగా పట్టుకుని ఆమెను నెమ్మదిగా తన వేపు తిప్పుకున్నాడు.
రాధిక శరీరం అతని స్పర్శకు గగుర్పోడిచింది.
ఏదో స్ట్రాంగ్ మత్తు వళ్ళంతా పాకుతోంది వేగంగా. రక్త ప్రసరణ వేగం విపరీతంగా పెరిగిపోయింది. గుండె లయ తప్పిఇర్రేగ్యులర్ గా కొట్టుకుంటోంది. అతనిని తను చేయమందేమిటి , అతను చేస్తుందేమిటి? భయంతో నుదుటి మీద చెమటలు పట్టేస్తున్నాయ్. కొంపదీసి అతను పూర్తిగా చొరవ తీసుకోడు కదా.