Previous Page Next Page 
శశిరేఖ పేజి 4

శశి - మరేమంటావు?
కృష్ణు - నాతో యిక్కడే వుండిపో, మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళనే వొద్దు.
శశి - ఛి! ఆ మాటలు మాట్లాడొద్దన్లేదూ? మా వాళ్ళ నోదుల్తానా? మా అమ్మ ఎడవదూ?
కృష్ణు - మీ అమ్మేడుస్తుందని  నన్నోదిలేస్తావూ? నేనేడవనూ?
శశి - నిన్నేందుకోదుల్తా? ఎప్పడూ వదలను. ఇట్లారా! ఈ ముక్కునీ, కళ్ళని వదుల్తానూ?
కృష్ణు - వదల కేం చేస్తావు? ఆ దిబ్బ మొఘంగాడువచ్చి  పిలక జుట్టేసుకుని పిటలమీద కూర్చుంటాడు వాడు. తలొంచుకొని పెద్ధబొట్టు పెట్టుకొని, పక్కన ముత్తయిదులాగు కూచుంటావు. నేను వచ్చి "ఏమండి శశిరేఖగారూ!" అంటే "ఎవరండి మీరం"టావు.
శశిరేఖ కృష్ణుని చెంపమీద  చరచెను.
శశి - ఎప్పడూ అట్లా అనవు కదా?
కృష్ణు - నిజమౌనా  కాదా?
శశి - కాదు.
కృష్ణు - ఇప్పుడు బడాయి మాటలకేంగాని, చివరికి యేమి అనకండా మీ వాళ్ళేం చేస్తున్నా వూరుకుంటావు.
శశి - నిజం, నా ప్రాణముండగా  వోప్పకోను. నిన్ను వోదిలేస్తానా?
కృష్ణు - నిజంగా! నువ్వేప్పడన్నా కనపడవుగవును! యెప్పటికి అని తలుచుకుంటే, ఎంత దుఃఖం వొస్తుందనుకున్నావు! నాకింకేమి లేనట్లుంటుంధి. అసలు నువ్వెందుకు కనపడ్డావా అనిపిస్తుంది.
శశి - వదలను కృష్ణా, వదిలి నేను బతకగలనూ?
ఇట్లా చూడు బతగ్గలనూ?
కృష్ణు - పోనీ, నా దగ్గర వుండిపో! ఆ  ముద్దు కన్నులతో నన్నేప్పడూ చూస్తో వుండు.
శశి - తప్పుకదూ?
"ఇప్పుడు చేసేది తప్పుకదూ" అని కృష్ణుని నోటిదాక  వచ్చెను కాని, ఆమె కండ్లలో అమాయకత్వమును చూచి కృష్ణు దూరకుండెను.
పారిజాత పుష్పముల వాసన మనసులను  కలవరపరిచినది.  బాగుగ చికటిపడెను. శశిరేఖ తల పై ఎర్రని పూరేకులను చెట్టు విదల్చెను. తెలియ రాని కోర్కెలు వారి మనసుల విజృంభించెను. దూరముగ పడవవారి పాట విషాదముగ
వినపడుచుండె.శశిరేఖ వెళ్ళుటకు లేచెను. నాలుగు పారిజాత పువ్వులను కృష్ణుడామె ముడిలో పెట్టుచుండగా  అతని చెయ్యి  ఆమె మెడకు తగిలెను.ఆమె జుట్టు వీడి మోకాళ్ళ వరకు పడెను.
శశి - వోదులు జుట్టు ముడి వేసుకోవాలి.
కృష్ణు - ఆ చంద్రుడు చూడు ఈ పెద్ద మబ్బు ఎక్కణ్నించి  వచ్చిందా అనుకుంటాడు. మరి అంత పెద్ద జుట్టేంతి ?బరువు కాదూ?
శశి - నే వెడతాను.
కృష్ణు - ఒక్కమాట. యిట్లా చూడు.పోనీ,పోనీ ఆ కళ్ళు నక్షత్రాలంటావా, లేదా? ఎప్పడూ అట్లా మెరుస్తాయేం?
శశి - నీపెదిమిలట్లా ఎర్రగా వుంటాయేం?
కృష్ణు - చెప్పనా యెందుకో?
శశి - వొద్దు పో!
అని త్రోసివేసెను.
శశిరేఖ ఏమియును తెలియని ముగ్ధ. నెలకు పూర్వము ఒక కొత్త పడవను లాకులో చూడవచ్చినప్ప డితని పరిచయమయ్యేను.అదియే యిట్టి ప్రేమగ మారినది. పూర్వయవ్వనమున వికసించిన పువ్వు తుమ్మెద నేట్లాకర్షించుచున్నదో,
సూర్యకిరణముల వేడికి మంచు యేల కరుగుచున్నదో, వసంతముల కోయిల యేలకూయుచున్నదో, అందుకనే ఆమె ప్రేమించెను.ప్రేమించిన ప్రేమయే ప్రేమ.
                                                                               3
కృష్ణు - గోవిందపురపు లాకు అధికారి కుమారుడు. అతడు విశాఖ పట్నమున  డాక్టరు  పరిక్ష చదువుచుండెను. మూడేండ్లు పూర్తి అయినవి. ఇప్పడేండాకాలపు శలవులకు ఇంటికి వచ్చెను. లాకువద్ద నుండు యింటి యందే యతనికి నివాసము. ఒకనాటి సాయంకాలము  ఒక పడవవ్తేపు మహాద్భుతము  వలె చూచుచుండు శశిరేఖ కలువ కన్నులును, ఎర్రని పెదవులు నాతని  నాకర్షించెను. ముందు వెన్క  లాలోచింపక ఆనంద పారవశ్యమున నా ప్రేమాంబుధిలో
నిన్నాళ్ళు  నోలలాడుచుండెను.
నాలుగు దినములు గడచినవి. ఒకనాటి అర్ధరేయి ఆ చిన్న కుటీరమున నందరు నిద్రించుచుండిరి.అంతయు నిశ్శబ్దము. ఎవరో మెల్లగ తలుపు తట్టినట్లు చప్పడయ్యేను. తలుపుదగ్గర నిద్రించుచుండిన కృష్ణుడు తలుపు తెరచి చూచెను. పున్నమినాటి వెన్నల. కాని ఎవరూ నాతనికి కాన్పింపలేదు. చిన్న కంఠమున "కృష్ణా"యను పిలుపు వినబడెను.అతను మెల్లగ తలుపు వేసి కొంచెము  దూరముననున్న నారింజ చెట్టుకింద నిలుచుని యున్న శశిరేఖనుచూచెను. ఆమె శిరము నానించి సోలిపోయేను. "శశి, శశి, నా శశి"అని పలుమారు పిలిచి"ఏమి జరిగినది? ఎందుకిప్పడు వచ్చావు?"అనియడిగెను. శశిరేఖ యతనిని లాకువద్ధకు రామ్మనెను. ఇద్దరును వెళ్ళి వెన్నెల యందు నీటియొడ్డున గూర్చుండిరి.
శశి - నిన్ను కనుక్కోవడం ఎట్లాగో తెలిలేదు. తలుపు కొడితే ఎవరు తెరిచి ఏమి అడుగుతారో అని భయము వేసింది.నువ్వు కనబడక పోతే మళ్ళి యింటికి పోయేదాన్నానుకుంటా. నువ్వింత సులభంగా కనపడ్డం ఈశ్వరుడికి నేను చేసినపని యిష్టమని తెలుస్తోంది.

 Previous Page Next Page