Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 3

 

    "ప్రమాదం ఎలా జరిగింది?" అప్పటికే జనం లోంచి తీసుకొస్తున్న న్యూస్ రిపోర్టర్స్ ని దూరంగా పంపారు.
    'అప్పుడు తొమ్మిది గంటలయింది. ఆఫీసులకి వెళ్ళే టైం కదా! అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. హటాత్తుగా కొండ చరియలు విరిగి పడుతున్నట్లు పెద్ద శబ్దమయింది సార్!
    కరెంటు తీగలు ఉన్నంత మేర భవనంలో ఎక్కడి కక్కడే మంటలు లేచాయి. బయటికొచ్చి చూస్తె శ్రావణ మేఘాలు నేలమీదికి దిగివచ్చినట్టు నల్లని పొగ ఆవరించింది.
    భవనం మూడో అంతస్థు కుప్ప కూలిపోయింది. ఎవరికీ ఏమీ మిగలలేదు. అంతా స్మశానమే!" బావురుమన్నాడు సమాధానం చెప్పిన వ్యక్తీ!
    "కంట్రోల్ యువర్ సెల్ఫ్!"
    "టెల్ మీ ! పై అంతస్టులో ఎవరుంటున్నారు?" ఓదార్చుతూ అడిగాడు ఎ.ఎస్.పి విక్రమ్!
    "ఆ ఫ్లోర్ లో ఎవరూ కాపురాలు ఉండటం లేదండీ! అది స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా! టైం కాలేదు. ఎవరూ రాలేదు. పదింటికి తెరుస్తారు."
    విక్రమ్ నేత్రాలు విచ్చుకున్నాయి. కనుబొమ్మలు పైకి లేచాయి.
    దూరంగా ఓ చెట్టు క్రింద నిలబడి అంతా కోల్పోయినట్లు శూన్యం లోకి చూస్తున్నాడు ఓ యువకుడు. అతన్ని చూడగానే విక్రమ్ కి చాలా జాలిగా అనిపించింది. బాగా కృంగిపోయినట్లు కన్పించాడు.
    హడావుడిగా నడుస్తూ అక్కడకు చేరుకున్నాడు.
    "సీ మై ప్రెండ్! టెల్ మీ యువర్ నేమ్!" అని అడిగాడు మృదువుగా !
    "ఎస్. జయసింహ! " కలలో మాటలాడుతున్నట్టు చెప్పాడు.
    "ఎందుకంత నిరాశగా చూస్తున్నావు? ఈ ప్రమాదంలో మీ వాళ్ళు ఎవరయినా పోయారా?"
    "పోయేందుకు నా కేవరున్నారని? ఆయామ్ ఎ లోన్!"
    "మరెందుకు కలా దిగులు పడ్డావు?"
    "ఇఫ్ యూ ఆర్ సో మేర్సిబుల్! ప్లీజ్ టెల్ మీ! స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియాలో స్ట్రాంగ్ రూం పగిలిపోయిందా?"
    "అవును పగిలిపోయింది. వేరి పవర్ పుల్ ఎక్స్ ప్లోషన్"
    "లాకర్స్ కూడా పగిలాయా?"
    "యూ ఆర్ సో పూర్! స్ట్రాంగ్ రూం పగిలితే లాకర్లు పగలవా"
    
                                2

    "రుక్ జావ్! కౌన్ హోతుమ్ !! అందర్ నై జాసక్త!"
    "ఎ.ఎస్.పి సాబ్ ని చూడాలి! లేట్ మీ గో!"
    "దొరగార్ని చూడాలంటే ముందే అపాయింట్ మెంట్ ఉండాలి."
    "అలాంటిదేమీ లేదు. నన్ను పోనివ్వు!"
    "బతాదియా కిస్ సే! సంజానై!"
    "కాదు నేను ఎ.ఎస్.పి తో మాట్లాడాలి. అర్జంటు" మొరాయించి ముందుకు వెళ్ళాలని ప్రయత్నించాడు జయసింహ!
    "క్యా బత్తమీజీ! చలో! హాఠో!' భుజాలు పట్టుకుని అడ్డగించాడు గార్డు." ఎ.ఎస్.పి సాహబ్ ఆఫ్ కో హోతా హైక్యా" అంటూ మొరటుగా ఎద్దేవా చేశాడు.
    "ఓ ముఖ్యమయిన విషయం మాట్లాడాలంటే వినవెం? బలాన్ని ప్రయోగించి అయినా ముందుకే పోవాలని ప్రయత్నిస్తున్నాడు. వారి మధ్య జరుగుతున్న సంఘర్షణ అంతా దూరం నిలిచి గమనిస్తున్న ఓ పోలీసాఫీసర్ వారి దగ్గరగా వచ్చాడు.
    "దేఖో సాబ్! పాగల్ హై క్యా"గార్డు వాపోయాడు.
    "ఎవరు మీరు?" ఆఫీసర్ అడిగాడు.
    "నా పేరు జయసింహ." "ఎందుకొచ్చావు?"
    "ఎ.ఎస్.పి తో మాట్లాడాలి?
    "దొరగారు నీకు ముందే తెలుసా?" ఒకసారి చూచాను"
    "అదా సంగతి! ఏం మాట్లాడతావూ?"
    "నిన్న జరిగిన బ్లాస్టింగ్ లో బాంకు లాకర్ ......"
    "కమాన్ ఫాలో మీ!' మరింక ఎక్కువ వివరాలు బయట పెట్టనివ్వకుండా వెంట తీసుకు పోయాడు.
    కంప్లయింట్స్ రూమ్ లో ఇద్దరు ఆఫీసర్స్ డ్యూటీలో ఉన్నారు. మరో యిద్దరు ఓ కేసు గురించి మాటాడుకుంటున్నారు.
    డిపార్ట్ మెంట్ కి సంబంధించని మరో వ్యక్తిలోనికి రావటం గమనించి మాటలు నిలిపేశారు.
    "ఫ్రెండ్స్! సి హిమ్! చాలా ముఖ్యమయిన పని మీద వచ్చాడట" ఓ అట వస్తువుని అప్పగించినట్లుగా చెప్పాడు.
    చిరునవ్వు ముఖాలతో అందరూ అతని వంక చూచారు. అలాంటి సహజ ముద్ర క్రిమినల్స్ ముఖంలో కనిపించదు. అందరు పోలీసాఫీసర్స్ ని చూడగానే తప్పకుండా వారి ముఖాల్లో రంగులు మారతాయి.
    "కూర్చోండి" మర్యాద యిచ్చాడు ఓ ఆఫీసర్! కూర్చున్నాడు.
    "లేట్ అజ్ నో హు అర్ యూ?" దుబ్బులా అందంగా అమరిన మీసాన్ని దువ్వుకుంటూ ఓరగా మిగిలిన వారి వంక చూస్తూ అడిగాడు.
    చాలా సీరియస్ గా సాగే పనుల మధ్య యిదొక చిన్న తమాషా అందరిలో కొద్దిపాటి ఉత్సాహం ఆసక్తీ కన్పించాయి. ఉత్సాహం రేకెత్తింది.
    చేరవలసిన చోటు యింకా దూరంగానే ఉండిపోయింది" వినయంగా బదులు చెప్పాడు.
    "సో యూ లైక్ టు సి అసిస్టెంట్ సూపర్నెంట్ సాబ్! అంతేనా?"
    "ఎస్! దట్స్ మై రిక్వస్ట్ అండ్ డెడ్ లా ఎనీడ్!"
    "ఈజిట్?" కనుబొమ్మలు ఎగురవేశాడు . మిగిలినవారు పెదవుల చాటున నవ్వుకుంటున్నారు.
    "షల్ వియ్ నో యువర్ నీడ్! నేరుగా పంపటం ఎలా? అందుకు "
    సైలెంట్ గా మనసుల మధ్య ప్రవహిస్తున్న తమాషా పెద్ద నవ్వులుగా బయట పడేందుకు సిద్దంగా వుంది.
    'మొన్న జరిగిన ప్రేలుడులో నాకు సంబంధించిన ఓ సమాచారం అడగాలని వచ్చాను" అందరూ ముఖాలు చూచుకున్నారు. పక్కగా ఉన్న వారి మనసులు సీరియస్ గా అయినాయి.
    "లుక్ ! అలాంటి విషయాలు నేరుగా వారిని అడగకూడదు. ముందుగా మాకు చెప్పాలి! అది ఎంత ప్రాముఖ్యత కలిగిన విషయమైతే దొరగారితో మాట్లాడేందుకు మేమే పంపుతాం. ఒక సంగతి చెప్పు.
    "నువ్వు అడగాలని వచ్చావా?చెప్పాలని వచ్చావా?"
    "అడగాలనే వచ్చాను"
    "కమాన్! మాతో చెప్పు! ఏమిటి నీ అనుమానం! అవసరం?"
    "లాకర్స్ అన్నీ పగిలాయా?"
    "ఆ సంగతి చెప్పేందుకు అప్పుడే వీలుకాదు. నువ్వు ఎన్నో నంబర్ లాకర్ గురించి అడుగుతున్నావు?"
    "డబల్ ఎయిట్!"
    "అందులో నువ్వేం దాచావు?"
    "నేను నా సందేహం తీర్చుకునేందుకు వచ్చాను. మీ సందేహాలు తీర్చేందుకు కాదు. లాకర్ లో నేను ఏం దాచానో ఇప్పుడప్పుడే చెప్పకూడదు కదా!
    ఆ నంబర్ లాకర్ పగిలిందా ?లేదా ? ఆ వివరం కావాలి నాకు. మీరు చెప్పగలరా?" అనుకోని విధంగా ఎదురయిన విసుగు . కొద్దిగా షాక్ అయినట్లు కనిపించారు.
    "అది చాల కాన్పిడేన్షియాల్ మాటర్! వివరాలు దొరగారి దగ్గరే ఉంటాయి."
    "అందుకే వారిని చూడాలన్నాను. యామైరైట్?" చిరునవ్వుతో అందరి వంకా చూచాడు జయసింహ!
    చాల అమాయకంగా కన్పించాడు. లోనికి వచ్చాక మాటల మధ్య హటాత్తుగా రాటు తేలిపోయాడు ఘనుడే!
    ఆఫీసర్స్ పెదవుల చాటున పొంచి వున్న చిరునవ్వులు అలాగే మాయమయినాయి. షాక్ అయినట్లుగా. 

 Previous Page Next Page