"యూ వార్ టూ మచ్...."
"లీవిట్.....! వదిలేయండి. ఆయన మిమ్మల్నెప్పుడయినా కొడతారా?"
"లేదు"
"ఓపెన్ గా నలుగురున్నపుడు నడుమ్మీద చేయివేస్తారా?
"లేదు
"మీ పర్సనల్ లైఫ్ లో ఆయనేమన్నా జోక్యం చేసుకుంటారా?"
"ఉహూఁ లేదు"
" అయ్ థింక్ యూ ఆర్ డూయింగ్ జాబ్. మీరు పనిచేస్తారుకదూ?
"ఆఁ."
"మీ జీతం గురించిన డిటైల్స్ ఎప్పుడయినా అడిగేవారా?"
"ఎప్పుడూ లేదు"
"మరి మీరందుకు ఆయనకీ వివాహం చేయాలనుకుంటున్నారు! మీరు ....మీకు.....మీకేమయినా సెక్సువల్ ఫ్రేజిడిటీ...."
"ప్లీస్! మైండ్ యువర్ టంగ్"
"డోంట్ గేటెక్సయిటేడ్. నేను ముందే చెప్పాను. పర్సనల్ గా తీసుకోకండని"
"ఓకే ఒకే....
"చిక్కీ! నీవు....నీవేమయినా ప్రశ్నలు అడుగుతావా ఏమిటి?"
"నైసాఫ్ యూ ఆంటీ! ప్లీజ్ ఎక్కువలేదు. రెండోమూడో అంతే!
"తోందరక్కానివ్వండి" అంది వసుంధర
"ఏంలేదు. సుందర్ కి మాడ్రన్ డ్రస్ అంటే డిస్ లైకింగా?"
"డ్రసింగ్ యీజె పర్సనల్ ఆఫయిర్. ఇందులో ఆయన లైకిగ్ ఆర్ డిస్ లైకింగ్ ప్రశ్నేలేదు"
"ఆహహఁ. నా ప్రశ్ననిమీరు సరిగ్గా కేచ్ చేయలేదు. పోన్లెండి ఇంకోలా అడుగుతాను. మీరుఇలా చీరలోకాక జీన్సులో కానీ, మికీ, మెక్సిల్లో కానీ కనిపించుతారనుకోండి. అప్పుడు ఆయన ఫీలింగ్స్ ఎలావుంటాయి అని"
"ఎప్పుడూ ఎక్స్ పీరియన్స్ చేయలేదు"
"మీ వివాహం ఎన్నేళ్ళయింది?"
"ఆఁ అయిదేళ్ళయి పోయాయి"
"ఎప్పుడయినా మీ కొలీగ్స్ ని.... అందమైన అమ్మాయిలని పరిచయం చేసేరా?
"ఆఁ"
"వాటబావుట్ హిజ్ రిపర్ కషన్స్ ? ఆయన ఎలా ప్రవర్తించేరు"
"కాస్త ఓవరే....!"
"గుడ్! ఎనీ అడ్వాన్స్ మెంట్ ఇన్ దట్ లైన్?"
"నొ అయిడియా?"
"హియీజ్ ఫెంటాస్టిక్ హియీజ్ పైన్. మార్వెలన్....ఆంటీ అయ్ లైక్ హిం అయ్ లవ్ హిం! అయ్ వాంట్ హిం!"
"కూల్ డౌన్ చిక్కీ.... కూల్ డౌన్!...."
"ఆంటీ....! ఆంటీ....!"
"చిక్కీ! నాకూ అలానే అనిపిస్తూంది. పోనీ నీతోబాటు నేను అప్లయి చేస్తాను కాకపోతే ఏజ్ రిలాక్స్ చేయమని రిక్వెస్టు చేస్తూ మరో లెటర్ ఎటాచ్ చేస్తాను.
"ఆంటీ....ఆంటీ....! వై డోంట్యూ డ్రాప్ ఫర్యువార్ సెల్ప్ ఆంటీ! ఎల్లాగూ నీకు ఏజ్ బారయిపోయింది కదా? ఆంటీ ప్లీస్ ఆంటీ నన్నే ట్రై చేయనివ్వు"
"విల్యూ బోతాఫ్ యూ ప్లీస్ మేకె మూవ్ ఫ్రం హియర్ ?" వసుంధర కాళికలా గట్టిగా అరచింది వాళ్ళ సంభాషణ వినలేక.
వాళ్ళు వెళ్ళిపోయేక వీధి తలుపు వెయ్యబోతూ అల్లంత దూరంలో గబగబా ఎండనపడి నడచివస్తున్న బాబాయి కనిపించి ఆగిపోయింది. వేయబోతోన్న తలుపుని వేయకండ ఆపి నవ్వుతూ ఆయన్నే చూస్తూ నిలుచుండి పోయింది దగ్గరగా వచ్చేదాక.
"బాబాయ్?" అందానందంగా వసుంధర.
"ఏమ్మా! వసుంధర బావున్నావా ?" అన్నారాయన ఆప్యాయంగా వసుంధర తల నిమిరి
"రండి బాబాయ్!" అంటూ ఆయన చేతిలోని సంచీని అందుకుంది. ఆయన "ఆఁ. ఆఁ.... ఉండమ్మా! నేను తెస్తానులే!" అంటున్నా వినకుండ.
బాబాయంటే వసుంధర్ కి స్వయాన తండ్రి తమ్ముడేంకాదుకానీ, అంతకన్నా ఎక్కువే అనురాగంలో ఆయన తల్లీ , వసుంధర తండ్రి తల్లీ స్వయాన అక్కచెల్లెళ్ళు. ఒకే వూరిలో ఉండటంచేత ఆ అన్నాతముళ్ళకుంటుంబాలమధ్య అనురాగాలు ఎక్కువ.....అప్యాయతలు ఎక్కువ....!వసుంధరంటే ఆయనకు మరీ.
"చెప్పండిబాబాయ్! అమ్మానాన్నాపిన్నీ పిల్లలూ అంతాకులాసాయేనా?"
"కులాసాయే తల్లీ! అంతాబాగున్నారు. మీరెలావుంటున్నారు. తల్లీ....! అదే మీ ఆలూమగలు.... మీ సంసారం.... మీ అన్యోన్యం....."
"ఆయన పూర్తిగా మారిపోయేరు బాబాయ్!"
"మారిపోయెరా?" అంటూ దీర్ఘంతీసి క్షణం సేపు ఆగిపోయి అదోలాచూచి "మారిపోయేరంటే ఎట్లాగమ్మా?.... ఏదయినా దురభ్యాసాలు?...."
"ఏమో? ఉన్నట్టుగా లేవు కానీ.... కానీ...."
"చెప్పుతల్లీ!.... ఇంకా నానుస్తావెందుకమ్మా?"
"మొన్న నా ఫ్రెండ్ వచ్చింది అదీ నాకళ్ళ ముందరే...."
"దారుణం....ఏంచేసేడేం?"
"ఇంకేం చేయాలీ! ఒకటే ఇకఇకలు పకపకలూనూ...."
"ఆడవాళ్ళకి సిగ్గుండాలి. ఈమధ్య వీళ్ళుకూడ మరీబరితెగిస్తున్నారు"
"సరే వాళ్ళకి సిగ్గులేదు బాగానేవుంది పోనీ ఈ మనిషి కేమయిందీ?"
"ఛా మీదబడ్డాడా?"
"ఆఁ. ఇహ అదోక్కటే తక్కువ...."
"ఐతే ఉత్తుత్తిమాటలూ నవ్వులూనా.....?"
"అవి చాలవూ?"
"చాలవూ మరి!"
"ఓసారి ఆఫేసుకు రమ్మన్నారు" "వచ్చాడా?"
"వస్తారా? రారు. రారని తెలుసు. రాకున్నా ఫరవాలేదు"
"మరేవిటమ్మా! ?"
"రాను అని ఖచ్చితంగా చెప్పేస్తారు బాబాయ్ ! అక్కడే నాక్కోసం"
"కాదూమరి....! అయినా చెప్పటంలో కాస్త సరసం ఉండొద్దూ?
"అదేకదూ నా బాధంతానూ అందుకే ఆయనకి మరొక పెళ్ళి చేద్దామానుకున్నాను"
"నీవేచేస్తావా?....ఆయనకింకో పెళ్ళి నీవే చేస్తావా?"
"ఆఁ....ఏంఁ.? తప్పా?"
"కాదులే కానీ....ఎవరు....? ఎవరు పిల్లనిస్తారు అని ?"
"ఎవరు యిస్తారు అని మనమాలోచించుకుంటూచుంటే ఎలా?"
"మరి మార్గ మేమిట్తల్లీ?"
"ఉంది. పేపర్లో ప్రకటించటం. ప్రకటించాను"
"మంచిపంచే సేవు....ఏమయినా దరఖాస్తులు వచ్చాయా?"
"ఆఁ ఓ ఏభయిదాకా వచ్చాయి"
"ఏభయ్యే....! అయ్యబాబోయ్"
"బాబాయ్"
"ఆఁ ఏమ్మా?"
"ఏం లేదు బాబాయ్! నీవుచెప్పు. ఆయనకు మరో అమ్మాయినిచ్చి పెళ్ళిచేస్తానని నేననుకొటంలో నేనేమయినా తప్పుచేశానా?"
"లేదమ్మా! తప్పేంలేదు. ఆమాటికి వస్తే సరయినపనే చేసేవు. నీ స్ధితిలో ఎవరున్నా ఆపనేచేస్తారు"
ఆతరువాత ఏం మాట్లాడాలో తెలియలేదామెకు. ఆమె బాబాయ్ కూడ ఏదో ఆలోచిస్తూ అన్యమనస్కంగా ఉండిపోవటంతో ఆయన్ని ఆయనకే వదలి వంటయింటిలో పనిచూచుకోటానికి బయలుదేరింది వసుంధర.
అరగంటతరువాత బాబాయిని భోజనానికిరమ్మంటూ పిలచింది కంచంలో అన్నం వడ్డించి పక్కనేకూచుని ఆప్యాయంగా అడగిమరీ నేయివేసింది.
"అమ్మా! వసుంధరా"
"ఏంబాబాయ్?"
"నీతోనే పనుండి వచ్చానమ్మా నేను"
"నాతోనా? పనుందా? చెప్పండిబాబాయ్! ఇంకా సందేహిస్తూన్నారెందుకూ?"
"సందేహము కాదమ్మా! నీ వేమనుకుంటావోనని...."
"భలేవాడివే బాబాయ్! నేనేమనుకుంటానూ?"
"అడుగు బాబాయ్"
"నీవు ప్రసూనని....ప్రసూనని నీవు....."
"నేనా? ప్రసూననా....? చెప్పండి బాబాయ్ ఏమయిందీ?"
"నీవే యిక దాన్ని కడుపులో పెట్టుకుని కాపాడాలి"
"అసలు విషయం చెప్పు బాబాయ్! ఏమయిందీ?"
"ఏంకాలేదమ్మా ?"
"మరీ....?"
"ఏంలేదమ్మా! నీవు యిచ్చిన ప్రకటననిచూచి మన ప్రసూన కూడ అప్లయి చేసిందమ్మా !"
"ప్ర....సూ...న అప్లికేషను వేసిందా ?"
"కాదమ్మా....నేనే వేయించాను"
"వేయించావా బాబాయ్...?"
"అవునమ్మా! చూడుతల్లీ! ఎలాగూ నీవు నీ భర్తకి యింకో పెళ్ళి చేయలనుకుంటున్నావు. ఆ పెళ్ళి కూతురు నీ చెల్లెలే అయితే.... ఆ పిల్లను నేను నీ చేతుల్లో ఉంచుతే దానికీ దైర్యంగా ఉంటుంది. నాకూ తృప్తి...."
"....." వసుంధర ఏమి మాట్లాడలేక మౌనంగా వుండిపోయింది. వసుంధర మనసులో ఎన్నెన్నో ఆలోచనలు ఉరకలు ఎత్తుతున్నాయి, అలల్లా ఎగిరెగిరి పడుతున్నాయి. సముద్రాన కెరటాల్లాగ వువ్వెత్తుగా లేచి ఒక్క సారి అంతెత్తునుంచి విరుచుకు పడిపోతున్నాయి. తనుతల పెట్టిన ఈ కార్యంలో ఇన్నిన్ని డెలికేట్ విషయాలుచోటు చేసుకుంటుంటాయని ఆమె ఊహించనైనా ఊహించలేక పోయింది.
"నీతో ఇంతసేపు మాటాడి....నేను చెప్పిన అన్నిటికీ ఊఁకొట్టి.....నేను చేసిన పని సబబువుందని నిశ్చయంచేసి.....నా మొగుడికి నేనే పెళ్ళి చేయటంలో ఏ మాత్రం అసమంజసంలేదని వత్తాసుపలికి.....యింకోపక్క నుంచీ తన కూతురికి నా మొగుడికి అంటగట్టుదామని నిశ్చయించేసుకుని అప్లికేషను వేయించుతాడా.....? ఓక సారి సుందర్ మంచివాడు గాదంటూనే ఒప్పుకుంటూన్నట్లుగానే ఇలా వెనుకవైపుగోతులు తీస్తాడా? అమ్మా! పెద్దమనిషీ! నీ గుండెలో ఇన్ని ఆలోచనలున్నాయా?"
అనుకుంది వసుంధర....
"చూడమ్మా! రేపు ఆఖరు తేదీకదూ....అవునా?"
"ఆఁ"
"ఏభయదాకా వచ్చుంటాయంటున్నావు గదా?"
"ఆఁ"
"మరి ఆ ఏభయిలో ఏదోఒక్కటేగా నిర్ణయించుకునేది?"
"ఆఁ"
"నీవు....నీ వేగా ఈ సెలెక్షను బోర్డు ప్రెసిడెంటువీ?"
"అవుననుకో నీవు చెపితే కాదంటారా?"
"అనరు"
"కాస్త ఆ నలభయి తొమ్మిదింటినీ ప్రక్కకు నెట్టేసి ప్రసూననే...."
"చూస్తాను బాబాయ్....."
"చూస్తానంటేకాదు మాటివ్వాలి"
"అప్లికేషన్లన్ని చూచేక.... ఒకవేళ నేనుగాని, ఆయనగానీ...."
"నచ్చక ఎలా పోతుందమ్మా !"
"కానీ బాబాయ్. నేను చెప్పాకా ....అల్లుడిగారి ప్రవర్తన చూచాక గుడ్ మీరు....మీరింకా.....ప్రసూననిచ్చి పెళ్ళిచేయాలనేఅనుకుంటున్నారా?"
"అందులో ఏముందమ్మా! నీకు మీవారిమీద మనసు విరిగిపోయి ఇంత సాహసానికి పూనుకున్నావుగానీ, లేకపోతే నీకు తెలియదుకనుక నా ఏమన్నాన్నా ఏం? ఇంతకన్నా మంచి అల్లుడు ఇంకెక్కడ దొరుకుతాడుతల్లీ? ఏ ఆడదానికైనా?"
"అలాగా బాబాయ్.....!"
* * *
"అప్లికేషన్లన్ని చూచేరా? ఏ కాండిడేట్సు.... నచ్చారు...."అంది వసు.
"కేండిడేట్సు.... ప్లూరల్ కాదు సింగులరే. సెలక్ట్ చేసే సేను" అన్నాడు సుందర్.
"అలాగా! గుడ్....! కేండిడేటు ఫోటో పంపిందా ?"
"ఆఁ. చాలా అందంగా ఉంది"
"చూడొచ్చా....!"
"సరిపోయే! నీవు చూడకపోతే ఎట్లా....ఇదుగో చూడు...."
"అవును....ఇ...ఇ...ఇదా....? ఈ ఫోటోలోని అమ్మయినా?"
"ఆఁ ఆ అమ్మాయే నాక్కావాలి"
"ఏమండీ?" అంటూ అమాంతం సుందర్ ని గట్టిగా కౌగిలించేసుకుంది సుందర్ మొహం మీద దొరికిన చోటేల్లా ఆబగా ముద్దేట్టుకుంటూ. వసు.
"అవును వసూ! అదేమిటి నీవుగూడ అప్లయిచేసి నా ముందరపడెయ్యటానికి ఇంత హంగామా దేనికి? నాపైన ఏవేవో ఎందుక్కల్పించావూ?"
"ఎందుకా.....? ఎందుకంటే....? యింతకంటే మంచి మొగుడు ఎక్కడా దొరకడనీ యింతమంది నీకక్కరలేకపోతే నాకివ్వునాకివ్వు అంటూ అరుస్తూ ఉన్నారుకనుక! పైగా మాబాబాయి స్వయంగావచ్చి అన్నీ విని నా ప్రపోజలుకు సపోర్టు యిస్తున్నట్టేయిచ్చి, తన కూతురి అప్లికేషనుని కాస్త రెకమెండ్ చేయమని నన్నే కోరటం.....!"
"ఏమయినా బ్రైడ్స్ వేటలో నాకు నీవే దొరికావు...."
"కాదు నేనే మిమ్మల్ని దక్కించునున్నావు"