కథ
వాంటెడ్ బ్రైడ్
జోస్యము విద్యాసాగర్
కావలెను: మా శ్రీవారికి తగిన వధువుకావాలి. పెళ్ళిచేసుకోవాలనుకున్న అమ్మాయిలుకానీ, అమ్మాయిలున్నవారుకానీ, మిగతా వివరాలకోసం, బస్ట్ సైజ్ ఫోటోని జతఃపరచిన స్వదస్తూరితో, పూర్తి వివరాలతోపాటు దరఖాస్తూ పంపుకోటానికి ఆఖరు తేది.....పెళ్ళికొడుకు భార్య.... అడ్రసు.....
అది ఓ పేరు మ్రోగిన తెలుగు దినపత్రికలో పెద్ద పెద్ద అక్షరాలతో బాగా కనిపించేట్టుగా బార్డరుకట్టి మరీ ప్రచురింపబడిన ప్రకటన కటింగ్.....
"మీ పెళ్ళి....ఉహూఁ మీతో పెళ్ళికి.....కాదు కాదు మిమ్మల్ని పెళ్ళి చేసుకోటానికి వేయవలసిన అప్లికేషన్లకు ఆఖరు తేది ఇవాళే....."
"వసూ! ప్లీస్....డోంట్ బీ సిల్లీ...."
"సిల్లీ ఏముందీ? నేనావాళే చెప్పాను"
"చెప్పావు.....!ఏం చెప్పావూ.....?ఏంచేపావూ అంటున్నాను. టేల్శీ....!"
"మీకు యింకో అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తానని"
"అదే....అదే....! ఎందుకు ? వై....వైసో....!"
"ఆగండి. మరీ అంతలా గొంతుచించుకుంటారెందుకూ? మీకు మాత్రం తెలియదకనుకనా?"
"నొ....! ఊహూఁ నాకు తెలియదు. అయ్ డోంట్నో......!"
"అలా అనకండి. మీకు బాగాతెలుసు. ఆలోచించండి"
"వసూ!....వసూ!"
"ఏంచెప్పమంటారా? వింటే మీ అహం దెబ్బతింటుందేమో?"
"నెవర్....నెవర్. అయాం నాట్ దటవీక్...."
"కాదూ? కాదేమో ఆలోచించండి మీకే తెలుస్తుంది"
వసుంధర సుందర్ భార్య. వసుంధర ఆఫీసరుగా పనిచేస్తోంది. సుందర్ ని ప్రేమించి మరీ పెళ్ళిచేసుకుంది. వాళ్ళిర్వురూ అన్యోన్యంగా ఉండేవారే. కానీ కొన్ని రోజులనుంచీ వసుంధరీకి భర్తసుందర్ తనని లెక్కచేయటం లేదనీ తనంటే యిష్టంలేదని ఎందుకో అనుకోసాగింది. అలా అనుకోగానే అతని ప్రతి చర్యా వింతగా విచిత్రంగానేకాక తన అబిప్రాయాన్ని బలపరుస్తున్నట్లుగా ఉన్నాయి.
"తమాషా చూచారా!" అంది వసుంధర, భర్త అడ్వర్ టైజ్ మెంట్ కటింగ్ ఉన్న పైలుని పూర్తిగా చదివేడని నిశ్చయం చేసుకున్నాక.
"ఏమిటో?"
"ఇటువంటి ప్రకటనలకు అంతగా రెస్పాన్స్ ఉండదనుకున్నాను"
"ఊఁ...."
"ఆహఁ. అదేం కాదండొయ్. బ్రహ్మాండంగాఉంది. చూచారా మొత్తం ఏభయి అప్లికేషన్లు వచ్చాయి"
"ఊఁ...."
"అంటే....అంటే అర్ధం ఏమిటటా.....? మగాడంటూ కనిపిస్తేచాలు. అతడు ఎట్లాఉన్నాసరే.....ఎలాంటివాడయినాసరె పెళ్ళి చేసుకోవటానికి ముందుకు వస్తున్నారన్నమాట. ఆంధ్రదేశపు ఆడబడచుల్లారా! హాట్సాఫ్!...."
"ఊఁ...."
ఆ ఊఁ...ఊఁలు ఏమిటీ? అయినా ఇక్కడ మిమ్మల్నేదో మెడలువంచి, కొండలు మోయిస్తున్నట్లుగా ఆ దిలీస్ కుమార్ మొహమూమీరూనూ.....! కాస్త ఆ అప్లికేషనులని చెక్ చేసి, అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూచి, లేని వాటిని పక్కకు తోసి....ఫోటోలుంటే కాస్తంత చూచి....ఏదైనా సాయంచేసి పెట్టరాదుటండీ? మీ పెళ్ళేగా....! మీరూ చూచి నచ్చిందో లేదో చెప్పి..."
సుందర్ వసుంధరని రెండునిముషాలపాటు అదోలా చూచి చేతిలోని పైలుని బళ్ళమీద విసురుగ్గాకొట్టి చరచరా బయటకు వెళ్ళిపోయేడు. కిసుక్కున నవ్వుకుంది వసుంధర!
సుందర్.....! సుందరెంత అందంగా ఉంటాడూ? ఎంత హుందాగా ఉంటాడూ? ఈ పెళ్ళి ప్రపోజల్ పెట్టి నిజంగా తాను తప్పుపనిచేస్తున్నానేమో? ఈ అప్లికేషన్లు....ఈ అడ్వర్ టైజ్ మెంట్లూ అన్నీ అనవసరమేమో? తననుకుంటున్నట్లుగా సుందర్ కి తనంటే అయిష్టంలేదేమో ? తనమీద ప్రేమ ఉన్నదేమో? తినికూచుని లేనిపోని ఆలోచనలుచేసి నానాహంగామా చేస్తున్నాదేమో?....అయినా....అయినా....పెళ్ళయినవాడనితెలిసినా.....పెళ్ళికొడుకుకి భార్య ఉందని తెలిసినా.....పెళ్ళికొడుకు భార్యే ప్రకటన యిచ్చిందనితెలిసినా పెళ్ళికి సిద్దపడి ఎంతమంది అప్లియిచేశారు.....అని తలచుకుని ఆశ్చర్యపోయింది. వసుంధర.....
బయట కాలింగ్ బెల్ మోగి ఆమె ఆలోచనలకి బ్రేక్ పడింది. బళ్ళమీదున్న పైలుని చేత్తో తీసుకుని ఆల్మరాలోఉంచి తలుపు తెరచింది. బయట తలుపుదగ్గర ఓనలభయ్యేళ్ళ ఆవిడ మరో పాతికేళ్ళ అమ్మాయి నిలుచుకొనున్నారు. నలభయ్యేళ్ళున్న ఆవిడ మరోపాతికేళ్ళ అమ్మాయి నిలుచుకొనున్నారు. నలభయ్యేళ్ళున్న ఆవిడ అందంగా అలంకరించుకునివుంటే ఆమెని తలదన్నేట్టుగా అలంకరించుకొనుంది పాతికేళ్ళ యువతీ మరీ అందంగా అలంకరించుకుని ఉంది.
"నమస్తే....!" అన్నారాయిద్దరూ చాల నెమ్మదిగా ఏకకంఠంతో
"నమస్తే....!మీరూ....?" అంది వసుంధర మధ్యలోనే ఆగిపోతూ.
"ఇది....ఇదీ వసుంధరగారి యిల్లెనా?"
"ఆఁ నేనే వసుంధరని"
"అయితే మేము సరయిన అడ్రసుకే వచ్చానుమన్నమాట"
"ప్లీస్....! డూ కమీన్, లోపలకు రండి
"మీరూ........?"
"మేము.....మేము పేపరులో మీరిచ్చిన ప్రకటనని చూచి వచ్చాం"
"కానీ.....నేనుపర్సనల్ ఇంట్రవ్యూతీసుకోటంలేదు. అలాప్రకటించలేదు"
"అవుననుకొండి. కానీ మేమే...."
"నేరుగా వచ్చేసేరా? అప్లికేషను పంపుకున్నారా లేదా?"
"ఆఁ పంపించాముగా"
"చూడండి. ఆప్లికేషను పంపించేరుగదా? లాస్ట్ డేట్ అయిపోగానే వాటినన్నింటిని స్క్రూటినైస్ చేసి క్వాలిఫికేషన్లని చూచి మేము సెలెక్టు చేసుకున్న నలుగురయిదుగురికి మాత్రము ఇండివిడ్యూవల్ గా ఇన్ ఫర్మేషన్ ఇస్తాం ఇంట్రవ్యూ ఉందని. ఈ మధ్య ఎటువంటి ప్రయత్నాలు చేసినా వాటిని డిస్ క్వాలిఫికేషన్ ట్రీట్ చేస్తాం"
"చూడండి వసుంధరగారూ? మీరింత ఫ్రాంక్ గా మీ మనసులోని భావాలని బయట పెట్టినందుకు వియార్ రియల్లీ వెరీ హాపీ.....కానీ...."
"ఇక కానీలు గీనీలు ఏవీ ;లేవండీ?"
"ఓకే! ఓకే....! అయినా పిల్లనిస్తామనుకున్నప్పుడు మేముకూడకాస్త ముందూ వెనక పెళ్ళి కొడుకుని గురించిన వివరాలను విచారించుకో వాలిగదా? వాకబు చేసుకోవాలిగదా? పోనీ అనుకుంటే ప్రకటనలో మీరే వివరాలు యివ్వలేదాయె"
"ఆల్రైట్.ఆల్రైట్.....! ఆ బై ది బై....మీ యిద్దరిలో కేండిడేట్ ఎవరూ?"
"అడుగుతున్నారుకనుక నిజం చెప్పేస్తున్నాము. ఇద్దరమూ అభ్యర్దులమే. కాకపోతే నాకు ఏజీ బారయిపోయింది....! పోనీ ఏజీ రిలాక్సేషన్ ఏమయినాఉంటే చెప్పండి"
"ఏజీ రిలాక్సేషనా? ఎన్నీళ్ళు ఏమిటీ?"
"అన్నట్లు ముందు మీ రిక్వయిర్ మెంటు చెప్పలేదు"
"ముప్పయి"
"ముప్పయారు! దెన్ ఆరేళ్ళు అయాంథర్టీసిక్స్ నాకుముప్పయ్యారెళ్లు"
"ఆమె....?"
"ఈమె నా మేనకోడలు. ఈ అమ్మాయి కేండిడేట్....! షీయీజ్ ట్వెంటీపైవే. ఎంబీయే. సెంట్రల్ గవర్న మెంటులో ఉద్యోగం. నాలుగంకెల జీతం. ముప్పయ్యారూ ముప్పయ్యీ ముప్పయ్యేనిమిది కొలతలు. ఎత్తుఅయిదూ ఒకటి...."
"బాగానే ఉంది మీకేం వివరాలుకావాలో అడగండి. మరి"
"మరోలా అనుకోకూడదు నుమండీ! ఇది కేవలం మేము అప్లయి చేసిన అప్పాంటుమెంటుతాలూకు వివరాలు తెలుసుకోటానికివేసే ప్రశ్నలే! ఇందులో పర్సనల్ ఏవీ లేవు. ఉండవు"
"ప్లీస్ ప్రొసీడ్"
"మీవారు.....అదే పెళ్ళికొడుకు పేరు?"
"సుందర్.....సుందరమూర్తి"
"పైన్. బ్యూటిపుల్ నేం! ఆఁ. ఆర్యూ వెజ్. ఆర్ నాన్ వెజ్. శాఖాహరులా? కదా?"
"వియార్ బొత్. సమయాన్నిబట్టి పోతాం!"
"వెల్! ఇట్స్ పైన్. ఆఁ. సుందరమూర్తిగారికి మీరు వివాహంచేయాలనుకున్నారు" మీరు అన్నపదాన్ని కావాలనే నొక్కిపలుకుతూ కళ్ళనెగ రేసి తలని ముందుకూ వెనక్కూ ఆడించింది ఆమె అందంగా.
"యస్...అవును"
"అంటే....మీకూ సుందర్ కీ మధ్య ఏమయినా కలతలు....?"
"నొ....అలాంటివేవీ లేవు"
"వెల్! సుందర్ కి ఎనీ బెడ్ హెబిట్స్ ....ఏవయినా దురలవాట్లున్నాయా?"
"దురలవాట్లా....? దురాలవాట్లంటే.....! సిగరెట్ సిప్ చేస్తారు"
"దట్స్ ఫేషన్. అదికాదు"
"పేకాడుతారు. అప్పుడప్పుడు"
"దటీజ్ సోషియల్ స్టేటస్. దురలవాటు కాదు"
"ఎప్పుడయినా అదీ కంపెనీకోసం ఓపెగ్ లేదా రెండు పెగ్ లు వేసుకుంటారంతే!"
"కంపెనీ యిచ్చే మంచి అలవాటుని దురలవాటని ఎలా అంటాము?"
"మరింకేవిటీ ?"
"ఆమాటికొస్తే ఇంకా రెసిస్ కి వెళ్ళరు. వెడతారా?"
"నొ....నొ! తెలియవు"
"అయితే ఏ దురలవాటూ లేదన్నమాట నో బాడ్ హెబిట్స్ ఎటాల్. ఆఁ. ఇంకో ముఖ్యమైనప్రశ్న. సుందర్ యువర్ హస్బెండ్.... బెడ్ రూంలో...."
"బెడ్ రూంలోనా? వాడ్డుయూ మీన్?"
"అయ్ మీన్ పడకటింటిలో ఆయన బిహేవియర్...."